Read Mother's mind by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • ఇత్తడి సామాను

    ఇత్తడి సామానుఉదయం 6:00 గంటలు అయింది. రాజమ్మ గారు స్నానం చేసి...

  • అమ్మ మనసు

    అమ్మ మనసుఅక్షరాభ్యాసం అయిపోయింది కదా! ఎల్లుండి సప్తమి శుక్రవ...

  • నడిచే దేవుడు

    నడిచే దేవుడుఉదయం 11 గంటలు అయింది బ్యాంక్ అంతా రద్దీగా ఉంది....

  • రెండో భార్య - 2

    రెండో భార్య-2              ఒక మద్యతరగతి అమ్మాయి తన ప్రమేయం ల...

  • మన్నించు - 3

    రోజులు మారేకొద్ది ఇష్టాలు మారిపోతుంటాయి. చిన్నప్పుడు ఇష్టం అ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అమ్మ మనసు

అమ్మ మనసు

అక్షరాభ్యాసం అయిపోయింది కదా! ఎల్లుండి సప్తమి శుక్రవారం ఆరోజు బాగుంది చంటి దాన్ని ఆ రోజు నుంచి స్కూలుకి పంపించు అంటూ తండ్రి చెప్పిన మాటలకు సరేనని చెప్పి ఫోన్ పెట్టేసింది శ్వేత. శుక్రవారం అంటే ఇంక మూడు రోజులే ఉంది. పుస్తకాలు బ్యాగు బూట్లు స్కూల్ యూనిఫారం కొనాలి అంటూ హడావుడి పడిపోతుంది శ్వేత తన కూతురు రమ్యని మొదటిసారిగా స్కూల్లో జాయిన్ చేయడానికి. సాయంత్రం భర్త రాగానే బజారుకెళ్లి ఇవన్నీ కొనుక్కుని రావాలని అనుకుంది. 

రమ్య పుట్టి అప్పుడే మూడేళ్లు అయిపోయింది. అప్పుడే స్కూల్ కి వెళ్లే పెద్ద పిల్ల అయిపోయింది. ఇన్నాళ్లు చంకెక్కి కూర్చుని శ్వేత నీ ఏ పని చేసుకోనివ్వకుండా మారం చేసే రమ్య స్కూల్ కి వెళ్ళిపోతుంది అనుకుంటే శ్వేతకి ఒక్కసారి ఎందుకో బెంగగా అనిపించింది. పుట్టిన దగ్గరనుంచి ఒక్కరోజు కూడా అమ్మ చంక వదలని రమ్య ఇప్పుడు స్కూల్ కి వెళ్ళిపోతుందంటే ఏదోలా ఉంది. శ్వేత ఎప్పుడు నిద్రలేస్తే వెంటనే లేచిపోయి అప్పటినుంచి అమ్మ కూడా తిరుగుతూ అది కావాలని ఇది కావాలని అడుగుతూ అల్లరి చేస్తూ ముద్దు ముద్దు మాటలు చెబుతూ దొరికినవన్నీ పాడుచేస్తూ దెబ్బలు తగిలించుకుంటూ క్షణం కూడా తల్లికి ఖాళీ లేకుండా పని పెట్టే చంటి పిల్ల రమ్య రేపు స్కూలుకు వెళ్లి పోతుంది అంటే రేపటి నుంచి పొద్దు ఎలా గడుస్తుందని ఆలోచిస్తోంది శ్వేత. 

ఇంట్లో తండ్రి కసురుకుంటేనే చాలా సేపు ఏడ్చి తండ్రిని భూతoల్లా చూసే చంటిది స్కూల్లో అల్లరి చేస్తే మాస్టర్ భరించలేక రెండు దెబ్బలు కొడితే పాపం ఏడుస్తుందేమో అనుకుంటూ కొంగుతో రెండు కళ్ళు తుడుచుకుంది. 

రోజు ఇంట్లో ఒంటి మీద బట్టలు ఉంచుకోకుండా తిరిగే ఆ చంటిపిల్ల ఆ స్కూల్లో అన్ని గంటలసేపు ఆ యూనిఫారం ఉంచుకుంటుందా. తీసేయమని ఏడుస్తుందేమో. పాపం ఎవరు సముదాయిస్తారు

మధ్య మధ్యలో చిరు తిండి కావాలంటూ ఒంటిట్లో డబ్బాల వైపు చూపించి అడిగే ఆ పసికూనకి పాపం మధ్యలో ఆకలేస్తే ప్రేమగా ఎవరు పెడతారు. ఉదయం పట్టుకెళ్ళిన క్యారేజీ గిన్ని మూత తీసి ముందర పెట్టి తీసుకుని తినమంటారు. ఆ చిట్టి చిట్టి చేతులకు ఎన్ని మెతుకులు వస్తాయి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం చంకనేసుకుని అమ్మ ముద్ద తాతయ్య ముద్ద నాన్నముద్ద అంటూ ఊరంతా తిప్పి గోరుముద్దలు తినిపించి కడుపు నింపేది. కానీ ఇప్పుడు ఆ స్కూల్లో ఉంటే ఎవరు అంత శ్రద్ధగా పెడతారు . తెలుసో తెలియకో కిందపడిన అన్నం మెతుకులు నోట్లో పెట్టుకుంటే నాకు ఏం తెలుస్తుంది అనుకుంటూ ఆలోచనలో పడి మనసంతా గుబులుగా అయిపోయింది శ్వేతకి.

 ఏడాది నిండిన దగ్గర నుంచి కాలకృత్యాలు తీర్చడానికి నో రారా తన సమస్యని అమ్మకు చెప్పే ఆ బుడ్డిది అక్కడ ఎవరిని అడుగుతుంది. ఎవరు దీని మాటలు అర్థం చేసుకుంటారు. పొద్దున్నుంచి సాయంకాలం వరకు డైపర్లు మార్చకుండా ఉంటే అనారోగ్యం రాదా అన్నీ తలుచుకుంటే భయంగా ఉంది.

 రోజు స్నానం చేయించిన తర్వాత టిఫిన్ తినేసి రెండు మూడు గంటలు హాయిగా మంచం మీద పడుకునే ఆ బుజ్జి తల్లిని ఆ బడిలో ఎవరు పడుకోబెడతారు. ఎవరు జోల పాట పాడుతారు. బట్టతడిపితే తీసే వాళ్ళు ఎవరు. అమ్మో తలుచుకుంటేనే మనసు పీకుతోంది. అయినా ఇప్పుడే కదా మూడేళ్లు నిండాయి. అప్పుడే బడికి ఏం తొందర వచ్చింది. చంటిపిల్ల కదా అల్లరి చేస్తే చేస్తుంది. నాకు లేని బాధ మిగతా వాళ్ళకి ఎందుకు. అందరూ సలహాలు ఇస్తున్నారు బడికి పంపమని. బడికి పంపితే కొంచెం అల్లరి తగ్గుతుంది అంటూ సలహాలు కూడా ఇస్తున్నారు ఆ పాలబుగ్గలను ముద్దు పెట్టుకోకుండా ఒక నిమిషం కూడా ఉండలేను అలాంటిది అన్ని గంటలు స్కూల్లో అది ఉండిపోతే ఎలాగా . రోజు ఇంట్లో అల్లరి చేసినట్లుగానే అక్కడ కూడా అల్లరి చేస్తే బుగ్గ పట్టుకుని గిల్లితే బుగ్గ గులాబీ రంగులో కందిపోతే గుక్క పట్టి ఏడుస్తే ఎవరు అమ్మో నేనయితే స్కూలుకు పంపను ఇంకా కంగారు లేదు అనుకుంటూ మంచం మీద పడుకుంది శ్వేత.

సాయంకాలం ఆఫీసు నుండి ఇంటికి వచ్చిన భర్త మంచం మీద ఉన్న శ్వేతను చూసి ఏమి పడుకున్నావ్ ఈ వేళలో ఆరోగ్యం బాగోలేదా అంటూ ఒంటి మీద చేయి వేసాడు. అదేమీ లేదండి ఒంట్లో బాగానే ఉంది. మనసు ఏమీ బాగాలేదు అంటూ ఏడవడం మొదలుపెట్టి తన మనసులో ఉన్న మాట భర్త శంకర్రావు కి చెప్పింది. 

శంకర్రావు పకపకా నవ్వుతూ చూడు శ్వేత తల్లిగా నీకు బిడ్డ మీద ఆ ప్రేమ అభిమానం బెంగ ఉండడంలో తప్పులేదు. తల్లి నవమాసాలు మోసి జన్మనిస్తే బిడ్డకి భవిష్యత్తును ఇచ్చేది బడి. నువ్వు కన్నతల్లివి. బడి చదువుల తల్లి. ఇద్దరూ ఒకటే.

 బుడిబుడి అడుగులతో వచ్చిరాని మాటలతో పలక బలపం పుచ్చుకుని అమ్మను వదిలి రానని మారం చేసే చంటి దాన్ని బుజ్జిగాడిని లాలించి బుజ్జగించి అక్కున చేర్చుకుని గురువు రూపంలో ఆ చదువుల తల్లి అక్షరాలు నేర్పిస్తుంది. నేర్చుకున్న తొలి అక్షరం ఆ బ్రతుకుని ఎన్ని మలుపులో తిప్పి విజ్ఞానవంతులుగా చేస్తుంది . బ్రతుకుకి ఉపాధి కల్పిస్తుంది మాయ మర్మం తెలియనీ ఆ పసికూనలని జ్ఞానవంతుల్ని చేస్తుంది. క్రమశిక్షణ నేర్పిస్తుంది. బడి బాట పట్టిన పిల్లలకి బ్రతుకు బాటకి పోరాటo ఎలా చేయాలో నేర్పిస్తుంది. మనం బ్రతికున్నంత కాలం పిల్లలకి ఏ లోటు లేకుండా చూస్తాం. మనం కన్నుమూస్తే వాళ్లకి ఆధారం. చిన్నప్పుడు నేర్చుకున్న అక్షరం కల్పించిన ఉపాధి. 

అలాగే నీలోని ధర్మసందేహాలు అన్నిటికీ కాలమే సమాధానం చెప్పి పిల్లలకి అన్ని నేర్పిస్తుంది. అన్ని వాళ్ళంతట వాళ్లే అన్ని అలవాటు చేసుకుంటారు. చుట్టూ ఉండే వాతావరణాన్ని చూసి అని భర్త చెప్పిన మాటలకి శ్వేత మనసు కుదుటపడింది

 తల్లిదండ్రులు పిల్లలకు తమ కాళ్ళ మీద తాము నిలబడే చేయాలంటే అక్షరాలు నేర్పించాలి కదా అంటూ భర్త చెప్పిన మాటలకి కొంతవరకు సమాధానం పడిన బిడ్డ భవిష్యత్తు పాడు చేయడానికి ఇష్టపడక లేచి వంటింట్లోకి వెళ్ళింది భర్తకు టిఫిన్ చేయడానికి.

అవును నిజం ప్రస్తుత కాలంలో మూడు సంవత్సరముల రాగానే అక్షరాభ్యాసం చేసి స్కూలుకు పంపించడం మొదలు పెడుతున్నారు. ఒకప్పుడు ఐదు సంవత్సరములు వరకు స్కూలుకు పంపేవారు కాదు. ఈ మూడు సంవత్సరముల పిల్ల తల్లికి పసిపిల్ల కదా. ఇప్పుడే నడక నేర్చుకుని బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చిరాని మాటలు చెబుతూ అమ్మానాన్న తాతయ్యలను గుర్తు పడుతూ స్కూల్ కి వెళ్ళిపోతావంటే వెళ్లిపోతానని చెబుతూ తల్లికి రోజు ఊపిరి సలపకుండా ఇంటిదగ్గర పనులు చెప్పే ఆ బుజ్జి తల్లి స్కూలుకు వెళ్ళిపోతే తల్లికి ఏమి తోస్తుంది పాపం. చెయ్యి విరిగినట్లు ఉంటుంది.

 దానికి తోడు కొంచెం అలవాటయ్యే వరకు కొంతమంది పిల్లలు ఏడుస్తారు కొంతమంది పిల్లలు మామూలుగానే ఉంటారు.పిల్లలు ఏడ్చినా ఏడవకపోయినా తల్లి మటుకు పిల్ల గురించి బెంగపెట్టుకుంటుంది రోజు స్కూల్ నుండి వచ్చే వరకు కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతుంది. ఇది లోక సహజం . మొదటిసారిగా పిల్లల్ని స్కూలుకు పంపే తల్లి మనోవ్యధ. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279