Read Wedding in a dream by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • రెండో భార్య

    ఒక మద్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్య...

  • మారిన పల్లె

    మారిన పల్లె  పల్లెటూరు అనగానే చుట్టూ పచ్చని పొలాలు ,పిల్ల కా...

  • రహస్యం

    తా తలనాటి ఆస్తి, దాయాదుల మధ్య, కోర్టులలో నలిగి నలిగి దివాకరా...

  • పెళ్లి చూపులు

    పెళ్లిచూపులుతెనాలి సంబంధం వాళ్లు ఫోన్ చేశారు అమ్మాయిని చూసుక...

  • వివాహం

    పెళ్ళి అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, క...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

కలలో కళ్యాణం

కలలో కళ్యాణం

 అబ్బా ! ఎంత బాగుంది ఈ శుభలేఖ.

అయినా ఈ శుభలేఖ ఎవ్వరూ పంపించారు అనుకుని
 చూసేసరికి మిథిలా నగరం నుంచి వచ్చినట్లు కనబడుతోంది.
అలకాపురి లో చుట్టాలున్నారు గాని మిథిలాపురిలో ఎవరున్నారు అబ్బా ! అనుకుని వరుడు పేరు చూసేసరికి రాములోరి పెళ్లికి ఊరంతా పెద్దలే కదా అనుకుని బయలుదేరా బాల రాముడిని చూడొచ్చని ముచ్చట పడ్డాను.వధువు ఇంకెవరు మా సీతమ్మ తల్లి కదా!

 పర స్త్రీని కూడా కన్నెత్తి చూడని మహా పురుషుడు రాముడు. ఏకపత్నివ్రతుడు. అయినా పుట్టినరోజు నాడే కళ్యాణం జరిగే అదృష్టం ఈ లోకంలో ఎంత మందికి ఉంటుంది. రామచంద్ర మూర్తి లాంటి మహనీయులకు తప్పితే. ప్రతి ఏట కళ్యాణం దేవుళ్ళకే మనలాంటి వాళ్ళు చేసుకుంటే కారాగారానికే. అబ్బా దేవుడి పెళ్లి శుభలేఖ అందుకున్నాను. తప్పకుండా వెళ్లాలి . మియాపూర్ అడ్రస్ తెలుసు కానీ మిథిలాపురి నాకు తెలియదు. 
కళ్యాణం చూసే అదృష్టం ఉంటే దేవుడే అక్కడకి తీసుకెళ్లి పోతాడు. అందుకనే సంకల్పం మనది నెరవేర్చేవాడు ఆ మహానుభావుడు. 

భూదేవి అంత కల్యాణ వేదిక మీద వధూవరులు, కన్యాదాతలు 
ఆకాశమంత పందిరిలో ఆహ్వానితులందరూ సింహాసనములను అధిష్టించి అతిధి మర్యాదలు పొందుతూ ఉండగా నేను కూడా అతిధిని అయిపోయా. దేదీప్యమానంగా వెలిగిపోతున్న కళ్యాణ వేదికను, ఆకాశమంత పందిరిని చూసి ఇంత అందమైన వెలుగులకు కారణం ఎవరు అని ఆలోచిస్తే లోకమంతటికి వెలుగులు పంచే దినకరుడు అతిధుల్లో కనబడ్డాడు. నువ్వు పంచే వెలుగులకి ఏ వెలుగు సాటిరాదు తండ్రి అని నమస్కరిస్తే జరిగేది నా రాముడి కళ్యాణం ఏదో నాకు తోచినంత సహాయం అన్నాడు మహానుభావుడు.

అసలే వసంత ఋతువు. ప్రకృతి అంతా పచ్చని మామిడాకు తోరణాలు కట్టినట్లుగా ఉంది. వేదిక మీద దినకరుడు ఇచ్చే వెలుగులకు మురిసిపోయాను కానీ వేసవి తాపం ఆహుతులను బాధించకుండా నదులు మీద నుంచి వీచే గాలిని మోసుకుని మరీ వచ్చాడు వాయుదేవుడు . మనం ఎప్పుడు వాయుదేవుడికి అతిధులమే. పంచభూతాలలో ఒకడైన వాయుదేవుడు మనకి ప్రాణనాధుడు. హమ్మయ్య పెళ్లి హాయిగా చూడొచ్చు వాయుదేవుడు పుణ్యమా అని అనుకున్నాను.

 దేవుళ్ళందరూ వచ్చారు . మరి లక్ష్మీదేవి కనపడలేదు ఏమిటని చూస్తే నేను చూడవలసింది ఆహుతుల్లో కాదు వేదిక మీదని లేటుగా తెలుసుకున్న. 

అమ్మవారి చేతిలో ఎర్ర గోరింటాకు మెరిసిపోతూ… ఆ నడివేదికపై నడుస్తూ వెళ్ళింది సీతమ్మ తల్లి. మనసు నిండిపోయింది నాకు.

ఆమె అడుగుల శబ్దం వినిపించలేదు కానీ… ఆ అడుగుల్లో వెన్నెలలా ఒక శాంతం ఉంది… ఆ దీవెనలే మళ్ళీ ఈ భూమికి విలువను ఇస్తున్నాయనిపించింది.

ఆమెకు ఎదురుగా రామచంద్ర మూర్తి… ఆశ్చర్యం కలిగించే అందం… ఉదారత… ప్రశాంతత కలయికగా ఒక జీవ రూపం. ఆ క్షణంలో వారిద్దరిని చూస్తుంటే కాలం ఆగిపోతే బాగుండనిపించింది.

వేణువాద్యం మౌనమై… మృదంగం ముడిపడి… సమస్త ప్రకృతి కూడా ఒక్క క్షణం మౌనంగా ఆ శుభ దృశ్యాన్ని ఆస్వాదించింది.

సీతా రాముల కల్యాణం అంటే ఆధ్యాత్మిక సందేశం మాత్రమే కాదు…మనిషి జీవన విధానానికి ఒక మార్గదర్శకం.

ప్రేమ… నిజాయితీ… నమ్మకం… కుటుంబానికి గౌరవం… విలువల శృంఖల ఇది.

పురోహితుల స్థానంలో కూర్చున్న వశిష్ట మహర్షి దంపతులు ఇద్దరికి బ్రహ్మ ముడి వేసి కలిపి అనేక ప్రమాణాలు చేయించి అగ్ని దేవుడు చుట్టూ ఏడు అడుగులు నడిపిస్తుంటే ఆ లోక కళ్యాణానికి సాక్షిభూతుడుగా అగ్నిదేవుడు ఆహుతుల్లో కనబడ్డాడు. ఎంత అదృష్టం. ఎవరిది .? ఆహుతులుగా వచ్చిన వాళ్లది. 

ఆ వధూవరుల మెడలో ఉండే పూలమాలలు ఆకాశంలో ఉండే తారల లా మెరిసిపోతూ కనబడ్డాయి. అందరూ వచ్చారు నీలి మేఘాలు కనపడలేదు ఏమిటా అని అనుకుంటే మాది రామచంద్రమూర్తి శరీరం మీదనే ఉన్నాము అని గర్వంగా చెప్పే యి.

తారలందరూ కిందకు దిగి వచ్చారు మరి చంద్రుడు కనపడలేదేమిటి అబ్బా అనుకుంటే సరిగ్గా చూడు వధువు మొహం కేసి అన్నారు ఎవరో!. వసంత కోకిల సన్నాయిరాగం , సముద్రపు అలల మృదంగ నాదం, ఆకాశంలో పక్షుల కిలకిల రావాలు అన్నీ కలిసి మంగళ వాయిద్యాలు గా వినపడ్డాయి. 

 సీతమ్మవారు అయ్యవారి తల మీద పోసిన ముత్యాల అయ్యవారి ఒంటిమీద జారి పడుతుంటే అవి ఇంద్రనీల మణి లాగా వరుడు తలమీద మల్లెపువ్వులు లాగా, అమ్మవారి చేతిలో ఎర్రని పద్మ రాగ మణి లాగా కనబడుతుంటే అతిథిగా వచ్చిన వరుణ దేవుడు జనం కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు కుంభ వృష్టిగా కురిపించాడు.

ఆకాశంలోని మేఘాల మెరుపులు మేఘాల గర్జన వెరసి బాణసంచాగా ధ్వనించింది. ఇంతలో ఏదో సైరన్ చప్పుడు గట్టిగా వినిపించడంతో ఒక్కసారి కలలోంచి ఇలలోకి వచ్చి పడ్డాను. ఇదంతా కలలోని కళ్యాణమా అని మురిసిపోయి ఇలలో సీతారామ లక్ష్మణ సమేత హనుమత్ స్వామి కి ఇష్టమైన సుందరాకాండ పారాయణ కొనసాగించడానికి కూర్చున్నాను. 

అక్కడ కలలోని కళ్యాణానికి అతిథిగా వెళ్లిన నేను విందు భోజనానికి ఉండకుండా వచ్చేసిన ఇలలో వసంత కాలంలో మన శరీరానికి పుష్టి చేకూర్చే చలిమిడి, వేడి తగ్గించే పానకం వడపప్పు మహా ప్రసాదంగా స్వీకరించి ఆనందం పడ్డాను. మానవ జీవితంలో ఎప్పుడూ చూడని దేవతలను కలలో చూసినందుకు పొంగిపోయాను.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279