Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఒరేయ్ బావ - ఒసేయ్ మరదలా - 15

ఓకే ఆ రోజు నేనే నిన్న ఆఫీసులో డ్రాప్ చేస్తాను సరేనా!!!!! “ అని చెప్పి అలా మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇద్దరు హ్యాపీగా నిద్రపోయారు

అలా నాలుగు రోజులు రామ్ ఆఫీస్ కి వెళ్తే సీత ఇంట్లో ఉంటూ తన వాళ్లతో అప్పుడప్పుడు మాట్లాడుతూ డైలీ యూట్యూబ్లో చూస్తూ రకరకాల వంటలు తయారు చేస్తూ రామ్ మీద వాటిని ప్రయోగిస్తూ ఉంటే రామ్ వాటికి బలవుతూ ఉన్నాడు......

@@@@@@@

ఈ నాలుగు రోజుల్లో రామ్ చేసే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి సబ్మిషన్ కూడా అయిపోయి ఈ టైం లో క్వాలిటీ బాగా ఉండేలా చేశాడు అని కాంప్లిమెంట్ రాగానే అందరూ రాముని పొగడ్తలలో ముంచేశాడు రామ్ కి కూడా తన వర్కింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్నందుకు సంతోషించాడు...... సాయంత్రం ఇంటికి వచ్చేసాక సీతకీ తనే స్వయంగా వంట చేసి పెట్టి పార్టీ ఇచ్చాడు.....

ఆ ప్రాజెక్ట్ చాలా బాగా చేయడం వలన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా రామ్ నే చేయమని ఆ కంపెనీ వాళ్ళు చెప్పేసరికి కృష్ణ కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు.....

ఆ ప్రాజెక్ట్ కోసం కొత్తగా వస్తున్న వాళ్లని ట్రైనింగ్ ఇచ్చి ఇద్దరిని రామ్ టీంలోకి పంపించమని మేనేజర్ కి ముందుగానే చెప్పాడు ఎండి...... ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి వన్ మంత్ పైనే ఉందని కొత్త వాళ్ళలో ఇద్దరిని రామ్ కింద వేస్తే వాళ్లు కూడా వర్క్ నేర్చుకుంటారు అనుకున్నాడు కృష్ణ......

అలా సీత ఆఫీస్ లో జాయిన్ అయ్యే రోజు రానే వచ్చింది ఉదయాన్నే సీత హడావిడిగా రెడీ అవుతూ ఉంటే రామ్ సీత హడావిడి కి నవ్వుకుంటూ తనే టిఫిన్ ప్రిపేర్ చేసి “ మరీ అంత హడావిడి పడకు ఎవరికైనా ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ అంటే కొంచెం టెన్స్ ఉంటుంది..... “ అని నవ్వుతూ అంటూనే టిఫిన్ సీతకి తన చేతులతో స్వయంగా పెట్టాక రెడీ అయ్యి రమ్మని చెప్పి సీత వాష్ రూమ్ లోకి వెళ్ళగానే

తను కూడా టిఫిన్ చేసి సీత కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు..... సీత జీన్స్ అండ్ టీ షర్ట్ జర్కిన్ లో బయటికి రాగానే రామ్ ముందు షాక్ అయినా తర్వాత కళ్ళు మెరిసి “ ఏంటే ఇది??? ఈ డ్రెస్ లో ఆఫీసుకు వస్తావా నువ్వు??? నేను ఒప్పుకోను వెళ్లి పద్ధతిగా పంజాబీ డ్రెస్ వేసుకో పో..... “ అని కసిరాడు

“ ఏం బావ ఇది బాగోలేదా??? ఎక్కువగా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు ఇవే వేసుకుంటారు కదా!!! “ అని అయోమయంగా అడిగింది సీత

“ అందరి గురించి మనకెందుకు మన సంగతి మనం చూసుకోవాలి కానీ!!! ముందు నువ్వు నేను చెప్పినట్టు చేయ్.... “ అని చెప్పేసి సీతని బలవంతంగా మళ్లీ బెడ్ రూమ్ లోకి పంపించి హమ్మ అంటూ గుండెల మీద చేయి వేసుకొని “ ఇది ఇలా రెడీ అయ్యి వెళ్తే దీని వెనకే ఆఫీస్ స్టాఫ్ మొత్తం పడతారు...... బాబోయ్ అలా జరిగితే ఎలా??? “ అనుకుంటూ

సీత తిరిగి పాటియాలో రెడీ అయ్యి రాగానే పద్ధతిగా కనిపించి “ ఇప్పుడు బాగున్నావు “ అంటూ పాపిడి కుంకుమ పెట్టబోతుంటే సీత ఆపి “ చెప్పాను కదా బావ నువ్వు మన రిలేషన్ ని అనౌన్స్ చేసే వరకు నేను కూడా అనౌన్స్ చేయనని!!! అప్పటివరకు ఇంతే!!!! “ అంటూ

కాళ్ళకి సాక్స్ వేస్తూ ఉంటే “ అవి ఎందుకు??? “ అని అడిగాడు “ మరి మెట్టెలు కనిపించకుండా ఉండాలంటే ఇవి వేసుకోవాలి కదా బావ!!! “ అని సీత అనగానే నవ్వుకుంటూ “ మన రిలేషన్స్ అనౌన్స్ చేయడానికి ఎక్కువ రోజులు లేదులే!!! “ అనుకుంటూ రామ్ కూడా రెడీ అయ్యి రాగానే

“ ఓకే బావ నేను బయలుదేరుతాను ఆల్రెడీ క్యాబ్ బుక్ చేసుకున్నాను...... “ అనగానే “ ఓయ్ అదేంటే నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని చెప్పాను కదా!!!! మరి నువ్వు క్యాబ్లో వెళ్లడం ఏంటి??? “ అని అడిగాడు

“ నీకు లేట్ అవుతుంది బావ చూడు టైమెంతయిందో!!! “ అని టైం చూపించి “ అందుకే క్యాబ్ బుక్ చేసుకున్నాను...... నువ్వు ఆఫీస్ కి వెళ్ళిపో నేను వెళ్తాలే...... “ అని తన ఫైల్ సర్దుకుంటూ అంది

“ ఏం పర్లేదు లేట్ అయితే లేట్ అయింది...... నాకు ఆఫీస్ లో పెద్దగా వర్క్ కూడా లేదు...... నిన్ను నేనే ఆఫీస్ లో డ్రాప్ చేస్తాను ఆల్రెడీ అమ్మ వాళ్లకి కూడా చెప్పాను అమ్మ వాళ్లు కూడా మరీ మరీ చెప్పారు నిన్ను నేనే ఆఫీసు తీసుకువెళ్లి తీసుకురావాలని!!!! కాబట్టి ఎక్కువ చేయకుండా నోరు మూసుకొని పదా..... “ అని అన్నాడు

“ అబ్బ బావ ప్లీజ్ చెప్పేది అర్థం చేసుకో!!!! నీతో పాటు నేను ఆఫీస్ కు వస్తే అందరూ నిన్ను ఎవరు నీతో పాటు నేను ఎందుకు వచ్చాను లవర్ ఏమో అని అనుకుంటారు!!! వాళ్ళకి అంత స్కోప్ మనం ఎందుకు ఇవ్వాలి చెప్పు??? అందుకే చెప్తున్నాను ప్లీజ్ ప్లీజ్ బావ ఈ ఒక్కసారికి నా మాట విను...... నువ్వు వెళ్ళు నేను నా ఆఫీస్ కి వెళ్తాను..... “ అని బలవంతంగా రామ్ ని ఒప్పించి ఆఫీస్ కి పంపించి హమ్మయ్య అనుకుంటూ గుండెల మీద చేయి వేసుకొని వెనకే వచ్చిన క్యాబ్లో తను బయలుదేరి ఆఫీస్ కి వెళ్ళింది

రామ్ సీత కంటే ఒక పది నిమిషాల ముందు ఆఫీస్ లోకి వెళ్లిన రామ్ తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు...... ఆ పది నిమిషాల తర్వాత రామ్ ఆఫీసు ముందు సీత క్యాబ్ ఆగింది......

సీత ఆఫీస్ మొత్తాన్ని పైనుంచి కింద వరకు చూసి “ బాబోయ్ బావ ఇంత పెద్ద ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాడా???? నేను అసలు అనుకోలేదు బట్ ఎనీవే బావ కంపెనీలో కావాలని జాబ్ సంపాదించాను..... హహహ ఈ విషయం బావకి తెలీదు కదా సర్ప్రైజ్ ఇద్దాం..... “ అనుకుంటూ నిదానంగా లోపలికి వెళ్లి రిసెప్షనిస్ట్ కి జాయినింగ్ లెటర్ చూపిస్తే రిసెప్షనిస్ట తనని మేనేజర్ దగ్గరికి వెళ్ళమని ఆయనే అన్ని చెప్తారని క్యాబిన్ ఎక్కడో చెప్పగానే సీత మేనేజర్ క్యాబిన్ వెతుక్కుంటూ వెళ్ళింది......

మధ్యలో సీత నీ చూసిన ఆఫీస్ స్టాఫ్ లో అమ్మాయిలు సీత అందాన్ని చూసి జలస్ ఫీల్ అయితే అబ్బాయిలు వావ్ అనుకోకుండా ఉండలేకపోయారు...... సీత గ్రీన్ కలర్ టాప్ కి పింక్ కలర్ బోటమ్ వచ్చి పింక్ కలర్ చున్నీ వేసుకొని మెడలో సింపుల్ చైన్ తాళిని దాచేసి నుదుటన చిన్న ఎర్రటి బొట్టు దాని కింద పూజ చేసిందని దానికి గుర్తుగా కుంకుమ బొట్టు చేతులకి అటు ఇటు బంగారు గాజులు ఉంటే మధ్యలో పింక్ కలర్ నార్మల్ గాజులు నాలుగు నాలుగు వేసుకొని ఉంది.....

ముఖ్యంగా పెదవుల మీద జరిగిన చిరునవ్వు బుగ్గన చొట్టలు నిజమైన అట్రాక్షన్ గా కనిపిస్తూ ఉంటే కాళ్ళకి పట్టీలు ఘల్ ఘల్ అని అంటూ అందరిని సీత వైపుకి చూసేలా చేసి అమాయకంగా కనిపిస్తున్న మొహానికి ముగ్దులు అయిపోయేలా చేసి వావ్ అనుకునేలా చేసింది.......

అందరితో పాటే ఉన్న నితూ కూడా తన గజ్జల సౌండ్ కి తలపైకి ఎత్తి చూడగానే అక్కడ సీతని చూసి షాక్ అయ్యి “ ఈ అమ్మాయి షాపింగ్ మాల్ లో చూసిన అమ్మాయి కదా??? ఇక్కడ ఏం చేస్తుంది??? “ అనుకుంటూ తను మేనేజర్ క్యాబిన్ కి వెళ్ళటం చూసి అయోమయంగా రామ్ తో చెప్పాలి అనిపించినా ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే మళ్లీ తిడతాడని ఆ ప్రయత్నం మానుకుంది

మేనేజర్ క్యాబిన్ కి వెళ్ళిన సీత అతనికి వినియంగా గుడ్ మార్నింగ్ అని విష్ చేసి న్యూ జాయినింగ్ అని చెప్పి తన జాయినింగ్ లెటర్ ఫైల్ ఇవ్వగానే అతను అన్ని పరిశీలించి ఒక గంట పాటు ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయించి ఆ తర్వాత తనని అభిరామ్ టీం లో వేస్తున్నట్టు చెప్తాడు......

అభిరామ్ టీం అనగానే సీత కళ్ళు మెరిసిన వెంటనే తన నార్మల్ చేసుకొని ఓకే అని చెప్పి మేనేజర్ రామ్ దగ్గరికి సీతను తీసుకు వెళ్తూ ఉంటే మేనేజర్ వెనకే వెళుతూ “ ఇప్పుడు బావ నన్ను చూసి కచ్చితంగా షాక్ అవుతాడు.... వావ్ సూపర్..... “ అనుకుంటూ ఉంది

రామ్ క్యాబిన్ కి వెళ్ళిన మేనేజర్ సీతని బయటే ఉండమని చెప్పి లోపలికి వెళ్లి రామ్ కి న్యూ జాయినీ ని నీ టీంలో వేస్తున్నారని చెప్పాడు......

రామ్ అయోమయంగా “ న్యూ జాయినీ నా టీంలో ఏంటి సార్???? నాకసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు పైగా నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి చాలా టైం ఉంది...... “ అని అన్నాడు

“ ఏమో అది తెలీదు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఇద్దరినీ టీంలో వెయ్యమని ఎండి ఆర్డర్ పైగా తక్కువ కాలంలో నువ్వు నీ టాలెంట్ ని ఇంత త్వరగా ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి నీ కింద వాళ్ళకి కూడా బాగా ట్రైనింగ్ ఇస్తావని ఎండి సార్ ఆలోచన..... “ అని అన్నాడు మేనేజర్

రామ్ అయోమయంగా మేనేజర్ వైపు చూస్తూ “ మరి కొత్త వాళ్లకి ప్రాజెక్టు వర్క్ నేర్పించాలంటే టైం పడుతుంది కదా సార్???? ట్రైనర్స్ దగ్గరికి పంపించకుండా డైరెక్ట్ గా నా దగ్గరికి పంపిస్తే వాళ్లకి నేర్పించి నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసరికి లేట్ అవుతుంది కదా!!!! “ అని అడిగాడు

“ వన్ మంత్ తర్వాత నీకు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని సార్ అన్నారు ఈ నెల రోజులు కొత్త వాళ్లకి ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత మీ కింద వేస్తారు..... నేను జస్ట్ నీ టీం లో వేసిన వాళ్లలో ఒకరు వచ్చారు వాళ్ళని నీకు పరిచయం చేద్దామని తీసుకువచ్చాను...... “ అని నవ్వుతూ అన్నాడు మేనేజర్

మేనేజర్ మాటలకి అవి బలవంతంగా పెదవుల మీద నవ్వు తెచ్చుకొని “ ఒకే సార్ రమ్మని చెప్పండి..... “ అనగానే మేనేజర్ అంతవరకు బయట నిలబడి లోపలికి చూడటానికి ట్రై చేస్తూ ఉన్న మొత్తం కర్టెన్స్ వేసి ఉండటం వలన కొంచెం కూడా కనిపించక సైలెంట్ గా ఉన్న సీతని పిలిచాడు......

సీత లోపలికి రావటమే “ గుడ్ మార్నింగ్ సార్.... “ అని రామ్ కి మాత్రమే అర్థమయ్యేలా కన్ను కొట్టి పెదవుల మీద చిలిపి నవ్వుతో అంది

సీతని అక్కడ చూసిన రామ్ షాక్ అయ్యి తర్వాత షేక్ అయ్యి మనసులో “ ఇదేంటి ఇది ఇక్కడ ఉంది??? అంటే దీని జాబ్ నా ఆఫీస్ లో నాకిందేనా??? “ అని అర్థమవ్వగానే కళ్ళు పెద్దవి చేశాడు

ఇంతలో మేనేజర్ “ షీ ఇస్ సీతా మహాలక్ష్మి..... చెప్పాను కదా న్యూ జాయిన్ అని ఈ అమ్మాయే..... ఈ అమ్మాయితో పాటు ఇంకొకరు నీ టీంలో జాయిన్ అవుతారు వాళ్ళు రెండు రోజుల్లో వస్తారు..…. వాళ్ళు వచ్చాక వాళ్ళని కూడా పరిచయం చేస్తాను..... “ అని అన్నాడు

సీత ఏమీ ఎరుగని దానిలా “ హలో సార్ అని అనగానే రామ్ షాక్ నుంచి చేరుకొని నువ్వు అని అంటూ ఉంటే మేనేజర్ అయోమయంగా “ చెప్పాను కదా మళ్లీ నువ్వేంటి అని అడుగుతావేంటి??? * అని అన్నాడు

అభి అప్పుడు చేరుకొని పళ్ళు బిగపెట్టి “ ఒకే సార్ నేను తనతో కొంచెం సేపు మాట్లడి పంపిస్తాను..... “ అనగానే “ ఓకే అభి డైరెక్ట్ గా తనని ట్రైనర్ దగ్గరికి పంపించేయ్..... “ అని చెప్పి మేనేజర్ వెళ్ళిపోయాక క్యాబ్ డోర్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయాక రామ్ సీత దగ్గరికి ఒక్క అడుగు వేస్తూ “ నాకెందుకు చెప్పలేదు నువ్వు ఇక్కడే జాయిన్ అవుతున్నావని??? “ అని అడిగాడు


ఇంకా ఉంది.....

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్......