Read Will this journey reach the coast.. - 19 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 19

ముందుగా 1-19 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది..


ప్రణయ్ ' నిజంగా నీది ప్రేమ అయితే చిన్నప్పటి నుండి నువ్వు చాలా కోల్పోయావు అసద్ అది అంతా తన ప్రేమ వల్ల నువ్వు పొందాలి అని కోరుకుంటున్న ' అని మనసులో అనుకొని చిన్నగా నవ్వుకొని అసద్ వెనుకే వెళ్ళాడు..


అసద్ ప్రణయ్ వచ్చిన తర్వాత కార్ స్టార్ట్ చేసి షివి వాళ్ల కాలేజ్ కి తీసుకువెళ్ళాడు..


అసలు షివి వైపు ఆ రోజు ఎం జరిగిందో ఒక సారి చూద్దాం రండి..


షివి, అనిరుధ్ వెళ్లి టాక్సీ లో కాలేజ్ అడ్రస్ చెప్పి ఎక్కారు.. అనిరుధ్ " ఇప్పుడు చెప్పు.. అతను నీకు తెలుసా.." అని అడిగాడు అనిరుధ్..


షివి " హా అన్నయ్య.. అని తనకి అతనికి మద్య జరిగింది చెప్తుంది.."


అనిరుధ్ " సరేలే.. మంచి పని చేసావు.. అందులో నిన్ను మెచ్చుకున్న.. ఒక్కదానివే వస్తా అన్నావు.. ఇందులో మాత్రం నా కోపం తగ్గలేదు షివి.." అన్నాడు ఎటో చూస్తూ..


షివి కళ్ళ నిండా నీళ్లతో.. " అది కాదు అన్నయ్య నాకు పెళ్లి చేస్తారు అంట.. చదువుకోవాలి అంటే నాకు వచ్చే వాడు చదివిస్తారు అంటున్నారు.. నా వయసు ఎంత నాకు మాత్రం వుండవ గోల్.. కలలు.. అన్ని అబ్బాయిలకి మాత్రమే రిజర్వ్ చేశారా.. నీకు కావాల్సింది ఇచ్చారు.. నన్ను మాత్రం ఎప్పుడు వదిలిచుకుందాం అన్నట్టు వున్నారు.. అమ్మ.. నాన్న.." అంటూ అనిరుధ్ నీ వాటేసుకొని కళ్ళ నీళ్లతో చెప్తుంది..


అనిరుధ్ కి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.. అవును ఈ టాపిక్ ఫస్ట్ అనిరుధ్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యింది.. అనిరుధ్ కి ఒక ఫ్రెండ్ వున్నాడు హైద్రాబాద్ లో చైల్డ్హుడ్ ఫ్రెండ్.. అతని పెళ్లికి వెళ్తూ.. ఇంట్లో వాతావరణం బాగోలేదు అని షివి నీ కూడా తీసుకువెళ్ళాడు.. అదే అతను చేసిన పొరపాటు..


షివి తండ్రి ఒక పొలిటీషియన్.. ఎమ్మెల్యే.. శ్రీనాథ్.. అక్కడ ఆ ఏరియా లో పేరు మోసిన పొలిటీషియన్.. ఆ ఏరియా లో ఎం జరగాలి అన్న అతని పర్మిషన్ తో నే జరుగుతుంది అల అని చెడ్డ వాడ అంటే కాదు ఒక మంచి నాయకుడు.. కానీ ఆడపిల్ల అంటే చిన్న చూపు కలిగిన వ్యక్తి.. ఆడపిల్ల అంటే ఇంటి పనులు మాత్రమే చెయ్యాలి.. మగ వాడికి రాత్రుళ్ళు సుఖం ఇవ్వాలి అనుకునే ఒక నీచమైన బుద్ది వున్న వాడు.. అల అని ఆడవాళ్ళతో తిరుగుళ్ళు లాంటివి ఏమీ లేవు.. ఇంట్లో ఆడవాళ్ళకి కూడా విలువ ఇవ్వటం తెలియని ఒక ముర్కుడు..


ఒక్కో సారి విసిగిపోయిన అనిరుధ్ ఎందుకు మా.. నాన్న ఎప్పుడు ఇలానే అని అడిగితే నవ్వి వురుకునే వారు అనిరుధ్, షివిధ లా తల్లి అయిన శారద గారు.. అంతకు మించి ఎం చెప్పగలరు.. ఆవిడ మాత్రం.. ప్రేమించి ఇంట్లో తల్లితండ్రులు తమ ప్రేమ నీ ఒప్పుకోలేదు అని తన ప్రేమ నీ మర్చిపోలేక.. ఇంకొకరికి మనసు చంపుకొని తనువు నీ అప్పగించ లేక ఆ రోజుల్లో శ్రీనాథ్ గారిని నమ్ముకొని ఇంట్లో నుండి వచ్చేసింది..


అది నచ్చని శ్రీనాథ్ తల్లి.. ఎప్పుడు శారద మీద శ్రీనాథ్ గారికి చెడుగా చెప్పటం మొదలు పెట్టింది.. పెద్దలు అంటే గౌరవం లేదు.. అందుకే తల్లితండ్రులను వదిలేసి వచ్చింది.. ఇక్కడికి వచ్చాక ఒక్క సారి కూడా వాళ్ళని తలుచికొలేదు.. పైగా తల్లితండ్రుల లాంటి అత్తమామ లని ఏమో పరాయి వాళ్ళ లా చూస్తుంది అని.. మొదట్లో ఆవిడ మీద అమితమైన ప్రేమ వున్న శ్రీనాథ్ గారు తన తల్లి మాటలు పట్టించుకోలేదు కానీ కొన్ని రోజులకు ఆవిడ మాటలు వినటం మొదలు పెట్టి భార్య నీ తక్కువగా చూసే వారు.. కానీ అనిరుధ్ పుట్టిన తర్వాత కొంచెం పర్వాలేదు కానీ షివి పుట్టిన తర్వాత మళ్లీ మొదలు పెట్టారు.. కేవలం ఆవిడని మాత్రమే కాక కూతురు మీద కూడా ఆ అసహ్యాన్ని తన తల్లి ఈ కొడుకుకి నింపింది..


అప్పటి నుండి కూతురిని కూడా చిన్న చూపు చూడటం అతనికి అలవాటు అయిపోయింది.. అనిరుధ్ ఫ్రెండ్ పెళ్లి కి వెళ్ళే రోజు పార్టీ లో ఏవో గొడవలు జరిగి పార్టీ లో వుండే సో కాల్డ్ నాయకులు.. వగైరా వగైరా గల్లు ఇంట్లో తిష్ట వేశారు.. పార్టీ మాయలో పడిపోయిన శ్రీనాథ్ గారు ఇంట్లో విషయాలు పట్టించుకోవటం ఎప్పుడో మానేశారు.. అనిరుధ్ నీ మాత్రం కొంచెం లో కొంచెం ప్రేమగా దగ్గరకి తీసుకునే వారు..


అల ఆ రోజు ఇంటికి చెప్పి వచ్చిన చెప్పకుండా వచ్చిన వచ్చారు అని శారద గారు అందరికీ మర్యాదలు చెయ్యడానికి కాఫీ లు గట్రా తీసుకువెల్తే అందులో ఒక వ్యక్తి అతని వంకర చూపు నీ ఆవిడ మీద పారేసుకున్నారు.. అది గ్రహించిన శ్రీనాథ్ గారు ఎం చెప్పాలి ఎలా చెప్పాలి తెలియక కాఫీ తీసుకొని వచ్చిన ఆవిడ మీద చెయ్యి చేసుకున్నారు..


అందరిలో తన తల్లి మీద చెయ్యి చేసుకునే సరికి అనిరుధ్ కి కోపం వచ్చింది.. ఎంత లేదు అన్న అనిరుధ్ కొంచెం పెద్ద వాడు కాబట్టి అన్ని తేలికగానే అర్దం చేసుకునే వాడు..


శారద గారు అందరిలో తన భర్త కొట్టే సరికి ఏడుపు వస్తుంటే లోపలికి వెళ్లారు.. ఇది అంతా చూసిన షివి ఎంతైనా చిన్నది కదా ఆవేశంలో నాన్న నీ అడుగుతా.. అంటూ వుగిపోయింది.. అప్పుడు షివి ఆవేశం చూసి ఎం చేస్తుంది అనే కంగారులో అనిరుధ్ బయటకి వెళ్దాం అని చెప్పాడు..


అనిరుధ్ వెళ్లి శ్రీనాథ్ నీ అడిగాడు.. ఆయన " ఇప్పుడు అది ఎందుకు.. వద్దు.. నువ్వు వెళ్ళు నాన్న.." అన్నారు.. అప్పటికే కోపంలో వున్న అనిరుధ్ " ప్లీస్ నాన్న అది ఎం చిన్న పిల్ల కాదు దానికి కూడా బయట ప్రపంచం తెలియాలి.. అయిన ఇలా ఫంక్షన్ లకి వెళ్తేనే కదా.. నలుగురి కళ్ళల్లో పడి మీకు సంబంధాలు వెతికే పని తగ్గుతుంది.." అని ఏదో ఆ క్షణం ఆయన నీ ఒప్పించటానికి అన్నాడు కానీ.. అదే నిజం అయ్యి అందరి జీవితాలని కాటు వేస్తుంది అని ఊహించ లేకపోయాడు..


శ్రీనాథ్ గారు కాసేపు అలోచించి " సరే.." అన్నారు.. అనిరుధ్ వెళ్ళే సరికి షివి రెఢీ అయ్యి వచ్చింది.. అనిరుధ్ షివి నీ తీసుకొని పెళ్లికి వెళ్ళాడు.. కానీ అనుకోని సమస్య అక్కడే ఎదురు అయ్యింది..


అక్కడ పెళ్లి కూతురి బ్రదర్ కన్ను షివి మీద పడింది.. ఎలాగో అనిరుధ్ లేని సమయం చూసి షివి తో అసభ్యంగా మాట్లాడాడు.. కోపం వచ్చిన షివి అతని చెంప పగలగొట్టి అనిరుధ్ దగ్గరకి వెళ్లి ఏడుస్తూ.. జరిగింది చెప్పుకొచ్చింది..


అనిరుధ్ కి కోపం వచ్చిన ఇక్కడ ఎందుకు లేనిపోని గొడవలు.. మళ్లీ అతని వల్ల ఫంక్షన్ మొత్తం డిస్టర్డ్ అవుతుంది అని షివి నీ తీసుకొని వెళ్ళిపోయాడు..


కానీ అతను మాత్రం అతని చెంప మీద కొట్టిన షివి కి జీవితం మీద దెబ్బ కొట్టాలి అని అనుకున్నాడు.. డైరెక్ట్ గా ఏమి చెయ్యకపోయినా ఇండైరెక్ట్ గా షివి జీవితం ఇలా అవ్వటానికి అతనే కారణం అవుతాడు.. అని అతనికి కూడా ఆ క్షణం తెలియదు..


అల వెళ్ళిన వాళ్లు మళ్లీ డైలీ రొటీన్ లో పడిపోయారు అనిరుధ్ ఇంక షివి లు కానీ అతను మాత్రం ఎం చెయ్యాలా అని ఆలోచనలో వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని అనిరుధ్ నంబర్ నీ సంపాదించాడు..


అల అనిరుధ్ నీ కాంటాక్ట్ అయ్యి ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్పాడు.. ఫోన్ నంబర్ కనుక్కొని మరీ సారీ చెప్పే సరికి అనిరుధ్ కూడా లైట్ తీసుకున్నాడు.. కొన్ని రోజులు ఫోన్ లోనే స్నేహం పేరు తో మాటలు మొదలు పెట్టాడు..


రోజులు గడుస్తన్నాయి అతను కూడా అనిరుధ్ నీ కాంటాక్ట్ అవ్వడానికి రీసన్ చెప్పటం మొదలు పెట్టాడు.. అతని షివి ఇష్టం అని ప్రేమ అని.. అది చెప్పే దారి సరిగ్గా లేక ఇద్దరి మద్య మిస్ అండర్ స్టాండింగ్ జరిగి అల అయిపోయింది అని చెప్పాడు..


మొదట్లో అది నిజం అనుకొని అనిరుధ్ కి ఎం మాట్లాడాలో అర్దం కాక కొన్ని రోజులు సైలెంట్ గా వున్నాడు కానీ అతను రోజు రోజుకి బలవంతం చేసే సరికి అప్పుడు అర్దం అయ్యింది అనిరుధ్ కి ఇది అంతా అతని ప్లాన్ అని.. అతను చేస్తున్న హంగామా కి అనిరుధ్ విసిగిపోయి అతని కాంటాక్ట్ నీ తీసేసాడు.. అన్నిట్లో కూడా అతను ఇంకో అకౌంట్ ఓపెన్ చేసాడు.. నంబర్ మార్చాడు..


కానీ అతను అనిరుధ్ తో ఆగకుండా అనిరుధ్ ద్వారా.. ఇంక కొందరి స్నేహితుల ద్వారా అనిరుధ్ తండ్రి షివి దగ్గరకి వెళ్లి పెళ్లి చేసుకుంటా అని అతని గుణగణాలు.. ఆస్తిపాస్తులు.. చెప్పుకొచ్చాడు.. అసలు షివి నీ పెళ్లి కి తీసుకువెళ్ళింది కూడా ఆ కారణం చేతే కాబట్టి అల రావటం ఏదో గొప్ప పని అన్నట్టు మీసం మెల వేస్తూ నవ్వుతూ.. అతని పొగడ్తలకు పడిపోయి షివి నీ అతనికి ఇచ్చి పెళ్లి చెయ్యాలి అని ఇంట్లో ప్రస్తావించారు..


చిన్నప్పటి నుండి తండ్రి ఇష్టాలు తప్పా తన ఇష్టాలు లేని ఆ ఇంట్లో తనకి పెళ్లి అని టాపిక్ వచ్చే సరికి ఇంట్లో అందరి మీద ఆరిచేసి తను నోయిడా వెళ్ళిపోయి ఎలాగో ఉద్యోగం చేసుకొని అయిన చదువుతాను అని డాన్స్ కంపిటిషన్ కోసం వుంది.. ఇప్పుడే గుర్తు వచ్చింది అతనికి పేరు పెట్టలేదు కదా.. ధీరెన్ పేరు ఎలా వుంది..


అది అంతా చూసి శ్రీనాథ్ గారికి కోపం వచ్చింది.. ఈ విషయం ఫోన్ ద్వారా అనిరుధ్ కి చేర వేశారు శారద గారు.. అనిరుధ్ ఎలాగో తండ్రి కి నచ్చచెప్పి.. చదువు పూర్తి అయ్యే సరికి పెళ్లి చెయ్యాలి అనే చెత్త కండిషన్ పెట్టీ షివి నీ అక్కడికి పంపించారు.. ఇంట్లో అందరి మీద కోపం గా వున్న షివి తను ఒక్కతే వెళ్తాను అంటే.. అది ప్రమాదం అని.. పైగా ఎవరికి తెలియని పిరికి షివి తనకి మాత్రమే పరిచయం వున్న అనిరుధ్ ఒప్పుకోలేదు.. ముందు రోజు వచ్చి ఫ్రెండ్ ఇంట్లో ఉండి షివి తో పాటు నోయిడా కి వచ్చాడు.. అంతా గుర్తు వచ్చే సరికి కళ్ళల్లో నీళ్ళు అనుమతి లేకుండా వెళ్తూనే వున్నాయి.. ఈ లోగా కాలేజ్ రావటం తో షివి నీ అక్కడ వదిలి తను వుండే ఫ్లాట్ కి వెళ్ళాడు..



హాస్టల్ కి వెళ్ళిన షివి ఫ్రెష్ అయ్యి.. కాలేజ్ కి రెఢీ అయ్యి వెళ్ళే సరికి తన బెస్ట్ ఫ్రెండ్ గీత తన కోసం ఎదురు చూస్తూ వుంది.. తనని చూసి పలకరింపు గా నవ్వి పక్కకి చూసే సరికి తన అన్నకి అపురూపమైన అపురూప కనిపించింది.. గీత నీ చుసి నవ్వి తనని చుసి నవ్వకపోతే ఫీల్ అవుతుంది అని అపురూప కి ఒక ఇబ్బంది పూర్వకమైన నవ్వు నీ బదులిచ్చింది.. తను అంతే..


వెళ్లి గీత తో మాట్లాడుతూ.. ఆ దసరా సెలవుల్లో తను ఎం చేసిందో అండ్ డాన్స్ కాంపిటీషన్ గురించి చెప్పి ఇంక ఏవో మాట్లాడుకుంటూ వుండగా.. వచ్చాడు.. వేస్ట్ ఆఫ్ ఇండియా.. షివి నీ ఇబ్బంది పెట్టడం మాత్రమే పనిగా పెట్టుకున్న మనీష్..


వచ్చి " హాయ్.. షివి.." అంటూ వుగుతు వచ్చి వాటేసుకోబోయాడు.. సహజంగానే అతను అంటే పడని షీవి అతను అల మీద కి వస్తూ వుంటే పక్కకి తప్పుకుంది.. అతను అది గమనించక షివి వెనుక వున్న చెట్టుని గుద్దుకుని అతని ముక్కు కి ముద్దు పెట్టుకుంది.. అతనికి నొప్పిగా వున్న వెనక్కి జరిగి షివి వైపు చూస్తూ పల్లు మొత్తం బయట పెట్టి " సరదా చేస్తున్నావు.. వావ్.." అంటూ ఏదో వాగుతు వుంటే షివి నీ తీసుకొని గీత వెళ్ళిపోయింది.. ఆ వెనుకే అపురూపమైన అపురూప కూడా..


గీతా " ఎంటి ఇది షివి.. అతను కావాలి అని ఇలా ప్రవర్తిస్తూ వుంటే నువ్వు సైలెంట్ గా వుండటం నాకు ఏమి నచ్చలేదు.. అనిరుధ్ అన్నయ్య కి చెప్పొచ్చు కదా.. అన్నయ్య చూసుకునే వాడు.." అని అనింది..



కొనసాగుతుంది...