Read Love letter..? - 2 by vasireddy varna in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • ప్రేమలేఖ..? - 2

    తన ప్రమేయం లేకుండానే సన్నగా వణికి పోతుంది లీలా.తలుచుకుని బ్ర...

  • అంతం కాదు - 6

    అద్భుతమైన మలుపు!ఎపిసోడ్ 12: అంతర్ధానం – ఒక లోకానికి అంతం, మర...

  • థ జాంబి ఎంపరర్ - 4

    పారిపోతుంది.ద జాంబి ఎంపరర్ (The Zombie Emperor)రాంబాబు జ్ఞాప...

  • తనువున ప్రాణమై.... - 13

    ఆగమనం.....వీళ్ళిద్దరి అల్లరి సరసాలు చూస్తూ మన హీరో.. డిక్కీ...

  • ఓ మనసా... - 6

    స్క్రీన్ మీద వివేక్ నంబర్ కనిపించి ఆ టైంలో చేయడంతో ఇంపార్టెం...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమలేఖ..? - 2



తన ప్రమేయం లేకుండానే సన్నగా వణికి పోతుంది లీలా.

తలుచుకుని బ్రతకడానికి మనకి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. చిన్నపిల్లలం కాదు లీలా.. అలా అని ఎవరిని బాధ పెట్టాలని నాకు లేదు. ఇంకా నిన్ను దూరం చేసుకొని నరకం భరించే శక్తి కూడా నాకు లేదు.

ఇది నా మనసు తీసుకో..  నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తుంటాను అని కచ్చితంగా చెప్పిన అతని మాటలకి వణుకుతున్న చేతితో పేపర్ కవర్ అందుకుంది లీలా.

నిమిషాల క్రితం నీరెండలో బంగారు బొమ్మలా మెరుస్తున్న ఆమె రూపం ఇప్పుడు మక్కెన పువ్వులా అలసిపోయిన ఎరుపు రంగులో కనిపిస్తుంటే చాలా కష్టంగా ఉంది ఆనంద్ కి.


ఏమన్నా చెప్పాలా అని చిన్న గొంతుతో ఆర్థిగా ఆమెనే చూస్తూ అడిగాడు.

జీవిత కాలానికి సరిపడా చెప్పాలన్నంత ఆశ అయితే గుండె నిండుగా ఉంది. 

పెద్దవాళ్లని ఎదిరించి అడుగు ముందుకు వేయలేని కట్టుబాటుకు లోంగిన ఆమె.. పెదవి కదపలేదు.

చిన్నగా తల మాత్రమే అడ్డంగా కదుపుతూ ఆనంద్ ఇచ్చిన కవర్ అప్పటివరకు గుండెలకి అడ్డుగా పెట్టుకుని ఉన్న బుక్ లో భద్రంగా పెడుతుంటే

నిలవలేకపోయాడు ఆనంద్.

ఊపిరి తీసుకోలేనంత బరువులు మోస్తున్న ఫీలింగ్ అతనిది. ఆమెది కూడా అదే ఫీలింగ్.. తెలుస్తుంది అతనికి.

మాటలలో చెప్పలేని ఆ బరువును మోయలేని ఆనంద్ ఇంక ఒక్క క్షణం కూడా అది భరించే శక్తి లేని వాడిలా లీల రెండు చేతులు పట్టుకుని మీద క్లాత్ అని బలంగా ఆమె నడుము చుట్టూ ఒక చేతిని భుజాల మీదగా మరొక చేతిని అల్లేసి గట్టిగా హత్తుకున్నాడు.


బుక్స్ వదిలేసింది లీలా.

ఊపిరి కూడా స్తంభించిన ఫీలింగ్ ఆమెదే.

చిన్ననాటి నుంచి కలిసి తిరిగిన స్నేహంలో, మనసులు కలిసిన ప్రణయంలో కూడా ఎప్పుడూ కూడా ఆనంద్ అలా పట్టుకున్నదే లేదు అసలు ఇంత దగ్గరగా ముట్టుకున్నదే లేదు.

ఆమె చేతులు గాలిలోనే ఉన్నాయి. కనురెప్పలు వేయడం కూడా మర్చిపోయింది.

బలంగా తీసుకుంటున్న ఆనంద్ ఊపిరి మెడ మీద వెచ్చని సెగలుగా, తెరలు తెరలుగా తగులుతుంటే నిలువెల్లా వణికిపోతున్న లీల నెమ్మదిగా కళ్ళు మూసింది.

వేగంగా పరిగెడుతున్న ఆనంద్ గుండె చప్పుడు వింటూ అప్పటివరకు ఎగసి పడిన ఆమె గుండె వేగం చిన్నగా నెమ్మదించింది.


ఎదురు చూస్తుంటాను ఎంతకాలమైనా.. అయితే నాకోసం నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే మాత్రం ఎంతకైనా తెగిస్తాను..!!

చాలా బలంగా స్థిరంగా చెప్పినా అతని నిర్ణయంలో అంతులేని ఆవేశం అనంతమైన ప్రేమ.

కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు కంపించిపోయింది లీల.

ఆనంద్ అన్నంత పని కచ్చితంగా చేస్తాడు. అతని ప్రేమ అంత మొండిది. చదువుకున్నాడు తనని పోషించగలడు, అయినా తన వలనే చేతులు కట్టుకొని అందరి ముందు తిట్లు తిన్నాడు. 

తనకోసమే ఇప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు. అయినా నోరు విప్పలేని తన అసహాయతకు, కని పెంచిన కన్న వాళ్ళని వదులుకోలేని తన బలహీనతకు అతని ఆవేశం అణుచుకుంటూ తన నుంచి దూరం వెళ్తున్నాడు. 

ఇంటికి వెళ్ళాలి ఆనంద్..!! చీకటి ముసుగు వేసుకుంటున్న పడమటి ఆకాశాన్ని చూస్తూ కష్టంగా చెప్పింది.

ఇంకెప్పటికీ నన్ను రావద్దు అంటున్నావు అని అని చూపెడుతున్న కోపంతో అడుగుతూ ఆమెను వదిలాడు ఆనంద్.

తలెత్తి చూడలేకపోయింది అతన్ని. 

నాకు అందరూ కావాలి ఆనంద్ అని మాత్రమే నెమ్మదిగా చెప్పింది. 

నేల చూపులు చూస్తున్న లీల మొఖాన్ని దోసెట్లోకి తీసుకొని అందులో నేనుండను అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ.

లీలా నుంచి మౌనం సమాధానమయింది. 

నీ మనసులో నేను ఉన్నానని అందరికీ తెలిసేలా ఒక్క మాట చెప్పు లీలా. నువ్వు చిన్న పిల్లవి కాదు. వయసు వచ్చిన ఆడపిల్లవి. ఈ సంవత్సరం దాటితే చదువు అయిపోయిన నీకు కచ్చితంగా పెళ్లి...

ఆ మాట పూర్తిగా కాకముందే ఆనంద్ పెదవుల మీద తన వేళ్ళు అడ్డుగా నిలిపింది లీల వినడం కూడా భరించలేనంత కోపం, బాధ తో. 

హుమ్మ్.. ఆమె చేతిని అడ్డుతప్పించిన అతని పెదవుల మీద పెలవమైన నవ్వు.

చచ్చిపోతావా..?? తగ్గు స్వరం తాగిన ఆ ప్రశ్న చాలా బదులుగా వచ్చింది ఆనంద్ నుంచి.



మళ్లీ మౌనమే లీల సమాధానం అవుతుంటే తల కిందకు దించేసింది.

మ్మ్... తెలుసు నాకు.. నువ్వు కచ్చితంగా అదే చేస్తావు. నా ప్రేమ నిండిన నీ గుండెని ఆపేస్తావు. 

నోరు విప్పి చెప్పలేని నీ మౌనంలో దానిని తగలబెట్టేస్తావు. నిన్ను చంపుకుంటూ నన్ను, నా ప్రేమని, నింపిన నీ  జ్ఞాపకాల ఊపిరి తీసేస్తావు.

చాలా పదునుగా వినిపిస్తున్న ఆనంద్ మాటలు కత్తి వేటగా తగులుతుంటే ప్లీజ్ ఆనంద్ నీ మాటలతో నన్ను చంపకు అంది వేడుకోలుగా. 




నోరు విప్పి చెప్పలేని నీ మౌనంలో దానిని తగలబెట్టేస్తావు. నిన్ను చంపుకుంటూ నన్ను, నా ప్రేమని, నింపిన నీ  జ్ఞాపకాల ఊపిరి తీసేస్తావు.

చాలా పదునుగా వినిపిస్తున్న ఆనంద్ మాటలు కత్తి వేటగా తగులుతుంటే ప్లీజ్ ఆనంద్ నీ మాటలతో నన్ను చంపకు అంది వేడుకోలుగా. 


జరగబోయేది చెప్తున్నా..  నీ పక్కన నన్ను చూసి బామ్మ నన్ను నిలదీస్తే నాకు ఇష్టం అని చెప్పలేని నీ మౌనంలో నేను ఓడిపోయాను లీలా. 

ఇక నువ్వు ప్రాణం తీసుకుంటే నేను బ్రతికున్న శవాన్ని అనేసరికి కోపంగా చూసిన లీల కళ్ళు కన్నీటి కడవల ఉన్నాయి.

ఇది మనసులో పెట్టుకొని నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో. పిచ్చి పనులు చేస్తే మాత్రం ఊపిరి వదిలేస్తు నువ్వు దించుకున్న బరువు ఊపిరి ఉన్నంతవరకు మోస్తూన్న శవంలో మారిపోతాను...

అని చివరి మాటగా స్థిరంగా చెప్పిన ఆనంద్ లీల నుదురు మీద పెదవులద్దే వెళ్లిపోయాడు అక్కడ నుంచి. 



**************************




కామెంట్స్ మస్ట్ బేబీస్...💞

__Varna.