Read Nirupama - 12 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 12

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 11

                  మనసిచ్చి చూడు - 11చెప్పు మధు ఎందుకు ఇంత కంగారు...

  • ధర్మ- వీర - 7

    పనోడు తన ఇంటికి వెళ్లి పెళ్ళాం పిల్లలతో ఊరు వదిలి పారిపోతు ఉ...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 1

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • అరె ఏమైందీ? - 25

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిరుపమ - 12

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

"ఒక్క విషయం నీకేమి ఆడ్ గా అనిపించలేదా?" నిరుపమ ఇంటికి ఆటోలో వెళుతూ ఉంటే తోవలో సమీర మొహంలోకి చూస్తూ అడిగింది మేనక.

"ఆ విషయం ఏంటో చెప్పకుండా నువ్విలా అడగడం ఏమి బాగాలేదు."

"ఆ నిరంజన్ ఆ అవుట్ అఫ్ ఫాషన్ బ్లాక్ స్పెక్ట్స్ ఎందుకు పెట్టుకున్నాడు? అదర్ దేన్ దట్ హి ఈజ్ ఇంప్రెసివ్."

"అఫ్ కోర్స్, ఎస్." నవ్వుతూ తలూపింది సమీర. "ఒకేసారి నిరుపమ అడిగేసింది కూడా. తన ఐస్ కి ఎదో పెక్యూలియార్ ప్రాబ్లెమ్ ఉందంట.  తన ఐస్ ఏమాత్రం లైట్ కి, పొల్లూటెడ్ ఎయిర్ కి ఎక్సపోజ్ అవ్వకూడదట. అందుకని డాక్టర్స్ సజెస్ట్ చేశారట. నిజానికి తనకి కూడా ఆ బ్లాక్ స్పెక్ట్స్ అలా పెట్టుకోవడం ఇష్టంలేదని అన్నాడు."

"ఆల్రైట్. మనకి ఇష్టం లేనివి కూడా తప్పక కొన్నిసార్లు చెయ్యాల్సివస్తూ ఉంటుంది కదా." మేనక అంది.

"ఎదో దారిగా బయలు దేరాను. కానీ ఆ ఇల్లు దగ్గరే పడుతూ ఉంటే నాకు చాలా అనీజీ గా వుంది. అక్కడ నిరుపమ జ్ఞాపకాల్ని తట్టుకోగలనా అనిపిస్తూవుంది." మేనక కళ్ళల్లోకి చూస్తూ భయంగా అంది సమీర.

"నేనున్నాగా. జస్ట్ బి బ్రేవ్." సమీర భుజాలచుట్టూ చెయ్యి వేసి దగ్గరకి తీసుకుంటూ అంది మేనక. "నిరంజన్ అంకుల్ చెప్పింది అక్షరాలా నిజం. నువ్వు భయపడేది చేస్తే నీకదంటే భయంపోతుంది. నువ్వొక్కసారి వచ్చి తన పేరెంట్స్ తో మాట్లాడితే తరచూ నువ్వక్కడికి రాగలవు. నిన్నూ చూస్తూవుంటే వాళ్ళకి మరింత స్వాంతనగా ఉంటుంది."

ఇంకొంచం మాట్లాడుకునేవారే కానీ అప్పటికే ఆటో నిరుపమ ఇంటివరకు వచ్చేసింది. వద్దన్నా వినిపించుకోకుండా ఆటో ఫేర్ సమీరే చెల్లించింది. తరువాత ఇద్దరూ నిరుపమ ఇంట్లోకి నడిచారు.

&

"నిరుపమ లేకపోతే నువ్వూ రావు కదా. నీకు నీ క్లోజ్ ఫ్రెండే తప్ప మేమక్కర్లేదు." మేనక, సమీర ఇంట్లో అడుగు పెట్టేసరికి నిర్మల మాత్రం వుంది. సమీరని చూస్తూ తను అంది.

ఒక్కసారిగా గుండెలని పిండేసినట్టుగా అయింది సమీరకి. ఏం చెప్పాలో తోచక మేనక మొహంలోకి చూసింది.

"మరేం పర్లేదులే. మీరిద్దరూ ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారని తను చెప్పింది. ఈసారి మాట్లాడినప్పుడు తనకి చెప్పు. అలా చుట్టాల ఇంట్లోనే ఉండిపోతే బాగా ఉండదని. నేను ఇంటికి వచ్చేమని ఎన్నోసార్లు చెప్తున్నాను. తను వింటంలేదు."

అయోమయంగా సమీర మొహంలోకి మరోసారి చూసింది మేనక. తను తరువాత ఎక్సప్లయిన్ చేస్తానన్నట్టుగా తలూపింది మేనక.

"నేను తను నా రూంలోకి వెళతాం ఆంటీ." మేనక అంది.

"కాస్త ఆగండి. కాఫీ తాగి వెలుదురుగాని. ఆ మేడమెట్లన్నీ ఎక్కి నేను రాలేను." అక్కడినుంచి కదులుతూ అంది నిర్మల.

"నిరుపమ చనిపోయినా తను బ్రతికి ఉన్నట్టుగానే భావిస్తూవుంటుంది. నిర్మలాంటీ దృష్టిలో ఇప్పుడు నిరుపమ తన మేనత్త ఇంటిదగ్గర వుంది." నిర్మల అక్కడినుంచి వెళ్ళిపోగానే మేనక అంది.

"మై గాడ్! నాకిది ఎలా అర్ధం చేసుకోవాలో బోధపడడం లేదు." ఇంక ఏదో అనబోతూ ఉంటే రంగనాథ్ వచ్చాడక్కడికి. "సమీ ఎలా వున్నవు? చాలా రోజులు అయింది నిన్నూ చూసి."

"ఏదో బాగానే వున్ననంకుల్. కొంచెం ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉండిపోయాను. అందుకే రాలేక పోయాను." అతికష్టంమీద పొంగుకొచ్చే ఏడుపు ఆపుకుంటూ వుంది సమీర.

"నువ్వూ, నిరుపమ ఎంతో ఇష్టంతో జాయిన్ అయ్యారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీలో. నువ్వైనా మంచి మార్కులతో ఉత్తీర్ణురాలివైతే నాకు ఆనందంగా ఉంటుంది." అక్కడే వున్న కుర్చీలో కూచుంటూ అన్నాడు రంగనాథ్.

"ట్రై చేస్తున్నానంకుల్. మంచి మార్కులే తెచ్చుకోవాలనుకుంటున్నాను." వచ్చే ఏడుపుని ఆపుకుని ఎలా మాట్లాడుతుందో సమీరకే అర్ధంకావడం లేదు.

అప్పుడు మేనక ఏదో చెప్పబోతూ ఉంటే నిర్మల ట్రే లో కాఫీ కప్పులతో అక్కడికి వచ్చింది. రంగనాథ్ కూడా అక్కడికి వచ్చాడని తెలిసినట్టుగా వుంది, మూడు కప్పులతో వచ్చింది.

"మధ్యాన్నం అంతా నువ్వెక్కడికి వెళ్లవు? ఆశ్చర్యంగా నువ్వు సమీర కలిసివచ్చారు. మీరిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు?" మేనక మొహంలోకి చూస్తూ అడిగింది నిర్మల. రంగనాథ్ కి కూడా అప్పటివరకూ వాళ్ళిద్దరిమధ్య ఫ్రెండ్షిప్ అయినా విషయం తెలియదు. అయన కూడా వాళ్ళ మొహాల్లోకి ఆశ్చర్యంగా చూసాడు. అలాంటి ప్రశ్న నిర్మలనుండి వూహించక పోవడంవల్ల ఆ ఇద్దరూ గతుక్కుమని ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు.

"సమీర గురించి అంకుల్ చెప్పారు ఆంటీ. నాకు మధ్యాన్నం నిద్రపట్టలేదు, ఏమీ తోచలేదు. ఒకవేళ తనింటి దగ్గరే ఉంటే కాస్త మాట్లాడొచ్చు కదాని వాళ్ళింటికి వెళ్ళాను. లక్కీగా ఈ రోజు తనింటిదగ్గరే వుంది." రంగనాథ్ మొహంలోకి రిక్వెస్టింగ్ గా, తను చెప్పింది ఒప్పుకోమన్నట్టుగా చూస్తూ అంది మేనక.

"నేనే మేనకకి సమీర గురించి చెప్పాను. అంతే కాదు తను కాలక్షేపం కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటే తనింటికి వెళ్ళమని నేనే సజెస్ట్ చేశాను." రంగనాథ్ చెప్పాడు విషయం అర్ధం అయినట్టుగా.

"మంచిపనిచేసారు. నిరుపమ వచ్చేవరకు తనకి కాలక్షేపానికి కొంచం ఇబ్బందిగానే ఉంటుంది." నిర్మల అంది.

"తనకి ఆ ఇబ్బంది రానివ్వను ఆంటీ. మంచి కాలక్షేపం అయ్యేలా చూస్తాను." బలవంతంగా చిరునవ్వుని మొహంలోకి తెచ్చుకుంటూ అంది సమీర. "నిరూ ఎప్పుడోగానీ ఎక్కడికీ వెళ్ళదు కదా. తను తన మేనత్త దగ్గరే ఎంజాయ్ చేస్తూ ఉండివుంటే ఉండనివ్వండి."

"అలాని కాలేజీ కూడా ఎగ్గొట్టి ఎన్నిరోజులు అక్కడ ఉండిపోతుంది? తమాషాకి తను కాలేజీలో జాయిన్ అవ్వలేదుకదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీకి. ఈయన్ని తనతో గట్టిగా చెప్పమంటే చెప్పరు." నిష్టూరంగా రంగనాథ్ వైపు చూస్తూ అంది నిర్మల.

"ఈసారి చెప్తాలే." కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రంగనాథ్. ఆ మోహంలో బాధ స్పష్టంగా వ్యక్తం అవుతూ వుంది.

"మేమిద్దరం నిరూ గదిలోకి వెళతాం." ఇంక అక్కడ వుండలేననిపించి లేచి మేనక మొహంలోకి చూసింది సమీర. మేనక కూడా తలూపి లేచి నిలబడింది. ఆ వృద్ధ దంపతులిద్దరిని అక్కడ అలాగే వదిలి మేనక, సమీర నిరుపమ గది వైపు నడిచారు.

&

నిరుపమ గదిలోకి వెళ్ళేవరకూ ఎలాగో ఉగ్గబట్టుకుని వుంది సమీర. కానీ ఆ గదిలోకి వెళ్ళాక ఇంక ఆగలేక మొహాన్నిచేతుల్లో మూసుకుని, వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడున్న బెడ్ మీద కూలబడిపోయింది.

"రిలాక్స్. రిలాక్స్ యువర్ సెల్ఫ్." మేనక ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తూనే వుంది. తనూ సమీర పక్కనే బెడ్ మీద కూచుని, తన భుజాల చుట్టూ కుడి చెయ్యివేసి దగ్గరకి తీసుకుంటూ అంది.

"ఆ పెద్దవాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతూ వుంది. స్కౌండ్రల్, కనీసం వాళ్ళ గురించయినా ఎందుకు ఆలోచించ లేక పోయింది?" చేతుల్లో మొహం దాచుకుని ఇంకా అలా ఏడుస్తూనే అంది సమీర.

"అదే నాకూ అంతు పట్టటం లేదు. అది ఎంత పెద్ద విషయం అయినా కావచ్చు. తను అలా సూసైడ్ చేసుకుంటే తన పేరెంట్స్ ఎంత ఎఫెక్ట్ అవుతారో తను ఊహించలేని విషయమా?" మేనక అంది.

"ఇదే రూంలో, ఇదే బెడ్ మీద మేం ఎన్నో గంటలు మాట్లాడుకున్నాం. ఎన్నో విషయాలు   షేర్ చేసుకున్నాం." తన ముఖం మీద చేతులు తొలగించుకుంటూ అంది సమీర. "ఎప్పుడూ తన మోహంలో కాస్త కూడా విచారం చూడలేదు. కొంచంగా కూడా తనెప్పుడూ ఏ విషయానికి బాధపడుతున్నట్టుగా చెప్పలేదు. అలాంటిది తను సూసైడ్ చేసుకునేంతగా ఏ విషయం వచ్చింది?" నొసలు చిట్లించి కొశ్చనింగ్ ఎక్స్ప్రెషన్ తో మేనక మొహంలోకి చూసింది సమీర.

"ఇన్ ఫాక్ట్, ఆ విషయం తెలుసుకోవడానికే మా అంకుల్ ఇన్వెస్టిగేషన్ చేస్తూన్నది. నేను ఇక్కడ ఉండడం వెనక మెయిన్ పర్పస్ కూడా అదే." సమీర చుట్టూ వున్న చేతులు తొలగించి బెడ్ మధ్యలో బాసిపట్టు వేసుకుని కూచుంటూ అంది మేనక. "వెరీ స్యూర్ ఐ యామ్. ఈ నెల రోజుల వ్యవధిలో ఆ విషయం ఏమిటో మా అంకుల్ కనిపెట్టి తీరతారు."

"కానీ ఏమిటి ప్రయోజనం? చనిపోయిన తను తిరిగిరాదు. అంతే కాకుండా తను ఏ కారణంతో సూసైడ్ చేసుకుందో అదెవరికి తెలియడం కూడా తనకి ఇష్టంలేనట్టుగా వుంది. అందుకే ఏ క్లూ ఆ విషయమై మనకి దొరకనివ్వ లేదు. ఆ కారణం తెలుసుకోవడానికి మనం ప్రయత్నించకుండా ఉండడమే మంచిదేమో అని నాకు అనిపిస్తూ వుంది." సమీర అంది.

మేనక ఇంకా ఎదో చెప్పబోతూ ఉంటే రంగనాథ్ అక్కడకి వచ్చాడు. ఆయనని చూస్తూనే మేనక, సమీర బెడ్ మీదనుంచి లేచి నిలబడ్డారు.

"ఫరవాలేదు కూచోండి. నేను మీ ఇద్దరి ఫ్రెండ్స్ సంభాషణలకు ఏమీ అంతరాయం కలిగించలేదు కదా?" బెడ్ కి అపోజిట్ లో వున్నకుర్చీలో సెటిల్ అవుతూ అన్నాడు రంగనాథ్.

"అటువంటిది ఏమి లేదు." నవ్వుతూ బెడ్ మీద మళ్ళీ కూచుంది మేనక సమీరని చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన కూచోపెట్టుకుంటూ. "నిజానికి ఇప్పుడు మేము మీరు చేయించే ఇన్వెస్టిగేషన్ గురించి మాటాడుకుంటున్నాం. సమీర ఏమంటూంది అంటే ఆ కారణం ఇప్పుడు తెలిసి ఏమి ప్రయోజనం తనెలాగూ తిరిగి రాదు కదా అంటూంది. అంతేకాదు ఆ విషయం మనమెవరికి తెలియకపోవడం ఇష్టం లేకపోవడం వల్లే తనలా చనిపోయింది, తనకిష్టం లేని పని మనం చెయ్యడం ఎందుకు అని అభిప్రాయపడుతూంది." అంది మేనక.

"ఎగ్జాట్లీ నా ఒపీనియన్ అదే అంకుల్. తనెందుకు చనిపోయిందో మనకి తెలియడం నిరుపమకి ఇష్టం లేదు. తనకిష్టం లేని పని మనమెందుకు చెయ్యాలి?" సమీర అంది.

"నేనలా ఆలోచించ లేకపోతున్నాను సమీ. నిరుపమ చాల ఇంటెలిజెంట్! విల్ పవర్ వున్న అమ్మాయి. అలాంటి తను ఎదో అతి చిన్న కారణంతోనో లేదా అసలు ఏ కారణం లేకుండానే సూసైడ్ చేసుకుందని ప్రపంచం అనుకోవడం నాకిష్టం లేదు. తన సూసైడ్ వెనక చాలా బలమైన కారణమే ఉంటుందని నాకనిపిస్తూంది. అది నాకు, ఇంకా ప్రపంచానికి కూడా తెలియాలి."

"కానీ అంకుల్....." సమీర ఎదో చెప్పబోయింది.

"ఎస్, సమీరా. ఆ కారణం ఖచ్చితంగా తెలిసి తీరాలి. అది తెలిస్తేనే నా మనసుకు కొంతన్నా స్వాంతన కలుగుతుంది. నన్ను నిరంజన్ ఇంకా స్మరన్ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ వద్దని కన్విన్స్ చేయబోయారు. కానీ ఆ విషయం తెలిస్తేనే కానీ నేను ఉండలేను."

ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు మేనక, సమీర.

“ఈ ఇన్వెస్టిగేషన్ లో నువ్వు సాయం చేస్తానని చెప్పమ్మా." రిక్వెస్టింగ్ గా సమీర కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రంగనాథ్.

ఏం చెప్పాలో తెలియక అయోమయంగా మేనక కళ్ళల్లోకి చూసింది సమీర.

"మా అంకుల్ ఎలాగూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నేనూ ఆయనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. ఇది ఆగే ప్రసక్తే లేదు. నువ్వూ చేతనైనంత హెల్ప్ చేస్తేనే బావుంటుంది." మేనక అంది.

"ఆల్రైట్ అంకుల్." సడన్ గా ఎదో నిర్ణయానికి వచ్చినట్టుగా అంది సమీర రంగనాథ్ మొహంలోకి చూస్తూ. "మీకా విషయం తెలిస్తే కొంత రిలీఫ్ కలుగుతుందని మీకు అనిపిస్తే, నేను కచ్చితంగా అందుకు చేయగలిగినంత సాయం చేస్తాను. ఈ ఇన్వెస్టిగేషన్కి పూర్తి సహకారం అందిస్తాను." 

"అంతే కాదు అప్పుడప్పుడు వస్తూ కూడా వుండమ్మా. నిన్ను చూస్తూ ఉంటే కూడా నాకు నిరుపమని చూసినట్టుగా అనిపించి కొంచం స్వాంతనగా ఉంటుంది." అదే రిక్వెస్టింగ్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు రంగనాథ్.

"తప్పకుండా వస్తానంకుల్. ఇప్పటివరకు తన జ్ఞాపకాల్ని ఇక్కడ తట్టుకోలేనేమోనని రావడం మానేసాను. నిరంజన్ అంకుల్ సజెస్ట్ చెయ్యడంతో డేరింగ్ చేసి వచ్చాను. ఇప్పుడు కొంచం కరేజ్ వచ్చింది. వస్తూ వుంటాను." నవ్వతూ అని లేచింది సమీర. "ఇక వెళతానంకుల్. ఇల్లు వదలిపెట్టి చాలా సేపయింది. మామ్ చూస్తూ ఉంటుంది." అని చెప్పి, మేనక కళ్ళల్లోకి ఒకసారి చూసి అక్కడనుండి వెళ్ళిపోయింది సమీర.

"థాంక్స్ అంకుల్. ఆంటీ దగ్గర నేను ఎంబరాస్ అవ్వకుండా సేవ్ చేసారు. సమీర దగ్గరికి వెళ్తున్నానని మీకు చెప్పకుండానే వెళ్ళాను." రంగనాథ్ ముఖంలోకి గ్రేట్ఫుల్ గా చూస్తూ అంది మేనక.

"దానికేం పర్లేదు. అదేం పొరపాటు పని కాదుకదా." కుర్చీలో వెనక్కి వాలి నవ్వాడు రంగనాథ్. "ఎనీహౌ మీరిద్దరూ ఫ్రెండ్స్ ఎప్పుడు అయ్యారు?" అని అడిగాడు.

"మా స్మరన్  అంకుల్ అడిగారు తనని వెళ్లి కలవమని, తానేదో క్లూ దొరికిందని చెప్పిందని. అంకుల్ ఆల్రెడీ తనని ఒకసారి కలిసి మాట్లాడారు. అందుకే నేను ఈ రోజు వెళ్ళడానికి ముందే ఒకసారి తనని కలిసి మాట్లాడాను. మేం క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అయిపోయాం." చివర్లో నవ్వింది మేనక.

"ఏమిటి, తానేదో క్లూ దొరికిందని చెప్పిందా? అదేమిటో నీకు చెప్పిందా అయితే?" ఆసక్తిగా అడిగాడు రంగనాథ్.

"ఎస్, అంకుల్. దేర్ ఈజ్ ఏ లిటిల్ డెవలప్మెంట్ ఇన్ దిస్ మాటర్. కాకపోతే మిమ్మల్ని అనవసరంగా ఎక్సయిట్ చెయ్యడం ఇష్టం లేక చెప్పలేదు." తాను సమీర ఇంట్లో చూసిందేమిటో వివరంగా చెప్పింది మేనక.

" తను ఆ ఫీలింగుని తట్టుకోలేక పోయిందా? ఏమైవుంటుంది ఆ ఫీలింగ్?" ఎగ్జైటింగ్ గా అన్నాడు రంగనాథ్.

"సర్టేన్లీ సమ్ నెగటివ్ ఫీలింగ్. ఆల్రెడీ అంకుల్ తో డిస్కస్ చేశాను. పూర్తి విషయం తెలియాలంటే ఇంకొన్ని క్లూస్ కావాలన్నారు అంకుల్. మీరా విషయం గురించి ఎక్కువగా అలోచించి ఎగ్జైట్ కాకండి. ఎనీహౌ…...." కాస్త ఆగి అంది. "నేను పూర్తిగా కాన్ఫిడెంట్. మీకిచ్చిన నెల రోజుల గడువులో మా అంకుల్ ఆ విషయం కనిపెట్టి తీరతారు."

కష్టంగానే అనిపించినా మేనక అలా చెప్పిన తరువాత అడ్జస్ట్ అయ్యాడు రంగనాథ్. "ఆ తరువాత నువ్విక్కడ నుండి వెళ్ళిపోతావనుకుంటాను." కుర్చీలో మరోసారి వెనక్కి వాలి అన్నాడు రంగనాథ్ విచారంగా.

"నో అంకుల్." బెడ్ మీద నుండి కిందకి దిగి, రంగనాథ్ కుర్చీ వెనక్కి వచ్చి, అయన మెడ చుట్టూ చేతులు వేసి అంది. "నేను ఆల్రెడీ ఆంటీ కి మాట ఇచ్చాను. మీకు కూడా ఇస్తున్నాను. మీరు వెళ్ళమనేంత వరకు ఇక్కడే వుంటాను. ఫీల్ రిలాక్స్డ్."

"చాలా మంచి విషయం అమ్మా." ఆమె చేతుల్ని విడిపించుకుని, కుర్చీలోనుంచి పైకి లేచి, ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు రంగనాథ్. "ఇక కిందకి వెళదాం. ఆంటీ ఒక్కర్తీ వుంది కిందన."

తరువాత ఆ ఇద్దరూ కిందకి వచ్చేసారు.

&

"మామ్, చెప్పు." సప్పర్ పూర్తి చేసి, మేడ మీద గదిలోకి ఇలా వచ్చి బెడ్ మీద ఆలా నడుం వాల్చిందో లేదో ప్రతిమ నుంచి  ఫోన్ వచ్చింది మెనకకి. అసలే చికాగ్గా ఉండడంతో ముక్తసరిగా అంది.

"నువ్వు ఫోన్ చెయ్యవు. నేనే చెయ్యాలి. ఇలాగే వుండే విషయం అయితే వెంటనే బయలుదేరి ఇంటికిరా. నువ్వే హెల్ప్ చెయ్యక్కరలేదు, మీ అంకుల్ పాట్లేవో తనే పడతాడు." ప్రతిమ అంది కోపంగా.

"నేనేదో అంకుల్ కి హెల్ప్ చేసేస్తానని కాదు ఈ ఓల్డ్ ప్యూపిల్ ఇద్దరూ నేనిక్కడ ఉండడం వల్ల కొంత రిలీఫ్ ఫీలవుతున్నారు. అందుకనే వున్నాను." చిరాకు మేనకలో ఇంకా ఎక్కువైంది.

"అలాని ఎంతకాలం అక్కడ ఆలా ఉండిపోగలవు? పెళ్లి చేసుకుని ఇంకో ఇంటికి వెళ్ళవలసినదానివి. ఆ విషయం మర్చిపోకు."

"చుట్టుతిప్పి విషయం అక్కడికే తెస్తావు కదా." మంచం మీద లేచి, బాసిపట్టు వేసుకు కూచుంది మేనక. "ఇప్పట్లో నా పెళ్లి ఎలాగూ జరగదు. అంత పని పడితే అప్పుడు ఆలోచిద్దాంలే." ఆలా అంటే తన తల్లికి ఎంత మండుతుందో తెలిసి డేరింగా అంది మేనక. నిరుపమ గురించే ఆలోచిస్తూ తనకెందుకో చాలా అనీజీగా, అప్సెట్ గా వుంది. కొంత మైండ్ డైవర్సన్ కావాలి.

"అంతా నీ ఇష్టమే అనుకుంటున్నావా? నువ్వలా మొండి పట్టు పట్టుకుని కూర్చుంటే నాకు నచ్చిన వాడితో నెల రోజుల్లో నీ పెళ్లి  చేసి పారేస్తాను." ఫోన్లో అరచినంత పనిచేసింది ప్రతిమ.

"మామ్……" వస్తూన్న నవ్వుని బలవంతంగా అణచిపెట్టుకుని సీరియస్ గా అంది మేనక. "నువ్వు నన్ను చదువుకోడం కూడా చదువుకోనివ్వకుండా పెళ్లి చేసెయ్యాలనే చూస్తే నేను ఆ విషయం గురించి కూడా ఆలోచించను. చూస్తాను నువ్వు నెల రోజుల్లో నా పెళ్లి ఎలా చేసేస్తావో."

"నువ్వు ఏం.ఏ ఇక్కడ జాయిన్ అయ్యావు అనుకో. పెళ్లయ్యాక ఇంకో చోటికి వెళ్లాల్సి వస్తే ట్రాన్స్ఫర్ కష్టం కదా. పెళ్లయ్యాక మీ అయన వున్న చోటే వున్న కాలేజీ లో జాయిన్ అయ్యావు అనుకో, ఆ ఇబ్బంది ఉండదు కదా. అందుకని నిన్నాపాను కానీ వేరే ఉద్దేశం ఏమి లేదు." ఇమ్మీడియేట్ గా ప్రతిమ లో చేంజ్ కనిపించింది. తన కూతురిలో మొండితనం ఆమెకి బాగా తెలుసు.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాత భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)