Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 18

నీతూ రామ్ తో మాట్లాడదామని సాయంత్రం వరకు వెయిట్ చేసి రామ్ సెల్లార్ లోకి రాగానే రామ్ అని అరుస్తూ తన దగ్గరికి వెళ్లి “ రామ్ ఆరోజు షాపింగ్ మాల్ లో కనిపించిన అమ్మాయి అదే నీతో కనిపించిన నీ మరదలు ఈరోజు మన కంపెనీకి వచ్చింది కదా!!! ఎందుకు??? పైగా నీ క్యాబిన్ కి మేనేజర్ సార్ తీసుకువచ్చారు ఎందుకు???? ఆ తర్వాత మేనేజర్ సార్ వెళ్లిపోయిన మీ ఇద్దరే చాలాసేపు క్యాబిన్లో ఉండిపోయారేంటి??? అంతేకాకుండా లంచ్ అవర్ కూడా నీ దగ్గరే ఉంది ఎందుకు??? “ అని పిచ్చి ప్రశ్న వేసింది

@@@@@@@

నీతూ ప్రశ్నకి రామ్ కి కోపం వచ్చినా తనకేమీ తెలియదని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ “ ఎమీ లేదు తను ఈ కంపెనీలోనే జాయిన్ అయింది నేను కొత్తగా స్టార్ట్ చేసే ప్రాజెక్ట్ లో తాను కూడా నీతో పాటు ఒక మెంబర్...... అందుకే పరిచయం చేయటానికి మేనేజర్ సార్ తీసుకువచ్చారు...... మధ్యాహ్నం లంచ్ తను తెచ్చుకోపోతే నేను పిలిపించాను అంతే!!!! “ అని క్యాజువల్ గా అన్నాడు

అవునా అని నీతూ ఆశ్చర్యంగా మొహం పెడితే “ సీత నాకు కూడా తను ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నట్టు చెప్పలేదు ఇక్కడికి వచ్చాకే తెలిసింది...... కానీ హ్యాపీగా ఉంది వేరే ఎక్కడో తన జాబ్ చేస్తూ ఉంటే తనని ఎవరైనా ఏమైనా అంటారేమో!!!! లేకపోతే కొత్తగా వచ్చిందని టీజ్ చేస్తారేమో!!!! లేకపోతే ఏదైనా ఇబ్బందుల్లో ఇరుక్కుంటుందేమో అని అని నేను ప్రతిరోజు టెన్షన్ పడాలి ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు...... “ అని సంతోషంగా అన్నాడు

“ ఓకే అయితే తను ఇప్పుడు హాస్టల్ లో ఉంటుందా??? అలా అయితే తను అక్కడ ఇబ్బంది పడుతుంది కదా అంత ఇబ్బంది పడటం ఎందుకు నాతో పాటు నా ఫ్లాట్ షేర్ చేసుకోవచ్చు నాకు అభ్యంతరం లేదు...... “ అని ఫ్రీ ఆఫర్ ఇచ్చింది

“ అవసరం లేదు తన బాధ్యత మా అమ్మ నాన్న తన అమ్మ నాన్న నాకు అప్పగించారు కాబట్టి తను నాతోనే ఉంటుంది నా ఫ్లాట్లో...... “ అని కొంచెం ఘాటుగానే అన్నాడు

నీతూ అసహనంగా “ అలా చేస్తే వయసులో ఉన్న అబ్బాయి అమ్మాయి ఓకే ఫ్లాట్లో అది పెళ్లి కాకుండా ఉన్నారు అంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదా!!! పైగా సీత ఆడ పిల్ల తన గురించి ఎంతమంది తప్పుగా అనుకుంటారు చెప్పు??? అందుకే సేఫ్ సైడ్ నాతో ఉండమని చెప్తున్నాను...... “ అని అంది

“ ఎవరో ఏదో అనుకుంటారని అందరికీ భయపడుతూ బ్రతకలేం కదా నీతూ??? అయినా సీతకి లేని బాధ నీకెందుకు చెప్పు???? తనే నాతో ఉండటానికి ఎటువంటి ఇబ్బంది చూపించడం లేదు కాబట్టి ఇక ఈ డిస్కషన్ ఇంతటితో ముగిస్తే బెటర్..... నాకు దీని గురించి మాట్లాడటం ఇష్టం లేదు..... “ అని అన్నాడు

“ ఓకే మీ ఇష్టం నేను ఈ సండే మీ ఫ్లాట్ కి రానా??? ఇద్దరిదీ దగ్గర దగ్గర అపార్ట్మెంట్స్ అయినా కలవడానికి కుదరటం లేదు కదా ఊరుకుల పరుగుల జీవితం అయిపోతుంది అందుకే అడిగాను!!!! “ అని అంది(యాక్చువల్గా రామ్ తన అపార్ట్మెంట్ కి అంత త్వరగా ఎవరిని రానివ్వడు ముఖ్యంగా అమ్మాయిలని...... రామ్ కి ఎక్కువగా అమ్మాయిలలో ఫ్రెండ్స్ లేరు కాలేజ్ టైం నుంచి నీతూ ఒక్కటే అయితే ఆఫీస్ లో మాత్రం లేడీ ఎంప్లాయిస్ తో నార్మల్గా మాట్లాడుతాడే కానీ ఎవరి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోడు..... ఒక్క సీత దగ్గర తప్ప.....)

“ ఓకే బట్ ఈ సండే కాదు నెక్స్ట్ సండే నేను అందరిని నా ఇంటికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాను అప్పుడు వద్దువులే..... ఎందుకంటే ఈ సండే ప్రాజెక్ట్ కి సంబంధించిన పార్టీ ఉంది కదా ఆరోజు నా తరఫునుంచి అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది ఆ తర్వాత అందర్నీ డిన్నర్ కి ఇంటికి పిలవాలి అనుకుంటున్నాను....... అప్పటివరకు నేను బిజీగా ఉంటాను...... “ అని నవ్వుతూ అన్నాడు రామ్

“ ఏం సర్ప్రైజ్ అభి నాకు చెప్పొచ్చు కదా??? “ అని క్యూరియస్ గా అడిగింది నీతూ

“ చెప్పేదే అయితే ఇంతసేపు ఆగను కదా నీతూ??? సర్ప్రైజ్ అన్నాక సర్ప్రైజే పార్టీ రోజే అది రీవీల్ అవుతుంది..... “ అని అన్నాడు రామ్

నీతూ మనసులో “ ఏం సర్ప్రైజ్ అయి ఉంటుంది ఒకవేళ నాలాగే అభి కూడా నన్ను ప్రేమిస్తున్నాడా??? అందుకే ఆరోజు అందరి ముందు ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాడా??? అవును అదే అయ్యుంటుంది అభి నాతో తప్ప ఎవరితోనూ అంతగా కలవడు కదా????

కాబట్టి నన్ను ప్రేమిస్తున్నాడు..... ఎన్నాళ్ళ నుంచో నేను ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను...... అది ఇన్నాళ్లకు వచ్చింది..... అవును నేనే ఎందుకు ముందు అభికి ప్రపోజ్ చేయకూడదు??? ఎస్ ఆరోజు అభి కంటే ముందు నేనే తనకి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేస్తాను...... తను ఆశ్చర్యపోయి సంతోషంతో ఉబ్బి తబ్బిబైతైపోవాలి..... “ అని అనుకుంటూ తన లోకంలో తను ఉంది

(నీతూ కాలేజ్ టైం నుంచి రామ్ ని ప్రేమిస్తుంది కానీ తనకి చెప్పే ధైర్యం లేక ఇన్నాళ్లు ఆగింది...... రామ్ తన మీద చూపించే కేరింగ్ ని ప్రేమ అని పొర బడుతుంది...... ఇప్పుడు రామ్ కి పెళ్లయిందని తెలిస్తే ఏమైపోతుందో పాపం???)

“ సరే ఇక నాకు లేట్ అవుతుంది ఇంటికి వెళ్లాలి సీత ఒక్కటే ఉంది కదా!!! “ అని నవ్వుతూ చెప్పి తన బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు

నీతూ కూడా రామ్ తనని ప్రేమిస్తున్నాడన్న ఊహల్లో విహరిస్తూ తన స్కూటీ మీద తన ఫ్లాట్ కి వెళ్ళిపోయింది......

ఇంటికి వెళ్లేసరికి సీత రామ్ కోసం వేడివేడిగా పుణుగులు వేసి అందులోకి టమాటా చట్నీ చేసి పెట్టి ఉంచింది.....

రామ్ ఇంట్లోకి అడుగు పెట్టడమే గుమగుమలాడే వాసన వస్తూ ఉంటే “ సీత ఈరోజు ఏం చేసింది??? “ అనుకుంటూ లోపలికి వచ్చిన రామ్ కి సీత వెలిగిపోతున్న మొహం కనిపించి “ ఇదంతా జాబ్ వచ్చినందుకేనా??? “ అని తన షూస్ తీస్తూ అడిగాడు

“ లేదు నీతో పాటు వర్క్ చేస్తున్నందుకు!!! ముందు వెళ్లి ప్రెష్ అయ్యి రా బావ నీకోసం నీకు ఇష్టమైన పునుగులు చేశాను...... “ అని ఎక్సైటింగ్ గా ఉంది

“ అవునా అయితే ఫైవ్ మినిట్స్ వెంటనే వచ్చేస్తాను..... “ అని లాప్టాప్ బ్యాగ్ తీసుకొని కంప్యూటర్ టేబుల్ మీద పెట్టేసి ఫ్రెష్ అవ్వటానికి నైట్ ట్రాక్ తీసుకొని వాష్ రూమ్ లోకి వెళ్లిపోయాడు

సీత కూడా ఆ పునుగులని ఒకే ప్లేట్లో సర్ది చెట్ని పెట్టుకుని బయటికి వచ్చింది......

రామ్ వచ్చాక రామ్ చేతికి ప్లేట్ ఇచ్చి “ తిని చెప్పు బావ ఎలా ఉన్నాయో??? “ అని అడిగింది

“ అన్ని ప్రయోగాలు నా మీదేనే బెడిసి కొడితే ఏం లేదు నేను బెడ్ కి అంకితం అవుతాను..... “ అని వెటకారంగా అంటూనే ఒకటి తిని టెస్ట్ బాగానే అనిపించడంతో బాగున్నాయి అని అనగానే రామ్ నోట్లో పెట్టుకోబోయేది సీత తన నోట్లో పెట్టించుకుని “ చాలా బాగున్నాయి వంట ప్రయోగాలలో ఈమధ్య సక్సెస్ అవుతున్నాను కదా బావ??? “ అని వెలిగిపోతున్న మొహంతో అడుగుతుంది

“ హా అవును సక్సెస్ అవుతున్నావు కానీ ఆ ప్రయోగాలకి కొన్నిసార్లు బాలయ్యది నేనే కదా!!! నీకేం చేసి పెట్టి నా కడుపులోకి తోస్తావు..... “ అని నిష్టూరంగా మాట్లాడుతూనే ఇద్దరూ ఆ ప్లేట్ పుణుగులని షేర్ చేసుకుని తినేసి ప్లేట్ షింక్ లో వేసి వచ్చాక సీతని తన పక్కన కూర్చోబెట్టుకొని

“ రేపటి నుంచి ఆఫీస్ కి వస్తున్నావు కాబట్టి అందరిని ఊరికే నమ్మేయకు..... జాగ్రత్తగా ఉండు...... ఎప్పుడు నేను నీ పక్కనే ఉండను అర్థమైందా???? అలాగే ఎవరితోను నీ పర్సనల్ స్పేస్ లోకి వచ్చేంత స్నేహం చేయకు అందరూ మంచివారు అయ్యుండరు..... నువ్వు స్నేహం కొద్ది మాట్లాడిన వాళ్ళు అది మరోరకంగా అనుకునే ప్రమాదం కూడా ఉంది..... “ అని జాగ్రత్తలు చెప్తూ ఉన్నాడు

“ హహహ బావ నువ్వు ఉండగా నాకెందుకు భయం??? పటిక్యులర్గా నువ్వు వర్క్ చేస్తున్న కంపెనీలోనే నేను జాబ్ తెచ్చుకున్నది ఎందుకో తెలుసా???? నా సేఫ్టీ కోసం నువ్వు నాతో పాటు ఉంటే నాకు చిన్న నొప్పి కూడా కలిగినివ్వకుండా చూస్తావన్న నమ్మకం...... “ అని నమ్మకంగా అంది

“ హా సరేలే ఈ మాటలకు ఏమీ తక్కువ లేదు..... “ అని చెప్పి సరదాగా మాట్లాడుకుండు డిన్నర్ చేసేసి నైట్ కూడా ప్రశాంతంగా ఒకరి కౌగిలిలో మరొకరు నిద్రపోయి తర్వాత రోజు తన కాలేజ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యి కాకపోతే వేరే టీంలో సెలెక్ట్ అయ్యారని ట్రైనింగ్ మాత్రం అందరికీ ఒకేసారి అని తెలిసి తన ఫ్రెండ్స్ తో మాటల్లో పడిపోయింది......

సీత ఫ్రెండ్స్ ప్రియా రాగిణి మౌనిక భాను వీళ్ళు నలుగురు సీతతో పాటే ఆ కంపెనీలోనే జాబ్ సంపాదించారు..... కాకపోతే వేరే వేరే టీమ్స్ లో ప్రియా రాగిణి ఒక టీం లో పడితే మౌనిక భాను మరొక టీంలో పడ్డారు...... వీళ్ళు నలుగురు హాస్టల్లో జాయిన్ అయితే సీత తన బావతో కలిసి తన అమ్మ నాన్నల బలవంతం మీద ఉంటున్నానన్నట్టు కలరింగ్ ఇచ్చింది కానీ ఆ బావ రామ్ అని ఎవరికి తెలియనివ్వలేదు.....

సీత ఫ్రెండ్ అయినా రాగిణి రామ్ ని చూసి చూడగానే ఫ్లాట్ అయ్యి తనతో మాటలు కలుపుదాం అనుకున్న రామ్ కనీసం తనవైపు కూడా చూడకపోయేసరికి డల్ అయిపోయింది..... కానీ ఎవరికీ తను రామ్ కి ఎట్రాక్ట్ అయిందన్న విషయం తెలియనివ్వలేదు......

అలా రోజులు గడిచిపోతూ రామ్ సీతని తన బైక్ మీద ఆఫీస్ కి తీసుకు వెళ్తాను అన్న సీత వద్దని వాళ్ళ రిలేషన్ బయటపెట్టే వరకు ఎవరికి వారుగా వెళ్దాం అని చెప్పి డైలీ సీత క్యాబ్లో వెళ్తుంటే రామ్ తన వెనకే బైక్ మీద ఫాలో అవుతూ ఆఫీస్ కి వెళ్తున్నాడు......

అమిత్ ఎన్నిసార్లు సీతకి సారీ చెప్పాలని ట్రై చేసిన సీత అమిత్ మీద కోపంతో ఎవాయిడ్ చేస్తూ వస్తుంది.....

మరోవైపు లంచ్ కూడా సీత తన ఫ్రెండ్స్ తో తినమన్నా అమ్మానాన్నలు క్యాంటీన్ ఫుడ్ బయట ఫుడ్ తినొద్దు అని వార్నింగ్ ఇచ్చారు అందుకే నేను బాక్స్ తెచ్చుకున్నాను ఇక్కడే తింటాను అని బలవంతంగా వాళ్ళని కాంటీన్ కి పంపించి హ్యాపీగా లంచ్ కూడా రామ్ తో పాటు రామ్ క్యాబిన్లోనే చేస్తూ ఉంటే అది చూసిన నీతూకి రోజు రోజుకి అసహనం పెరిగిపోతూ వాళ్ళిద్దరూ జస్ట్ బావ మరదళ్ళు మాత్రమే అంతకుమించి ఏమీ లేదు అని మనసుకు సర్ది చెప్పుకుంటూ ఉంది......

అలా రోజులు గడిచిపోతూ పార్టీ జరిగే రోజు రానే వచ్చింది..... ఆరోజు మధ్యాహ్నం నుంచి అందర్నీ ఇంటికి వెళ్లిపోమని చెప్పి షార్ప్ ఫిక్స్ కల్లా పార్టీ జరిగే హోటల్ కి రమ్మని కృష్ణ అందరికీ ప్యూన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో అందరూ సంతోషంగా ఎవరి ఇళ్ళకి వాళ్ళు ఎవరి హాస్టల్స్ కి వాళ్ళు ఎవరి ఫ్లాట్స్ వాళ్ళు వెళ్లిపోయారు......


ఇంకా ఉంది......

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......