Read Are Amaindi - 17 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 17

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"దీని పేరెంట్స్ కి విషయం తెలుసంటారా? ఇది చెప్పివుంటుందా? చెప్పివుంటే ఒక మగాడితో పెళ్లికాని పిల్ల ఇదిలా ఉండడానికి వాళ్లెలా ఒప్పుకుని వుంటారు?"

"ఇలాంటి ప్రొఫెషన్స్ లో ఇలాగ చెయ్యాల్సి వస్తూ ఉంటుంది. అయినా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? సినిమాల్లో చూసావుగా ఎలా తెగించి నటిస్తున్నారో. అది వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండానే ఉంటుందా?" చిదంబరం అన్నాడు. "అయినా మనకి అదంతా అనవసరం. మనపని మనకి పూర్తి అయితే చాలు."

"ముఖ్యంగా ఆ అమ్మాయిని మన కోడలు చేసుకుందామనుకోవడం వల్లే అది మనల్ని సాధిస్తూంది. ఆ విషయం మనం విడిచిపెట్టేస్తే అది మనల్ని వదిలేస్తుందనుకుంటా." సాలోచనగా అంది శకుంతల.

"మన పరిస్థితులన్నీ మర్చిపోయి నువ్వలా ఎలా మాట్లాడతావు? మనం పీకల్లోతు అప్పుల్లో వున్నాం. ఆ సర్వేశ్వరం సహాయం లేకపోతె అప్పులవాళ్ళు మనల్ని రోడ్డుమీద పడేస్తారు. ఆ సర్వేశ్వరం కూతుర్ని మన కోడల్ని చేసుకుంటేనే తను మనకి పూర్తి సహాయం చేస్తాడు." చిదంబరం కోపంగా అన్నాడు. "ఆ అమ్మాయి సర్వేశ్వరానికి ఒక్కతే కూతురు. ఆ సర్వేశ్వరం ఎంత ఆస్థిపరుడో, ఆ అమ్మాయిని మన అబ్బాయి చేసుకుంటే వచ్చే లాభం ఏమిటో నీకూ తెలుసును. నేనూ, తనూ ఇద్దరం ఒకసారే వ్యాపారం ప్రారంభించినా, నేనిలా పాతాళం లో ఉండిపోయినా అతను మాత్రం కోట్లకి పడగలెత్తాడు." నిట్టూర్చాడు చిదంబరం. "నువ్వాలోచించి చెప్పు. నువ్వా విషయం గురించి మరిచిపోదాం అంటే మరిచిపోదాం."

"మనం మరిచిపోయినంత మాత్రాన ఆ దయ్యం మనల్ని విడిచిపెట్టేస్తుందన్న గ్యారంటీ లేదుకదా. సరే కానివ్వండి."

తమ ప్రస్తుత పరిస్థితులలో ఆ అమ్మాయిని తమ కోడలిగా చేసుకోవడం ఎంత అవసరమో శకుంతలకీ సడన్గా గుర్తు వచ్చింది.

"ఒక్క నాలుగు రోజులు ఓపిక పట్టి వుంటే పెళ్ళైపోయి ఉండేది. ఈ లోపునే తన కుక్కబుద్ధి చూపెట్టి అంతా నాశనం చేసాడు." చిదంబరం కోపంగా అన్నాడు.

"మనవాడి గురించి మీకు తెలియనిదేముంది? అయినా ఆ సంఘటన తర్వాత మీరు ఆ సర్వేశ్వరం తో మాట్లాడారా లేదా?" శకుంతల అడిగింది.  

"జరిగిన దానికి సారీ చెప్తూ ఏమన్నా ఫోన్ చేస్తాడేమోనని చూస్తున్నాను. ఇప్పటివరకూ తన దగ్గరనుండి ఏ ఫోనూ రాలేదు. అసలు ఏం జరిగిందో తనకి తెలియనట్ఠేల్లె వుంది." చిరాకుపడుతూ అన్నాడు చిదంబరం.

"మీ తెలివి తెల్లారినట్టే వుంది." కోప్పడింది శకుంతల. "ఈ లోపున అతను తన కూతురికి వేరే సంబంధం చూసుకుంటే. లేకపోతె తన భార్య ఎవర్ని అనుకుంటూందో, వాడినే ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటే. కేవలం అనుకున్నామే తప్ప మనమేం ఇంకా ముహుర్తాలు పెట్టేసుకోలేదు. మీరు వెంటనే అయన తో మాట్లాడండి. సాధ్యమైనంత త్వరలో ఈ పెళ్ళితంతు అయిందనిపించండి." అప్పటికి శకుంతల తన కొడుకు తనని ఆ మంజీర ఎలా తన్నిపడేసిందో చెప్పిన సంగతి మరిచిపోయి కేవలం ఆ అమ్మాయి తన కోడలైతే వచ్చే లాభం గురించి మాత్రమే ఆలోచిస్తూ వుంది. 

"నువ్వు చెప్పిందీ నిజమే సుమా. నేనెందుకు నీలా ఆలోచించలేకపోయాను?" విచారపడుతూ అన్నాడు చిదంబరం. "సాధ్యమైనంత త్వరలో ఆ సర్వేశ్వరంతో మాట్లాడతాను."

&&&

నిరంజన్ గదిలో నిరంజన్ కి, మల్లిక కి విడివిడిగా రెండు బెడ్ లు ఏర్పాటు చేయించాడు చిదంబరం. మల్లిక కూడా మంచి అట్రాక్టివ్ గా, మంచి యవ్వనం తో ఉండడం వల్ల చూస్తూ తట్టుకోవడం కొంచెం కష్టంగానే వుంది నిరంజన్ కి. తక్కిన అమ్మాయిలతో ఇంతకుముందు తను అడ్వాన్స్ అయినట్టుగా, మల్లిక విషయం లో అడ్వాన్స్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్, తన తండ్రి మంజీర తో పెళ్ళిజరిగితే వచ్చే లాభం గురించి,ప్రస్తుతం తమ కుటుంబానికి అది ఎంత అవసరమో మళ్ళీ మళ్ళీ చెప్పి తన బ్రెయిన్ వాష్ చేసేసాడు. అందువల్ల ఆ రోజు తర్వాత మరి మంజీర ఊసే ఎత్తకూడదు అని తను తీసుకున్న నిర్ణయాన్ని కూడా మార్చుకోవాల్సి వచ్చింది. ఈ లోపున తను మల్లికతో ఏదన్నా పిచ్చిపని చేసి ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటే, తన తండ్రి తనని నిలువునా నరికేస్తాడు. అందుకని ప్రలోభపడకుండా జాగ్రత్తగా వున్నాడు. అంతేకాకుండా ఆ రోజుని తల్చుకుని ఎంత భయంగా అనిపించినా, మంజీర తల్లి సమస్య తీరాక మంజీర ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు

"నువ్వు నిజంగానే ఆ మంజీర తల్లి సమస్య పూర్తిగా తీర్చి, తనతో నా పెళ్ళిజరిగేలా చూడగలవా?" మల్లిక మొహంలోకి చూస్తూ అడిగాడు నిరంజన్.

"చూస్తూవుంటే ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకోవాలని బాగా ఉన్నట్టు వుందే. అంత అందంగా వుంటుందా?" నవ్వుతూ అడిగింది మల్లిక.

"బాగా అందంగా వుండేమాట అయితే నిజమే. కాకపోతే ఆ రోజున తన చేతుల్లో అలంటి ట్రీట్మెంట్ దొరికాక తన గురించి ఆలోచించ కూడదనే నిర్ణయించుకున్నాను. అందులోనూ ఒక దయ్యం మన ప్రాణాలు తీస్తుందంటే ఎవరు సరదా పడతారు ఎంత అందంగా ఉంటే మాత్రం? కానీ చూస్తున్నావుగా ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోకపోతే మా డాడీ ఊరుకోడు ఈ పెళ్లితో ఆ సర్వేశ్వరం ఆస్తిపాస్తులన్నీ మాకు కలిసిరావాలని ఆశ పడుతూ వున్నాడు."

"ఈ కూతురు తప్ప ఆ సర్వేశ్వరానికి ఇంకెవరూ రెలెటివ్స్ లేరా?"

"ఒక చెల్లెలు వుందనుకుంటా. కానీ తనకెప్పుడో పెళ్ళిచేసేసాడు. అందులోనూ కూతురంటే పంచప్రాణాలు. అందువల్ల తనని పెళ్ళిచేసుకుంటే మేజర్ లాభం నాకే కదా."

"అది నిజమే." తలూపింది మల్లిక.

"నిజానికి అంతగా దాని చేతుల్లో తన్నులు తిన్నా, ఆ దయ్యం భయం కూడా వున్నా, దాని అందాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నా. అన్నిరోజులు దానితో కలిసితిరిగినా, దాన్ని ముద్దుపెట్టుకోవడం కాదు, కనీసం ముట్టుకోవడం కూడా ముట్టుకోలేకపోయాను."

"అదేంటలా?" ఆశ్చర్యంగా అడిగింది మల్లిక. ఇన్నిరోజులు ఇద్దరూ ఏవేవో విషయాలు మాట్లాడుకుంటూ వున్నా, నిరంజన్ మనసు విప్పి ఈ విషయాలు మాట్లాడుతున్నది ఇప్పుడే.

"దానికి సెక్స్ అన్నా, రొమాన్స్ అన్నా పడదు. ఎవరన్నా ముద్దుపెట్టుకోవడం సీన్ చూసినా కూడా చిరాకుపడిపోతుంది. అందుకని అదసలు సెక్స్ కి పనికొస్తుందో లేదో చూద్దామనే ఆ రోజలా ట్రై చేశా. అదలా బెడిసికొట్టింది."

"సెక్స్, రొమాన్స్ అంటే అంత చిరాకు వున్న అమ్మాయిని పెళ్ళిచేసుకుని మాత్రం ఏం ప్రయోజనం? పెళ్లయ్యాక మాత్రం నిన్నదసలు ముట్టుకోనిస్తుందా?"    

"సెక్స్ అంటే అసలు ఇష్టం లేని అమ్మాయిని బలవంతంగా అనుభవించడం లోనే అసలు మజా వుంది. నాకు చాలా రోజులుగా ఎవరన్నా అమ్మాయిని రేప్ చెయ్యాలని కోరిక. ఇప్పటివరకూ అందరు అమ్మాయిలూ నాకు లొంగిపోయారే తప్ప అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఆ రోజు దాని తల్లి అలా అడ్డు రాకపోతే, అది సెక్స్ కి పనికొస్తుందో లేదో తెలుసుకోవడం తో పాటు, ఒక అమ్మాయిని రేప్ చెయ్యాలన్న నా కోరిక కూడా తీరి ఉండేది." సడన్ గా ఒక శాడిస్టిక్ ఎక్సప్రెషన్ తో అన్నాడు నిరంజన్.

"ఒకసారి రేప్ చెయ్యగలవేమో కానీ, రోజూ ఏం రేప్ చెయ్యగలవు? రేప్ చేస్తేనేకానీ అనుభవించలేని అమ్మాయితో నీకు సుఖం ఉండదు." మల్లిక అంది.

"ఒకసారి రేప్ చేసి ఆ టేస్ట్ చూపించాక, తరవాత దానంతట అదే దాని గురించి నా దగ్గరికి వస్తుంది. ఒకవేళ అలా రాకపోయినా నా చిలకొట్టుళ్ళు నాకు వుండనే వున్నాయి. అదీ కాకుండా  దానితో సంసారం సుఖం కన్నా కూడా దానిని పెళ్లిచేసుకోవడం వల్ల కలిసొచ్చే ఆస్తిపాస్తులే నాకు ముఖ్యం."

దానికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయింది మల్లిక.

"అంతేకాకుండా దానిని పెళ్లి చేసుకుని రేప్ చేస్తే, నా జీవితం లో ఒక్క కన్యనన్నా అనుభవించానన్న తృప్తి నాకు ఉంటుంది. నేను ఇప్పటివరకూ అనుభవించిన వాళ్లలో ఒక్కళ్ళు కూడా కన్యత్వం వున్నవాళ్లు లేరు. ఐ యామ్ స్యూర్. ఇది మాత్రం ఇప్పటివరకూ ఎవడినీ తనమీద చెయ్యివెయ్యనిచ్చి వుండదు." అప్పటికి ఆ రోజు తన భయంకర అనుభవం పూర్తిగా మర్చిపోయాడు నిరంజన్.

"నిజం చెప్పాలంటే నేనూ ఇప్పటివరకూ కన్యనే. కనీసం ఎవరినీ నా మీద చెయ్యికూడా వెయ్యనివ్వలేదు." అమాయకంగా మొహంపెట్టి అంది మల్లిక. "చాలా కట్టుబాట్ల మధ్యపెరిగాను. మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబెర్స్ తో తప్ప మగవాళ్ళతో మాట్లాడ్డం కూడా తప్పే తెలుసా?" తను విచ్చల విడిగా మగవాళ్ళతో సెక్స్ ఎంజాయ్ చెయ్యడం గుర్తుకువచ్చి అదొకలా అనిపించింది మల్లిక కి.

"వెరీ గుడ్. జాగ్రత్తగా మైంటైన్ చేసి తన కన్యత్వాన్ని తన భర్తకి మాత్రమే అప్పచెప్పే ఆడవాళ్లంటే నాకు చాలా గౌరవం. నువ్వలాగే వుండు." అంతలోనే మల్లిక చెప్పింది గుర్తుకువచ్చి అడిగాడు. "మరి నువ్విలా నాతో ఉంటున్న విషయం మీ ఇంట్లో తెలుసా? ఎలా ఒప్పుకున్నారు?"

"ఇది ఒక ప్రొఫెషనల్ కమిట్మెంట్. నా ప్రొఫెషన్ లో ఇలాంటివి తప్పవు. నా ఇంట్లో వాళ్ళకి తెలుసు, నేనిలా ఎవరితో కలిసున్నా ఎటువంటి తప్పుచేయనని." దృఢస్వరం తో అంది మల్లిక.

నిరంజన్ ఎదో అనబోయే లోపున మళ్ళీ తానే అంది. "నేనీరోజు ఒకసారి మా ఇంటికి వెళ్లి వస్తాను."

"ఆమ్మో, నేనొక్కడినే ఉంటే.........." నిరంజన్ మొహం సడన్ గా భయంతో నిండిపోయి, ఎదో అనబోయాడు.

"ఒక్క గంటలో తిరిగి వచ్చేస్తాను. అయినా నేను ఈ గదిని పూర్తిగా మంత్రబంధం చేసి వుంచాను. ఈ గదిలోకి వచ్చి అంత తేలిగ్గా అది నిన్నేమీ చెయ్యలేదు. నేను మళ్ళీ తిరిగి వచ్చేవరకూ నువ్వీ గదిలోనుండి బయటకి రాకు."

"పోనీ నేనూ నీతో రానా?"

"అలా నేను నిన్ను తీసుకెళ్లడం నా ప్రొఫెషనల్ ఎథిక్స్ కి విరుద్ధం. నా సార్ మంగళాచారి గారు అలాంటివాటికి అసలు ఒప్పుకోరు." నవ్వుతూ అంది. "నేను ఒక గంటలో తిరిగి వచ్చేస్తాను. ఈ లోపున అది నీ గదిలోకి వచ్చి నిన్ను ఏం చెయ్యలేదు. నువ్వు జస్ట్ ఈ గదిలోనే వుండు చాలు నేనొచ్చేవరకూ."

"ఒకే. అలాగే అయితే." చేసేదేం లేక అందుకు అంగీకరిస్తూ తలూపాడు నిరంజన్. 

&&&

"ఏమిటే నువ్వింత సమయం తీసుకుంటున్నావ్?" చిరాకు పడుతూ అంది మల్లిక తల్లి చారులత. "నీ అక్కలిద్దరూ ఈ విషయం లో ఎంత ఫాస్ట్ గా సెటిల్ చేసుకున్నారో తెలుసా? నువ్వు వాడితో కలిసి ఉంటూ కూడా, ఇప్పటివరకూ వాడిని కమిట్ చేయించలేక పోయావు."

"మామ్ అన్ని సందర్భాలు, అన్ని పరిస్థితులు ఒకేలా వుండవు. కొన్నిట్లో సహనం అవసరం. వాడి నాన్న వాడిని తన ఫ్రెండ్ కూతురికి ఇచ్చి చెయ్యాలని పట్టుపట్టి కూచున్నాడు. వాడి తల్లి కూడా అందుకే సుముఖంగా వుంది. ఆ అమ్మాయిని కాకుండా వీడు ఇంకెవరని పెళ్లిచేసుకుంటానన్నా వాడి నాన్న వాడిని నిలువునా నరికేస్తాడు. అందుకనే వీడు జాగ్రత్తగా వున్నాడు."  

"అయితే వీడితో వుండడం అసలు ఎమన్నా ప్రయోజనం వుంటుందంటావా? లేకపోతె టైం వేస్టేనా?" చారులత అడిగింది.

"టైం వేస్ట్ అని చెప్పి నేనెక్కడ అన్నాను? కాకపోతే మనం అన్నిచోట్లా క్విక్ రిజల్ట్స్ ఎక్స్పెట్ చెయ్యలేం." మల్లిక అంది.

"వర్కవుట్ అవ్వదనుకుంటే వుండి టైం వేస్ట్ చేసుకునేంత తెలివితక్కువ దద్దమ్మ కాదు మనమ్మాయి. తనప్రయత్నం తను చేస్తూంది. మనం ఓపికగా ఎదురు చూడాలి." అంతవరకూ మౌనంగా వున్న మంగళచారి అన్నాడు.

"డాడ్ కి నా మీద వున్న నమ్మకం నీకెందుకు లేదు మామ్? నేనేం అక్కడ ఊరికినే కూచోలేదు. వాళ్లలో భయం ఇంకాస్త ఎక్కువయ్యేలా చేసాను. త్వరలోనే మనదారికి వస్తారు. నేను ముందు చెప్పినట్టుగా కాస్త ఓపిక కావాలి అంతే."

"ఆడపిల్ల తల్లిని కదా, అందుకే కాస్త భయం. మీ అక్కలు సెటిల్ అయినట్టుగా నువ్వూ ఏదోఒక మంచి ఫ్యామిలీ లో సెటిల్ అయిపోతే నాకీ టెన్షన్ ఉండదు." చిరునవ్వుతో అంది చారులత.

"నీకు దేనికి టెన్షన్? నీ పోలికలే పుణికిపుచ్చుకుని పుట్టారు నీ కూతుర్లు ముగ్గురూ. నువ్వు నన్నెలా పెళ్లిచేసుకున్నావో మర్చిపోయావా?" చిరునవ్వుతో అడిగాడు మంగళాచారి. "ఎదో మామూలుగా నువ్వూ కోరిక తీర్చుకోవడానికి అని నన్ను కమిట్ చేయించేదానివి. నువ్వు టాబ్ వేసుకుంటానని చెప్పి ఏ రోజు నన్నది పెట్టుకోనివ్వలేదు. నెమ్మదిగా నావల్ల కడుపుతెచ్చుకుని నిన్నే పెళ్లిచేసుకునేలా చేసావు."

"మామ్, అయితే జస్ట్ అక్కల్లాగే పెళ్లినాటికే నువ్వూ ప్రేగ్నన్ట్ వన్నమాట." నవ్వి అడిగింది మల్లిక

"అవును. అప్పుడు నా కడుపులో వున్నది నీ పెద్దక్క." తనూ చిరునవ్వుతో అంది చారులత. "నువ్వు చెప్పినది కాదనడం లేదు. కానీ సాధ్యమైనంత త్వరలో వ్యవహారం పూర్తయ్యేలా చూడు. పెళ్లికాని పిల్లవి వాడితో అలా పనిపూర్తికాకుండా వుండడం మంచిదికాదు."

"ఒకే మామ్, గుర్తువుంచుకుంటాను." తలూపిందిమల్లిక. "నిజానికి వాడొక పెద్ద తిరుగుబోతు. ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలన్న ఉద్దేశంతో లేకపోతె ఇప్పటికే నాతోటి ఎప్పుడో కమిట్ అయిపోయేవాడు."

"అలాంటివాడు కాకపోతే మన దారికి ఎలా వస్తాడు? అయినా ఎక్స్పీరియన్స్ వున్నవాడు అయితేనే బెటర్. ఆ విషయం నీకూ తెలుసు." చారులత అంది. "అయినా నువ్వు మరిచిపోయి ఎప్పటిలా టాబ్ వేసుకోవడం లాంటివి చెయ్యకు. అలాగే వాడినది పెట్టుకోనివ్వకు."

"నువ్వది చెప్పక్కర్లేదు మామ్, గుర్తువుంచుకుంటాను." మరోసారి నవ్వింది మల్లిక. "అయినా ఇంతా చేసి, వాడితో కమిట్ అయ్యాక కూడా కడుపు రాకపోతే ఏం చెయ్యాలి?"

"అలాక్కూడా జరగొచ్చు. నేను ట్రై చేసిన ఇద్దరితో నాకేం రాలేదు. మీ డాడ్ తోటే అది వర్కవుట్ అయింది. నీ పెద్దక్క విషయం లోనూ అలాగే జరిగింది. కేవలం నీ చిన్నక్కే లక్కీ. మంచివ్యక్తిని మొదటిసారే సెలెక్ట్ చేసుకోగలిగింది. సెలెక్ట్ చేసుకున్నవాడితో మూడోసారి కలిసినప్పుడే కడుపుతెచ్చుకుని పెళ్లిచేసుకోగలిగింది.”

"మామ్ డాడ్ ఇక్కడేవున్నారు. నీ సీక్రెట్ ఏమిటి ఆలా చెప్పేసావ్?" ఆశ్చర్యంగా అడిగింది మల్లిక.

"నాకు తెలియని సీక్రెట్స్ ఏమీ లేవు. పెళ్లయి ఒక సంవత్సరం కూడా కాకుండానే, ఇంక  నేను చెయ్యగలిగింది ఏమీ లేదని మీ మామ్ నాకు చెప్పేసింది. నాకన్నా ముందు ఇద్దరు చేయలేనిది నేను చెయ్యగలిగానని హ్యాపీ ఫీలవ్వడం తప్ప ఇంకేం చెయ్యలేకపోయాను." నిట్టూరుస్తూ అన్నాడు మంగళాచారి.

"పెళ్ళైన తరువాత వాడి పిలక నీ చేతుల్లోవుంటుంది. అది పట్టుకుని ఎలా ఆడించాలో నేను నీకు వాడితో పెళ్లయ్యాక చెప్తాను." చారులత అంది.

"అదిసరే. కానీ నువ్వు నా అసలు ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. ఇంతా కస్టపడి వాడివల్ల నాకు ఏమీరాకపోతే ఏం చేద్దాం? వాడివల్ల నాకు కడుపు రాకపోతే మాత్రం వాడిని నేను పెళ్లిచేసుకోలేను."

"అలాంటి పరిస్థితి ఎదురైతే దానిగురించి అప్పుడే ఆలోచిద్దాం, ఇప్పుడెందుకు టెన్షన్?" చారులత బదులుగా మంగళాచారి అన్నాడు. "మన ఫీజు ఎంత రాబట్టుకోగలమో అంత రాబట్టుకుని తృప్తిపడదాం."

"మీ డాడ్ కరక్ట్ గా చెప్పారు. అయినా నువ్వు అనవసరమైన డౌట్స్ పెట్టుకోకుండా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి." చారులత అంది.

"ఒకే మామ్. అలాగే అయితే." సోఫాలోనుండి లేచి అంది మల్లిక. "ఈసారి మళ్ళీ ఇక్కడికివచ్చినప్పుడు మంచి శుభవార్త తోనే వస్తాను."

ఆ తరువాత అక్కడనుండి వస్తూన్న మల్లికని తల్లీ తండ్రీ ఇద్దరూ కూడా వచ్చి సాగనంపారు.

&&&

 "మీరు నా ఇంటికి మళ్ళీ రావడం నాకు చాలా ఆనందంగా వుంది. ఈ సారి కాఫీ తాగి భోజనం చేస్తేనే కానీ వెళ్లనివ్వను." తనింట్లోకి తనూజని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ అన్నాడు అనిరుధ్.

"వీడికి వంటలో బాగానే ప్రవేశం వుంది. నేనూ తరచూ వీడింట్లో భోజనం చేస్తూ వుంటాను. కాబట్టి మీరు అనవసరంగా భయపడనవసరం లేదు." ఆ సమయానికి అక్కడవున్న మనోజ్ అన్నాడు.

"అసలు నేను నిన్ను భోజనానికి ఆహ్వానించడానికే ఇక్కడికి వచ్చింది. ఈ రోజు మనందరి భోజనాలు కూడా అక్కడే. నువ్వు వంటలాంటి ప్రయత్నాలు ఏమీ పెట్టుకోవద్దు." అక్కడున్న కుర్చీలో కూలబడుతూ అంది తనూజ.

"కానీ నేను ఆస్తమాటూ అలా అక్కడికి భోజనానికి రావడం నాకు ఇబ్బందిగా వుంటుంది." ఒక ఇబ్బందికరమైన ఎక్సప్రెషన్ తో అన్నాడు అనిరుధ్.

"అలా ఇబ్బంది పడడానికి నువ్వేం మాకు పరాయిమనిషివి కాదు. త్వరలోనే ఆ ఇంటికి కాబోయే అల్లుడివి. నిన్ను ప్రత్యేకంగా ఆహ్వానించమని మంజీర చెప్పింది." కుర్చీలో వెనక్కి జరగిలబడుతూ అంది తనూజ.

"ఈ మధ్యన నేను తరచూ అక్కడే భోజనం చేస్తూవున్నాను. మళ్ళీ ప్రత్యేకంగా ఆహ్వానం ఏమిటి?" ఒక కుర్చీని తనూజ కి ఎదురుగా లాక్కుని అందులో కూలబడుతూ అన్నాడు అనిరుధ్. "అయినా అంత ప్రత్యేకంగా ఆహ్వానించదలుచుకున్నప్పుడు తను ఎందుకురాలేదు?"

"ఎదో ఆస్థిపనిమీద వాళ్ళ డాడీ తో కలిసి టౌన్ కి వెళ్ళింది. పెద్ద షాపింగ్ మాల్ ఎదో కొని అది తన పేరు రిజిస్ట్రేషన్ చెయ్యబోతున్నాడు మా అన్నయ్య. అందుకనే వెళ్ళింది, లేకపోతె నిన్ను ఆహ్వానించడానికి వచ్చేదే." తనూజ అంది. "ఈ సెలబ్రేషన్ కూడా దానిగురించే.  మధ్యాహ్నం భోజనాల సమయానికల్లా వచ్చేస్తారు. నువ్వు తప్పకుండా ఈరోజు భోజనానికి ఉండాలని ఇద్దరూ మరీ, మరీ చెప్పారు."

"మరి నేనిప్పుడు ఇంటికివెళతాను." మొహమాటంగా లేచి నిలబడి అన్నాడు మనోజ్.

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)