Read Will by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • ఇంటి దొంగ

    ఇంటి దొంగతెల్లారేసరకల్లా ఊరంతా గుప్పు మంది ఆ ఊరి ప్రెసిడెంట్...

  • వీలునామా

    వీలునామా " నాన్న ఇంకా నాలుగు ముద్దలే ఉన్నాయి ఇది మీ తాత ముద్...

  • కన్యాదానo

    కన్యాదానంఉదయం 10 గంటలు అయింది.పరంధామయ్య గారు అప్పుడే టిఫిన్...

  • రక్తం చిమ్మిన రాత్రి

      రక్తం  రాత్రిఉదయం ఏడుగంటల సమయం...ఉత్తరప్రదేశ్‌లోని బడౌత్‌...

  • గురు దక్షిణ

    గురుదక్షిణసాయంకాలం నాలుగు గంటలు అయింది. వీధి అరుగు మీద కూర్చ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వీలునామా

వీలునామా 

" నాన్న ఇంకా నాలుగు ముద్దలే ఉన్నాయి ఇది మీ తాత ముద్ద
 అంటూ కంచంలోని పెరుగన్నం ముద్ద ని రాఘవయ్య గారి 
 నోటికి అందించాడు రాజేష్. అన్నం ఇంక తిననని తల అటు
 ఇటు తిప్పేస్తూ పక్కకు తిరిగి పడుకున్నాడు రాఘవయ్య గారు.
ఇదిగో ఇది మీ నాన్న ముద్ద ఇది తినకపోతే మీ నాన్నకు కోపం
 వస్తుంది ఇది కూడా తినంటూ బలవంతంగా రాఘవయ్య
 గారినోట్లో పెట్టాడు. రాఘవయ్య గారు కోపంగా కొడుకు రాజేష్
 వైపు చూశాడు . నువ్వు రాత్రి ఏమి తినడం లేదు నీకు
 ఆకలేస్తుందో లేదో నాకు తెలియదు నీరసం వస్తుందని నాకు
 భయం. 

 మరి అమ్మంటే నీకు ఇష్టం కదా ఇది అమ్మ ముద్ద
 చూడు మిఠాయి నంచి పెడతాను తిను అంటూ పక్కనే
 డబ్బాలో ఉన్న మిఠాయి అన్నoముద్దతో కలిపి పెట్టాడు. రాఘవయ్య గారు గబగబా నోరు తెరిచి ఆ ముద్ద తినేసారు.
 రాఘవయ్య గారికి స్వీట్ అంటే ఇష్టం. భార్య అంటే
 అమితమైన ప్రేమ. మావయ్య గారికి స్వీట్ పెట్టకండి షుగర్
 పెరిగిపోతుంది అంటూ వంటింట్లోంచి భార్య శాంత గట్టిగా
 కేకేసింది. షుగర్ తగ్గించడమే కదా రోజు నా పని దాని సంగతి
 నేను చూసుకుంటాలే అంటూ డాక్టర్ రాజేషు భార్యకు
 సమాధానం చెప్పి రాఘవయ్య గారి మూతి తుడిచి బ్లడ్ ప్రెషర్
 చెక్ చేసి మందులు వేసి దుప్పటి కప్పేసి బాత్రూంలోకి వెళ్లి
 స్నానం చేసి బట్టలు మార్చుకుని టిఫిన్ చేయడానికి డైనింగ్
 టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏవండీ మావయ్య గారిని చూస్తే
 భయమేస్తుంది.మీరు పెట్టిన నాలుగు ముద్దలు తప్పితే ఏమితినడం లేదు. కాఫీ టీలు అసలే వద్దంటున్నారు. నాకు ఏమిటోఏమి తోచడం లేదు అంటూ భార్య చెప్పిన మాటలకి డాక్టర్ రాజేష్ ఆయనకి కిడ్నీలు సరిగా పనిచేయడం లేదు. దానికితోడు హైబీపీ షుగరు. మా నాన్న నార్మల్ పరిస్థితికి రావడంచాలా కష్టం . ఏదో అలా ఉన్నన్నాళ్ళు చంటిపిల్లలాచూసుకోవడం మనం చేయగలిగిన పని. ఇష్టమైనవి పెట్టడం ఇష్టం లేనివి మానేయడం. బలవంతంగా అన్నం నాలుగు ముద్దలు తింటున్నాడు. అంతకంటే చేయగలిగింది ఏముంది. 

నేను డాక్టర్ని కదా రాత్రి పగలు చూసుకుంటూనే ఉంటాను. ఎవరికైనా డాక్టర్లు నొప్పి తగ్గించగలరు కానీ ఆయుష్షును పెంచలేరు. అప్పుడే ఏడాది అయింది మంచం దిగి. అన్నీ మంచం మీదే అని చెబుతూ కళ్ళు తుడుచుకున్నాడు. ఎంత డాక్టర్ అయితే మటుకు ఏమిటి రక్తసంబంధం కదా. అయితే డాక్టర్ రాజేష్ కి మనసులో ఇంకో బాధ కూడా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తోందని. భార్యకు చెప్తే భయపడుతుందని అసలు విషయాలేవీ చెప్పలేదు.

ఇంతలో వీధి గేటు చప్పుడు అయింది. ఎవరబ్బా అనుకుని అటు తొంగి చూసాడు డాక్టర్ రాజేష్. గుడ్ మార్నింగ్ సార్ అంటూ లోపలికి అడుగు పెట్టాడు కాంపౌండర్ రవి.

 రాజేష్ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు కాంపౌండర్ రవి రాఘవయ్య గారి బాగోగులు చూసుకుంటాడు. డాక్టర్ రాజేష్ ఇంటికి రాగానే తండ్రి సంగతి తనే స్వయంగా చూసుకుంటాడు. తప్పక హాస్పిటల్ కి వెళుతున్నాడు కానీ తండ్రి అంటే చాలా ప్రేమ అభిమానం. దానికి తోడు పెద్దలంటే గౌరవం. ఎంత రాత్రి అయినా అలిసిపోయి ఇంటికి వచ్చిన తండ్రి బాగోగులు చూడకుండా నిద్రపోడు. రాత్రిపూట తండ్రి గదిలోనే వేరే మంచం మీద పడుకుంటాడు. పగటిపూట కోడలు శాంత అటు ఇటు తిరుగుతూ ఇంటి పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ మావగారికి ఏం కావాలో చూసుకుంటూ ఆప్యాయంగా పలకరిస్తూ కాలక్షేపం చేస్తుంది. పిల్లలు స్కూల్ కి వెళ్లి వచ్చి వెంటనే తాతయ్య గదిలోకి దూరి ఆ కబురు ఈ కబురు చెప్పి గాని బయటికి రారు. అలా అలవాటు చేశారు డాక్టర్ రాజేష్ గారు. "అయ్యగారు మందులన్నీ వేసేసారా తాతయ్య గారి కంటూ అడిగిన రవి ప్రశ్నకి అన్ని వేసేసాను మధ్యాహ్నo అమ్మగారికి చూపించి మిగిలిన మందులు వెయ్యి జాగ్రత్తగా చూడు నేను ఆస్పత్రికి వెళ్లి వస్తాను అంటూ డాక్టర్ రాజేష్ కారు ఎక్కి వెళ్ళిపోయాడు.

రాఘవయ్య గారు గవర్నమెంట్ స్కూల్లో 35 సంవత్సరంలు 
 టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. రాఘవయ్య గారికి ఒక కొడుకు నలుగురు కూతుర్లు తర్వాత. ఆడపిల్లలు అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. రాజేష్ చిన్నప్పటినుంచి ఆటపాటల్లోనూ చదువులోనూ అన్నిట్లోనూ ఫస్ట్. 
అందుకే స్తోమత ఉన్నా లేకపోయినా కష్టపడి రాజేష్ ని డాక్టర్ కోర్స్ చదివించారు రాఘవయ్య గారు.రాజేష్ కూడా చాలా కష్టపడి చదివి గవర్నమెంట్ హాస్పిటల్ లో షుగర్ డాక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడ ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు. డాక్టర్ రాజేష్ కి ఇద్దరు మగ పిల్లలు . ఇంకా స్కూల్ కి వెళ్ళే స్థాయిలోనే ఉన్నారు. చిన్నప్పటినుంచి రాజేష్ కి తల్లితండ్రులంటే ఎంతో గౌరవం. అభిమానం ప్రేమ. రాఘవయ్య గారు కూడా తన తండ్రి పరంధామయ్య గారు చాలా సంవత్సరాల పాటు మంచం మీద ఉంటే రాఘవయ్య గారే చాకిరి
 చేసేవారు. అప్పటికి రాజేష్ కి పది ఏళ్లు ఉంటాయేమో తండ్రి చేస్తున్న ప్రతి పనిని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవాడు. పరంధామయ్య గారికి అన్నం కలిపి ముద్దలు పెట్టడం సాయంకాలం పూట తండ్రిని వీల్ చైర్ లో కూర్చోబెట్టుకుని పార్కుకి తీసుకెళ్లడం రాత్రిపూట తండ్రి పక్కనే మంచం వేసుకొని పడుకోవడం అర్ధరాత్రి అపరాత్రైన సరే తండ్రి లేపితే విసుక్కోకుండా రాఘవయ్య గారు లేచి కావాల్సిన దాన్ని అందించడం అన్ని చిన్నప్పటినుంచి చూశాడు. రాఘవయ్య గారు చిన్నతనంలోనే రాజేష్ కి దేవుడనే వాడు వేరే చోట ఎక్కడ లేడని మన ఇంటిలోనే మన కన్న తల్లిదండ్రులే దేవుళ్ళని ,దేవుడి కోసం ప్రత్యేకంగా పూజలు చేయక్కర్లేదని, తల్లిదండ్రులను బాగా చూసుకుంటే దైవం సంతోషిస్తుందని, అంటూ చెప్పిన మాటలు రాజేష్ మీద బాగా ప్రభావం చూపేయి.
అలాగే తండ్రి మాటలను తూచా తప్పకుండా పాటిస్తాడు డాక్టర్ రాజేష్. రాఘవయ్య గారు రిటైర్ అయిన సంవత్సరం తర్వాత రాజేష్ గారి అమ్మ చనిపోయింది. 
అప్పటినుంచి తండ్రి ఒంటరిగా ఫీల్ అవ్వకుండా మళ్లీ పెళ్లి చేసుకోమని బలవంత పెట్టాడు రాజేష్. రాఘవయ్య గారు అందుకు ఒప్పుకోలేదు. నాలుగు సంవత్సరాల తర్వాత ఇదిగో ఇలా మంచం మీద పడ్డాడు రాఘవయ్య గారు.

హాస్పిటల్ కి వెళ్లాడన్నమాట కానీ రాజేష్ కి మనసు మనసులో లేదు. తండ్రి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ మధ్యలోనే ఆపేస్తున్నాడు. ఆయనకి ఏ సమస్య లేదు. ఒక ఆరోగ్య సమస్య తప్పితే. ప్రతి నెల పెన్షన్ వచ్చి అకౌంట్ లో పడుతుంది. ఆ డబ్బు ఎవరు ముట్టుకోరు. పొలం అమ్మిన డబ్బులు ఊరిలోని ఇల్లు అమ్మిన డబ్బులు రిటైర్మెంట్ బెనిఫిట్ లు అని బ్యాంకులో వేసుకున్నారు రాఘవయ్య . రాజేష్ తల్లి బంగారం అంతా లాకర్ లోనే ఉంచుకున్నారు రాఘవయ్య .ఏ అవసరం వచ్చినా కొడుకు దగ్గరుండి చూసుకుంటాడు. ఆ తండ్రి కొడుకుల మధ్య అసలు డబ్బు సమస్య లేదు. ఆడపిల్లలు కూడా ఏడాదికోసారి వచ్చి వెళ్తారు కానీ వాళ్లెవరు ఆ విషయాలు ఏమి పట్టించుకోరు. ఏ రకంగా చూసుకున్నా ఆయనకి ఏ సమస్య లేదు. మరి ఏం చెప్పదలుచుకున్నాడు ఈరోజు ఎలాగైనా నాన్నను అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ పేషెంట్లను చూసేసి ఇంటికి బయలుదేరాడు డాక్టర్ రాజేష్.

రాజేష్ ఇంటికి వచ్చి తండ్రి గదిలోకి తొంగి చూసేటప్పటికి తండ్రి నిద్రపోతున్నాడు. గదిలో పెళ్లి బట్టలు మార్చుకునీ బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తినేసి తండ్రి రూమ్ లో వెళ్ళిపోయాడు డాక్టర్ రాజేష్.
 కాసేపటికి రాఘవయ్య గారికి మెలకువ వచ్చి ఒరేయ్ రాజేష్ బాత్ రూమ్ కి వెళ్ళాలి రా అంటూ పిలిచాడు. తండ్రిని బాత్రూం తీసుకెళ్ళు తిరిగి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టి నాన్న నీతో కొంచెం మాట్లాడాలి అంటూ రాఘవయ్య గారితో అన్నాడు రాజేష్. చెప్పరా అంటూ రాజేష్ వైపు చూశాడు రాఘవయ్య గారు. నువ్వు చాలాసార్లు నాతో ఏదో చెబుదామని మధ్యలోనే ఆపేసావు. నీ మనసులో ఏముందో నాకు తెలియడం లేదు. అది ఏమిటో చెప్పు అంటూ బ్రతిమాలాడు రాజేష్. చూడు రాజేష్ నీ తెలుసు మేము మా అమ్మకి ఎనిమిది మంది సంతానం. నేనొక్కడినే మగ పిల్లవాడిని మిగిలిన వాళ్ళందరూ ఆడపిల్లలే. నాకు తెలిసినంత వరకు పిల్లలందరికీ చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసేటప్పటికి చాలా ఆస్తి ఖర్చు అయ్యింది. ఆయన ఏ నాడూ ఇంత ఆస్తి మిగిలి ఉందని నాకు చెప్పలేదు. ఆయన వ్యవసాయం మీద ఆధారపడిన వారు వేరే ఉద్యోగం ఏమీ లేదు.మా అమ్మ మీ అమ్మ లాగా చిన్న వయసులోనే చనిపోయింది. అప్పటినుంచి మా నాన్న నా దగ్గరే ఉండేవాడు. . నేనెప్పుడూ ఆర్థిక వ్యవహారాల్లో తల దూర్చలేదు. ఆయన్ని ఎప్పుడూ డబ్బులు ఖర్చు పెట్టనివ్వలేదు. ఆయనకేం కావాల్సిన నేనే చూసుకుంటూ ఉండేవాడిని. అయినా చాలా రోజులు ఆరోగ్యంగానే ఉండేవాడు. ఒకసారి హై బీపీ వచ్చి పక్షవాతం వచ్చికాళ్లు చేతులు పడిపోయి మంచం మీద పడ్డాడు. మా ఆడపిల్లలు చుట్టపు చూపుగా వచ్చి చూసి వెళ్ళే వారే కానీ ఎవరు దగ్గరుండి చాకిరి చేయలేదు. అలా ఆయన రెండేళ్లు మంచం మీద ఉండి సడనుగా ఒక రోజు చనిపోయాడు.

 ఆయనకున్న ఆస్తి వివరాలు నాకు ఏమీ చెప్పలేదు. పైగా రాతకోతలు కూడా ఏమీ లేవు. కార్యక్రమాలన్నీ భారీ ఎత్తున చేసాము. అందరూ వెళ్ళిపోయే ముందు మా అక్కయ్య భర్తలు నా దగ్గరికి వచ్చి ఆస్తి గురించి నిలదీశారు. అప్పుడు బీరువా అంతా వెతికితే పల్లెటూర్లో రెండు ఎకరాలు పొలానికి సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రమే దొరికే యి. మరి పొలం నుంచి వచ్చిన ఆదాయం ఏం చేస్తున్నారని అడిగారు. నా దగ్గర సమాధానం ఏమీ లేదు. ఆస్తంతా నువ్వే తినేసావని నన్ను నానా మాటలుఅని ఊరందరికీ చెప్పి వెళ్లిపోయారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు వాళ్లు మళ్లీ మన గుమ్మం తొక్క లే దు.పిల్లల పెళ్లిళ్లుకి కూడా రాలేదు. ఎవరు ఎలా ఉన్నారో కూడా ఏమి తెలియదు. 

మా నాన్న పోయిన కొద్దిరోజులకి నేను ఆ కాగితాలు పట్టుకుని పెద్దక్క ఇంటికి వెళ్తే ఆ కాయితాలు తీసుకుని విసిరి కొట్టాడు మా బావ.అందుకే నేను కొద్ది కాలమే బతుకుతాను అని నాకు తెలుసు. నువ్వు రేపు ఉదయం లాయర్ ని పిలిపించు. నేను వీలునామా వ్రాస్తాను అంటూ తన మనసులోని మాట కన్నీళ్లు కార్చుతూ చెప్పాడు. రాజేష్ కి ఇది చాలా ముఖ్యం అనిపించి తెల్లవారగానే లాయర్ ని పిలిపించి తండ్రి గదిలో కూర్చోబెట్టాడు. నాలుగు గంటల తర్వాత లాయర్ గారు బయటకు వెళ్లిపోయిన తర్వాత రాజేష్ తండ్రి గదిలోకి వెళ్ళాడు. రాఘవయ్య గారు మొహంలో ఆందోళన ఏమి లేదు. చాలా ప్రశాంతంగా ఉంది.

అలా రెండు మూడు నెలలు గడిచిన తర్వాత రాఘవయ్య గారు హఠాత్తుగా కన్ను మూశారు. అందరూ వెళ్ళిపోయే ముందు తండ్రి వ్రాసిన వీలునామ తీసి అందరి ముందు చదివి వినిపించాడు రాజేష్. ఎవరు ఏమి మాట్లాడలేదు. తండ్రి కోరిక ప్రకారం అందరూ ఆస్తి సమానంగా పంచుకుని ఎవరి కాపురం వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా బతుకుతున్నా రు.

ఈ కథ ఇలా సుఖాంతం అయింది. అయితే నిజ జీవితంలో వీలునామా వ్రాయ డానికి చాలామందికి భయం. అది వ్రాస్తే చనిపోతామని ఒక అపోహ. వీలునామా వ్రాయకుండా చనిపోయి పిల్లలు మధ్య భేదాభిప్రాయాలు వచ్చి కుటుంబాలు విడిపోయిన సందర్భాలు ఎన్నో. ఉమ్మడి కుటుంబంలో తెలివైన వాళ్ళు ఆస్తి కాజేసిన సందర్భాలు ఎన్నో. బతికున్నంత కాలం కష్టపడి పొట్ట మార్చుకుని సంపాదించిన సొమ్ము చనిపోయిన తర్వాత పిల్లలందరి కి సమానంగా పంచితే ఏ గొడవ ఉండదు. తల్లి తండ్రి ఆస్తి కడుపున పుట్టిన పిల్లలందరికీ సమానమైన హక్కు ఉంది. చట్టం ఎలా ఉన్నప్పటికీ తల్లికి తండ్రికి పిల్లలందరూ సమానులే. ఆడపిల్లలు మగపిల్లలు సమానమే. ఎవరు ఎక్కువగా కాదు ఒకరు తక్కువ కాదు. అందుకే బ్యాంకు డిపాజిట్లకి నామినేషన్ ఆస్తిపాస్తులకి వీలునామా అనే సౌకర్యం చట్టం కల్పించింది. పెద్దవాళ్లు చనిపోయిన తర్వాత కూడా మాట పడకుండా ఉండాలంటే వీటికి ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వాలి. 

లేకపోతే ఎన్నో కుటుంబాలకు సంబంధించిన ఆస్తి తగాదాలు కోర్టులో మూలుగుతున్నాయి ఈనాటి కూడా. ఏదేమైనా ఇది పెద్దల ఆలోచించవలసిన విషయం. దీనివల్ల మానసిక ప్రశాంతత చాలా ఉంటుంది.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279