Truth - 25 books and stories free download online pdf in Telugu

నిజం - 25

Next day morning:

విజయ్ సాగర్ ఇంటికి వెళ్ళాడు .

రాఘవులు : రండి sir కూర్చోండి , తను నా భార్య కాంతం.

విజయ్ : నమస్తే ఆంటీ

కాంతం : నమస్తే బాబు , నీ గురించి సాగర్ చెప్పాడు మీరిద్దరూ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంట కదా .

విజయ్ : అవును ఆంటీ , మీరు నన్ను గుర్తు పట్టి నట్టు లేరు , మీరు సాగర్ వాళ్ల అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను చూసాను .

కాంతం : అలాగా బాబు అప్పుడు మీరంతా చిన్న పిల్లలు కదా , అందుకే పట్టలేదు .

అప్పుడే సాగర్ లోపలి నుండి వచ్చాడు.

సాగర్ : గుడ్ మార్నింగ్ రా.

విజయ్ : ఏరా ఆడ పిల్ల లాగా ఎంత సేపు రా రెడీ అవ్వడం .

సాగర్ : పొద్దున పొద్దునే విజ్జి యోగా చేసే వరకు వదల్లేదు రా బాబు , నీక్కూడా అలాంటి రాక్షస చెల్లి ఉంటే తెలిసేది నా తిప్పలు.

విజయ్ : యోగా చేస్తే మంచిదే కదరా , నన్ను ఫోన్ చేసి పిలిస్తే నేను కూడా వచ్చి యోగా నేర్చుకునే వాడిని కదా .

కాంతం : దానిదేముంది బాబు రెండు రోజుల్లో వూరి నుండి వచ్చేస్తారు గా , అప్పుడు రోజూ వచ్చేయండి , మా విజ్జి యోగా ఆసనాలు చాలా బాగా వేస్తుంది , అది చిన్నప్పుడే అన్ని ఆసనాలు నేర్చుకుంది .

విజయ్ : అలాగే ఆంటీ తప్పకుండా వస్తా 😃

సాగర్ : అరే అనవసరం గా బుక్ అవ్వకు , దాని చేతిలో అయిపోతావు .

కాంతం : రండి బాబూ టిఫిన్ చేద్దురు

విజయ్ : అయ్యో పర్లేదు ఆంటీ నేను చేసే వచ్చాను .

కాంతం : కొంచెం తినండి బాబు మా విద్య పెసరట్టు ఉప్మా చాలా బాగా చేస్తుంది , ఒకసారి టేస్ట్ చూడండి .

సాగర్ : అవున్రా విజ్జి చాలా బాగా చేస్తుంది , రా తిందాం.

విజయ్ : ఇంతకీ విజ్జి ఏది రా కనిపించటం లేదు.

అప్పుడే కిచెన్ లో నుండి బయటకు వచ్చింది విద్య.

విద్య : నా పేరు విజ్జి కాదు విద్య .😠

కాంతం : మేమంతా విజ్జి అనటం విని తను కూడా అన్నాడు దానిలో తప్పేంటి , నువ్వు ముందు లోపలికి వెళ్ళి సరిగా రెడీ అయ్యి రా , గంగ కూడా కాల్ చేసింది ఇందాక .

అక్కడి నుండి తన రూం లోకి వెళ్లి పోయింది విద్య రెడీ అవ్వడానికి .

ఈ విజయ్ చూడడానికి చాలా బాగున్నాడు , మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది , విజ్జి పక్కన ఈడు జోడు బాగుంటాడు , ఈ అబ్బాయిని ఎలా అయినా మంచి చేసుకోవాలి అనుకుంది మనసులో కాంతం .🙄

కాంతం : బాబు నువ్వు ఒక్కడివే ఉంటున్నావ్ అంట కదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరూ రాలేదా బాబు నీతో

విజయ్ : నాన్న గారు కాలం చేసి ఒక సంవత్సరం అయింది ఆంటీ , అమ్మ ఏమో అక్క దగ్గర US లో వుంది , అక్క ఇప్పుడు pregnent , కొన్నాళ్ళు అమ్మ తనకు తోడుగా అక్క దగ్గరే వుంటుంది .

US లో వున్నారు అంటే బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ నే అయి ఉండొచ్చు , ఇంత మంచి సంబంధం మళ్ళీ దొరకదు అని మనసులోనే సంబర పడి పోతుంది కాంతం . 😌

కాంతం : ఇంట్లో సంభందాలు ఏమయినా చూస్తున్నారా బాబు.

రాఘవులు : నువ్వు ప్రశ్నలు అడగడం ఆపి ఆయన్ని ప్రశాంతం గా తిన నివ్వు కాస్త .😐

విజయ్ : అయ్యో పర్లేదు uncle , ఆంటీ ఎంతో ఆప్యాయం గా మాట్లాడుతున్నారు , ఎలాగో విజ్జి రెడీ అయ్యే వరకు వెయిట్ చేయాలిగా అడగనివ్వండి .

కాంతం : ఏం లేదు బాబు ఏదయినా సంబంధం వుంటే చూద్దామని .

విజయ్ : మీ లాంటి మంచి అమ్మాయి వుంటే చూడండి ఆంటీ చేసుకుంటాను.

దీనికి రోజు రోజుకి పైత్యం ఎక్కువయి పోతుంది అనుకున్నాడు మనసులో రాఘవులు.

వీడేన్టి వూళ్ళో ఎవరో అమ్మాయి నచ్చింది అన్నాడు నాతో , ఇప్పుడు అమ్మ తో ఇలా మాట్లాడుతున్నాడు అసలు ఏమైంది వీడికి .

లోపలి నుండి వస్తూనే వీళ్ల మాటలు వింది విద్య.

కాంతం : వచ్చి కూర్చో విజ్జి టిఫిన్ పెడతా నీక్కూడా.

విజ్జి : ఎవరికమ్మ సంబంధం అంటున్నావ్ .

కాంతం : మన విజయ్ కి, ఈ వూరి అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది కదా అని మాట్లాడుతున్నా.😃

విజ్జి : అయితే ఆ చౌదరి గారి అమ్మాయి మొన్ననే పోలీస్ ట్రైనింగ్ ముగించు కోని వచ్చింది , ఆ అమ్మాయిని మాట్లాడు , చక్కగా ఒకే డిపార్ట్ మెంట్ కూడాను .

గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయింది విజయ్ కి , చిరు కోపం తో చూసాడు విజ్జి వైపు .

విజయ్ ని అలా చూసి తల దించుకొని ముసి ముసిగా నవ్వుకుంది విజ్జి.

ఈ తింగరి దానికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు అనుకుంది కాంతం 😕

కాంతం : ఆ పల్లవి ఏమీ బాగోదు , విజయ్ ని చూడు సినిమా హీరో లా వున్నాడు , పెళ్లి అన్నాక ఈడు , జోడు చూడాలిగా .

విజయ్ : థాంక్స్ ఆంటీ నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు మీరు , కొంత మంది అయితే మంచిగా మాట్లాడ టానికి కూడా ఏదో వాళ్ల ఆస్తులు అడిగినట్టు చేస్తారు ఆంటీ .

ఓరకంట విజ్జిని చూస్తూ అన్నాడు విజయ్.

కాంతం : అయ్యో రామా నీ లాంటి మంచి అబ్బాయి తో అలా ఉన్నారంటే ఏం రోగమో మరి వాళ్ళకి.

విజ్జి : 😠 , అమ్మా వేరే వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు .

కాంతం : అయ్యో రామా మనకు కావలసిన అబ్బాయి మన వూళ్ళో వుంటే మనమే కదా పట్టించుకోవాలి , మన కెందుకు అంటే ఎలా.

వూళ్ళో సమస్యల్ని తను పట్టించు కుంటున్నాడు , తన గురించి పట్టించు కోవడానికి మనమే కదా వున్నాం. మనకెందుకు అంటావె .

వీళ్ళ ముగ్గురి మాటలు వింటున్న రాఘవులు, సాగర్ ని చూసి అసలేం జరుగుతోంది ఇక్కడ అన్నట్టు చూసాడు🤨 ,ఏమో అన్నట్టు పెదవి విరిచాడు సాగర్.😕

Something is fishy అనుకున్నాడు సాగర్ మనసులో.

టిఫిన్ చేయటం అవగానే బయలుదేరారు సాగర్ , విజయ్, విద్య. వాళ్ళను జీప్ లో రామారావు గారి ఇంటి వరకూ దింపడానికి వాళ్ళతో వెళ్ళాడు రాఘవులు.

జీప్ లో వెళుతుండగా:

విజయ్ : uncle మీకు సాగర్ జరిగింది చెప్పాడు కదా.

రాఘవులు : ఆ చెప్పాడు sir , ఇక్కడ స్టేషన్ సంగతి నేను చూసుకుంటా , మీరు అక్కడి పని పూర్తి చేసుకుని రండి.

విజయ్ : ఇప్పుడు duty లో లేము కదా uncle, మీరు నా ఫ్రెండ్ కి ఫాదర్ కదా బయట వున్నప్పుడు కూడా sir అనకండి , నాకు అదోలా వుంటుంది.

చిన్నగా నవ్వుతూ సరే బాబు అన్నాడు రాఘవులు .

విజయ్ : నాకెందుకో మనల్ని ఎవరో గమనిస్తూ వున్నారు అనిపిస్తుంది uncle, అందుకే నేను లీవ్ మీద వూరికి వెళ్ళానని చెప్పండి స్టేషన్ లో కూడా , ఈ విషయాలేవీ బయటకు తెలీక పోవడమే మంచిది అనిపిస్తుంది .

రాఘవులు : మీరు చెప్పింది నిజమే బాబు ఇంత జరిగింది అంటే ఈ వూళ్ళో ఎవరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఒక్కరైనా వుండే వుండాలి , నేను కూడా అందరి మీద ఒక కన్నేసి వుంచుతా .

రామారావు గారి ఇంటికి చేరుకున్నారు అంతా , అక్కడి నుండి గంగ ని తీసుకొని రామారావు గారి కార్ లో వెళ్లాలని అక్కడకు వచ్చారు .

అప్పటికే వీళ్ల గురించి ఎదురు చూస్తూ వుంది గంగ . మోహన్ కి గంగ కి తప్ప అసలు సంగతి ఎవరికీ తెలీదు ఇంట్లో , రామారావు గారి తమ్ముడిని కనిపెట్ట డానికే విజయ్ సాయం చేస్తున్నాడు అని అనుకుంటున్నారు అందరూ .

నిజం చెప్పాలంటే తను వెతుక్కుంటూ వెళ్ళేది నిజం గానే నేరస్తుడినేనా కాదా అన్న క్లారిటీ విజయ్ కి కూడా లేదు , కానీ తన ముందు వున్న ఏ ఒక్క ఆప్షన్ ని వదులుకోవాలి అని అతనికి లేదు , అందుకే తనకు తెలియని ఆ వ్యక్తి గురించి ఎలాగయినా తెలుసుకోవాలని అనుకుంటున్నాడు విజయ్ .

రామారావు గారికి చాలా సంతోషం గా వుంది , ఇప్పటికయినా నా తమ్ముడి గురించి తెలిస్తే మా నాన్న కి ఇచ్చిన మాట నిలబెట్టు కోవచ్చు అనుకున్నాడు మనసులో .

సాగర్ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు , తన పక్కన విజయ్ కూర్చున్నాడు , వెనుక సీట్లో గంగ , విద్య కూర్చున్నారు .

కార్ బయలు దేరే ముందు ఏదో గుర్తు వచ్చినట్టు ఇంతకీ మీ తమ్ముడు పేరు ఏంటి uncle అన్నాడు విజయ్ , రామారావు గారితో .

నా తమ్ముడి పేరు కృష్ణారావు బాబు అనగానే ఏంటి uncle కృష్ణారావు అన్నారా అన్నాడు విజయ్ .

రామారావు : అవును బాబు ఏమయింది.

విజయ్ : ఏం లేదు uncle బాగా విన్న పేరు లాగా అనిపించింది.

రామారావు : ఇంట్లో మాత్రం వాడిని కృష్ణ అని పిలుచుకునే వాళ్ళం , నన్ను రామా అని వాడిని కృష్ణా అని ఎంతో ప్రేమగా పిలుచుకునేవారు అమ్మా , నాన్న .

సరే బాబు మీరు బయలుదేరండి వస్తుంది , ఇప్పుడు బయలు దేరితే గానీ రాత్రికి చేరుకో లేరు , జాగ్రత్త గా వెళ్ళండి అని విజయ్ వాళ్ళను సాగనంపారు.

షేర్ చేయబడినవి

NEW REALESED