Read Adult story by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • పెద్దల కధ

    పెద్దల కథ"ఏవండి రామయ్య గారు! ఎందుకొచ్చిన అవస్థ . రోజు క్యారే...

  • స్వగతం - 2

    ఎదుగుతున్న ప్రతీ మనిషికి తపన పడేది గుర్తింపు కోసం. అది చాలా...

  • ఓ మనసా... - 2

    సెక్స్ విత్ మనీ కావాలనుకున్న ఏ ఆడపిల్ల అయినా రానా ను రిజెక్ట...

  • నిజం వెనకాల ఆలయం - 1

    మీరా, లీనా, తాన్య ముగ్గురు ఒక గుడి కి వెళ్తారు. ఆ గుడిని చూడ...

  • అంతర్జాతీయ మాతృ దినోత్సవం

    అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెం...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

పెద్దల కధ

పెద్దల కథ

"
ఏవండి రామయ్య గారు! ఎందుకొచ్చిన అవస్థ . రోజు క్యారేజీ తెప్పించుకుని తినడం ఆరోగ్యం బాగోలేక పోతే వాళ్లని వీళ్ళని బతిమాలి ఆసుపత్రికి తీసుకు వెళ్ళమనడం ఇవన్నీ ఎందుకండీ హాయిగా నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులు దగ్గరికి వెళ్లి పొండి సీతమ్మ గారు మీరేనా చెప్పండి ! అంటూ క్యారేజీ తీసుకొచ్చిన రామశాస్త్రి మాటలకి ఆ దంపతులు ఇద్దరు పేలవంగా ఒక నవ్వు నవ్వేరు.

ఆ నవ్వు అర్థం ఏమిటో తెలియలేదు రామ శాస్త్రి కి. ఎప్పుడు ఏమీ మాట్లాడరు. నేను ఎప్పుడు ఏం అడిగినా ఇలాగే నవ్వుతారు అంటూ ఖాళీ క్యారేజీ తీసుకుని వెళ్లిపోయాడు రామశాస్త్రి.

రామ శాస్త్రి కాదు ఊర్లో వాళ్ళందరూ కనపడినప్పుడల్లా ఆ మాటలు మాట్లాడినా ఆ దంపతులకు గుండె తీయని బాధతో మూలుగుతూ ఉంటుంది

రామయ్య ఆ ఊర్లో ఒక ప్రభుత్వ స్కూల్లో టీచర్ గా పని చేస్తూ ఉండేవాడు. నలుగురు మగ పిల్లలకి ఉన్నత చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసి వ్యక్తిగతమైన బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, కూడా పూర్తిచేసుకుని హాయిగా సొంత ఊర్లోనే కాలక్షేపం చేస్తుండేవారు రామయ్య, సీతమ్మ దంపతులు. 
అయితే కొద్ది కాలానికి రామయ్య పాపం అనారోగ్యం వచ్చి మంచం మీద పడ్డాడు. నిజానికి రామయ్య మంచం మీద పడడంతో బాధ్యతలన్నీ సీతమ్మ మీద పడ్డాయి . సీతమ్మకి అప్పుడప్పుడు మనసులో అనిపిస్తూ ఉండేది. పిల్లల దగ్గరికి వెళ్ళిపోతే మంచిదేమో!. ఎందుకో ఈ మాట భర్తకు ఇష్టం ఉండదు. ఆ మాట చెప్పినప్పుడల్లా గట్టిగా అలాగే అని అంటాడు. వాయిదా వేస్తుంటాడు. ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి ఏదైనా అవసరం వస్తే ఎవరు చూస్తారు ? అని భయపడుతుండేది పాపం.

రామయ్య కొడుకులందరూ కుటుంబాలతో సహా తల్లిదండ్రులు చూడ్డానికి సొంత ఊరికి వచ్చారు. ఒకరోజు పెద్ద కొడుకు తండ్రి గదిలోకి వెళ్లి " నాన్న మీతో మాట్లాడాలి అన్నాడు. " చెప్పరా ఏమిటి ఏదైనా సమస్య అని అడిగాడు రామయ్య . లేదు మీరు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. ఇక్కడ మీకు సాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు. అందుకని మీరు మాతో పాటు వచ్చేయండి అన్నాడు రామయ్య పెద్ద కొడుకు. ఇంతలో మిగతా కొడుకులు కోడళ్ళు కూడా లోపలికి వచ్చి పెద్ద కొడుకుతో వంత పాడారు.

రామయ్యకు తను ఉన్న పరిస్థితుల్లో అదే మంచిదనిపించింది. రోజు భార్య పడుతున్న అవస్థ చూడలేక సరే రా! మంచి రోజు చూసుకుని వెళదాం అని సంతోషంగా చెప్పాడు. తనని చూడ్డానికి వచ్చిన స్నేహితులందరికీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని ఆనందంగా చెప్పాడు.
 ఆ ముసలి దంపతుల భాగ్యనగర ప్రయాణానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు .రామయ్య సీతమ్మ దంపతుల భాగ్యనగర ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చింది. ఒకరోజు రాత్రి రామయ్య గారిసంతానం , కోడళ్ళు, పిల్లలు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సీతమ్మ నిద్ర వస్తుందని గదిలోకి వెళ్లి పడుకుంది. మధ్యలో మెలకువ వచ్చిన సీతమ్మకి హాల్లో పిల్లల మాటలు చెవిని పడ్డాయి. 

అంతవరకు నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు రామయ్య ఆఖరి కొడుకు ఒరేయ్ నాన్నకు అన్ని బాగానే చెప్పావు కానీ! అసలు విషయం చెప్పలేదు !అన్నాడు. దానికి పెద్దవాడు అలా చెబితే బాగుండదేమోరా ! ఎందుకు బాగుండదు మనందరం కలిసే కదా నిర్ణయం తీసుకున్నాం! దాంట్లో తప్పేముంది!. అందరికీ సమాన బాధ్యత ఉంటుంది. అందరి దగ్గర ఉన్నట్టుంటుంది వాళ్ళకి అన్నాడు చిన్నవాడు. అంతే కాదు నీ ఇల్లు పెద్దది. నా ఇల్లు చిన్నది. ఈ ముసలి వాళ్లు ఎక్కడ ఉంటారు. ఏదో మూడు నెలల పాటు అంటే ముక్కు మూసుకుని ఉంటారు అన్నాడు చిన్నవాడు. 

"
లేదురా నాన్నకు నలుగురు అన్నదమ్ములు ఉన్న తాతయ్యని మామ్మని తన దగ్గరే ఉంచుకునేవాడు. అలాంటిది మనం ఇలా పంపకాలు వేసుకున్నామంటే చాలా బాధపడతాడు అసలు మనతో పాటు రాడు. 
ఒకసారి మనతో పాటు వచ్చిన తర్వాత నిదానంగా చెబుదాము అన్నాడు పెద్దవాడు రామయ్య రెండో కొడుకు మూడో కొడుకు కూడా తన తమ్ముడిని సపోర్ట్ చేశారు. "సరే గట్టిగా మాట్లాడకండి! అమ్మ నాన్న వింటారు. అసలు రంగం చెడుతుంది. వీళ్ళను ఒక్కళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్తే లోకం అంతా మనల్ని తిట్టుకుంటారు అంటున్నాడు పెద్దవాడు.

ఈ మాటలు విన్న సీతమ్మకి ఒక్కసారిగా దుఃఖం పొంగు కొచ్చింది. భూకంపం వచ్చినట్లు అనిపించింది. అంటే కన్న తల్లిదండ్రుల బాధ్యతని నలుగురు అన్నదమ్ములు పంచుకున్నారన్నమాట. అంటే ఒక్కొక్కరు ఇంట్లో మూడేసి నెలలు ఉండాలన్నమాట. అసలే పల్లెటూరు నుంచి వెళతాం. పట్నవాసం అలవాటు లేని వాళ్ళం. ఆహారంలో మార్పు వచ్చిన, వాతావరణంలో మార్పు వచ్చిన పెద్దవాళ్ళకి కష్టమే.
దానికి తోడు పెద్దవాడేమో కూకట్పల్లి రెండోవాడు దిల్షుక్ నగర్ మూడోవాడు సన్ సిటీలో నాలుగో వాడు మెహిదీపట్నంలో కాపురాలు. 

 మూడు నెలలు ఒక చోట అలవాటు పడిన తర్వాత మళ్లీ పెట్టి బేడా సర్దుకుని ఇంకో ఇంటికి వెళ్లాలన్నమాట. "నీకు మా ఇంట్లో టైం అయిపోయింది అంటూ పిల్లలు చూసే చూపులకి ఎలా తట్టుకోగలం! ఈ వయసులో ఆ ట్రాఫిక్ లో ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్లాలంటే ఎంత కష్టo అని ఏడుస్తూ పడుకుంది. 

ఆ రాత్రి పడుకుంది అన్నమాట కానీ నిద్ర పట్టలేదు సీతమ్మకు. తెల్లవారి లేచి పిల్లలు ఎవరూ లేవకుండా రామయ్యకి ఈ విషయం చెప్పింది. 

పిల్లలంతా లేచిన తర్వాత రామయ్య పిల్లలందరిని పిలిచి తన ఆస్తిని ఐదు భాగాలు చేసి ఎవరు భాగం వాళ్లకు ఇచ్చేశాడు. ఈ ఊళ్లో మీకు మిగిలిన ఆస్తిని అందరికీ సమానంగా ఇచ్చేసాను. 
ఇంక నేను మీ అమ్మ మిగిలాము. మీకు అపురూపమైన ఆస్తిలా మేము ఈ ఊర్లోనే ఉండిపోదాం అనుకుంటున్నాము. ప్రాణం లేని ఆస్తికి మాటలు రావు. మనసుండదు. కానీ మనసున్న మమ్మల్ని ఆస్తిలా పంపకాలు చేసుకుంటే మా మనసు విరిగిపోయింది. మేము ఇంక ఎక్కడికి రాము. ఇక్కడే కాలక్షేపం చేస్తాము. నా పెంపకంలో ఈ పిల్లలు ఇలా తయారవుతారు అని నేను కలలో కూడా ఊహించలేదు అన్నాడు.

పిల్లలకు పెళ్లిళ్లు అయిపోయి వేరే కుటుంబాలు ఏర్పడిన తర్వాత తల్లిదండ్రులను వేరుగా చూడడం అనేది చాలా తప్పు. కుటుంబ విషయాల్లో సలహా సంప్రదింపులలో ఎప్పుడు పెద్దవాళ్ళుగా తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వాలి. అనుభవంతో చెప్పిన మాటలలో ఏదో ఒకటి ఉపయోగించకుండా ఉండదు. 
పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. అంతేగాని బాధ్యతలను పంపకాలు చేసుకోకూడదు. అది చాలా బాధాకరం అని చెప్పాడు రామయ్య. 
ఆ తర్వాత పిల్లలు ఎంత బ్రతిమాలిన రామయ్య సీతమ్మ ఊరు నుంచి కదల్లేదు. ప్రతిరోజు క్యారేజీ తెప్పించుకుని సహాయానికి ఒక మనిషిని పెట్టుకుని ఏదో కాలక్షేపం చేస్తూ ఉండిపోయారు. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కా కినాడ 9491792279