Read The Endless - 10 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • ప్రేమలేఖ..? - 6

    నాలుగు రోజులకు లీల కు జ్వరం తగ్గింది, వారానికి కాస్త లేచి తి...

  • అంతం కాదు - 10

    ఈసారి వచ్చినది — తాబేలు.“బరువు ఏదైనా తెచ్చుకోండి,” అన్నారు....

  • పాణిగ్రహణం - 3

      శిల్ప, విక్రమ్ ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తూ టెన్షన్తో చేతులు రె...

  • తనువున ప్రాణమై.... - 17

    ఆగమనం.....అవును రా!! ఆ పొట్టిదే, ఈ పొట్టిది!!పిచ్చ పొట్టిది!...

  • అధూరి కథ - 2

    కౌసల్య గారు తన room లోంచి బయటకి వచ్చి hall లో ఉన్న సోఫా లో క...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 10

ఈసారి వచ్చినది — తాబేలు.“బరువు ఏదైనా తెచ్చుకోండి,” అన్నారు. “కానీ, నీటిలో ఇది తాబేలుకు మాత్రమే సొంతం!”అందరూ నీటిలో తేలుతూ చూస్తుండగా, ఒక్క తాబేలు మాత్రం ప్రత్యేకంగా కనిపించింది. నల్లటి శరీరం, గడ్డం లాంటి పెరిగిన బాడీ, వెనకాల గుండ్రటి చిప్ప, ముందు కళ్లలో గులాబీ రంగు మెరుపు, చిన్న ముసిముసి నవ్వుతో, మనసు తాకేలా అరుస్తోంది. అది చిన్న పిల్లాడిలా కనిపించడమే కాదు, వినిపించడమే కాదు — ఏదో చెప్పాలనిపిస్తోంది.రుద్ర ఆ తాబేలు వైపు చూస్తూ, మౌనంగా నవ్వాడు. “ప్రతి జీవికి ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది... కానీ మనుషుల ఆశలు, కోరికలు వారిని బంధించేస్తున్నాయేమో...” అని మనసులో తలుచుకున్నాడు.ఇంతలో తాబేలు నెమ్మదిగా ముందుకు వచ్చింది. “హలో... నా పేరు వీరుపాక్ష,” అంది. “నేను మీ స్పేస్ ఎలిమెంట్ క్లాస్ టీచర్ ని. మీరు అందరూ నాకు చాలా నచ్చారు!”తెల్లగా మెరిసే బట్టలు వేసుకొని, శాంతంగా మాట్లాడుతున్న తాబేలు ఒక్కసారి తల గోకుతూ పలికింది,“మా దగ్గర చిప్పలు తిప్పుకోవాల్సిన పని లేదు, మా తలే చుట్టూ తిరుగుతుంది!”అంతే, క్లాస్ మొదలైంది. వీరుపాక్ష మాట్లాడసాగింది:“స్పేస్ అనంతం. ఇది మీ ఆలోచనల మీద ఆధారపడుతుంది. మీరు ఎలా ఆలోచిస్తే, ఈ ప్రపంచం అలా మారుతుంది. ఇది నీటిలా కాదు, మంటలా కాదు, భూమిలా కాదు. ఇది మీరు.”విద్యార్థులంతా ఆశ్చర్యపోయారు.“ఇది ఎప్పటికీ అంతం కానిది. మీ ఆశలు, కోరికలు లాంటిదే. మీరు ఎంత ఎక్కవ ధ్యానం చేస్తే, అంత బాగా నెరవేరుతాయి.”వీరుపాక్ష తల మూసుకుని ఒక ఆసనంలో కూర్చున్నట్టుగా హాయిగా లేచిపోయింది. చుట్టూ బ్లాక్ కలర్ ఎలిమెంట్ వలయంలా తిరుగుతూ, చుక్కలు మెరుస్తూ ఒక పవర్‌ను విడుదల చేసింది.విద్యార్థులు ఆశ్చర్యంతో చూస్తూ,“ఇది ఎలా చేయాలి?” అని ప్రశ్నలు అడగసాగారు.వీరుపాక్ష నవ్వుతూ చెప్పింది:“ఓ క్షణం... కళ్లు మూసుకోండి. గాలి సేదతీర్చుకోండి. మీరు తేలికగా ఉండాలి. మీరు చూస్తున్న వస్తువు బరువుగా అనిపిస్తే, మీరు మారాలి. మీ ఆలోచనల ఆధారంగా మీ శరీరం మారుతుంది. అదే స్పేస్ శక్తి!”అందరూ కళ్లు మూసుకున్నారు. రుద్ర కూడా.గాలి చుట్టూ తిరుగుతోంది...నీటి బరువు తగ్గిపోతోంది...అందరూ గాలి మాదిరిగా తేలిపోతున్నారు...క్లాస్ అంతా మౌనంగా, కానీ శక్తిగా నిండిపోయింది.ఎలా ఉందో చెప్పుఆ సుదూర గదిలో... వీరు పక్ష కళ్లముందు ఒక తడి అంధకారం లాంటి స్పేస్ మెరిసిపోతుంది. అతని చుట్టూ ఒక్కసారిగా ఒక పింక్ బ్లాక్ కలర్‌తో కలిసిన కొత్త రంగు ఏర్పడుతుంది. ఆ రంగులోంచి మెరుపులా చుక్కల వర్షం మోత మోగించకుండా బయటికి జారుతుంది. రంగుల రేఖలు నెమ్మదిగా గాలిలో తేలుతూ, అక్కడున్న కుర్చీలు, కాగితాలు, మనుషులపైనకి జారిపడతాయి.అవి శరీరాలను గాలి లాగా స్పర్శించగా, కొందరు అవి లోపలికి ప్రవేశించకుండా ఎదురు పడుతుంటే – పెద్ద చేపలాంటి విద్యార్థులు మాత్రం ఎలాంటి భయమూ లేకుండా వాటిని హజమ్ చేసేస్తున్నారు. కొద్దిసేపటికి, వారు కొత్త శక్తితో పట్టుదలగా నిలబడతారు. వారి చుట్టూ రంగుల బబుల్స్ మెరిసిపోతూ ఒక రకమైన ఎనర్జీ షీల్డ్ ఏర్పడుతుంది.అయితే రుద్ర మాత్రం...తన శరీరంలో కొత్తగా నిండి వస్తున్న శక్తిని అర్థం చేసుకోలేకపోతూ, ఒక్కసారిగా ఒక చల్లదనంతో కూడిన వేడికి లోనవుతాడు. అతని కాళ్ల క్రింద భూమి దడిలాడుతుంది. గాలిలో నుంచి పింక్-గోల్డ్ కలర్ తరంగాలా వచ్చి అతని చుట్టూ తిరుగుతాయి. వాటిలో తెల్లటి మెరుపులు మెరిసిపోతూ, మిగతావారికంటే చాలా బలంగా ఉంటాయి.అప్పుడు…రుద్ర మెడ దగ్గర ఉండే నల్ల వెంట్రుక లాకెట్ తిరుగుతుందనిపిస్తుంది. అది అతని శరీరంలోకి శక్తిని గ్రహిస్తూ, చుట్టూ ఉన్న ఎనర్జీని ఏరేస్తూ, అతనిలో చింతనాతీతమైన శక్తిని నింపుతుంది.ఆ వెంటనే— రుద్రకు గుర్తొస్తుంది… ఆ రోజు భూమిమీద ఫైట్ జరిగినప్పుడు తనకు బులెట్ తగిలిన సమయంలో, అదే వెంట్రుక తనలోకి ప్రవేశించిందని!"ఇప్పుడు అర్థమైంది… ఇది లకీ కాదు… ఇది రుద్రమనుల బ్లెస్సింగ్!" అనుకుంటాడు.ఒక్కసారిగా అతని చుట్టూ గోల్డ్-బ్లాక్ కలర్ పవర్ పటములా తేలి, కింద భూమి అతని కాళ్లకు మద్దతుగా ఆకారాన్ని మార్చుకుంటుంది.అతని కన్నాల్లో విశ్వాసం మెరుస్తుంది. అన్నీ గమనిస్తున్న వీరు పక్ష ఒక్కసారిగా కళ్లు తెరిచి, రుద్ర వైపు చూస్తాడు – ఏదో శక్తి రుద్రను ఎంచుకుంది అన్న అర్థం వస్తుంది.రుద్రలోంచి బయటకి వస్తున్న పవర్ ఇప్పుడు పంచభూతాలను తనవైపు లాగుతున్నట్లుగా ఉంటుంది."అలియాస్ రుద్రమనియా... యాక్టివేట్!"ఒక్కసారిగా ఆ నల్ల వెంట్రుక గిరగిరా తిప్పుకుంటూ చుట్టూ ఉన్న పంచభూతాలను కంట్రోల్ చేయడం మొదలుపెడుతుంది!రుద్ర తనను ఎవరూ అనుమానించకూడదని కింద పడిపోయినట్లు నటించాడు. స్టూడెంట్స్ ఆశ్చర్యపోయినా, అది కేవలం నటనే అని అందరికీ, వీరూపాక్షకి కూడా అర్థమైంది. వీరూపాక్ష పిల్లలతో కలిసి ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. వారం రోజుల పాటు, శక్తి వస్తూ, తగ్గుతూ ఉంది.ఇదే సమయంలో, జాన్ న్యూ సిరీస్ రోబోట్‌లను తయారు చేసి ఒక స్పేస్ షిప్‌లోకి ఎక్కించాడు. అప్పుడే ఒక బ్లాక్ టోర్నడో లాంటిది ఏర్పడి, దానిలో నుండి విశ్వ (అలియాస్ ఎర్ర కళ్ళ వ్యక్తి), మాయా లోకపు రాజు కొడుకు బయటికి వచ్చాడు. విశ్వ ఆ స్పేస్ షిప్‌లోని వందల రోబోట్‌లను విధ్వంసం చేశాడు. వాటికి బ్లూ కలర్ డైమండ్స్ అమర్చబడి ఉండటం వల్ల ఎనలేని శక్తి వచ్చింది.విశ్వ భూమి మీదకు దిగి జాన్‌తో, "జాన్, నువ్వు నాకు చాలా పెద్ద పని చేశావు. వీటిలో మాయా శక్తి, భూమి మీద ఆధునిక శక్తి రెండూ కలిసి ఉండటం వల్ల వీటిని ఆపడానికి దైవశక్తులు తప్ప మామూలు శక్తులు ఎవరికీ రావు. నీకు కావాల్సింది నేను ఎప్పుడో ఇచ్చాను కాబట్టి నువ్వు సహాయం చేస్తున్నావు. నువ్వు కూడా మామూలోడివి కాదు, నా లాంటి వాడిని నీ దాకా రప్పించుకున్నావు. అది నీ తెలివితేటలు, నీ శక్తి. నాకు తెలిసి మీ నాన్నను చంపింది ఘటోత్కజ. మాయా లోకపు అధిపతి. బాహుబలిలో కట్టప్ప ఎలాగో, మా మాయా లోకంలో ఘటోత్కజ అలాంటి పోస్ట్‌లో ఉన్నాడు. కాకపోతే కట్టప్పకు పెళ్లి కాలేదు, ఇతనికి పెళ్లి అయ్యి, కూతుర్లు, నాన్నలు, ఇలా వంశం అభివృద్ధి చెందుతూ మా కాళ్ళ కింద బతికేవాడు," అని చెప్పడం మొదలుపెట్టాడు."నువ్వు నాకు ఇంత సహాయం చేశావు కాబట్టి భూమి నీదే, నువ్వే అధీనం చేసుకో," అంటూ విశ్వ మరోసారి ఒక లిక్విడ్ ఇచ్చాడు. "ఇది నువ్వు సృష్టించిన దానికి బాగా పనికొస్తుంది. దీనిలో ఉన్న ఎనర్జీ ఎప్పటికీ తగ్గదు. అలాగే ఇది చాలా ప్రమాదకరం. నువ్వు ఎలా తయారు చేసుకుంటే అంత ప్రమాదంగా తయారవుతుంది." అని ఆ లిక్విడ్ ఇచ్చి, "సరే మిత్రమా, ఒకవేళ నేను అక్కడ ఓడిపోతే మళ్ళీ నీ దగ్గరికి వస్తా. ఇదిగో," అంటూ మరో బ్లాక్ కలర్ కత్తిని ఇచ్చాడు. అది చూడడానికి మేఘంలా కనిపించినా పగలు విడిచి ఉన్న కత్తి.జాన్ "ఇది ఏంటి, నాకు అర్థం కావడం లేదు. ఈ లిక్విడ్ కూడా దీనిలాగే నాకు ఎందుకో రెండూ ఒకటేలా అనిపిస్తున్నాయి," అనడంతో విశ్వ చిన్నగా నవ్వుతూ, "నువ్వు తెలివైన వాడివి అని అనుకున్నా కానీ మరీ ఇంత తెలివైన వాడివా! ఇది నా నుంచి వచ్చిన ఖడ్గం. నా బ్లాక్ పవర్ వల్ల, బ్లాక్ మ్యాజిక్ వల్ల పుట్టిన వ్యక్తి. ఎప్పుడు ఇది నాతోనే ఉండేది. ఫస్ట్ టైం నీకు ఇస్తున్నా. అలాగే ఇది నా బ్లడ్," అంటూ విశ్వ ఇచ్చిన లిక్విడ్‌ను చూపిస్తూ "దీనిలో నా పవర్ మొత్తం ఉంది. ఒకవేళ నీకు కావాలంటే నువ్వు ఉపయోగించుకోవచ్చు. కానీ నువ్వు నా లాగే మారిపోతావు," అని అన్నాడు.జాన్ "కూల్ బ్రో, నీలాగా అంటే నీలాగే శక్తులు వచ్చాయి కదా. ఇలాగే మారిపోతావు కదా. అప్పుడు భూమిని ఇంకా తేలిగ్గా అంతం చేయొచ్చు లేదా మన సొంతం చేసుకోవచ్చు," అని ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. విశ్వ, "సరే, ఇక నీకు చెప్పాల్సింది చెప్పేశాను, నేను ఇంకా వెళ్తున్నా," అంటూ బయలుదేరాడు