Read Are Amaindi - 16 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 16

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"అప్పుడప్పుడు అన్నా నేను నా భార్యతో అలా మాట్లాడుకోగలుగుతున్నాని నాకు ఆనందం గా వుంది. నాకు ఆ ఆనందం లేకుండా చేస్తావా? మరి నిర్మల తనలోకి రాకుండా చేసేస్తావా?" సర్వేశ్వరం కోపంగా అడిగాడు తనూజ ముఖంలోకి చూస్తూ. 

"మరి తనంటే అంత ప్రేమ వున్నవాడివి, తను భర్తగా నిర్ణయించిన అనిరుధ్ కే  ఇచ్చి పెళ్ళిచెయ్యాలని ఎందుకు అనుకోలేదు? ఆ నిరంజన్ కి ఇచ్చి చేద్దామని ఎందుకు అనుకున్నావు?" తనూజ అడిగింది.

"అప్పటికే నిరంజన్, ఇంకా మంజీర ఎదో లవ్ లో వున్నట్టుగా చిదంబరం చెప్పాడు. మంజీర కూడా తామిద్దరూ మంచి స్నేహితులమనే చెప్పింది. చిన్నతనం లో ఎంతో క్లోజ్ గా కలిసి ఆడుకున్నా, తరువాత, తరువాత అనిరుధ్ గురించి మంజీర ఏం మాట్లాడలేదు. ఇంక అనిరుధ్ ని పెళ్లిచేసుకోమని ఏమని అడగను?" సర్వేశ్వరం అన్నాడు.

దానికి ఎవరూ ఏం మాట్లాడలేదు. నిజానికి ఏం మాట్లాడాలో ఎవరికీ ఏం తెలీలేదు. కొంత నిశబ్దం తరువాత మళ్ళీ సర్వేశ్వరమే అన్నాడు.

"తను మామూలుగా అయిన తరువాత నేను జరిగినదంతా మంజీరకి చెప్పాను. తను షాక్ అయిపోయింది. తన మామ్ అనిరుధ్  తన భర్తగా అంత సీరియస్ గా ఉందని ఆ నిమిషం వరకూ తనకి తెలీదు. తన మామ్ నిర్ణయాన్ని గౌరవించడం తన కర్తవ్యంగా భావించింది. నేను నిరంజన్ కి తనకి వున్న లవ్ విషయం గుర్తు చేస్తే, తమ మధ్య ఎదో చిన్న స్నేహం లాంటిది తప్ప లవ్ లాంటిది ఏమీ లేదని అనిరుధ్ ని పెళ్లిచేసుకోవడానికి తనకి ఏమీ అభ్యతరం లేదని చెప్పింది. కానీ మాకక్కడే పెద్ద చిక్కు వచ్చి పడింది."

"ఏమిటది?" భృకుటి మూడేసి అడిగింది తనూజ.

"కాలేజ్ లో మంజీర నిరంజన్ తో చనువుగా తిరగడం అందరికీ, అనిరుధ్ తో కలిపి తెలుసు అని తను చెప్పింది. అలాగే చాలా సందర్భాల్లో ఎదో తెలియక తనని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడేనని కూడా చెప్పింది. అనిరుధ్ ని స్ట్రెయిట్ గా అడిగితె తనని పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకోడని మా ఇద్దరికీ అనిపించింది. అందుకనే అలా ఇల్లు లాక్కుంటానని ఫోర్స్ చేసి పెళ్ళికి ఒప్పించాలని చూసాను." విచార వదనం తో అన్నాడు సర్వేశ్వరం.

ఆ విషయం విని మళ్ళీ అక్కడున్న తక్కిన ముగ్గురూ నవ్వారు.

"మీరు అలా ఆలోచించడం కరక్టే అంకుల్. ఎందుకంటే మీరు స్ట్రెయిట్ గా అడిగివుంటే నేను మంజీరని పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకునే వాడిని కాదు. మా కాలేజ్ లో అందరం కూడా వాళ్లిద్దరూ డీప్ లవర్స్ అన్న అభిప్రాయం లో వున్నాం." అనిరుధ్ అన్నాడు.

"వాడితోటి లవ్వా? వాడితో అప్పుడసలు అలా ఎలా కలిసి తిరిగేనా అని ఆశ్చర్యంగా వుంది!" మంజీర అంది.

"అందులోనూ తను నన్ను చాలా సార్లు ఇన్సల్ట్ చేసి మాట్లాడింది. నా వైపు కనీసం చూసేది కూడా కాదు."

"ఆ విషయమై నేను నీకు సారీ చెప్పేసాను, మర్చిపోయావా?" కోపంగా అంది మంజీర.

"నేను నిన్ను ఎక్స్క్యూజ్ కూడా చేసేసాను. ఇప్పుడు కేవలం జరిగింది చెప్తున్నాను అంతే." అనిరుధ్ అన్నాడు. "అంతేకాకుండా మీరు నేనే ఎందుకు తనని పెళ్లిచేసుకోవాలనుకుంటున్నారో నాకు బోధపడలేదు. అది పెద్ద పజిల్ గా మిగిలి పోయింది. నిరంజన్ ని కూడా కలిసి మాట్లాడినా నాకు క్లారిటీ రాలేదు."

"ఆ విషయం లో నీకు అంతా చెప్పి, పూర్తి క్లారిటీ ఇచ్చి, నిన్ను మా అమ్మాయిని పెళ్లిచేసుకునేలా కన్విన్స్ చేసింది నా చెల్లెలే కదా." తనూజ మొహం లోకి అప్రిసియేటివ్ గా చూస్తూ అన్నాడు సర్వేశ్వరం.

"తను నాకు విషయం అంతా చెప్పి, క్లారిటీ ఇచ్చింది నిజమే." కాస్త ఆగాక మళ్ళీ అన్నాడు అనిరుధ్. "కానీ అప్పటికే మీ అమ్మాయిని ఎలాగన్నా పెళ్లి చేసుకోమని మనోజ్ పేరెంట్స్ నన్ను కన్విన్స్ చేశారు. మీరు ఎంతో మంచి మనిషని, తమ కుటుంబం తో పాటుగా ఎన్నో కుటుంబాలకి మీరు సహాయం చేశారని, మీ అమ్మాయి ఏదో తెలిసో తెలియకో అలా బిహేవ్  చేసింది  తప్ప చాలా మంచి పిల్లని చెప్పారు. ఏదో తన మామ్ ఆంటే భయం వల్ల ఆవిడని అలా దూరం పెట్టినా, ఆవిడంటే అందరికీ సింపతీ వుంది. అలాంటి ఆవిడ కూతురు కావడం వల్ల తనంటే కూడా ఆ సింపతీ రన్ అయింది. ఆంటీ వచ్చి నాతొ మాట్లాడే సమయానికి, నేను మంజీర తో మాట్లాడి, తను మనస్ఫూర్తిగా నన్ను పెళ్లిచేసుకునే మాట అయితే తనని పెళ్ళిచేసుకోవాలనే నిర్ణయించుకున్నాను." అనిరుధ్ అన్నాడు. 

"ఓహ్, అయితే ఈ విషయం లో అసలు క్రెడిట్ అంతా మనోజ్ పేరెంట్స్ కి వెళుతుందన్న మాట." నవ్వుతూ అంది తనూజ.

"కానీ నాకు ఆ విషయం లో పూర్తి క్లారిటీ ఇచ్చింది మాత్రం మీరే." అనిరుధ్ కూడా నవ్వాడు.

"కానీ ఒక మాట డాడ్..........." మంజీర అంది. "..............మామ్ కి మతిస్థిమితం లేదని అందరూ దూరం పెట్టారు. కానీ మీకు మాత్రం నచ్చి పెళ్లిచేసుకున్నారు, ఎలా? అలాంటి సరిగా మతిపనిచెయ్యని మనిషి మీద ప్రేమ ఎలా పుట్టింది? లేకపోతె తను అంత అందంగా ఉందనే పెళ్లిచేసుకున్నారా?"

"సమాధానం కొంచెం కష్టమే." నవ్వాడు సర్వేశ్వరం. "తనమీద అందరూ చిరాకు పడేవారు, చివరికి వాళ్ళమ్మతో సహా. నాకెందుకో తనమీద ఆసక్తి కలిగింది, తననే పెళ్లిచేసుకోవాలనిపించింది. తను అంత అందంగా వుందనే పెళ్లిచేసుకుందామనుకున్నానా అంటే నేను చెప్పలేను."

"నువ్వు కేవలం తను అందంగా వుందని మాత్రమే పెళ్లిచేసుకోలేదు అన్నయ్యా.   ఆలా అయితే తను పోయాక నువ్వొక్కసారైనా మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించావా? మళ్ళీ ఇంకొక ఆడమనిషి వూసన్నా ఎత్తావా? తనని మనస్ఫూర్తిగా ప్రేమించావు. ఇప్పటికీ ప్రేమిస్తూనే వున్నావు." తనూజ అంది.

"ఏమో ఈ ప్రేమలు, గీమలు నాకు తెలియవు. నేను ఆ హోటల్లో భోజనం చేసేప్పుడు నా దగ్గరే వుండేది. నాక్కావలసినవన్నీ చూసుకుంటూ వుండేది. అందువల్లనేనేమో తనంటే ఎదో తెలియని అభిమానం, ప్రేమ కలిగాయి. అందుకనే ఎవరు వద్దన్నా, చివరికి నువ్వు వద్దన్నా కూడా తనని పెళ్లిచేసుకున్నాను. తనని పెళ్లిచేసుకోవడం లో నన్ను ప్రోత్సహించింది కేవలం ఒకళ్ళే ఒకళ్ళు. అది స్వామి విచికిత్సానంద." కాస్త ఆగాడు సర్వేశ్వరం.

"ఇంకా నువ్వతని పేరు చెప్పలేదేమిటా, అతని గురించి ప్రస్తావన రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను. అతని గురించి వినకుండా నీ దగ్గర సంభాషణ ఎప్పుడూ పూర్తి కాదు కదా." చిరాగ్గా అంది తనూజ.

"అయన అన్నాడు నాతొ 'సర్వేశ్వరం నువ్వా అమ్మాయిని పెళ్లి చేసుకో. స్వచ్ఛమైన మనసు వున్న అమ్మాయి. ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల నీకు జీవితం లో బాగా కలిసొస్తుంది. మీ ఇద్దరి జంట భగవంతుడిచేత నిర్ణయించబడింది. అందుకే నీకు ఆ అమ్మాయిని చేసుకోవాలని ఆలోచన కలిగింది.' అన్నాడు" తనూజ అన్నది విననట్టుగానే అన్నాడు సర్వేశ్వరం.

"ఆ విచికిత్సానంద ని మీ ఇంట్లో చూసిన గుర్తు నాకు బాగానే వుంది. ఎప్పుడూ తెల్లటి బట్టలు కట్టుకుని, తెల్లటి గడ్డం తో, ప్రశాంతమైన వదనం తో నవ్వుతూ ఉండేవాడు." అనిరుధ్ అన్నాడు.

"నేను ఆయన్ని ఎక్కడో కాదు మా ఇంట్లోనే వుండమని ప్రార్ధించాను. అయన నా కోరిక మన్నించారు. అన్ని విషయాల్లోనూ నాకు సలహాలు ఇచ్చేవారు. ఆయన ఇచ్చిన అన్ని సలహాలు నేను పాటించేవాడిని. నిజం చెప్పాలంటే అయన ఇచ్చిన సలహాలు పాటించే నేను ఇంత గొప్పవాడిని కాగలిగాను, ఇంత సంపాదించగలిగాను."

"అన్నయ్యా నీ అభివృద్ధికి అంతటికీ కారణం నీ హార్డ్ వర్క్ ఇంకా ఇంటెలిజెన్స్ అని ఎందుకు అనుకోవు? ఆ క్రెడిట్ అంతా అలాంటి బాబాలకి, స్వాములకు ఎందుకు ఇచ్చేస్తావు?" కోపంగా అడిగింది తనూజ.

"నీలాంటి మూర్ఖులకి అలాంటి స్వాముల గొప్పతనం ఏం అర్ధమవుతుంది? నీకొక విషయం తెలుసునా? నేను నిన్ను దూరంగా వుంచి చదివించాలా, వద్దా అని ఆలోచిస్తూ వుంటే, నిన్నలా చదివించమని, నువ్వు చదువులో బాగా రాణిస్తావని సలహా ఇచ్చింది ఆయనే. నీకు తెచ్చిన డాక్టర్ సంభంధం లో కూడా ఆయనే ప్రోత్సహించారు." సర్వేశ్వరం కూడా కోపంగా అన్నాడు.

"పోన్లే ఆంటీ నీ విషయం లో కూడా అయన మంచి సలహాలు ఇచ్చారు కదా, అయన మీద నీకు ఎందుకు కోపం?" చిరునవ్వుతో అంది మంజీర.

"నాకు అయన మీద కోపం కాదు మంజీ. కానీ మనకి చెందాల్సిన గొప్పతనం అంతా కూడా అలాంటి స్వాములకు అంటగట్టడం నాకు నచ్చదు."

"మనోజ్ డాడీ కి కూడా ఆ విచికిత్సానంద మీద మంచి నమ్మకం వుంది. అయన ఆయనకి కూడా ఏవో సలహాలు ఇచ్చారని, అవి వర్క్ అవుట్ అయ్యాయని చెప్పారు." అనిరుధ్ అన్నాడు. 

"ఆయన వూళ్ళో చాలా మందికి మంచి మంచి సలహాలు ఇచ్చేవారు. అవి పని చేసేవి. ఆయనకి ఈ వూళ్ళో నాలాంటి భక్తులు చాలా మందే వుండేవారు. అయన లేని లోటు నాకిప్పుడు చాలానే తెలుస్తూంది. చాలా ముఖ్యమైన విషయాల్లో నాకు సలహాలు ఇచ్చేవాళ్లే లేరు." సర్వేశ్వరం అన్నాడు.

"నీ విషయం ఏమిటి మంజీ. అయన నీకేమన్నా గుర్తు వున్నారా? నీతో ఎమన్నా మాట్లాడేవారా?" అనిరుధ్ అడిగాడు మంజీర ముఖం లోకి చూస్తూ.

"అప్పటికి నేను చాలా చిన్నపిల్లని. అయన పోయేనాటికి కూడా నాకు పదేళ్ళకన్నా ఎక్కువ లేవనుకుంటా. అందుకని అయన జ్ఞాపకాలు నాకు ఎక్కువగా లేవు. జస్ట్ నీకున్నట్టుగానే, తెల్లబట్టలుతో, తెల్లగడ్డంతో వుండేవారు. అంతవరకూ మాత్రమే గుర్తు వుంది." అంది మంజీర.

"ఇంతకీ నీ ఫ్రెండ్ చిదంబరం, ఆ నిరంజన్ ల మాటేమిటి? మంజీర ఆ నిరంజన్ ని పెళ్లిచేసుకోబోవడం లేదని చెప్పేసావా?" సడన్ గా టాపిక్ మారుస్తూ అడిగింది తనూజ.

ఆ మాట విని గట్టిగా నవ్వాడు సర్వేశ్వరం. "నేను చెప్పడమేమిటి? ఆ మర్నాడు నిరంజన్ ఫోన్ చేసి, మంజీరని ఎదో దయ్యం పూనుతూందని, తనని తను పెళ్లిచేసుకునే ఊసే లేదని చెప్పేసాడు. పాపం వాడిని ఏం చేసిందో ఏమో నా భార్య, చాలా భయపడిపోయాడు వాడు. వాళ్ళ నాన్నతో అయితే మాత్రం ఇప్పటివరకూ నేను మాట్లాడలేదు. నాతొ అలా చెప్పేసిన వాడు, తన పేరెంట్స్ తో చెప్పకుండా వుంటాడా? నేను మళ్ళీ ప్రత్యేకంగా మంజీర తనని పెళ్లిచేసుకోబోవడం లేదని చెప్పేదేమిటి? తన ఉద్దేశమూ అదే కదా."

"కానీ నువ్వు ఆ చిదంబరం తో ఒకసారి మాట్లాడి ఉండాల్సింది కదా. నీకాయన మంచి ఫ్రెండ్. నేను నిరంజన్ ని పెళ్లిచేసుకోకపోయినా, మీ ఇద్దరి రిలేషన్షిప్ పాడవకూడదు." మంజీర అంది.

"నీ వల్ల నిరంజన్ అంతగా భయపడ్డాడు అన్న తరువాత, నాకు ఆ చిదంబరం తో మాట్లాడడానికి సిగ్గేసింది." సర్వేశ్వరం అన్నాడు. "కానీ నువ్వు చెప్పింది కూడా నిజమే. నేను ఒకసారి ఆ చిదంబరం తో మాట్లాడతాను. తను నాకు మంచి ఫ్రెండ్. మా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగాలి."

  "కానీ వాడు నిన్ను రేప్ చేయబోయాడు కదా. దానికి నీకు కోపం రావడం లేదా నిరంజన్ మీద?" అనిరుధ్ అడిగాడు.

"వాడికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ  పనిష్మెంట్ మామ్ ఇచ్చేసింది కదా. కోపం రావడానికి బదులు జాలేస్తూంది వాడిని తల్చుకుంటూంటే." మంజీర నవ్వింది.

"వాడు జస్ట్ ఎదో ముట్టుకోవడానికి, ఇంకా ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేశానని చెప్పాడు. కానీ అటువంటిది ఎదో వాడు ట్రై చెయ్యకపోతే నా భార్య వాడిని అంతగా తన్ని ఉండేది కాదు." సర్వేశ్వరం నిట్టూర్చి అన్నాడు "అయినా దానిగురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరమూ  లేదు."                                 

అలా కాసేపు మాట్లాడుకున్నాక, ఆ ఇంట్లోనే భోజనం చేసి, అనిరుధ్ ఇంటికి వచ్చేసాడు.

&&&

"నువ్వొచ్చాక ఆ దయ్యం బాధ ఎమన్నా తగ్గుతుందనుకుంటే అది ఇంకా ఎక్కువ అయింది. ఇంతకుముందు కేవలం మా అబ్బాయిని మాత్రమే సాధించేది. ఇప్పుడు మమ్మల్ని కూడా సాధిస్తూ వుంది. అర్ధరాత్రి సమయం లో దాని అరుపులవీ వినలేకపోతున్నాం." రాత్రి భోజనాల సమయం లో చిదంబరం అన్నాడు మల్లిక తో. 

"దాన్ని వదలుకొట్టుకోవడానికి పూర్తి ప్రయత్నం చేస్తూ వున్నారు. అలాగే దానికి అసలు ఇష్టం లేదని తెలిసీ, మీ అబ్బాయిని దాని కూతురికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. మరి దానికి కోపం రాదా? నేనుండి దానిని కట్టడి చేస్తూ వున్నాను. లేకపోతె అదెప్పుడో మీ ముగ్గురి ప్రాణాలు తీసేసేది." మల్లిక అంది.

"దానికంత ఇష్టం లేనప్పుడు, ఆ మంజీర తో నా పెళ్ళెందుకు డాడీ? ఆ విషయం మనం విడిచిపెట్టేస్తే, అదీ మనల్ని విడిచిపెట్టేస్తుంది." నిరంజన్ అన్నాడు భయం గా.

"నువ్వొక ఫూల్ లా మాట్లాడకు. నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే మీకెంత కలిసొస్తుందో నీకూ తెలుసును కదా." మల్లిక కోపంగా అంది.

"ఆ అమ్మాయికి వున్నపాటి ఆలోచన కూడా నీకు లేదేంట్రా?" చిదంబరం కూడా కోపంగా అన్నాడు.

"ఆ ఆలోచన వుంది. నా స్థానంలో అది మిమ్మల్ని ఉతికి ఉంటే మీకు తెలిసివచ్చేది. ఆ రోజు నేను ఎలా ప్రాణాలతో బయటపడ్డానో నాకే తెలీదు. తలుచుకుంటేనే నాకు భయంగా ఉంటుంది." నిరంజన్ కి కూడా కోపం వచ్చేసింది.

"ఆ దయ్యం సమస్య పూర్తిగా తీర్చడానికే కదా నేను వున్నది? ఆ దయ్యాన్ని పూర్తిగా నాశనం చేసి, ఏ ఇబ్బందీ లేకుండా ఆ అమ్మయితో నీ పెళ్లి జరిపించాకే నేనిక్కడనుండి వెళతాను." దృఢస్వరం తో అంది మల్లిక.

"నీ మాటలు వింటూవుంటే నువ్వాపని చెయ్యగలవనే నాకనిపిస్తూంది అమ్మాయ్." చిదంబరం అన్నాడు సడన్ గా ఆనందం నిండిన మొహంతో.

"నీ గురువుగారు మంగళాచారి గారి సహాయం లేకుండా నువ్వు అలా చేసేగలవా?"శకుంతల అడిగింది.

"ఖచ్చితంగా చెయ్యగలను.మంగళాచారి గారిదగ్గర కూడా నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరముంది. మీకెందుకు? మీరు ఈ సమస్యని పూర్తిగా నాకు విడిచిపెట్టండి. ఆ అమ్మాయిని మీ కోడలిగా ఈ ఇంట్లోకి తెచ్చే నేను ఇక్కడనుండి వెడతాను." మరొకసారి దృఢస్వరం తో చెప్పింది మల్లిక.

"ఆ అమ్మాయి అంత స్పష్టంగా ఆలా చెప్తూవున్నప్పుడు నువ్వు అక్కర్లేని అనుమానాలు వ్యక్తం చెయ్యకు." భోజనం ముగించి లేస్తూ అన్నాడు చిదంబరం. ఆ తరువాత అక్కడనుండి వెళ్ళిపోయాడు అయన.

"భోజనం అయిందిగా. నువ్వూ ఇక్కడనుండి వెళ్ళు." ప్లేట్ లో చెయ్యికడుక్కున్నా ఇంకా అక్కడే కూర్చున్న నిరంజన్ వైపు చిరాగ్గా చూస్తూ అంది శకుంతల. అతను అక్కడనుండి వెళితే మల్లికతో ఒక విషయం చెప్పాలన్న ఆలోచనతో వుంది.

"ఆమ్మో మల్లిక లేకుండా నేను వుండను. ఆ దయ్యం వచ్చి నన్నేమన్నా చేసేస్తుంది." భయంగా అన్నాడు నిరంజన్.

"నేనిక్కడ ఉన్నంత కాలం నిన్నే దెయ్యం ఏమీ చెయ్యలేదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు." నిరంజన్ వైపు చూస్తూ అంది మల్లిక.

"ఈ అమ్మాయి అలా చెపుతూందిగా. ఇంక వెళ్ళు." ఇంకా అలాగే కూచున్న నిరంజన్ వైపు చిరాగ్గా చూస్తూ అంది శకుంతల.

ఇంక తప్పదన్నట్టుగా అక్కడనుండి లేచి వెళ్ళాడు నిరంజన్.

"ఇదిగో చూడమ్మాయ్. ఇది ఇద్దరు మగాళ్లు ఉంటున్న ఇల్లు. నువ్వలా బ్రా వేసుకోకుండా ఉంటే ఎలా? అసలే యవ్వనం తో పిటపిట లాడుతున్నావు." నిరంజన్ అక్కడనుండి వెళ్ళగానే మల్లిక మొహం లోకి చిరాగ్గా చూస్తూ అంది శకుంతల.

"సారీ ఆంటీ, ఏదో తొందర్లో మరిచిపోయినట్టున్నాను." సిగ్గుతో ఎర్రబడ్డ మొహంతో గాభరాగా అంది మల్లిక. "అసలు ఎప్పుడన్నా బ్లౌజ్ అన్నా మర్చిపోతానేమో కానీ బ్రా మర్చిపోను."

"మా వాడిది అసలే చపల చిత్తం.  నువ్వేమో నిండు యవ్వనం తో అందంగా కూడా వున్నావు. ఏదన్నా పొరపాటు జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా వుంది." సడన్ గా భయం నిండిన మొహం తో అంది శకుంతల.

"మీ అబ్బాయిది చపల చిత్తం కానీ నాది కాదు ఆంటీ. ఎలాంటి పొరపాటు జరగనివ్వను. మీరు ధైర్యంగా వుండండి." అప్పటికీ మల్లిక కూడా భోజనం ముగించి, ప్లేట్ లో చెయ్యి కడుక్కుని అక్కడనుండి వెళ్ళిపోయింది.

"ఆ మంగళాచారి కి ఈ అమ్మాయి తప్ప ఇంకెవరూ దొరకలేదు పంపించేంచడానికి." బెడ్ మీద భర్త పక్కన సెటిల్ అవుతూ చిరాగ్గా అంది శకుంతల.

"అదే కదా అతనూ అన్నాడు." భార్య మొహం లోకి చూస్తూ అన్నాడు చిదంబరం. "ఇంతకీ ఇప్పుడేమైంది?"

"చూస్తున్నారుగా అదెలా వుందో? నిండు యవ్వనం తో పిటపిటలాడడమే కాదు, అంతో అంతో అందంగా కూడావుంది. మనవాడిదసలే కుక్కబుద్ధి. కతక్కుండా వుండలేడు. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పొరపాటు జరిగిందంటే, దాని బదులు ఇది మన కోడలై కూచుంటుంది." 

"ఎదో ప్రొఫెషనల్ కమిట్మెంట్ తో మనింటికి వచ్చింది. మనవాడేదో తొందర పడదామనుకున్నా తనలాంటి పొరపాటు జరగనివ్వదు. నువ్వనవసరంగా భయపడకు." అలా అన్నాడే కానీ చిదంబరానికి కూడా అటువంటి భయం వుంది.

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)