Read Truth - 20 by Rajani in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిజం - 20

ప్లాన్ లో మళ్లీ చేంజ్ దేనికి sir అడిగాడు చంద్రం , అదేంటి చంద్రం ఎందుకంటావ్ ఇందాక ఆ భీమన్న చెప్పాడు కదా కృష్ణా పాలస్ హోటల్ నుండి రావడం చూసా అని అక్కడికి వెళ్లి అడిగితే సరిపోతుంది కదా ఎందుకు వూరంతా తిరగటం ఇంకా అన్నాడు రాఘవులు , అవును sir ఆకలితో వుండి సరిగా పట్టించు కోలేదు, అయితే అక్కడి కే వెళదాం పదండి అంటూ లేచాడు చంద్రం. సాగర్ మాత్రం ఏదో ఆలోచిస్తున్నాడు , ఏమయ్యింది సాగర్ ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావ్ పద అన్నాడు రాఘవులు , ఈ రెస్టారెంట్ అతను చెప్పిన ఏరియా కి 2 km ల దూరంలో వుంది అయినా సరే ఇక్కడికే వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి , తను స్టే చేసే చోట ఎవరికీ అనుమానం రాకుండా అలా చేసి వుండ వచ్చు , అలాంటప్పుడు అతను వచ్చినప్పుడల్లా ఒకటే చోట స్టే చేసే వాడంటే నమ్మకంగా లేదు తన గురించి ఎక్కడా క్లూస్ దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు , ఇప్పుడు నేను చంద్రం కలసి కృష్ణా పాలస్ లో ఎంక్వైరీ చేస్తాం , మీరు మాత్రం ఇక్కడి నుండి 2 ,3 kms దూరంలో opposit direction లో వేరే ఏరియాస్ కు వెళ్లి చెక్ చేయండి , అన్నాడు సాగర్ రాఘవులు తో , సరే రా నీ ఇష్టం అలానే చేద్దాం , ఈ రోజు నువ్వే మాకు టీమ్ లీడర్ నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నాడు రాఘవులు . రాఘవులు మాటలకు నవ్వుకుంటూ బయటకు నడిచారు ముగ్గురూ.

సాగర్ , చంద్రం కలిసి కృష్ణా పాలస్ కి బయలు దేరారు, అక్కడ రిసెప్షన్ లో కూర్చున్న అతనికి మరిడ య్య సెచ్ చూపించి , ఒక వారం క్రితం ఇతను మీ హోటల్ కి వచ్చాడు కొంచం చూసి ఇతని డీటైల్స్ చూపిస్తారా అడిగాడు సాగర్ , లేదు sir అలా చూపించడం కుదరదు అన్నాడు హోటల్ రిసెప్షనిస్ట్ , తన పోలీస్ id ని ఆ రిసెప్షనిస్ట్ చూపించి ఇప్పుడు కూడా కుదరదా అని అడిగాడు , ఓ డిపార్ట్మెంట్ వాళ్ళా మరి ముందే చెప్పాలి కదా sir , అని వాళ్ళు చూపించిన స్కెచ్ వైపు ఒకసారి చూసి ఓ ఈయన , ఈ పాస్టర్ గారి కోసం వచ్చారా అన్నాడు రిసెప్షనిస్ట్ , సాగర్ చంద్రం ఇద్దరూ అవాక్కాయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు , నువ్వు సరిగా గుర్తు పట్టే చెప్తున్నావా అన్నాడు సాగర్ రిసెప్షనిస్ట్ తో , అవును sir నేను సరిగానే గుర్తుపట్టాను, నాకు అడక్కుండానే ప్రార్థన చేశారు , అన్నాడు నవ్వుతూ రిసెప్షనిస్ట్ , ఇంతకీ నీ పేరేంటి అడిగాడు సాగర్ ఆ రిసెప్షనిస్ట్ ని , నా పేరు శామ్యూల్ sir అన్నాడు అతను , వీడి పేరు అడిగి వీడికి ఒక స్టోరీ చెప్పాడు అని మనసులో అనుకున్నారు సాగర్ , చంద్రం ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ , సరే సామ్యూల్ మీ రిజిస్టర్ లో అతని వివరాలు ఉంటాయి కదా అవి చూపించు అన్నాడు చంద్రం , సరే sir అని రిజిస్టర్ తీసాడు సామ్యూల్ , దానిలో దైవ సహాయం అనే పేరు చూపించి ఇవే sir ఆయన డీటైల్స్ అని వేలు పెట్టి చూపించాడు సామ్యూల్ , దానిలో అతని అడ్రస్ దగ్గర వైజాగ్ అని వుంది ఏదో ఒక చర్చ్ పేరు రాశాడు అడ్రస్ లో , ఫోన్ నంబర్ రాసి ఉంది , sir ఫోన్ నంబర్ వుంది కాల్ చేయనా అని మొబైల్ చేతిలోకి తీసుకున్నాడు చంద్రం సాగర్ తో , దేనికి చంద్రం నెట్ కనెక్షన్ కావాలా అన్నాడు శామ్యూల్ వెనుక వున్న గోడను , రిజిస్టర్ ను మార్చి ,మార్చి చూస్తూ .

ఏంటి sir నెట్ కనెక్షన్ అంటున్నారు అన్నాడు చంద్రం ఆశ్చర్యం గా సాగర్ తో , ఈ శామ్యూల్ కి నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తూ అతని వెనుక గోడ మీద ఉన్న airtel ఇంటర్నెట్ కనెక్షన్ add మీద వున్న ఫోన్ నంబర్ ని ఇక్కడ రాసాడు , అని చెప్పి సామ్యూల్ వైపు సీరియస్ గా చూసాడు సాగర్ , అది విన్న సామ్యూల్ రిజిస్టర్ తీసుకుని దానిలో నంబర్ ను గోడ మీద నంబర్ ను మార్చి మార్చి చూసాడు , sir మా మేనేజర్ కు ఈ విషయం చెప్పొద్దు sir , నన్ను ఉద్యోగం లో నుండి పీకేస్తారు అన్నాడు బ్రతిమలాడుతూ సాగర్ తో .

ఈసారికి చెప్ప ను గానీ ఇక నుండి అయినా డీటైల్స్ తీసుకునేటప్పుడు కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకోని డీటైల్స్ చెక్ చేయి అని అక్కడ నుండి బయటకు వచ్చేసాడు సాగర్ , అతన్ని అనుసరించాడు చంద్రం.

సాగర్ ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి హెల్లో నాన్నా ఏమయినా తెలిసిందా అన్నాడు రాఘవులు తో , ఫోన్ లో మరో వైపు రాఘవులు మాట్లాడుతూ ఒక మూడు హోటల్స్ తిరిగాక ఒకతను గుర్తు పట్టాడురా ఈ స్కెచ్ ని అతను ఒక గవర్నమెంట్ టీచర్ అని ఎలక్షన్ duty కోసం పక్కూరు నుండి వచ్చానని చెప్పాడట అన్నాడు,

మరి అతని దగ్గర id ఏమి చూడలేదా ఆ హోటల్ వాళ్ళు అడిగాడు సాగర్ , ఎలక్షన్ టైం లో పాలిటిక్స్ పిచ్చి లో వుంటారు కదా అందరూ ,ఆ మాటల్లో పెట్టేసి రూం తీసుకున్నాడని అర్థమయింది ఆ రిసెప్షన్ లో వున్న వాడితో మాట్లాడాక , మరి మీరెళ్లిన చోట ఏమయింది అడిగాడు రాఘవులు , చిన్నగా నిట్టూరుస్తూ ఇక్కడయితే ఏకంగా పాస్టర్ నని చెప్పాడు , ఇంక ఈ హోటల్స్ లోనూ లాడ్జ్ స్ లోనూ అడగడం వేస్ట్ అనిపిస్తుంది , వాడు అందరికీ ఫేక్ id లనే ఇచ్చాడు , మీరు డైరెక్ట్ గా బస్ స్టాండ్ వచ్చేయండి నాన్న , నేను చంద్రం కూడా ఇటు నుండి బస్ స్టాండ్ కి వచ్చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సాగర్ .

Next day పోలీస్ స్టేషన్ లో :

సాగర్ , రాఘవులు , చంద్రం ముగ్గురూ స్టేషన్ లో విజయ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు , మిగిలిన కానిస్టేబుల్స్ వాళ్ళ వాళ్ల పనుల్లో వున్నారు .

స్టేషన్ లోకి రాగానే సాగర్ ని చూసిన విజయ్ , నైట్ వచ్చేసరికి లేట్ అయిందిరా అందుకే కాల్ చేయటం కుదర లేదు అన్నాడు , నేను try చేశా నీ ఫోన్ సిగ్నల్ లేనట్టుంది సరే డైరెక్ట్ గానే మాట్లాడదాం అని ఇలా వచ్చా అన్నాడు సాగర్ , అన్ని చోట్ల ఫేక్ id ఇచ్చాడా అడిగాడు విజయ్ , అవున్రా నీకెలా తెలుసు కొంపదీసి spy చేయడానికి మా వెనుక ఎవరినయినా పంపావా అన్నాడు సరదాగా సాగర్ .

వాడొక్ క్రిమినల్ కాబట్టి అలానే చేసి ఉంటాడని గెస్ చేసాను , ఇక్కడికి వచ్చే ముందే హైద్రాబాద్ పోలీస్ స్టేషన్ నుండి నాకొక కాల్ వచ్చింది , వాడి పేరు పీటర్ , వాడు 5 years బ్యాక్ వైజాగ్ లో హత్య చేసి పరారి అయ్యాడు , నాకు మార్నింగ్ కాల్ చేసిన ఆఫీసెర్ 5years బ్యాక్ వైజాగ్ లో వర్క్ చేశారట , ఆయన మనం పంపిన స్కెచ్ చూసి గుర్తుపట్టి నాకు కాల్ చేశారు అని జరిగింది చెప్పాడు విజయ్ .

ఆ sir ముందుగానే కాల్ చేస్తే మేము నిన్న తిరిగే పని తప్పేది sir, మనం ఆ స్కెచెస్ మొన్ననే ఫ్యాక్స్ చేశాం కదా అన్నాడు చంద్రం .

ఆయన లీవ్ లో ఉన్నారట , ఆయన స్కెచ్ చూడగానే వైజాగ్ కాల్ చేసి డీటైల్స్ క్రాస్ చెక్ చేసుకొని మార్నింగ్ నాకు కాల్ చేశారు , అవును వైజాగ్ లో మర్డర్ ఎందుకు చేశాడు కేస్ డీటైల్స్ ఏమయినా తెలిసాయా sir అడిగాడు రాఘవులు .

ఇదే రాఘవులు గారు ఇంపార్టెంట్ పాయింట్ , వాడు పార్క్ లో జాగింగ్ చేస్తున్న ఒక బిజినెస్ మాన్ ని దారుణం గా గొంతు కోసి చంపాడు , ఆ పార్క్ లో టీ అమ్మే అతను చెట్ల వెనుక నుండి అనుకోకుండా చూసాడు , అతను చెప్పటం వల్లే పోలీసు లకు విషయం అర్థమయ్యింది , ఎంక్వైరీ లో తేలింది ఏమిటంటే ఆ బిజినెస్ మాన్ ని తన బంధువులే ఆస్తి కోసం చంపించారు , డబ్బు తీసుకుని హత్య చేసిన పీటర్ మాత్రం పరారయ్యాడు , వాడి కోసం చాలా చోట్ల వెతికారు కానీ దొరకలేదు , ఆ హత్య చేపించిన వాళ్ళను పట్టుకొని ఇక కేస్ క్లోజ్ చేసేశారు అని తను తెలుసుకున్న విషయాలు చెప్పాడు విజయ్.

అంటే ఆ పీటర్ కిరాయికి మర్డర్స్ చేసే ఒక రౌడీ అంతే గానీ తనుకు పర్సనల్ గా ఈ వూరితో గానీ ఇక్కడి మనుషులతో గానీ ఎలాంటి సంబంధం లేదు అంతే కదా విజయ్ నువ్వు చెప్పేది , అన్నాడు సాగర్ కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఆశ్చర్యం గా .

ఎక్సాట్లి సాగర్ మనం ఆ పీటర్ తో పాటు ,అతని వెనుక ఎవరు ఉన్నారో కూడా తెలుసు కోవాలి అన్నాడు విజయ్ ఆలోచిస్తూ .

రాఘవులు గారు మీరు అన్ని పోలీస్ స్టేషన్లు కి ఆ పీటర్ స్కెచ్ ని ఫ్యాక్స్ చేసే పనిలో ఉండండి , ఎవరికి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా వెంటనే కాల్ చేయమని చెప్పండి , అని చంద్రం వైపు తిరిగి చంద్రం నువ్వు అర్జంట్ గా మచలీపట్నం వెళ్లి లాస్ట్ టైం పీటర్ వచ్చిన డేట్ నుండి సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చెయ్యి , అతను వెళ్ళేటప్పుడు ఏ బస్ ఎక్కడో చూడు , ఒక వేళ బస్ లో వెళితే ట్రేస్ చేసే ఛాన్స్ ఉంటుంది , లేదా వేరే ఏదైనా వెహికల్ లో వెళితే గనక కష్టం అని చెప్పి చంద్రం ని అక్కడి నుండి పంపేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు విజయ్ , తన ఎదురుగా చైర్ లో కూర్చున్న సాగర్ కూడా ఆలోచనల్లో పడిపోయాడు .