Read The Endless - 11 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • ప్రేమలేఖ..? - 7

    తిరిగి కొట్టడం వాళ్ళ నోర్లు ముయించడం క్షణం పని ఆనంద్ కి. ప్ర...

  • అంతం కాదు - 11

    కొద్దిసేపటికే విశ్వ అక్కడున్నాడు. జాన్ తన చేతిలో ఉన్న ఆయుధాల...

  • పాణిగ్రహణం - 4

    కోపంగా బయటికి వచ్చిన విక్రమ్ చూసిన ధనుంజయ గారు ఏమైంది అల్లుడ...

  • సీసాతో జీవితం

    సీసా తో జీవితం మన జీవితానికి "సీసాకి " విడదీయరాని బంధం ఉంది....

  • తనువున ప్రాణమై.... - 18

    ఆ గమనం.....అంతే..!! అందడం ఆలస్యం!! జుట్టు పట్టుకొని వంగదీసి....

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 11

కొద్దిసేపటికే విశ్వ అక్కడున్నాడు. జాన్ తన చేతిలో ఉన్న ఆయుధాలను చూస్తూ, "ఇది భూమికి కొత్త రాజు రాబోతున్నాడు. మళ్ళీ రాజకీయం మొదలవుతుంది, రాజులు, వాళ్ళ పిల్లలు," అని గట్టిగా నవ్వుతూ "నేనే రాజు," అని అంటూ అక్కడ కట్ అయింది.

వారం రోజుల తర్వాత, నెమ్మదిగా అక్కడ చెట్లు పెరగడం, పచ్చదనం పెరగడం, సూర్యకిరణాల వల్ల పైనుంచి వచ్చే వేడి గాలులతో అక్కడ ఉన్న చెట్లు, బుట్టలు, జీవులకు ఎక్కువ ఎనర్జీ సేవ్ అవుతూ "ఆర్" అనే నగరం ఒక్కసారిగా అన్ని నగరాల కంటే అద్భుతంగా మారిపోతోంది. అక్కడున్న స్తంభం కూడా మంచి వెలుగుతో బలంగా, ఈసారి ఎటువంటి తడబాటు లేని యువకుడిలా గట్టిగా నిలబడి అక్కడ రక్షణ కల్పించడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

అక్కడున్న వాళ్ళు, "రుద్రమనుల రాజ్యానికి శక్తి అందబోతోంది. మన రాజ్యానికి వచ్చిన మానవుడి వల్లే ఇది జరుగుతుందా? అంటే రుద్ర వల్లే ఇదంతా జరుగుతుందా?" అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. రుద్ర కూడా ఆశ్చర్యపోతూ, "ఇది రుద్రమనం రాజ్యమా? అంటే నేను ఇప్పుడు వేరే లోకంలో ఉన్నానా?" అని అతనికి పక్కాగా అర్థమైపోయింది. "ఇప్పుడు ఇకనుంచి ఎలా తప్పించుకోవాలి? వీళ్ళందరూ నన్ను దేవుడిలా చూస్తున్నారు," అని చుట్టూ తననే చూస్తున్న ప్రజలను చూస్తూ, "నేను నిజంగా వీళ్ళకు సహాయం చేయగలను," అని ఆలోచిస్తున్నాడు రుద్ర.రుద్ర బాధగా కూర్చుని ఉండగా అక్షర వస్తుంది. "ఏంట్రా! అప్పుడే దేవుడిలా మారిపోయావంట! ప్రజలందరూ నిన్నే కొలుస్తున్నారు. ఇప్పటివరకు కాపాడిన, రక్షించిన మా నాన్నను మరిచిపోయి నిన్ను దేవుడిలా అంటున్నారు. ఇది కూడా మంచిదేలే," అని చిన్నగా నవ్వుతూ వచ్చి కూర్చుంది.

"అవును, నిన్ను అడగడం మరిచిపోయా. నువ్వు ఎలా వచ్చావు? అయినా ఆ పెళ్లైన జంట ఇప్పుడు ఎలా ఉంది? అదే శివ-శ్వేత, ఆ ముసలి వ్యక్తి, అతనే కదా మా తాతయ్య," అని రుద్ర అడగడం మొదలుపెట్టాడు.

"అవును, చెప్పింది మొత్తం కరెక్టే. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమ జంట కదా, పెళ్లి అయ్యింది. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళకు ఒక పిల్లాడు పుట్టేంతవరకు యుద్ధం ఆపరు," అని అక్షర చిన్నగా, చిలిపిగా నవ్వడం మొదలుపెట్టింది.

"రెస్ట్ తీసుకో," అని బయటికి వెళ్తుండగా, రుద్ర ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని, "నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? మళ్ళీ మోసం చేయవు కదా?" అని అడుగుతాడు.

వెంటనే అక్షర చిన్నగా నవ్వుతూ, "చూడు, కావాలంటే ఒట్టేయ్ చూద్దాం!" అని రుద్ర అంటాడు. "ఒట్టేసి చెప్పు మాట! ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పను అయ్యగారు!" అని చిన్నగా నవ్వుతూ చెయ్యి విడిపించుకుని వెళ్ళిపోతుంది అక్షర. అక్షర చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోతుంది.

విశ్వ దాడి

అలా రెండు మూడు రోజులకే ఒకచోట ఒక నల్ల టోర్నడో ప్రత్యక్షమవుతుంది. అందులో నుంచి ఒక నల్లటి స్పేస్ షిప్ దిగుతుంది. దానిలో నుంచి నల్లటి సూట్‌లు వేసుకున్న కొన్ని రోబోలు దిగుతాయి. ఆ నల్లటి సూట్‌ల మీద నీలిరంగు గీతలతో, ఒకరకంగా భయంకరంగా, అద్భుతంగా, యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా ఉన్నాయి ఆ రోబోట్లు.

ఆ అందరూ దిగిన తర్వాత, ఒక్క దూకులో బయటికి దూకిన విశ్వ, "ఈ విశ్వాన్ని నేనే ఏలుతా! ఇక నన్ను ఆపడానికి ఎవరూ లేరు!" అని అంటూ బయటికి దిగుతాడు. "చూడండి సైనికులారా! ఇక్కడ ఎవరూ ఉండకూడదు. ఉంటే మన ఆధీనంలో ఉండాలి లేదా చచ్చిపోవాలి! చంపేయండి!" అని ఆదేశిస్తాడు.

ఇక సైనికులు, రోబోట్లు అటూ ఇటూ చూస్తూ, కెమెరా లాంటి కళ్ళతో ఎక్కడ ఏముందో ముందే పసిగడుతూ, ఎనర్జీ తగ్గదు కాబట్టి స్పీడ్‌గా అటూ ఇటూ తిరుగుతూ, చేతుల్లో గన్నులు, అలాగే ఫైర్ సింబల్స్, ఫైర్ గన్స్, ఫైర్ బాంబ్స్ అని విచిత్రమైన ఆయుధాలతో ఒక్కో రోబోట్ వందలకొద్దీ మనుషులను చంపేలా ముందుకు దూకుపోతున్నాయి.

రుద్రమనుల రాజ్యానికి ప్రమాదం

ఆ తర్వాత, విశ్వ ఒక అడుగు ముందుకు వేయగానే తన కాళ్ళ కింద ఒక నల్లటి బాక్స్ లాంటిది ఏర్పడుతూ అతన్ని గాలిలోనే నిలపడానికి సిద్ధమవుతుంది. ఎప్పుడైతే అక్కడికి దిగాడో, అతను కూడా ఎర్రటి కళ్ళతో, నల్లటి సూట్‌తో, గోల్డ్ బ్రౌన్ నీలం రంగు గీతలతో, ఒకరకంగా చేతిలో ఒక నల్లటి బాకుతో విధ్వంసం చేయడానికి అదొక్కటి చాలు అన్నట్టుగా, రొమ్ము విరిచి ఒక్క అడుగు వేస్తూ ముందుకు సాగుతున్నాడు.

అతని దెబ్బకు రుద్రమనుల రాజ్యం అల్లకల్లోలంగా మారిపోతుంది. నీటి అలలు ఉవ్వెత్తున ఎగిరెగిరి పడుతున్నాయి. ఆ దెబ్బకు రుద్రమనులు ఉన్న ప్లేసుల్లో ఒక్కసారిగా రక్షణ కవచం ఏర్పడింది. ప్రతి రాజ్యానికి ఒక నీలిరంగు, బంగారు రంగు అంటూ విచిత్రమైన రంగుల్లో వెలుగుతూ రక్షణ కవచం సృష్టించబడింది. దానిమీద ఒకదానిమీద శాపం పులుసులు, ఇంకొక దాని మీద తాబేలు, ఇంకొక దాని మీద ముళ్ళతో, ఇంకొక దాని మీద విధులతో ఇలా ప్రత్యేకమైన డిజైన్‌లతో 26 నగరాల మీద ఏర్పడింది. ఆరణ్య నగరం మీద పెద్దగా ప్రమాదం కలిగించినట్లు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న రుద్ర, అతనిలో ఉన్న రుద్రమణి పవర్, అలాగే అతను ఇప్పుడు ఆ నగరంలో స్థిరంగా బలంగా నిలబడి ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బంది కలగడం లేదు. అతని ఒక్క అడుక్కి నగరాలు ఉలిక్కిపడడం మొదలుపెట్టాయి.

భూమిపై విశ్వ ప్రభావం

"మరి ఇంత దగ్గరికి వస్తూ, ఇక ఈ రాజ్యాలకు, ఇక ఏ దేవునికి అస్సలు సంబంధమే ఉండదు," అని అంటూ విశ్వ తన కాలు ఒక్కసారిగా ఆ రాజ్యం మీద అడుగు పెట్టాడు. అతని కాలు నుంచి నల్లటి లేయర్స్ విడిపోతూ ఒక అద్భుతమైన, భయంకరమైన నల్లటి కవచం రుద్రమనుల రాజ్యాన్ని, సముద్రాన్ని అతలాకుతలం చేస్తూ బంధించి పడేసింది. బయట ఉన్న సముద్రం కూడా నల్లటి నీళ్ళతో నిలబడింది.

చుట్టూ ఉన్న జంతువులు, అంటే మామూలు రాజ్యంలో లేని రకరకాల చేపలు, తాబేలు, ఇంకా రంగురంగులుగా మెరిసే ఆములాంటి చేప, ఇంకా కరెంటు ఉత్పత్తి చేసే చేపలు, ఇటువంటి ప్రత్యేకమైన జంతువులు, మామూలు జీవులు ఎవరికీ తట్టుకోలేక సముద్రం బయటికి వస్తుండగా, చుట్టూ ఉన్న బీచ్‌లో ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. "ఏమిటివి?" అని ప్రశ్నించుకుంటున్నారు.

ఈ శక్తి భూమి మీద కూడా ప్రతాపం చూపింది. ఇవన్నీ సముద్రం నుంచి బయటికి వచ్చి భూమి మీద అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ ప్రమాదం చేయడం లేదు కానీ, ఆ శక్తికి తట్టుకోలేక భూమి మీదకి వచ్చి గిలగిలా కొట్టుకుని చనిపోయే స్థితికి చేరుకున్నాయి చేపలు. ఇవన్నీ చూస్తూ మనుషులు, "ఇది కలియుగం స్టార్ట్ అయింది," అని ముసలివాళ్ళు అనుకుంటున్నారు.పెద్దవాళ్లు, చిన్నపిల్లలు, ఆడవాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ భయపడటం మొదలుపెట్టారు. భూమి మీద కూడా ఇదే పరిస్థితి.

ఇక ఇక్కడ సీన్ కట్ చేస్తే, శివ ఉలిక్కిపడి నిద్ర లేచి ఏదో జరుగుతుందని అటు ఇటు చూస్తుండగా, రుద్ర వాళ్ళ తాతయ్య లింగయ్య శివకు మెసేజ్ చేసి, ఆటల మీద పాటల మీద దృష్టి పెట్టకుండా తన ఎనర్జీని సేవ్ చేసుకోమని చెబుతాడు.

మరోవైపు రుద్ర ఆరణ్య నగరం ప్రజల మధ్య నిలబడి భయంకరమైన ప్రమాదాన్ని చూసి కాళ్ళు వణుకుతున్నాయి. ప్రజలందరూ రుద్రనే దేవుడిలా చూస్తూ కాపాడమని అడుగుతున్నారు. ఆడపిల్లలు, చిన్న పిల్లలు భయంతో వణుకుతూ ఏం జరుగుతుందో అని అడుగుతుంటే రుద్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. రుద్రకి కోపం, భయం, టెన్షన్ ఒకదాని వెంట ఒకటి వస్తూ తలనొప్పి రావడంతో కింద కూలపడతాడు. ప్రజలందరూ ఉలిక్కిపడి చూస్తారు. రుద్ర లేచి భయపడకండి, నా ప్రాణం పోయినా మిమ్మల్ని విడిచిపెట్టను అని నేల మీద గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకు రక్తం కారుతూ భూమి మీద పడడంతో అది ఎర్రటి సింబల్‌గా మారుతుంది. అక్కడున్న భయం తగ్గుతూ నల్లటి ఎనర్జీ అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది.

ఇక మరో పక్క విశ్వ తన విశ్వంలోకి రాగానే తప్పించుకుని పోయిన ఐదు మంది అధిపతులు బయలుదేరారు. ఐదు వేరు వేరు పోర్టల్స్ నుంచి బయటికి వచ్చారు. ఘటోత్కజుడు, అక్షర వాళ్ళ నాన్న బయటికి వస్తారు. ఘటోత్కజుడు విశ్వతో మాట్లాడుతుండగా, విశ్వ తనకు కావాల్సిన పని తాను చేసుకుంటానని చెబుతాడు. ఘటోత్కజుడు విశ్వని ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఇద్దరూ యుద్ధానికి సిద్ధమవుతారు.

ఆకాశంలోకి వెళ్లిన వెంటనే ఒక్కొక్క అధిపతికి ఒక్కో రకమైన కవచాలు వస్తాయి. ఇక ఘటోత్కజుడికి ఒళ్లంతా తాబేలు నిప్పుకున్నట్టుగా రకరకాల సింబల్స్ ఏర్పడి అతని సూట్ వెండి కలర్ లోకి మారిపోతుంది.

విశ్వ చిన్నగా నవ్వుతూ వీళ్ళు పిల్లలు ఆటలు అనుకుంటున్నారా అని ఒక కాలు ముందుకు పెట్టి నేల మీద కొడతాడు. అంతే భూమి మీదకి దిగిన ప్రతి ఒక్కరు ఎగిరి పడతారు