ఇది మనసులో పెట్టుకొని నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో. పిచ్చి పనులు చేస్తే మాత్రం ఊపిరి వదిలేస్తు నువ్వు దించుకున్న బరువు ఊపిరి ఉన్నంతవరకు మోస్తూన్న శవంలో మారిపోతాను...
అని చివరి మాటగా స్థిరంగా చెప్పిన ఆనంద్ లీల నుదురు మీద పెదవులద్దే వెళ్లిపోయాడు అక్కడ నుంచి.
నిలువునా మోకాళ్ళ మీదకు జారిపోయిన లీల కన్నీళ్లకు ఆమె గుండె కోతే సమాధానంగా మారింది.
చాలా సేపటి వరకు అలాగే ఉండిపోయిన లీలా నెమ్మదిగా లేచి ఆ పక్కనే ఉన్న పిల్ల కాలువలో మొహం కడుక్కొని తనని తాను సముదాయించుకొని కిందపడిపోయిన తన కాలేజీ బ్యాగ్ ఇంకా జ్ఞాపకాలకు అద్దాం అయిన ఆ బుక్ చేతిలోకి తీసుకొని లేచింది.
ఆనంద్ కి తనకి మధ్య ప్రేమ చిగురించిన క్షణం నుంచి ఇప్పటివరకు అందమైన జ్ఞాపకాలను, ఆవేదనకు గురి చేసిన క్షణాలను భద్రంగా దాచుకున్న ఆ బుక్ కన్నా ఇప్పుడు అందులో ఉన్న ప్రేమ లేఖ మరింత అపురూపంగా మారింది లీల కి.
ఆ క్షణమే దానిని చదవాలి అన్న ఆత్రం మనసులో ఉరకలు వేస్తున్న ఎందుకో మరి కొంతకాలం దానిలో ఉన్న ఆనంద్ ప్రేమను తెలుసుకోవడానికి ఎదురు చూడాలనిపించింది.
పెదవులతో ఆ ప్రేమ లేఖను ముద్దాడి మళ్లీ బుక్ లో భద్రంగా పెట్టిన లీలా ఇంటి దారి పట్టింది.
ఆనాటి సాయంత్రానికి ఇక రేయి విశ్రాంతిని ఇవ్వగా మరుసటి హృదయానికి ఉత్సాహంగా నింగికి ఎగిసిన సూర్యుడు చాలా వేగంగా కాలాన్ని పరిగెత్తించాడు.
ఆ సంవత్సరంతో లీల డిగ్రీ పూర్తయింది. తనకు చెప్పలేదు కానీ బసవయ్య గారు కూతురు కోసం సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.
ఆండాలమ్మ గారు పెళ్లినాటికి మనవరాలికి దండిగా నగలు వేయాలన్న బలమైన కోరికతో కంసాలిని పిలిపించింది ఇంటికి.
ముగ్గురు మగ పిల్లల తర్వాత ఒక్కగాను ఒక్క ఆడపిల్ల. పెళ్లిళ్లు అయినా ముగ్గురు అన్నల మధ్యన ఎంతో అపురూపం లీలా.
బసవయ్య గారికి తగ్గ భార్య పూర్ణేశ్వరి గారు.
నిండుగా ఇంటికి లక్ష్మీదేవి లా ఉండే ఆమెకు సహనం ఓపిక చాలా ఎక్కువ.
అత్తగారి మర్యాదల నుంచి మనవల్ల మనవరాళ్ల ఆలనా పాలన వరకు అన్నింటిలో ఎంతో ఓర్పుగా, నేర్పుగా, సహనంతో, అనురాగంతో చెక్కపెట్టుకువచ్చే ఆమెకు కూతురంటే అపురూపం.
బసవయ్య గారికి ఆ ప్రేమ ఇంకాస్త ఎక్కువే.
ఇంతటి ప్రేమ అనురాగాలు మధ్య పెరిగిన లీల కి వాటితో పాటు చిన్ననాటి నుంచి వంటబట్టిన ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు ఆనంద్ ని దూరం పెట్టేలా చేసాయి.
ఆండాలమ్మ ఇంక పూర్తి బ్రాహ్మణ తత్వాన్ని చిన్ననాటి నుంచి నేర్చుకున్న ఆచారాలు పద్ధతులే పాటిస్తారు.
అవి ఎదుటివారిని ఇబ్బంది పెడుతున్న ఇంట్లో వారికి కఠినంగా ఉన్నా కూడా నరనరాల్లో పెంపకంతో జీర్ణించకపోయిన అలవాట్లు. మార్చుకోను లేరు, వదులుకోను లేరు.
ఆండాలమ్మ గారి నోటికి ఆవిడే పెద్దరికనికి కొడుకు కోడలు మనవళ్లు మనవరాలు అందరూ గౌరవంతో కూడిన భయభక్తులతో మెలుకుతారు.
కానీ వాడు వస్తే గుమ్మం దాటి లోపలికి రానివ్వని ఆవిడ చాదస్తం.. తమ కులం కానీ ఆనంద్ ని ఖచ్చితంగా అంగీకరించదు.
అందుకే లీల ఇష్టం అని చెప్పలేకపోయింది.
స్టడీస్ అయిపోగానే సిటీకి వెళ్లి జాబ్ లెస్సటిలయ్యాడు ఆనంద్. ట్రైనింగ్ పీరియడ్ పూర్తవగానే జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకొని ఊరికి వచ్చిన ఆనంద్ మొదటిగా లీలాకే కనిపించాలి అనుకున్నాడు.
తన కోసమే ఎప్పటిలా ఆ పెద్ద చెట్టు కింద ఊరి చివర వెయిట్ చేస్తూ ఉన్న ఆనంద్ లీలను చూడడమే రెక్కలు కట్టుకున్న ఆనందంతో తన ముందు నిలబడ్డాడు.
అతన్ని చూడగానే ఆకాశంలో తళుక్కుమన్న చుక్కల్లా మెరిసింది లీల ముఖంలో ఆనందం.
ఎప్పుడొచ్చావ్ ఏంటి ఆరిన ముఖంతో అడుగుతున్న లీలా కళ్ళల్లోనే సంతోషాన్ని ఇష్టంగా చూస్తూ జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ లీల చేతిలో ఉంచాడు ఆనంద్.
అది ఓపెన్ చేసి చూసిన లీలా కళ్ళు మతాబుల్లా వెలిగితే కంగ్రాట్యులేషన్స్ అంటూ ఆనంద్ విజయం తన విజయమే అన్నంత సంబరంగా చెప్పింది.
ఈ హ్యాపీనెస్ కి ఈ ఒక్క మాట సరిపోదు అంటూ తన కోసమే ఇష్టంగా కొన్న డ్రెస్ లీలాకి ఇచ్చాడు ఆనంద్.
తనకెంతో ఇష్టమైన నిమ్మ పండు రంగు చూస్తున్న లీల మొఖం వెలిగిపోతుంది. చిన్ననాటి నుంచి తన ప్రతి ఇష్టం ఆనంద్ కి చాలా బాగా తెలుసు.
ఈ హ్యాపీనెస్ కి ఈ ఒక్క మాట సరిపోదు అంటూ తన కోసమే ఇష్టంగా కొన్న డ్రెస్ లీలాకి ఇచ్చాడు ఆనంద్.
తనకెంతో ఇష్టమైన నిమ్మ పండు రంగు చూస్తున్న లీల మొఖం వెలిగిపోతుంది. చిన్ననాటి నుంచి తన ప్రతి ఇష్టం ఆనంద్ కి చాలా బాగా తెలుసు.
ఈ డ్రెస్ లో నిన్ను చూడాలని ఉంది అనగానే లేత గులాబీ రంగులో ఉన్న లీల బుగ్గలు కెంపుల్లా మారాయి సిగ్గుతో.
20 డేస్ ఇక్కడే ఉంటాను. అనడంతో ఉత్సాహంగా చూసింది లీల. బట్ అప్పటి వరకు వెయిట్ చేసే ఓపిక లేదు మేడం ప్లీజ్ ఈ ఫ్రైడే గుడికి వేసుకొస్తావా అని రిక్వెస్ట్ గా అడుగుతున్న ఆనంద్ అల్లరి కి నవ్వుతూ సరే అంది.
ఒకే ఊరిలో ఉండే ఇద్దరు ఒకే దారిన.. నెలల తర్వాత కలిసిన ఏడబాటుని కబుర్లతో దూరం చేసుకుంటూ కలిసి వెళ్తున్నారు.
**************************
కామెంట్స్ మస్ట్ బేబీస్...💞
__Varna.