Read Love letter..? - 5 by vasireddy varna in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • అధూరి కథ - 2

    కౌసల్య గారు తన room లోంచి బయటకి వచ్చి hall లో ఉన్న సోఫా లో క...

  • ప్రేమలేఖ..? - 5

    ఇల్లు దాటి బయటికి రాని లీల మీద ఆండాలమ్మ గారి అజమని చాలా కష్ట...

  • అంతం కాదు - 9

    ఇంకా టైం ఉంది. మనం ఇప్పుడు ఫైర్ ఎలిమెంట్ మొదలుపెడదాం," అంటూ...

  • పాణిగ్రహణం - 2

    గుమ్మం దగ్గర నిలబడిన నూతన దంపతులను ఆపి పేర్లు చెప్పి రమ్మంటా...

  • తనువున ప్రాణమై.... - 16

    ఆగమనం.....ఏంటి, ఒక రౌండ్ కంప్లీట్ చేసి వస్తారా!! పెళ్లి అయ్య...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమలేఖ..? - 5


ఇల్లు దాటి బయటికి రాని లీల మీద ఆండాలమ్మ గారి అజమని చాలా కష్టంగా అనిపించింది ఆనంద్ కి.

ఒకరోజు చూడడానికి ఇంటికి వచ్చాడు. గుమ్మంలోనే నిలబెట్టి మనవరాలు లేదని ఇంకోసారి రావద్దని అరిచి పంపిస్తుంది ఆండాలమ్మ. 








అది తెలిసిన ఆనంద్ ఫాదర్ రంగనాథ్ గారు కొడుకుని నిలదీశారు. 

ఆనంద్ తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. 


ఆండలమ్మ గారు ఒప్పుకోరుడా ఆవిడ మాట కాదు నివాళింట్లో ఎవరు కూడా ఏదీ చేయరు. దేవుడు ఉన్నాడని ఎంత బలంగా మనం నమ్ముతామా అనాది నుంచి వస్తున్న ఆచారాలు కట్టుబాట్లను వాళ్ళు అంత బలంగా నమ్ముతారు.


నువ్వు ఊర్లో ఉన్నంతవరకు లీలా అలా పంజరంలో పక్షులానే ఉండాలి. నిర్ణయం నీకే వదిలేస్తున్నా అని తండ్రి చెప్పడంతో శుక్రవారం సాయంత్రం గుడికి వచ్చిన లీలా అని ఎవరు చూడకుండా కలిసి సిటీకి వెళ్తున్న విషయం చెప్పాడు ఆనంద్. 

బామ్మ తిట్టినందుకు సారీ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది లీలా.

నేను మా నాన్నగారికి చెప్పాను మా సైడ్ నుంచి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. నువ్వు ఒక్కసారి చెప్పి చూడు అని ఆనంద్ రిక్వెస్ట్ చేయడంతో ఆండాలమ్మ గారు ఒప్పుకోవడం అసంభవం కనుక లీలా పూర్తిగా నిరాశతో చెప్పింది ఎప్పటికీ జరగదు అని. 



ఆరోజు తర్వాత మళ్లీ ఆనంద్ ని ప్రేమ లేఖ ఇవ్వడానికి చ్చిన రోజే కలిసింది మాట్లాడింది.. 

మొదటిసారిగా అతని కౌగిలిలో తన గుండె భారం కన్నీళ్లతో దించుకున్నది కూడా. 



ఆరోజు ఆనందించిన ప్రేమ లేక ఇప్పటికి ఓపెన్ చేయలేదు లీలా.

భద్రంగా ఇప్పటికే తన జ్ఞాపకాలు పుస్తకంలో అలాగే దాచుకుంది. 

ఒసేయ్ లీల అని బామ్మ గారు పెట్టిన కేకకి వస్తున్న బామ్మర్ది రూమ్ దాటి పరుగున వచ్చిన లీల ను కూర్చోబెట్టి నగల డిజైన్స్ చూడమని బుక్ ఇచ్చారు బామ్మ. 

ఇప్పుడు నాకేమీ వద్దు బామ్మ...!! అంది అఇష్టంగా.


ఈరోజు కోసం కాదు మా నీ పెళ్లి నాటికి నిండుగా అన్ని చేయించాలి. ఒక్కసారే అంటే ఎక్కడ అవుతుంది చెప్పు.??

అని వివరంగా చెప్పిన పూర్ణేశ్వరి గారు  నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో అంటే ఆల్బమ్ ఓపెన్ చేస్తుంటే లీల గుండె కనుక్కుమంది. 



బిసుకుపోయిన మనవరాలు భుజం తట్టి ఏంటే ఆ పరధ్యానం చూడు ఏం కావాలో అని కసిరారు అండలమ్మ.

ఆనంద్ చెప్పిన క్షణాలు రానే వస్తున్నాయి. దుఃఖం బరువుతో కష్టంగా దిగబెట్టి నాకు తెలియదు మామ మీరే చూడండి అని ఆల్బమ్ తల్లి ముందు పెట్టేసి పరుగున లోపలికి వెళ్లిపోయింది లీల. 



సరేలే అత్తయ్య గారు మనం కొన్ని చూసి మీ అబ్బాయి గారికి చూపిద్దాం. చివరిగా మీరు ఆయన ఏదంటే అదే. చిన్నపిల్లలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి లే అని పూర్ణేశ్వరి గారు సమర్థిస్తుంటే ఆండాలమ్మ గారి ఆలోచన అందుకు విరుద్ధంగా పోతుంది. 

గమనిస్తున్నారు ఆవిడ కూడా మనవరాలి ప్రవర్తనలో మార్పు. అన్నిటికీ దూరంగా, తనలో తానే ఒంటరిగా ఉండడం. అందుకే కొడుకుని సంబంధాలు చూడమని త్వరపెట్టింది ఆవిడ. 

సరే అలాగే చేద్దాం లే అని కోడలికి చెప్పిన ఆవిడ అప్పటికైతే ఏదో కానిచ్చారు. 

కానీ మనవరాలు మీద మాత్రం ప్రతిక్షణం ఒక కన్ను ఉంచుతూనే వచ్చారు.

ఒకరోజు సాయంత్రం పిల్లలందరూ బయటికి వెళ్దాం అనడంతో అన్న వదినతో పాటు లీలా నీకు కూడా లాకెళ్ళారు వాళ్ళు. 

ఎందుకు ఈ పిల్ల ఇలా ఉంటుంది అని దిగులుగా మారిపోయిన లీలా గురించి ఆలోచిస్తూనే తన గదిలోకి వచ్చిన బామ్మ అన్ని క్షుణ్ణంగా పరిశీలించగా...  పరుపు కింద అతి భద్రంగా దాచుకున్న లీల జ్ఞాపకాల పుస్తకం కనిపించింది ఆండాలమ్మ కి.

తీసి చూసిన ఆవిడ ముఖంలో నెత్తురు చుక్క లేదు. ఆవేశంగా ఆ బుక్ తనతో పాటు తీసుకొని బయటికి వచ్చేసింది అండలమ్మ. 

ఎప్పటిలా నైట్ బుక్ కోసం చూసింది లీలా. ప్రతి రాత్రి ఆ పుస్తకం లీలా  జ్ఞాపకాల జోల పాట లా మారింది. 

ఆండలమ్మ తీసుకెళ్లిన విషయం తెలియని లీల దానికోసం వెతకగా అది కనిపించక పోవటంతో నిస్సత్తువుగా కన్నీళ్ళతో నేల మీద కూలబడింది.

ఇక్కడే పెట్టాను ఎక్కడికి వెళ్లింది..??  అని పరుపు మొత్తం తీసి చూసింది అయినా బుక్ కనబడలేదు నిద్ర మానేయ రాత్రి మొత్తం రూమ్ అంతా తిరగేసిన లీలా తెల్లవారులు ఏడుస్తూనే ఉంది. 

లైట్ వెలుగుతున్న లీల రూమ్ చూస్తున్న బామ్మ గారికి లోపల జరుగుతున్నది ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు. అంత అనుభవం గడిచిన మనిషి ఆవిడ.

నా అంత దురదృష్టవంతురాలు ఈ భూమి మీద ఇంకొకరు ఉండరు. నీ ప్రేమని పొందలేని దురదృష్టవంతురాలిని. 

ఇప్పుడు నీ జ్ఞాపకాలను కూడా కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తూ ఏడుస్తూనే ఉండిపోయిన నీలా తెల్లారి బయటికి రాలేదు. 




పూర్ణేశ్వరి గారు ఇంకా రూమ్ దాటి రాని కూతురు కోసం వెళ్లి చూస్తే ఒళ్లంతా నిప్పులా కాలిపోతుంది. 

అయ్యో ఏంటే ఉన్నట్టుండి ఇంత జ్వరం అంటూ గాబరా పడుతూ బయటకు వచ్చి బామ్మ గారికి భర్తకి లీలా పరిస్థితి చెప్పి డాక్టర్ని పిలిపించమన్నారు. 

డాక్టర్ వచ్చారు, చూశారు, మందులు ఇచ్చారు.. శరీరానికి పనిచేసే ఆ మందులు మనసులోని కన్నీటిని దూరం చేయలేవు కదా. 


నాలుగు రోజులకు లీల కు జ్వరం తగ్గింది, వారానికి కాస్త లేచి తిరుగుతుంది కానీ మనిషి ఇది వరకులా లేదు. 

ఆనంద్ దూరంగా ఉన్న చిన్ననాటి నుంచి భద్రంగా దాచుకున్న ఆ జ్ఞాపకాల సావాసంతో రోజులు గడిపేస్తున్నారు ఇప్పుడు అది కూడా దూరం అవ్వడం.. భరించలేక పోతుంది. 



**************************




కామెంట్స్ మస్ట్ బేబీస్...💞

__Varna.