Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 20

జాగ్రత్త జ్యూస్ తో పాటు మందు కూడా ఉంటుంది..... చాలావరకు అన్ని ఒకే కలర్లో ఉంటాయి కాబట్టి చూసి తాగు...... లేదంటే నేను ఏమిస్తే అదే తీసుకో...... అలాగే ఈ పార్టీలో నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను..... కచ్చితంగా నేను ఇచ్చే సర్ప్రైస్ కి నువ్వు షాక్ అవుతావు చూస్తూ ఉండు..... “ అని నవ్వుతూ చెప్పి ఒకరి చేయి ఒకరు పట్టుకొని సెల్లార్ లోకి వెళ్లి ఈసారి బైక్ కాకుండా కార్ తీసుకొని పార్టీ జరిగే ప్లేస్ కి స్టార్ట్ అయ్యారు

@@@@@@@@

పార్టీకి ఒక్కొక్కరు వస్తూ ఉండగా 6:30 కల్లా అందరూ చేరుకున్నారు..... రామ్ సీత ఒకేసారి రావడం చూసిన సీత ఫ్రెండ్స్ రామ్ కొలీగ్స్ అందరూ ఆశ్చర్యపోయి సీత ఫ్రెండ్స్ ఎవరు అని అడిగితే ఇక అబద్ధం చెప్పటం ఎందుకు అనుకొని సీత రామ్ ని తన బావగా మాత్రమే ప్రస్తుతానికి పరిచయం చేసింది......

సీత ఫ్రెండ్స్ కి ఎవరికి రామ్ గురించి తెలియదు...... సీత కూడా ఎక్కువగా బావ ఇలా బావ అలా అని తిట్టేటప్పుడు చెప్పేదే తప్ప తన ఫోటో కానీ వాళ్లు డైరెక్ట్ గా చూసింది కానీ లేదు...... సో వాళ్లు ఎప్పుడు రామ్ ని చూసింది లేదు ఇప్పుడు వాళ్ల టీం లీడర్ సీత బావ అని తెలిసేసరికి కొంచెం షాక్ అయ్యారు..... రాగిణి మాత్రం బాగా డిసప్పాయింట్ అయిపోయింది.....

ఎందుకంటే చదువుకునే టైం లోనే సీత తన బావని తిట్టడానికి మాట్లాడేటప్పుడు కూడా తన కళ్ళల్లో మెరుపు గమనించి ప్రేమిస్తుందని అప్పుడే అర్థమై సీతకి చెప్పిన కొట్టి పారేసింది...... ఇప్పుడు ఇద్దర్నీ పక్కపక్కనే చూస్తూ ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా అనిపించి తనకి కనీసం ఛాన్స్ కూడా ఉండదని అర్థమై రామ్ మీద ఆశలు వదిలేసింది......

సీత ఫ్రెండ్స్ అందరూ వైట్ కలర్ లాంగ్ ఫ్రాగ్ వేసుకొని అందంగా రెడీ అయి వచ్చారు.... అజిత్ కూడా బ్లాక్ కలర్ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ టక్ చేసుకొని హెయిర్ కి జెల్ రాసి స్టైల్ చేసుకొని సీత దగ్గరికి వచ్చి హాయ్ అన్న పలకరించకుండా మొహం తిప్పేయడంతో బాధగా మిగిలిన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండిపోయాడు......

నీతూ కూడా బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాగ్ మీద సిల్వర్ కలర్ డిజైన్ తో వచ్చింది వేసుకొని మెడలో ప్లాటినం చైన్ జుట్టు సేమ్ సీత లాగే వేసుకొని ఒక చేతికి వైట్ స్టోన్ గాజు మరొక చేతికి వాచ్ పెట్టుకుని మొహానికి మేకప్ వేసుకొని వితౌట్ బింది అందంగా రెడీ అయి వచ్చింది......

నీతూ రామ్ కోసం వెయిట్ చేస్తూ సిక్స్ కల్లా పార్టీలో అటెండ్ అయింది..... తను వచ్చిన పావుగంట తర్వాత సీత రామ్ పక్క పక్కనే రావటం చూసి కొంచెం అసహనంగా అనిపించిన ఈరోజు ఎలాగైనా రామ్ తనకి ప్రపోజ్ చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్ లో ఉంది...... కానీ రామ్ కి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుని తన కంటే ముందే నీతూనే ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయింది..... అలా రామ్ సీత నుంచి కొంచెం పక్కకి రాగానే తనని మాటలతో ఎంగేజ్ చేసి తన దగ్గరే ఉంచేసుకుంది......

సీత రామ్ చెప్పినట్టు అడ్డమైన డ్రింక్స్ అన్ని ముట్టుకోకుండా తన ఫ్రెండ్స్ తాగే జ్యూస్ తీసుకుని తాగుతూ అప్పుడప్పుడు రామ్ వైపు చూసి కళ్ళతోనే నవ్వుతూ ఉంటే రామ్ కూడా సీత వైపు అప్పుడప్పుడు చూస్తూ సైట్ కొట్టుకుంటూ ఉన్నాడు.....

పార్టీ మొత్తంలో కల్లా సీత మాత్రమే బ్లాక్ కలర్ సారీ కట్టుకొని అందమైన ఏంజెల్లా కనిపిస్తూ ఉంటే పెళ్లి కానీ మగవాళ్ళందరూ సీతకి లైన్ వేసుకుంటూ ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే రామ్ కి ఎక్కడో కాలి కోపం వచ్చి సీత దగ్గరికి వెళ్దాము అనుకున్నా నీతూ వదలకు పోవడంతో ఇదంతా జస్ట్ ఒక హాఫ్ n అవర్ మాత్రమే తర్వాత అందరికీ తమ రిలేషన్ గురించి తెలిసిపోతుంది కాబట్టి ఎవరు సీత వైపు చూసే ధైర్యం చేయరు అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు.....

అలా పార్టీ స్టార్ట్ అయ్యాక ముందుగా అందరూ వచ్చారని ఫిక్స్ అయిన కృష్ణ అక్కడే అరేంజ్ చేసిన చిన్న డయాస్ మీదకి వెళ్లి “ ఎటెన్షన్ ఎవరీవన్.... ఈ పార్టీ ఎందుకనేది మీకు తెలుసు అనుకుంటా!!! తెలిసినా చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను మిస్టర్ అభిరామ్ మన న్యూ టీం లీడర్ చేసిన ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యి ఆ కంపెనీ నుంచి మరో ప్రాజెక్ట్ మనకి వచ్చింది...... అది కూడా అభిరామ్ కే వచ్చింది సో కంగ్రాట్యులేట్ టు హిమ్..... “ అని అన్నారు

అందరూ క్లాప్స్ కొడుతూ దగ్గర ఉన్నవాళ్లు కంగ్రాట్స్ అని గట్టిగా అరుస్తూ ఉంటే రామ్ సంతోషంగా థాంక్యూ అని చెప్పాడు..... సీత తన భర్తని అంతమందిలో పొగుడుతూ ఉంటే ఎక్కడి లేని సంతోషం వచ్చి నవ్వుతూ చూస్తూ ఉంది......

కృష్ణ రామ్ ని డయాస్ మీదకు పిలిపించి “ ఇతనిని టీం లీడర్ చేసేటప్పుడు చాలామందికి చాలా అనుమానాలు వచ్చాయి..... ఇంత తక్కువ టైంలో టీం లీడర్ ని ఎలా చేస్తున్నారు??? అని మీ మనసులోనే అనుకున్నారు కానీ నా వరకు తీసుకురాలేదు..... నేను మీరు అనుకున్న వాటికి సమాధానంగా అభి చేసిన ప్రాజెక్ట్ ని చూపించాలి అనుకున్నాను చూపించాను.....

నా ట్రస్ట్ ని అభి పోగొట్టలేదు కంగ్రాట్స్ అభి..... అలాగే ఇప్పటినుంచి నీకు హైక్ అండ్ ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు నా తరఫునుంచి చిన్న గిఫ్ట్..... “ అంటూ కార్ కిస్ అభి చేతిలో పెట్టి హైక్ వచ్చిన లెటర్ కూడా అభి చేతిలో పెట్టాడు

అభి సంతోషంతో కళ్ళు మెరిసి “ థాంక్యూ సార్ “ అని కృష్ణ చేతిలో మైక్ తీసుకొని “ ఈ సక్సెస్ నాది మాత్రమే కాదు మన కంపెనీ సక్సెస్ కూడా..... నా టీంలో ఉన్న టీమ్ మెంబర్స్ అందరూ నాకు ఎప్పుడూ తోడుగా ఉండటం వలన ఇన్ టైంలో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను..... అందుకే నా సక్సెస్ ని నా టీమ్ మెంబర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను..... “ అనగానే అందరూ ఓ అని గట్టిగా అరిచారు

వాళ్ల అరుపులు అయిపోయాక రామ్‌ నవ్వుతూ “ అలాగే ఈరోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకుంటున్నాను..... ఇట్స్ అబౌట్ మై లైఫ్..... ఈ విషయం మీకు ఇన్నాళ్లు చెప్పకుండా దాచినందుకు సారీ బట్ ఇప్పుడు చెప్పి ఒకరిని సర్ప్రైజ్ చేయాలని ఇంతవరకు ఆగాను..... “ అని మాట్లాడుతూ ఉండగానే

నీతూ తనకే ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాడు అని భ్రమపడి తనకంటే ముందే ప్రపోజ్ చేయడానికి ఆనందంగా పైకి వచ్చి అభి అంటూ వన్ ఇస్ మీద కూర్చుని రోజ్ ఫ్లవర్ పెట్టుకొని “ నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో!!!! కానీ అంతకంటే ముందు నేనే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను.....

అందుకే ఇదంతా అంటూ ఐ లవ్ యు అభి లవ్ యు సో మచ్...... కాలేజ్ టైం నుంచే నిన్ను ప్రేమిస్తున్నాను నాకు తెలుసు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని కానీ కరెక్ట్ టైం రాలేదని నువ్వు చెప్పలేదు నేను చెప్పలేదు.....

బట్ ఇదే కరెక్ట్ టైం అని నాకంటే ముందే నువ్వు నాకు ప్రపోజ్ చేయాలి అనుకున్నావు కానీ నేనే నీకు ముందు ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యి ఇలా నిన్ను సర్ప్రైజ్ చేస్తున్నాను..... యాక్సెప్ట్ మై లవ్ అభి..... “ అని రామ్ కి షాక్ ఇచ్చింది

అసలు రామ్ కి ఎలా రియాక్ట్ అవ్వాలి అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి నీతూ వైపే చూస్తూ ఉంటే సీతకి రామ్ ఇవ్వబోయే సర్ప్రైజ్ అదేమో అని భ్రమ పడి మనసు ముక్కలవుతున్న బాధ కలిగి ఇక అక్కడ ఉండటం అనవసరం అనుకుని కన్నీళ్ళతో అదంతా చూసి అక్కడ నుంచి బయటికి వెళ్ళటానికి వెనక్కి తిరిగింది..... కృష్ణ అయోమయంగా రామ్ వైపు చూస్తూ తన భుజం మీద చేయి వేసి కదిలించి “ అభి ఏంటి ఇదంతా??? ముందు సీత వెళ్ళిపోతుంది చూడు..... “ అని అన్నాడు

అప్పుడు రామ్ స్పృహలోకి వచ్చి కంగారుగా సీత అని గట్టిగా పిలిచి సీత ఏడుస్తున్న కళ్ళతో తనువైపు చూడగానే మనసు చివుక్కుమని వన్ మినిట్ అంటూ నీతూ ని పైకి లేపి నీతూ “ నీకెందుకు ఇలా అనిపించిందో నాకు తెలియదు కానీ నేను నిన్ను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు...... నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంతకుమించి ఏమీ కాదు.....

బహుశా నేను చూపించిన కేరింగ్ నీకు ప్రేమగా కన్వర్ట్ అయిందేమో కనీసం ఆ విషయం కూడా నాకు తెలియదు..... యాస్ ఏ ఫ్రెండ్ నేను నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చానే తప్ప లైఫ్ పార్ట్నర్ గా ఎప్పుడు ఊహించలేదు..... ఊహించుకోలేను కూడా ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్లయింది...... “ అని అక్కడ అందరికీ వినిపించేంత అన్నాడు

రామ్ అనే ఒక్కొక్క మాట నీతూ మనసుని ముక్కలు చేస్తూ ఉంటే కన్నీళ్ళతో రామ్ వైపు చూస్తూ “ అబద్ధం చెప్తున్నావు కదా అభి??? నాకు తెలుసు నువ్వు అబద్దం చెప్తున్నావని...... నువ్వు ఏ అమ్మాయితోనూ క్లోజ్ గా లేవు ఒక్క నాతో తప్ప అది కాలేజ్ టైం నుంచి...... మనం ఫ్రెండ్స్ అయినప్పటి నుంచి నీ ప్రతి ఒక్క విషయం నాతో షేర్ చేసుకునే వాడివి.....

ఆఖరికి నీ మరదలు మీద ఉన్న కోపంతో సహా!!! పైగా నాకు చిన్న జలుబు చేసిన ఎలా ఉంది ఇప్పుడు అంటూ ఫోన్ చేసి మరి అడిగే వాడివి..... ఇదంతా ప్రేమ కాక ఇంకేంటి??? జోక్ చేయకు అభి నేను ఈజీగా తీసుకోలేను ప్లీజ్..... “ అని దీనంగా అడిగింది

“ నో నో నీతూ నేను జోక్ చేయటం లేదు ఐ యాం సీరియస్..... నేను నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు...... “ అని సీత వైపు వేలు పెట్టి చూపించి “ తను నా మరదలు నీకు చెప్పాను కదా నా మరదలు తో పాటు తనే నా భార్య..... “ అంటూ సీతని రమ్మని కళ్ళతోనే పిలవగానే సీత ఏడుపు మొహంతోనే పైకి వచ్చి నీతూ వైపు రామ్ వైపు మార్చి మార్చి కోపంగా చూసింది

రామ్ సీత భుజం చుట్టూ చేయి వేసి కృష్ణ చేతిలో ఉన్న మైక్ తీసుకుని “ నేను మీ అందరికీ సీతని నా భార్యగా పరిచయం చేసి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కానీ అనుకోని విధంగా నాకే షాక్ తగిలింది...... షి ఇస్ మై వైఫ్ రీసెంట్లీ నేను పెళ్లి చేసుకున్నాను..... తను నా అత్త కూతురు నా మరదలు అండ్ దానితోపాటు నేను సీతని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను....... తిను నా భార్య సీత అభిరామ్ సీత మహాలక్ష్మి...... “ అని గట్టిగా చెప్పాడు


ఇంకా ఉంది......

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......