Read Are Amaindi - 14 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 14

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"ఐ సీ" చిరునవ్వుతో అంది మంజీర. తన అత్త తనతో ఎదో చెప్పాలనుకుంటూందన్న విషయం అర్ధం అయింది.

"నన్ను చెల్లెలి కన్నా కూడా ఎక్కువగా కూతుర్లాగే చూసాడు. కష్టం అంతా తను పడి. నన్ను కేవలం చదువుకి మాత్రమే పరిమితం చేసాడు. కాకపోతే........." కాస్త ఆగి అంది తనూజ. ".........చిన్న చిన్న వ్యాపారాలతో డబ్బు ఆర్జించడం మొదలు పెట్టాడు. కొంచెం నమ్మకం వున్న వాళ్ళ దగ్గర కొంత అప్పు తీసుకుని కొంచెం పెద్ద వ్యాపారం మొదలు పెట్టాడు. తరువాత అంతా మ్యాజిక్ లా అయింది. మా అన్నయ్య చేయ్యిపెట్టిందల్లా బంగారం అయింది. తనకు ఆర్జించిన ఆస్తిపాస్తులతో తనే ఆశ్చర్యపడేంతగా సంపాదించాడు."

"ఓహ్, గాడ్! ఆంటీ, నువ్వేదో చెప్పాలనుకుని ఎదో చెప్తున్నట్టున్నావు." నవ్వింది మంజీర.   

"కానీ నీకు చెప్పాల్సింది, తెలియాల్సిందే చెప్తున్నాను." తనూజ కూడా నవ్వింది. "నా దృష్టిలో నా అన్నయ్య డెవలప్మెంట్ కి కారణం తన హార్డ్ వర్క్, ఇంటిలిజెన్స్ ఇంకా అంతో ఇంతో లక్. కానీ నా అన్నయ్య దృష్టిలో, అదే నీ డాడ్ దృష్టిలో మాత్రం............"

"ఆ విచికిత్సానంద స్వామి, ఆయన అనుగ్రహం." నవ్వుతూ అంది మంజీర.

"అవును. అప్పుడు అయన ఈ ఊళ్ళోనే వుండేవాడు. చాలా మంది అయన దగ్గర సలహాలు తీసుకునేవారు, వాళ్ళల్లో మీ డాడ్ కూడా ఒకరు. వాళ్లందరికీ అయన సలహాలు ఫలించాయో లేదో నాకు తెలీదు, కానీ మీ డాడ్ మాత్రం అయన సలహాలు, అనుగ్రహం వల్లే ఇంత గొప్పవాడినయ్యానని చెప్తాడు."

"నిజమే కావచ్చుగా ఆంటీ." మంజీర అంది.

"నేను దేవుడిని నమ్ముతాను. కానీ ఇలాంటి స్వాములని నమ్మలేను. ఆ స్వామి సలహాలవల్ల మీ డాడ్ ఇంత వాడయ్యాడేంటే నేను ఒప్పుకోను."

"నాకూ ఆ స్వామి గుర్తున్నాడు ఆంటీ. మనింట్లోనే వుండేవాడు కదా."

"అవును. ఆ స్వామి మీద అభిమానం, భక్తి పెరిగిపోయి మనింట్లోకే తెచ్చి పెట్టుకున్నాడు మీ డాడ్." తనూజ అంది. "ఆ సమయం లో ఈ వూళ్ళో ఒకావిడ చిన్న హోటల్ నడుపుతూ వుండేది. తనకి ఇంట్లో వంట చెయ్యడానికి అవ్వని సమయం లో అక్కడ భోజనం చేసి నాకూ అక్కడనుండి క్యారేజ్ తెస్తూండేవాడు మీ డాడ్. ఆ హోటల్ నడిపే ఆవిడ కూతురితో, అంటే అదే మీ మామ్ తో ప్రేమలో పడ్డాడు మీ డాడ్. దానికి నేను అంగీకరించలేదు."

"అదేమిటి ఆంటీ?" ఆశ్చర్యంగా అడిగింది మంజీర. 

"మీ మామ్ కి మైండ్ అంత సరిగ్గా పనిచేసేదికాదు, నీకు తెలిసిన విషయమే కదా. అందుకనే నేను వద్దన్నాను. కాకపోతే చాలా అందంగా మాత్రమే వుండేది."

"గాడ్! అంత పెద్ద బిజినెస్ మాన్ అయినా డాడ్ కూడా అందానికి లొంగిపోయారా?" నవ్వింది మంజీర. 

"నేనూ అలాగే అనుకున్నా. కానీ తను మంచి వయసులో వున్నప్పుడే నీ మామ్ చనిపోయింది. అయినా పొరపాటున కూడా ఇంకో పెళ్లి గురించి కానీ, ఆడ తోడు గురించి కానీ ఆలోచించలేదు. బాగా ధనవంతుడు కావడం వల్ల, ఇంకా అప్పటికి మంచి యవ్వనంలోనే వుండడం వల్ల చాలా మందే పిల్లనివ్వడానికి ముందుకు వచ్చారు. నేను కూడా ఇంకా బాగా చిన్నపిల్లగా వున్న నిన్ను చూసుకోడానికి అయినా మళ్ళీ పెళ్లి చేసుకోమని నా అన్నయ్యకి చాలా చెప్పి చూసాను. కానీ మీ డాడ్ మళ్ళీ పెళ్లి చేసుకోను కాక చేసుకోను అన్నాడు. అంతేకాదు ............" నొక్కిచెప్పడానికి అన్నట్టుగా కాస్తఆగింది తనూజ. ".........ఇంకొక ఆడమనిషి   గురించికూడా ఆలోచించ లేదు."

"డాడ్ నిజంగా గ్రేట్!" అప్రిసియేటివ్ ఎక్సప్రెషన్ తో అంది మంజీర.

"నిజం గా గ్రేట్." తనూజ కూడా అంది. "చిన్నపిల్లవైన నిన్ను మీ మామ్ పోయిన తరువాత చూసుకోవడానికి తను చాలా ఇబ్బంది పడ్డాడు. తను ఇబ్బంది పడ్డం చూడలేక నేను చదువు మానేసి ఇక్కడే ఉండిపోతాను అన్నాను. అందుకు తను ఒప్పుకోలేదు. నేను కాలేజ్ లో చేరి చదివితీరాల్సిందే అన్నాడు. నేను ఒప్పుకోక తప్పలేదు." కాస్త ఆగింది తనూజ 

ఏం మాట్లాడాలో తట్టక మౌనంగానే ఉండిపోయింది మంజీర.

"నా డాక్టరేట్ పూర్తికాగానే నాకొక డాక్టర్ సంబంధం చూసాడు. కనీసం అప్పుడైనా కొంతకాలం ఇంటిదగ్గర వుండి నిన్ను చూసుకునే అవకాశం ఇవ్వమని అడిగాను. కానీ తను వినలేదు. నాకు అప్పటికే ఇరవైనాలుగేళ్ళు వచ్చేశాయని, ఇంకా లేట్ చెయ్యడం తగదని నాకు పెళ్ళిచేసేసాడు."

ఆ మాట వినగానే నవ్వింది మంజీర.

"ఎంతసేపూ నా సంతోషం, నా ఆనందం గురించే ఆలోచించాడు. నిజానికి నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో, నన్ను అంతగానే ప్రేమిస్తాడు. అలాంటి  అన్నకి కూతురువైన నీకు నేను ఏమీ చెయ్యలేకపోతే ఎలా? నిజానికి ప్రస్తుతం నేను నీకు చేస్తున్నది చాలా తక్కువ."

"ఒకే ఆంటీ. ఎనీహౌ, ప్రస్తుతం నువ్వు నాతో వున్నందుకు, నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా వుంది."

"కానీ నీకు ఎంతో ముఖ్యమైన సమయంలో నేను నీ కూడా వుండలేకపోయాను. అలాగే నేను ఇంటిదగ్గరే ఉండివుంటే నీ మామ్ కి కూడా బాగా హెల్ప్ అయివుండేదాన్ని. మామూలుగా అయితే పర్లేదు. కానీ తన మెంటల్ కండిషన్ కి స్వంత ఆడ మనిషి తాలూకు హెల్ప్ చాలా అవసరం. తన భర్తకి చెల్లెలినే అయినా అది నేను కాలేకపోయాను." సడన్ గా మొహం లో విచారంతో అంది తనూజ.

"జరిగిపోయినదానికి విచారించకు ఆంటీ. ఇప్పుడు నువ్వు మాకు చేస్తున్న హెల్ప్ కూడా తక్కువేమీ కాదు."

"ఎనీహౌ ఇప్పటికైనా నీ డాడ్ కి నాకు ఫోన్ చేసి విషయం చెప్పాలనిపించింది." నవ్వింది తనూజ. "ఇంతకీ అనిరుధ్ నువ్వు ఏం మాట్లాడుకున్నారు? నిన్ను పెళ్లిచేసుకోవడానికి ఏ రకంగానూ తనకి అభ్యంతరం లేనట్టేగా."

"ఎస్ ఆంటీ, నన్ను పెళ్లి చేసుకోవడానికి తనకి ఏ రకంగానూ అభ్యంతరంలేదు." సిగ్గువల్ల సడన్ గా ఎర్రబడిన బుగ్గలతో అంది మంజీర.

"చెప్పానుగా. నీ లాంటి బ్యూటీ ని పెళ్లిచేసుకోవడానికి ఎవరికైతే మాత్రం అభ్యంతరం ఉంటుంది? అలా వుంటే తనకి మైండ్ సరిగ్గా పనిచెయ్యనట్టు." మళ్ళీ నవ్వుతూ అంది తనూజ.

"అదే విషయం తనూ అన్నాడు. అంతేకాదు నేను పెట్టిన కండిషన్ కి ఒప్పేసుకున్నాడు కూడా. నా కండిషన్ కి తనంత తేలిగ్గా ఒప్పుకుంటాడని కూడా నేను అనుకోలేదు." నవ్వుని అలా కంటిన్యూ చేస్తూ అంది మంజీర.  

"నువ్వు కండిషన్ పెట్టావా? ఏమిటది?" కళ్ళు చిట్లించి అడిగింది తనూజ.

"కండీషనా?" అప్పుడుగాని తను చేసిన పొరపాటు గమనించలేదు మంజీర. తెలీకుండా తొందరపడి అనేసింది. "కండిషన్ ఏమీ లేదు. నేనేదో తొందర్లో అలా అన్నాను." కంగారుగా అంది.

"నువ్వు తొందర్లోనే అలా అన్నావు. అది ఒప్పుకుంటాను. కానీ కండిషన్ మాత్రం ఎదో వుంది. అదేమిటో చెప్పు." మంజీర మొహంలోకే సూటిగా చూస్తూ అడిగింది తనూజ.

"ఆంటీ అది........" ఏం చెప్పాలో తోచడం లేదు మంజీరకి.

"ఎదో కల్పించి చెప్పాలని మాత్రం ఆలోచించకు. నిజం చెప్పు. ఏం కండిషన్ పెట్టావ్?" తనూజ అలాగే చూస్తూ వుంది.

ఏం చెప్పాలో తెలియాక అలాగే ఉండిపోయింది మంజీర.

"నేను నీకెంతో కావాల్సిన మనిషిని అని, నిన్ను అభిమానించే మనిషిని అని ఒప్పుకుంటావు కదా? అలా అయితే ఆ కండిషన్ ఏమిటో చెప్పు. అలా చెప్పడం ఇష్టం లేకపోతె చెప్పానని చెప్పేయ్. నేను నిన్ను మళ్ళీ అడగను."

"మా మధ్య అసలు ఎప్పుడూ సెక్సే వుండకూడదని చెప్పాను." చిన్నగొంతుతో చెప్పింది మంజీర. అయినా అది తనూజ కి బాగానే వినపడింది.

"అదేం కండిషన్? అలాంటి కండిషన్ ఎవరన్నా పెడతారా?" అనిరుధ్ లాగే, తనూజ కూడా ఇది ముందే ఊహించింది. అనిరుధ్ తనకి ముకుందానికి జరిగిన సంభాషణ గురించి మాట్లాడినదంతా తనూజ కి బాగానే గుర్తు వుంది. "అసలు సెక్స్ లేకుండా భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ సాధ్యం అవుతుందా? పిల్లలెలా పుడతారు? నువ్వేమన్నా అంత చిన్నపిల్లవా ఈ విషయం తెలియాకపోవడానికి?"

"అనిరుధ్ ఎవరినన్నా తెచ్చుకుని పెంచుకుందామన్నాడు. సెక్స్ లేకుండా  కూడా మేమిద్దరం ఆనందంగానే కలిసి ఉండగలమన్నాడు." అనిరుధ్కే లేని బాధ నీకెందుకు అన్నట్టుగా చూస్తూ అడిగింది మంజీర.

"నిన్ను బాధపెట్టడం ఇష్టం లేక అలా అన్నాడు." అన్నాక కాస్త ఆగి మళ్ళీ అంది మంజీర. "సెక్స్ అన్నది కేవలం పిల్లల కోసం మాత్రమే కాదు. ఇది భార్యాభర్తల మధ్య చాలా కామన్ అండ్ ఎసెన్షియల్ థింగ్. ఆడవాళ్ళ కన్నా కూడా మగవాళ్లలో ఈ సెక్స్ కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. అది తీర్చుకోకుండా వుండడం కొన్నిసందర్భాలలో వాళ్ళకి ఇంపాజిబుల్ అయిపోతుంది. పెళ్లయ్యేవరకూ ఎలాగో తట్టుకున్నా, పెళ్లయ్యాక కూడా నువ్వు సెక్స్ లేకుండా ఉండమంటే అనిరుధ్ చాలా సఫర్ అవ్వాల్సి ఉంటుంది."

దానికి ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది మంజీర.

"అంతెందుకు, పెళ్లయి ఇన్ని సంవత్సరాలు అయినా, అంకుల్ కి నాకు మధ్య వారానికి ఒక్కసారయినా అది ఉండాల్సిందే. ఆడవాళ్ళలో కూడా కొన్ని సందర్భాల్లో ఆ కోరిక విపరీతంగా కలుగుతూ ఉంటుంది. అది తీరక పోతే చాలా ఇబ్బందికరంగానూ ఉంటుంది."

"ఏమో ఆంటీ, సెక్స్ విషయం ఎత్తితేనే నాకు చాలా ఇరిటేటింగా అనిపిస్తుంది, విపరీతమైన చికాకు వచ్చేస్తుంది. అసలు భరించలేకపోతూ వుంటాను." ఇబ్బందికరమైన ఎక్సప్రెషన్ తో అంది మంజీర.

"చిన్నతనం లో పెంపకం సరిగా లేక, ఇంకా బాగా ట్రెడిషనల్ కుటుంబాల్లో పెరిగిన ఆడపిల్లల్లో ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇది సరిచెయ్యలేని సమస్య ఏమీ కాదు. నువ్వు తల్చుకుంటే, ధైర్యంచేస్తే ఈ సమస్యనుండి బయటపడగలవు."

దానికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది మంజీర.

"నేను చెప్పిన మాటలకి కన్విన్స్ అయి నీతో పెళ్ళికి అంగీకరించాడు అనిరుధ్. అటువంటిది నీతో పెళ్లయ్యాక అంత ముఖ్యమైన విషయంలోనే అతనికి అంత పెద్ద లోటువుంటుందంటే నేను భరించలేను. ఒక విషయం చెప్పు, నిన్ను ప్రేమించే మనిషి ఒక విషయంలో అంతగా సఫర్ అవడం నీకు మాత్రం ఇష్టమా? ఏ కారణం వల్లో నీకు సెక్స్ అంటే వున్న ఇరిటేషన్ వల్ల సెక్స్ కోరిక కలగడం లేదు. లేకపోతె అది కలిగినప్పుడు, అది తీరే అవకాశం ఉండికూడా తీర్చుకోలేకపోతే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది అస్సలు నేను అంగీకరించలేను."

కింద పెదవిని పళ్ళమధ్య బిగబట్టి, దీర్ఘంగా ఆలోచిస్తూ, ఇంకా మౌనంగానే ఉండిపోయింది మంజీర.

"నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లిచేసుకోవడానికి  ముందుకొచ్చాడు అనిరుధ్, అభ్యంతరపడడానికి అవకాశం వున్నా కూడా. అలాంటి వ్యక్తి నిన్ను పెళ్ళిచేసుకుని బాధపడకూడదు. అలాగే నిన్ను పెళ్లిచేసుకోవడానికి కారణమై, తనను ఇబ్బంది పడేలా చేశానన్న బాధ నాక్కూడా వుండకూడదు. నీలో నువ్వు ఆ విషయమై ఖచ్చితంగా మార్పుతెచుకోవాలి మంజీరా." తనూజ అంది.

"ఒకే ఆంటీ నేను ట్రై చేస్తాను." మంజీర అంది.

"నువ్వు ట్రై చేస్తాను అంటే కాదు. నీలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఎంత మార్పు రావాలి అంటే పెళ్లికిముందే అది మీ ఇద్దరిమధ్య పూర్తికావాలి, అంటే మీ ఇద్దరి మధ్య సెక్సువల్ కలయిక జరగాలి. పెళ్లిరోజు నాటికే మీ ఇద్దరిమధ్య సెక్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేప్రకారం గా వుండాలి."

"ఆంటీ, ఏమిటిది? పెళ్ళికి ముందే సెక్సా? తప్పుకాదా?" కళ్ళు చిట్లించి అంది మంజీర.

"ఎంతమాత్రం తప్పు కాదు. మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలు. మరొకలా అయితే నేనూ ఇలా సజెస్ట్ చేసేదాన్ని కాదు. కానీ నీ విషయంలో ఇది నాకు అవసరం అనిపిస్తూంది. పెళ్ళికి ముందే నువ్వా విషయంలో పూర్తిగా నార్మల్ అవుతానని నాకు మాట ఇవ్వగలవా?" తనూజ అడిగింది.

"ఒకే ఆంటీ. నేను పెళ్లి అవ్వడానికి ముందే ఆ విషయంలో పూర్తిగా నార్మల్ అవుతాను. అందుకు చెయ్యవలసిన పూర్తి ప్రయత్నం చేస్తాను. మా ఇద్దరి మధ్య అదికూడా పూర్తయిందనిపించి..........." బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోతూవుండగా కాస్త ఆగి అంది మంజీర. "...........నీకు చెప్తాను."

"గుడ్. ఐ లైక్ యువర్ కమిట్మెంట్. నువ్వు ఈ విషయం లో హండ్రెడ్ పెర్సన్ట్ సక్సెస్ అవుతావు." మంజీర ని రెండు చేతులతో దగ్గరికి తీసుకుని తన కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ అంది తనూజ. "నీకు ఈ విషయంలో ఎటువంటి సహాయం కావాల్సిన కూడా నేను చేస్తాను. “

"ఒకే ఆంటీ." తన పట్టునుండి విడిపించుకుంటూ చిరునవ్వుతో అంది మంజీర.

తరువాత లంచ్ కి ఆ గదిలోనుండి వెళ్ళ బోయే ముందుగా ఆ ఇద్దరూ మరికాసేపు మాట్లాడుకున్నారు.

&&& 

బెడ్ మీద అడ్డుగా పడుకున్న ప్రమీల కి చాలా భారంగా వుంది. నిజంగా ఇలా భారంగా వుండడం అన్నది ఇవాళ మొదలు కాలేదు. ఆ రోజు సాకేత్ తో ఆలా సెక్స్ చేసిన దగ్గరనుండి ఇలా భారం గానే వుంది. నిజానికి ఆ వెంటనే అయితే ఒక సంవత్సరం వరకూ అది అక్కర్లేదేమో అనిపించింది. కానీ ఒక రోజు కూడా పూర్తిగా గడవకుండానే, సాకేత్ చేసినదంతా గుర్తుకువస్తూ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తూ వుంది.

నిజానికి సాకేత్ తో సెక్స్ పంచుకోవడం కన్నా ముందు కూడా తనకి ఇలా భారంగానే ఉండేది. పెద్ద మనిషి అయిన దగ్గరనుండి కూడా సెక్స్ లో పాల్గోవాలని చాలా కోరికగా ఉండేది. కానీ చిన్నప్పటినుండి నూరిపోసిన నైతిక విలువల కారణంగా, ఇంకా కడుపు వచేస్తుందేమోనన్న భయంతోటి ఆగింది. రాను రాను కొంచెం విప్లవాత్మక భావాలూ కూడా పెరిగి, సెక్స్ పెళ్ళికి ముందు చేసినా, ఎవరితో చేసినా పెద్ద తప్పు కాదు అన్న ఆలోచన వచ్చినా సరి అయిన అవకాశం దొరక్క ఆగింది. మంచి కండలు తిరిగిన శరీరంతో, సాకేత్ తనని బాగా సుఖపెట్టగలడనిపించినా, అంతకన్నా హ్యాండ్సమ్ గా వున్న అనిరుధ్ తో తన వ్యవహారం సెట్ అవుతుందేమోనని ఆగింది. అనిరుధ్ అలా రిజెక్ట్ చేసేసరికి ఇంకా ఆగలేక సాకేత్ తో కానిచ్చింది.      

అందులో సుఖం ఉంటుందని తెలిసినా అంత సుఖం ఉంటుందని, సాకేత్ తో అనుభవం తరువాత కానీ తెలిసి రాలేదు. దొంగ రాస్కెల్! తనకి ప్రతీ చోట స్వర్గం చూపించాడు. వాడు తనని అనుభవించిన తీరు తల్చుకుంటూంటే, తన శరీరం గురించి తనకన్నా వాడికే బాగా తెలుసు అనిపిస్తూ వుంది. ఇంతలా బాధపడేకన్నా ఎప్పుడో వాడిదగ్గరికి వెళ్లి మరోసారి అయిందనిపించేది. కానీ వాడు ఎదో అర్జెంటు పనివుండి వాళ్ళ వూరు వెళ్ళిపోయాడు ఆ మర్నాడే. పదిరోజులు అవుతూంది కానీ ఇంకా తిరిగిరాలేదు. మధ్యలో ఫోన్ చేస్తే ఇంకా పని పూర్తికాలేదు అప్పుడే రావడం అవదు అని చెప్తూ వున్నాడు.

సాకేత్ కడుపు వచ్చినా పర్లేదు కాంట్రాసెప్టివ్ ఏదీ తీసుకోవద్దని చెప్పినా ప్రమీల భయపడకుండా వుండలేకపోయింది. ఎంత వాడిని పెళ్లిచేసుకోబోతూందని చెప్పినా, పెళ్ళికి ముందే కడుపు తెచ్చుకుందంటే తమ ఇంట్లో చంపిపడేస్తారు. అందుకనే ఆ రోజు రాత్రి తన క్లోజ్ ఫ్రెండ్ రజనికి ఫోన్ చేసి ఏ టాబ్లెట్ వేసుకోవాలో చెప్పమని అడిగింది. రజనికి చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ వున్నారు, ఇలాంటి వాటిల్లో మంచి ఎక్స్పర్ట్.

అంతేకాకుండా తామిద్దరూ మంచి ఫ్రెండ్స్. హై స్కూల్ దగ్గరనుండి కలిసి చదువుకున్నారు. చిన్నప్పటినుండీ చదువులోకన్నా, ఇలాంటి విషయాల్లో రజని మంచి దిట్ట. ప్రమీల ని రకరకాలుగా ఎడ్యుకేట్ చేస్తూ వస్తూంది.

"ఆఖరికి ఆ అనిరుధ్ తో వ్యవహారం సెట్ అయిందా? ఎంత సుఖం ఇచ్చాడేంటి?" నవ్వుతూ అడిగింది రజని.

"ఇది అనిరుధ్ తో కాదులే." చిరాగ్గా అంది ప్రమీల.

"మరింకెవరు? ఆ అనిరుధ్ మీద ఆశతో, ఎంతోమంది నీ చుట్టూ తిరుగుతున్నా కాదన్నావు. నువ్వూ సఫర్ అయ్యావు. ఇంతకీ నీ అందాల్ని ఎంజాయ్ చేసే ఛాన్స్ ఎవరికీ ఇచ్చావ్?"

"ఆ విషయం చెప్తేకాని చెప్పవా?" ఇంకా చిరాకుపడుతూ అడిగింది తను.

"ఆ విషయం నాక్కూడా చెప్పడానికి నీకంత బాధగా ఉంటే చెప్పను. నీ బ్యూటీ ని మొట్టమొదటిసారి టేస్ట్ చేసిందెవరో నాకు తెలియాలి."

"సాకేత్."

"ఆ ఆరడుగుల కండల వీరుడా? వాడూ నీ చుట్టూ బాగానే తిరిగే వాడు. నీకు మంచి సుఖాన్నే ఇచ్చి వుండాలే."

"టన్నుల కొద్దీ ఇచ్చాడు. అది తరువాత. ఇంతకీ వాడి అకౌంట్లో నువ్వూ లేవు కదా? తనకి అందులో అమ్మాయిలతో మంచి అనుభవం ఉందనే చెప్పాడు వాడు."

"వాడిని చూసి, వాడి మొహం చూసి ఎక్ష్పెక్త్ చేసాను. కానీ వాడి అకౌంట్లో నేను లేను. వాడు నీ చుట్టూ తిరగడం చూసి, ఎప్పటికన్నా ఒకవేళ మీ ఇద్దరికీ సెట్ అవుతుందేమోనన్న ఉద్దేశంతో వాడిని నేను ట్రై చెయ్యలేదు. ఎనీహౌ కంగ్రాట్యులేషన్స్! ఒక బారియర్ని బ్రేక్ చేసి చక్కగా సుఖం అనుభవించావ్.”

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)