ప్రేమ మొదట్లో చాలా అందంగా ఉంటుంది. కొంత దూరం కలిసి నడిచాక, ఈ ప్రేమని ఎలా ఆపేయాలో తెలీదు, ఇంకొంచెం ముందుకు వెళ్తే వెనక్కి రాగలమో లేదో తెలీదు, అక్కడే ఆగిపోతే ఏం అవుతుందో కూడా తెలీదు. ప్రేమ ఏడారిలో ఎండమావి లాంటిది.. దాహం తీర్చుకోవడానికి వెళ్ళి ఊబిలో ఇరుకుపోయేలా చేస్తుంది.
**********************
క్లాసెస్ ఐపోయాయి.. ఎప్పటిలానే పార్కింగ్కి వెళ్ళి సైకిల్ బయటకి తోసుకుంటూ వచ్చాను. అందరినీ ఇప్పుడే వదిలారు కదా, రోడ్ మొత్తం జనాలే... కాలేజ్ రోడ్ సందు చివరి వరకు తోసుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి తోకుకుంటూ వెళ్లోచులే అని స్లోగా సైకిల్ తోస్తున్న.
"హాయి ధీర" అంటూ పలకరించాడు సిడ్.
తల పక్కకి తిప్పి చూసాను. ఎప్పుడులా అనిపించలేదు. ఏంటో బాగా టెన్షన్గా వున్నట్టు అనిపించాడు. చెమటలు కారుతూ, అటూ ఇటూ చూస్తూ... ఏం అయిందో తెలీడం లేదు గానీ ఏదో అయింది.
"ఏం అయింది. ఎందుకు అలా ఉన్నావ్?"
"చిన్న హెల్ప్ కావాలి"
"ఏం అయిందో చెప్పు ముందు"
"నువ్వు తప్ప ఎవ్వరూ హెల్ప్ చేయలేరు... ప్లీజ్"
"అబ్బా... ముందు విషయం చెప్పు"
"నా మొబైల్ దొరికిపోయింది. ఆఫీసు రూంలో హ్యాండోవర్ చేసుకున్నారు. ఇంట్లో తెలిస్తే ఏం అనరు గానీ ఇంకో మొబైల్ కూడా ఇంక కొనరు. ప్లేజ్ నాకు హెల్ప్ చేయవా"
"మొబైల్ ఎందుకు కాలేజీకి తెస్తున్నావ్... తప్పు కదా, రూల్స్కి కూడా అగైనేస్ట్. పోన్లే ఇక నుంచి బుద్ధిగా ఉండు"
"అదేంటి అలా అంటావ్. నాకు సమస్య వస్తె హెల్ప్ చేయకుండా రూల్స్ మాట్లాడతావ్ ఏంటి... ఆగు ముందు" నా సైకిల్ హ్యాండిల్ గట్టిగా పట్టుకున్నాడు.
కోపంగా చూసాను. నా హ్యాండిల్ పట్టుకునే అంత చనువు నేను ఇంకా ఇవ్వలేదు.. చేసిందే తప్పు పని, మళ్ళీ బ్రతిమిలాడకుండా దౌర్జన్యం చేస్తాడేంటి.
నా మనసులో మాట తెలిసినట్టు చేయి తీసేశాడు.
"సోరీ, ప్లీజ్ ఈ ఒక్కసారికి. నువ్వు తప్ప ఎవరూ చేయలేరు"
సర్లే పాపం అనిపించింది. తన తప్పు తెలుసుకొని ఇంకోసారి ఇలా చేయకపోతే అదే చాలు.
"నేనేం చేయగలను"
" మా ఫ్రెండ్ది ఇంకో ఫోన్ తెస్తాను. మా అమ్మలా మాట్లాడు కాలేజ్ వాళ్ళతో. నేనే ఏవో హెల్త్ రిపోర్ట్స్ కోసం ఫోన్ తీసుకువెళ్ళమన్నాను, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటా అలా చెప్పు చాలు"
"బాబోయ్... నా వల్ల కాదు... నాకు బయం.. దొరికితే.. మా ఇంట్లో తెలిస్తే చంపేస్తారు"
"ప్లీజ్.. అలా అనకు ధీర."
"నేను హెల్ప్ చేయనా" ఇద్దరం వెనక్కి తిరిగి చూసాం. శ్రీస్తి నీ చూసి షాక్ అయ్యాం. ఎప్పుడు ఏమీ మాట్లాడని శ్రీస్తి ఏంటి హెల్ప్ చేస్తా.. ధైర్యం చేస్తా అంటుంది.
"శ్రీస్తి .. ఏం అంటున్నావే.. ఐన నువ్వు ఎందుకు రిస్క్ చేయాలి... నాకే చేయడం ఇష్టం లేదు"
"పర్లేదు.. నేను మాట్లాడతాను సిడ్.. నీకు ఒకే ఐతే" శ్రీస్తిలో ఇంత దైర్యం ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
"కుదరదు... నాకు ధీర హెల్ప్ చేస్తుంది.. నువ్వు వెళ్ళిపో" డైరెక్ట్గా చెప్పేశాడు సిడ్.
ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది శ్రీస్తి. పాపం అనిపించింది. హెల్ప్ చేస్తా అని వచ్చేవాళ్ళని హార్ట్ చేసే అంత తల పొగరు ఉండకూడదు.
"ఎందుకు అంత పొగరు నీకు.. తను ఎంత బాధ పడుతుంది. ఎవరు మాట్లాడతే ఏంటి ... మొబైల్ వెనక్కి రావడం కదా ఇంపార్టెంట్ నీకు" కొంచెం గట్టిగానే అరిచాను. నా మొఖంలో ఈ సరికి చాలా కోపం కనిపించింటుంది తనకి.
"ధీర. నాకు నువ్వు హెల్ప్ చేయడం కావాలి. నీ కోసం నేను చాలా ఫీలింగ్స్ పెంచుకుంటున్న... నువ్వు కనీసం ఈ చిన్న హెల్ప్ కూడా చేయలేవా?"
మళ్ళీ మొదలు పెట్టాడు... ఎలా ఐన వదిలించుకోవాలి.. ఈ టాపిక్ వస్తె నాకు ఏదోలా అనిపిస్తుంది. కట్ చేయడం ఎలా అనేది తెలీడం లేదు.
"ఇట్స్ ఒకే... నేను మాట్లాడడమే కదా నీకు కావాలి. ఆల్రైట్.. గివ్ మీ ద ఫోన్" కోపంగానే చెప్పాను.
కొంచెం పక్కగా వెళ్ళి నిల్చున్నాం. ఈ లోపు తన ఫ్రెండ్ ఒకడు మొబైల్ పట్టుకొని వచ్చాడు.
"ఏంటి ఇది ఇంత పెద్దగా ఉంది. మొబైల్ ఏనా అస్సలు ఇది"
"టాబ్ అంటారు దీన్ని.. ఆన్లైన్ క్లాసెస్ వినడానికి బాగుంటుంది"
"సర్లే ఎందుకు టైమ్ వేస్ట్.. కాల్ చేయు.. ఫాస్ట్గా మాట్లాడి..... వెళ్ళిపోత"
రింగ్... రింగ్... రింగ్....రింగ్...
"హలో ... ఎవరు మాట్లాడుతుంది"
"హలో మేడమ్. ఐ యాం మదర్ ఆఫ్ సిద్ధార్థ. తను కాలేజీకి వచ్చినప్పుడు మొబైల్ తీసుకున్నారంట కథ. యాక్టువల్లి నా మెడికల్ రిపోర్ట్స్ స్లిప్ అందులో ఉంది అండి అది కలెక్ట్ చేసుకోవడానికే తను మొబైల్ తెచ్చాడు, నేనే తీసుకువెళ్ళమన్నాను.. కాయిన్ బాక్స్ నుంచి నాకు కాల్ చేసి చెప్పాడు. బయట ఉన్నాడంట కొంచెం మొబైల్ రిటర్న్ ఇచ్చేయండి మేడమ్. ప్లీజ్ "
"హమ్.. మీరు చెప్పింది అంత ఓకే అండి బట్ ఇలా కాలేజీకి మొబైల్స్ తేకూడదు. ఇంకోసారి రిపీట్ చేయొద్దని చెప్పండి"
"థ్యాంక్ యూ మేడమ్.... రిపీట్ అవ్వకుండా చూసుకుంటా"
కాల్ కట్ చేయగానే వెనక నుంచి ఎవరో టాబ్ లాగేసారు. తిరిగి చూసేసరికి శ్రీస్తి టాబ్ తన బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి అందులో పెట్టేసింది.
ఏం జరుగుతుందో అర్థం అయ్యేలోపు.. వైస్ ప్రిన్సిపాల్ సార్ బెత్తం పట్టుకొని క్రౌడ్ క్లియర్ చేస్తూ మా వైపు వచ్చారు.
"ఏంటి ఇక్కడ ఉప్పర మీటింగులు.. ఫాస్ట్గా కదలాలి.. శ్రీస్తి బ్యాగ్ మీద, నా సైకిల్ మీద ఒక దెబ్బ వేసారు".
"ఒరేయ్ సిడ్... నిన్ను కాలేజీ ఆఫీస్ రూంలో పిలుస్తున్నారు రా" దూరం నుంచి ఒక అబ్బాయి అరుపుకి అందరం అటు వైపు తిరిగాం.
"కదలాలి.. కదలాలి..." అని అంటూ సార్ ముందుకు వెళ్ళారు.
కనీసం శ్రీస్తికి థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు సిడ్. ఈ ప్రవర్తన నాకు నచ్చలేదు.
"సారీ మీ టాబ్" శ్రీస్తి టాబ్ వెయిట్ చేస్తున్న అబ్బాయికి ఇచ్చేసింది.
"థాంక్స్ అండి, మీరు లేకపోతే అందరం దొరికిపోయేవాళ్ళం" అని చెప్పి టాబ్ తీసుకొని వెళ్ళిపోయాడు.
"నువ్వు బస్సులో వెళ్ళలేదా" శ్రీస్తినీ అడిగాను
"బస్ మిస్ అయిపోయింది. నీతో నడుచుకుంటూ రావొచ్చా " నవ్వుతూ అడిగింది.
తల ఊపాను.
నడుస్తున్నా ఇద్దరం నిశబ్దంగా..
"ఎప్పుడు లేనిది ఎందుకు సీడ్కి హెల్ప్ చేద్దాం అనుకున్నావ్" చాలా సేపటి నుంచి అడగాలనిపించిన ప్రశ్న అడిగేసాను.
"ఎవరికి చెప్పావ్ కదా" అని అడిగి సమాధానం కోసం నా వైపు తిరిగి చూసింది.
చెప్పను అన్నట్టు తల అడ్డంగా ఊపాను.
"తను అంటే నాకు ఇష్టం"
ఈ సమాధానం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత సైలెంట్గా ఉండే అమ్మాయి మనసులో కూడా ఈ ఆలోచనలు వుంటాయా అనిపించింది.
"నువ్వు అనుకుంటున్నట్టు కాదు ధీర... లవ్ ఏం కాదు.. ఇష్టం అంతే... ఫ్రెండ్షిప్ చేస్తే బాగున్ను అనే ఫీలింగ్" ఏదో ఆలోచిస్తూ చెప్పింది సమాధానం. ఏదో దాస్తుంది అని క్లియర్గా అర్ధం అవుతుంది. అడిగి తెలుసుకునే కన్నా వదిలేయడం బెటర్ అనిపించింది. టైం వస్తె తనే చెప్తుంది కదా...
చెప్పినట్టు గానే మెహంది పెట్టించుకోడానికి మిత్ర, దివ్య, అజయ్ ఇంటికి వచ్చారు. మా ఇంట్లో చాలా ఆర్థోడాక్స్గా ఉంటారు. అబ్బాయిలతో మాట్లాడడం, స్నేహం చేయడం తప్పుగా చూస్తారు. అందుకే వాళ్ళని ఇంట్లోకి పిలవలేకపోయాను.
"పార్కుకి వెళ్దాం .. ఫ్రెష్ ఎయిర్ వుంటుంది" అని వాళ్ళతో చెప్పి.. ఇంట్లో ఫ్రెండ్స్తో వెళ్ళి అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి అని అబ్బదం చెప్పి ఏదోలా పార్కుకి వచ్చేశాం.
మెహంది పెట్టడం స్టార్ట్ చేశాను.
అందరం నవ్వుకుంటూ బలే ఎంజాయ్ చేసాం. శ్రీస్తి కూడా ఉంటే బాగున్ను అనిపించింది.
అజయ్ ఎప్పుడూ కన్నా ఎక్కువ అందంగా కనిపిస్తున్నాడు, బహుశా ఎప్పుడు కన్నా బాగా ఎక్కువగా నవ్వడం వల్ల అనుకుంటా. చాలా సేపు తనని చూస్తూ ఉండడం ఇదే మొదటిసారి. అందంగా నవ్వుతున్నాడు.. కళ్ళు పెద్దగా ఉన్నాయి, రెప్పలు ఏర్పుతుంటే ఇంకా ముద్దోచేలా అనిపిస్తున్నాడు. బుగ్గలు నవ్వీ నవ్వి కాబోలు ఎర్రగా కందిపోయాయి. మొకం మీద ఒక మచ్చ కూడా లేదు.. బలే సున్నితంగా ఉంది మొఖం సూర్యుని కాంతులు పడుతూ..
"నేను కొద్దిసేపు ఉయ్యాల ఊగుతానే.. చాలా రోజులు అయింది.. చిన్నపుడు ఊగిన గుర్తు" మిత్ర అంటూ లేచింది.
"నేనూ తోడుగా రానా?" అజయ్ లేవబోయాడు.
"వద్దు.. ప్లీజ్... తోడే కదా.. దివ్య వస్తుంది.. రావే దివ్య" మిత్ర కస్సుమని లెగిసింది.
దివ్య లెగిసి వెళ్ళింది.. ఇద్దరు నడుస్తూ, నడుస్తూ చాలా దూరం వెళ్లారు ఉయ్యాలలు వున్న వైపు.
"ఇంకేంటి సంగతులు" ఇద్దరం ఒకేసారి అని నవ్వుకున్నాం.
"నీకు ఒకటి చెప్పాలి ధీర" అజయ్ నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు.
వామ్మో.. ఏంటి ఈ గుండె .. ఇంత గట్టిగా కొట్టుకుంటుంది... ఆగిపోతుందా ఏంటి.. ఇంత అందంగా సరా సరి కళ్ళలో చూస్తే.. ఏం ఐపోవాలి ఈ చిన్న గుండె.. కళ్ళు తిప్పేసాను సిగ్గుతో...
ఏం చెప్పబోతున్నాడు??... నువ్వు అంటే నాకు ఇష్టం ధీర అని చెప్పబోతున్నాడా? నిజంగా అలా ధైర్యంగా చెప్పేస్తాడా?? చెప్తే , నేను ఏం ఆన్సర్ చెప్పాలి??
అయ్యో చాలా ఆలోచనలు.. నవ్వుతూ తన కళ్ళలో చూసి కళ్ళు అర్పను .. చెప్పు, వింటున్న అన్నట్టు..
"ఇది చాలా సార్లు చెప్ధం అనుకున్న.. గానీ చెప్తే ఏం అనుకుంటావా అని ఆలోచన.. ఐన ఈ సారి చెప్పేయబోతున్న... ఎంత ఐన మన ధీరనే కదా అర్ధం చేసుకుంటుందిలే అని ... "
ఇంకో క్షణం.. తను చెప్పబోతున్నాడు... నేను వినబోతున్న...
"నేను చాలా సంవత్సరాలు నుంచి ప్రేమిస్తున్న.. ఆది తనకి కూడా తెలుసు... నువ్వు చెప్తే తను వింటుంది.. నా గురించి ఆలోచిస్తుంది".
ఏం చెప్పాడో అర్థం కాలేదు... ఏం విన్నానో అస్సలు తెలీలేదు.. నిన్ను అనాలి కదా.. తను అంటాడేంటి? ఫస్ట్ టైమ్ కదా కంగారు పడుతున్నటున్నాడు.
"తను... ఎవరు" కన్ను బొమ్మలు ఎగరేస్తూ అడిగాను.
"అది... మిత్రని లవ్ చేస్తున్న... తనకి కూడా తెలుసు ఈ విషయం.. గానీ ఒప్పుకోవట్లేదు... ప్లీజ్ హెల్ప్ చేస్తావా?"
అంతా ఐ పోయింది. అజయ్ ప్రేమిస్తుంది మిత్రని... నేను ముందు నుంచే తెలుసుకోలేకపోయానా? ఇంక ఇంతే ... నా చెవులు విన్నది మనసు ఒప్పుకోనంటుంది. ఏదో పోయింది అనే బాధతో మాటలు రావడం లేదు...
"వెళ్దామా" వెనక్కి వచ్చిన మిత్ర, దివ్య అజయ్క్ అడిగారు.
లెగుస్తూ నా సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్టు చూసాడు అజయ్.
"నేను ఇంకొడిసేపు ఉండి వెళ్త ... మీరు వెళ్ళండి" అన్నాను
"బై" దివ్య, మిత్ర నవ్వుతూ చెప్పారు.
మొఖంలో ఏ ఫీలింగ్ ఇవ్వాలో తెలియక చేయి ఊపాను.
"మళ్ళీ కలుద్దాం ధీర" అజయ్ నా కళ్ళలో ఫీలింగ్ ఏంటో వెతుకుతూ చెప్పాడు.
ఇంక కలవొద్దు అని గట్టిగా అరిచేయాలనిపించింది.
ముగ్గురు వెళ్ళిపోయాక, నా కళ్ళలో నాకు తెలీకుండానే నీరు జారాయి.
అజయ్ ప్రేమిస్తుంది నన్ను కాదు.. మిత్రని..
ప్రతిసారి "మళ్ళీ కలుద్దాం" అంటుంటే ఎప్పుడెప్పుడు అని అనిపించేది.. ఇప్పుడు ఇంకెప్పుడు కనిపించకూడదు అని ఉంది.
*టూ బీ కంటిన్యూడ్*