Read Forgive me - 2 by Aiswarya Nallabati in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • రాత్రి.. ఆ కోట

    "రాత్రి.. ఆ కోట"-- PART 1** ఒక చిన్న గ్రామంలో, ఒక పాత కోట ఉం...

  • కనకయ్య తాత

    కనకయ్య తాతసాయంకాలం నాలుగు గంటలు అయింది. మండువేసవి కాలం.చల్లగ...

  • క్రుంగి మాల

    కరుంగళి మాల అనేది నల్ల తుమ్మ చెక్కతో తయారు చేయబడిన ఒక రకమైన...

  • మన్నించు - 2

    ప్రేమ ఒకరి మీదే పుట్టి ఒకరితోనే ఆగిపోవాలి అని  లేదు అన్నప్పు...

  • ఫేస్బుక్ రిక్వెస్ట్

    హాయ్‌... ఏంటీ నిన్న టచ్‌లో లేవు... ఎటెళ్లావు?’’‘‘నా బాయ్‌ఫ్ర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మన్నించు - 2

ప్రేమ ఒకరి మీదే పుట్టి ఒకరితోనే ఆగిపోవాలి అని  లేదు అన్నప్పుడు, మనతోనే ప్రేమ ఆగిపోవాలని ఏం వుంది? మనం మొదటి ప్రేమ కానప్పుడు మనమే చివరి ప్రేమ అవ్వాలని మాత్రం ఏం వుంది? మనం లేకపోతే వాళ్ళ జీవితం ఆగిపోతుంది అని మాత్రం అనుకోడం మన తప్పు. తను లేకపోతే నేను ఏం ఐపోతానో అనుకోడం ఒక అపోహ. 

---------------------------------------------------------------------

"అమ్మ నేను మొన్న కొన్న డిజైనర్ డ్రెస్ వేసుకొని వెళ్త కాలేజీకి" స్నానానికి వెళ్తూ మా అమ్మకి చెప్పాను. 

"సరే నీ ఇష్టం" మా అమ్మ ఇంత ఈజీగా ఒప్పుకుంటుంది అనుకోలేదు. ఈ రోజు అందరికన్నా నేనే అందంగా కనిపిస్తాను. 

స్నానం చేసి ముచ్చటగా కొనుకున్న డిజైనర్ గౌన్ వేసుకున్న. అబ్బా ఎంత అందంగా ఉందో ఈ డ్రెస్ నాకు. 

"అమ్మ జడ వేయు. కాలేజీకి లేట్ అవ్తుంది." మా అమ్మని పిలుస్తూ టిఫిన్ తిండానికి కూర్చున్నాను. 

మా అమ్మ బెడ్ రూంలో నుంచి వస్తూ దువ్వెనతో పాటు నూనె డబ్బా కూడా తెచ్చింది. 

"ఇప్పుడు నూనె ఏంటి మా.." ఛ! ఈ డ్రెస్కి లూజ్ హెయిర్ వేసుకొని వెళ్తే అందరూ నన్ను చూస్తూ ఉండిపోతారు. 

"నీకు ఏమీ తెలీదు. నూనె లేకపోతే తల నొప్పి వస్తుంది. చదువు బుర్రకి ఎక్కలి కథ" గట్టిగా నూనె రాసి ... జిడ్డు కారుస్తూ నాకు జడ వేసింది మా అమ్మ. 

అద్దంలో నాకు నేనే పల్లెటూరి పిచ్చిదానిలా కనిపించాను. ఏంటి ఇలా తయారు చేసింది నన్ను. నెమ్మదిగా మా రూంలోకి వెళ్లి డ్రెస్ మార్చెద్దం అనుకున్నాను. 

"బస్ వచ్చేసింది . పద ... పద" నాకు మార్చుకునే అవకాశం లేకుండా బస్ ఎక్కించేసింది మా అమ్మ. 

బస్లో అందరూ చాలా విచిత్రంగా చూస్తున్నారు. అర్థమైంది ఈ రోజుతో నా పరువు పోబోతుంది అని. 

"నాకు ముందే తెలుసు నీ నేచురల్ బ్యూటీ గురించి" అజయ్ బస్ దిగగానే వేసిన డైలాగ్. అబ్బా ఇలా కనిపించాలా తనకి. తన మొకం వైపు చూసే ధైర్యం కూడా చేయలేదు నేను. ఫాస్టుగా క్లాస్ రూం వైపు పరుగు తీసాను. 

"బానే వున్నావ్ లేవే" వెటకారం నవ్వుతో అంది దివ్య. 

"చాలు ఆపండి, ఎందుకు నిజం దాస్తారు.. ధీర ఈ డ్రెస్కి ఎవరైనా నూనె రాసుకొని జడ వేసుకుంటారా?" అడిగింది  శ్రీస్తి.

"అమ్మ వేసింది" సిగ్గుతో తల కొట్టేసినట్టుంది. 

"ఈ రోజు మనకి , అబ్బాయిలకి కలిపి ఎగ్జామ్స్. మన పక్కన అబ్బాయిలు పడ్తున్నారు బెంచ్లో. ఇలాంటి టైంలో నువ్వు ఇలా రెడీ అవ్వకుండా వుండాల్సింది" మిత్ర అంటుండగానే ఎగ్జామ్ బెల్ కొట్టారు. చేసేదేమీ లేక ఎగ్జామ్ హాల్ వైపు వెళ్ళాను. 

నా పక్కన ఈ రోజుకి అదృష్టం బాగుండి సీనియర్ అక్క పడింది. తను నన్ను చాలా వింతగానే చూస్తున్నా పెద్ద భాధగా ఏమీ అనిపించలేదు. 

ఎగ్జామ్ రాస్తుంటే మధ్య మధ్యలో రూమ్లో వున్న అబ్బాయిలు నన్ను చూసి నవ్వుకుంటున్న శబ్దం చాలా క్లియర్గా వినిపిస్తుంది. 

"ఏం ఐనా రసవా అసలు?" కిటికీ బయట నుంచి వచ్చిన సబ్ధంకి బయటకి చూసా. నన్నే జాలిగా చూస్తూ అడుగుతున్నాడు ఒక అబ్బాయి. ఎవరు తిను? నా గురించి ఎందుకు తినకు అంత జాలి? 

నవ్వలేక జాలి పడ్తున్నటు వున్నాడు. ఇంతమంది నవ్వగా లేనిది తిను నవుతే మాత్రం ఏంటి లే.... 

"రాస్తున్న" చెప్పాను. కళ్ళు అర్పుతూ చూస్తున్నాడు. బాగున్నాడు తెల్లగా.. సన్నని మొఖం, పెద్ద కళ్ళు, సూది ముక్కు. 

రోజంతా ఇలానే గడిచింది. చేసేదేమీ లేక అందరూ నవ్వుతుంటే వాళ్ళతో కలిసి నన్ను చూసుకొని నేనే నవ్వుకున్నాను. 

అజయ్ నన్ను చూసి ఏం అనుకొని వుంటాడో నాకు తెలుసు... అందం లేదు గానీ పొగరుకు తక్కువ లేదు తనకి అనుకొని వుంటాడు. ఐనా తను ఏం అనుకుంటే నాకు ఏంటి. తన కోసం ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు. 

ఆ రోజు రాత్రి మా అమ్మ, నాన్నగారు వేరే ఊరులో పని వుంది అని వెళ్ళారు. 

ఇంక ఈ రోజు నా ఇష్టం. 

తలంటుకుని చెక్కగా జుట్టు అరబెట్టుకొని.. కబ్బోర్లో నుంచి నాకు ఎంతో ఇష్టం ఐనా బ్లాక్ డ్రెస్ తీసుకొని వేసుకున్న. జుట్టు ఇంకాస్త తడిగా వుంది అని గమనించి, పోనీటైల్ వేసుకున్న. చక్కగా పౌడర్ రాసుకొని , సెంట్ కొట్టుకొని, నల్లని బొట్టు రెండు కళ్ళ మధ్య పెట్టుకొని, కళ్ళకి కాటుక రాసి అద్దంలో చూసుకుంటే ... ఎంత అందంగా అనిపించానో... ఐనా అదృష్టం వుండాలి నాలాంటి అమ్మాయికి సైట్ కొట్టాలన్నా.. 

ఈ రోజు నన్ను చూసి ఏం అనలో కూడా తెలీలేదు నా ఫ్రెండ్స్కి. ఐనా నేను వినాలనుకున్నది విల్ల నోటి నుంచి కాదు, అజయ్ నోటి నుంచి. ఎక్కడ అజయ్.. ఇంత సేపు అయింది ఇంకా కనిపించట్లేదు. నిన్న బాగులేనప్పుడు మాత్రం అందరికన్నా ముందే చూసి ఎక్కిరించాడు. ఐనా ఇంత మంది ఆశగా చూస్తున్నారు.. తను చూడకపోతే మాత్రం ఎంటిలే..

"ఏంటో ఈ అబ్బాయిలు.. నిన్న చూసింది అప్పుడే మర్చిపోయి నీకు సైట్ కొట్టేస్తున్నారు" నా పక్కన కూర్చున్న అక్క సెటైర్ వేసింది. అమ్మాయిలకీ, అమ్మాయిలకే పడదు అనేది నిజమే ఏమో.. నేను కొంచం బాగుండేసరికి ఇలా సెటైర్ వేసేసింది.

"హయ్... ఇంకో పెన్ వుందా నీ దగ్గర" నా బయట కూర్చున్న అబ్బాయి మళ్ళీ మాటలు కలపడానికి ట్రై చేస్తున్నాడు. కళ్ళు తిప్పేశాను. 

"వుంటే ఇవ్వొచ్చు కదా.. అంత బాగా అడుగుతున్నాడు" తన ముందు కూర్చున్న అబ్బాయి కొంచం గట్టిగానే మాట్లాడాడు. అందరూ ఎగ్జామ్ ఆపేసి నా వైపే చూస్తున్నారు. వామ్మో ఇంత ఎటెన్షన్ నా వల్ల కాదు. 

"ఇదిగో తీసుకో.." ఇంకో పెన్ తనకి ఇచ్చాను కిటికీలో నుంచి. 

"థాంక్స్ ... ఎగ్జామ్ ఐపోయాక నితో కొంచెం పెర్సన్లగా మాట్లాడొచ్చా ప్లీజ్" మళ్ళీ అడిగాడు. ఏంటి ఇలా అడిగేస్తున్నాడు. ఈ కాలేజీలోనే ఇంతా, లేదా అబ్బాయిలు అందరూ ఇంతేనా... అర్థం కాలేదు. 

మాట్లాడకుండా పరీక్ష రాసుకున్నాను. 


"హేయ్... హేయ్... నిన్నే ... ఒకసారి నీతో మాట్లాడాలి... ప్లీజ్" నా వెంటపడటం మొదలుపెట్టాడు నా పక్కన కిటికీ దగ్గర కూర్చున్న అబ్బాయి, ఒక గుంపుని తోడుగా వేసుకుంటూ. 

తొందరగా నడడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ దివ్య, మిత్ర, శ్రిస్తి.. కిందకే చూస్తూ బస్ నుంచి చాలా దూరం వచేసినట్టునాను. బయం మొదలైంది. ఇంకా వెంటపడ్తునే ఉన్నారు ఆ గ్యాంగ్. 


"ధీర.. ఎక్కడికి వెళ్తున్నావ్. మిత్ర వాళ్ళు నీకోసం అక్కడ వెతుకుతున్నారు." నా చేయి పట్టుకున్నాడు అజయ్. అజయ్ రావడం కూడా గమనించలేదు నేను. నా కళ్ళు తడిబారిపోయాయి. 

"వీళ్ళు.. నా వెంట పడుతున్నారు" ఆ అబ్బాయిల వైపు చేయి చూపించాను. 

"సిడ్...నువ్వు ఏంటిరా తిన వెంట పడ్డావు?" అజయ్ అడిగాడు ఆ అబ్బాయి వైపు చూస్తూ. 

"అజయ్.. అమ్మాయి బాగుంది కదా. పరిచయం పెంచుకుందాం అనుకున్న. తిను ఏమో ఇలా నడుచుకుంటూ వచ్చేసింది." ఆ అబ్బాయి చాలా క్యాజువల్గా చెప్పాడు. 

"ధీర.. ఇటు చూడు.. వీళ్ళు నా క్లాస్మేట్స్.. పర్లేదు అంత చెడ్డవాళ్ళు ఏం కాదు.. బయపెట్టేశారు కథరా.. పాపం ఈ అమ్మాయిని " అజయ్ నవ్వుతూ అన్నాడు. 

"సరే ... కొంచెం కూల్ అయ్యాక నేనే పరిచయం చేస్తా.. మీరు వెళ్ళండి రా... " అజయ్ మాటలకి వెళ్ళిపోయారు ఆ బ్యాచ్. 

"నీకు ఎం ఐనా పిచ్చా... ఇలా రెడీ ఇయ్యి వస్తే.. ఇలానే వెంటపడ్తారు. నిన్నటిలా నార్మల్గా రాలేవా కాలేజీకి..పద" అజయ్ అన్న మాటలలో కోపం వున్న.. నేను తన కళ్ళకి ఎంత అందంగా కనిపిస్తున్ననో నాకు అర్ధం అయింది. కొంచంగా మనసులో నవ్వుకున్నాను. 

"మనం ఫ్రెండ్స్గ్ ఉందామా అజయ్" తెలీకుండానే నా నోట్లో నుంచి వచ్చింది.నన్ను కాపాడాడు అనే కృత్గ్నత ఒక్కటే కారణం కాదు ఏమో... నా మనసులో ఇంకేదో వుంది ఏమో .... అనే ఆలోచన పక్కకి తోసేస. 

"నువ్వు మా మిత్రాకి ఫ్రెండ్వి కదా ... నాకూ ఫ్రెండ్వే" చాలా క్యాజువల్గా చెప్పేశాడు. 

"థ్యాంక్స్... నువ్వు రాకపోయుంటే చాలా బయపడిపోయా... " ఇలా చెప్పే రోజు వస్తుంది అని ఎవరైనా ముందు చెప్పుంటే నవ్వుకోనుండేదాన్ని. 

"వీలైనప్పుడు ఆ అబ్బాయితో ఈ గొడవ క్లియర్ చేసుకోడానికి ట్రై చేయు... మన ప్రవర్తన బట్టే అబ్బాయిల ప్రవర్తన ఆధారపడి వుంటుంది". బస్ దగ్గరకి వచ్చేశాం...

"వెళ్ళొస్తా మరి... మళ్ళీ కలుద్దాం" నవ్వుతూ చెప్పాడు

"కల్లుదం" నేను నవ్వుతూ చెప్పి బస్ ఎక్కేసాను.