Read Will this journey reach the coast.. - 18 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 18

ముందుగా 1-18 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది..



ఇంటికి వెళ్ళిన అసద్ కి పర్వీన్, ప్రణయ్ లు ఎదురు పడతారు.. అసద్ నవ్వుతూ వెళ్లి పర్వీన్ నీ హగ్ చేసుకుంటాడు..


పర్వీన్ నవ్వుతూ " కంగ్రాట్స్ నాన్న.." అంటారు ప్రేమగా.. అసద్ " థాంక్స్ అమ్మి.." అంటాడు..


ప్రణయ్ " నాకు తెలుసు రా నువ్వు వెళ్తే ఆ ప్రాజెక్ట్ నీకే వస్తుంది అని.. అందుకే నిన్నే పంపించా.." అంటాడు..


దానికి అసద్ " అలాంటిది ఎం లేదు.. పెర్ఫెక్ట్ ప్రెజెంటేషన్ ఇస్తే ఎవరికైనా ఈసీ గా వస్తుంది.. అందరూ వాళ్ల లాభాలు చూసుకున్నారు.. మనం హోనెస్ట్ గా ఇవ్వబట్టీ మనకి వచ్చింది.. అది నా వల్ల కాదు.. అయిన ఈ ప్రాజెక్ట్ నా వల్ల వచ్చిన నేను మాత్రం తన వల్లే వచ్చాను.." అన్నాడు ఏదో ఫ్లో లో..


అసద్ మిత బాషి.. ఎక్కువ మాట్లాడడం అనేది జరగదు అలాంటిది ఇవాళ ముత్యాలు రాలుతు వుంటే ఎవరు పట్టుకొరు.. కానీ అసద్ మాటల్లో లాస్ట్ లైన్ నీ ఇద్దరూ పట్టేశారు.. అనుమానం గా అసద్ వైపు చూస్తుంటే అసద్ అప్పుడు ఈ లోకం లోకి వచ్చి వాళ్ల వైపు చూసి ' డౌట్ వచ్చిందా..' అనుకొని " అమ్మి ఆకలి.. త్వరగా వెళ్ళాలి.. నీ చేతి వంట పెట్టు.." అన్నాడు.


ఏ తల్లికి అయిన బిడ్డ ఆకలి ముందు ఇంకేం గుర్తు వుంటుంది " అలాగే నాన్న వెళ్లి ఫ్రెష్ అవ్వు టిఫిన్ చేస్తాను.." అని పరుగున లోపలికి వెళ్ళి టిఫిన్ చేసే పనిలో పడిపోయింది..


ప్రణయ్ నీ మాత్రం డైవర్ట్ చెయ్యలేక పోయాడు.. అసద్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి త్వరగా రెఢీ అయ్యి వచ్చాడు.. ప్రణయ్ మాత్రం అసద్ ఇందాక అన్న మాటల గురించే ఆలోచిస్తున్నాడు.. అసద్ డైలీ షెడ్యూల్... రోజు తూ ఛా తప్పకుండా 5 కే లేగవటం 7 దాకా జిమ్ చెయ్యడం ఆ తర్వాత స్నానం చేసి బిజినెస్స్ న్యూస్ చూస్తూ బ్రేక్ ఫాస్ట్ చేసి 8:30 కల్లా ఆఫీస్ లో వుండటం అసద్ కి అలవాటు.. ఆఫీస్ నుండి వచ్చిన 11 దాకా వర్క్ చేసుకొని ఎప్పుడైనా బ్రిజర్ తో స్పెండ్ చేసి పడుకుంటాడు..


అసద్ బయటకి వస్తూ టైమ్ చుస్కున్నడు 8:30 అయ్యింది.. వెంటనే టిఫిన్ చేశాడు.. ప్రణయ అసద్ నీ గమనిస్తూ వున్నాడు.. అసద్, ప్రణయ్ లు టిఫిన్ పూర్తి చేసి ఆఫీస్ కి బయలు దేరారు.. అసద్ ప్రాజెక్ట్ ఒకే చేసుకొని రావటం తో ఆఫీస్ లో కొంచెం సందడిగా వుంది..


అందరూ వచ్చి అసద్ నీ విష్ చేస్తూ వున్నారు.. కానీ అసద్ " ఈ టైమ్ లో నాకు కావాల్సింది మీ విషెస్ కాదు.. వర్క్.. మనం వర్క్ ఇన్ టైమ్ లో.. బెస్ట్ చేస్తాము అని నమ్మకం మన పైన వుంచి మనకి ప్రాజెక్ట్ నీ ఇచ్చారు.. నేను ఆ నమ్మకాన్ని కలిగించాను.. కానీ ఆ నమ్మకం నిలబెట్టడం లో మీ హెల్ప్ కావాలి.. కాబట్టి అందరూ ఇన్ టైమ్ లో వర్క్ పూర్తి చెయ్యాలి.. చేస్తారు అని కోరుకుంటున్నా.." అని చెప్పి.. ఎవరి వర్క్ వాళ్ళకి ఎలోట్ చేస్తాడు..


అసద్, ప్రణయ్ లు వర్క్ లో పడిపోతారు.. టైమ్ నీ కూడా గమనించరు.. లంచ్ కూడా చెయ్యరు.. వర్క్ మద్యలొ ఎందుకో అసద్ కి కాన్సంట్రేషన్ కుదరక టైమ్ చూస్తే 3:30 అయ్యింది.. వెంటనే లేచి ప్రణయ్ తో " ప్రణయ్ లంచ్ చేద్దాం రా.." అని చెప్పి తన వర్క్ సేవ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చున్నాడు.. ప్రణయ్ కొంచెం ఆశ్చర్యపోయాడు..


ప్రతి రోజు లంచ్ ప్రణయ్ నే గుర్తు చెయ్యాలి అప్పుడే అసద్ లంచ్ చేస్తాడు.. లేకపోతే వర్క్ లోనే మునిగిపోతాడు.. అలాంటిది ఇవాళ లచ్ విషయం అసద్ గుర్తు చేసే వరకు ప్రణయ్ కి గుర్తు లేదు..


సరేలే అనుకోని వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకొని.. వచ్చి లంచ్ చేశారు.. అసద్ ప్రణయ్ తో " బయటకి వెళ్ళాలి పదా.." అనడం తో ప్రణయ్ కి ఇంక షాక్..


అసద్ ఎప్పుడు 7:30 కి ఇంటికి వెళ్తాడు.. అసద్ ప్రపంచం అంతా.. ఆఫీస్, ఇల్లు, పర్వీన్, ఫ్రెండ్ గా ప్రణయ్.. అంతే.. ఎప్పుడు కూడా ఇలా బయటకి వెళ్ళాలి అనే మాట అసద్ నోటి నుండి కేవలం పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే వినిపిస్తుంది.. పార్టీ కి కూడా ఎక్కువ వెళ్ళడు కానీ.. బిజినెస్స్ పరంగా ఈ మధ్యే పార్టీస్ కి వెళ్ళల్సివస్తుంది..


షాక్ లో ఉన్న ప్రణయ్ అసద్ ఎందుకు పిలిచాడు అర్దం కాక అయోమయంగా నే తన వెనుక నడిచాడు.. అసద్ కార్ స్టార్ట్ చేసే సరికి ప్రణయ్ వచ్చాడు..


అసద్ కి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు అసద్ నే డ్రైవ్ చేస్తాడు కార్..


ప్రణయ్ కూర్చున్న వెంటనే అసద్ ఒక పార్క్ కి తీసుకువెళ్ళి ఆపాడు.. అసద్ వెంటనే కార్ దిగి లోపిలికి వెళ్లి ఒక బెంచ్ మీద కూర్చున్నాడు.. ప్రణయ్ కూడా తన వెనుకే వచ్చి అసద్ పక్కన కూర్చొని " చెప్పు రా.. ఎంటి విషయం.." అన్నాడు..


అసద్ నవ్వుతూ చూసాడు ప్రణయ్ వైపు.. ప్రణయ్ కి ఇది కూడా షాక్ నే.. మామూలుగా అయితే అసద్ నవ్వటం అనేది చాలా అంటే చాలా రెర్.. ప్రణయ్ తో వున్నప్పుడు అయితే కొంచెం బెటర్ కానీ ఎప్పుడు అయితే బిజినెస్స్ స్టార్ట్ చేశాడో అప్పటి నుండి మరీ దారుణం గా అసలు నవ్వటం నే మర్చిపోయాడు.. అలాంటిది దాదాపుగా సమత్సరంన్నర తర్వాత అసద్ నవ్వు చూడటం కదా.. ఆ మాత్రం ఆశ్చర్యం వుండాలి లే.. అనుకొని..


ప్రణయ్ " ఎవరు ఆ అమ్మాయి.." అన్నాడు..


అసద్ " నిజంగా నా దేవత రా.. నా ప్రాణాలు కాపాడిన అమ్మాయి.. మై ఏంజెల్.." అన్నాడు..


ప్రణయ్ కి పిచ్చా షాక్.. అసద్ ఒక అమ్మాయి నీ ఇలా పొగిడే సరికి ఇంక ప్రాణాలు కాపాడిన అమ్మాయి అనే సరికి కొంచోమ్ కంగారుగా " ఏమైంది అసద్.." అని అడిగాడు..


అసద్ అక్కడ మీటింగ్ ఎలా జరిగింది.. అక్కడ షివి తనని కాపాడిన విధానం.. అండ్ నాట్యం.. ఇంక లాస్ట్ జర్నీ గురించి తనని ఫాలో అయ్యి ఏ కాలేజ్ లో చదువుతుంది అనేది చూసి వచ్చింది అంతా చెప్తాడు..


ప్రణయ్ పడి పడి నవ్వుకున్నాడు.. అసద్ ఏమో వుడ్డుకున్నాడు.. అసద్ " ఎందుకు రా నవ్వుతున్నావ్.." అన్నాడు.


ప్రణయ్ " నవ్వక.. ఎం చెయ్యాలి రా.. ఆ అమ్మాయి ముద్దు పెడుతుంటే నువ్వు మద్యలొ వెళ్ళడం.. ఎప్పుడు మెచ్యూర్ గా ఆలోచించే నువ్వు ఫర్ ద ఫస్ట్ టైమ్ చైల్డిష్ గా ఆలోచించావ్.. అందుకే నవ్వుతున్న.. అని కాసేపు నవ్వి.. మళ్లీ నార్మల్ అయ్యి.. నిజంగా ఆ అమ్మాయి నీకు కరెక్ట్ అనుకుంటున్నావా.. అసద్.." అన్నాడు..


అసద్ " నాకు తెలియదు రా.. ఆ అమ్మాయి నాకు కరెక్ట్ ఆ కాదా.. అన్నది నాకు తెలియదు.. అసలు నాకు డౌట్ గా వుంది.. నేను ఆ అమ్మాయి కి కరెక్ట్ ఆ కాదా.. అని.. తనని చూస్తుంటే అమాయకురాలు లా వుంది.. హెల్పింగ్ నేచర్.. అన్నయ్య అంటే ప్రాణం.. అంతకన్నా ఎం తెలియదు కానీ తనకి నేను సరిపోతాన.. అని అనిపిస్తుంది.. షి ఇస్ సంథింగ్ స్పెషల్ రా.. షి నీడ్ సంథింగ్ మోర్.. అండ్ నాకు తన మీద కలుగుతున్న ఈ ఫీల్ ఇంక ఇంక పెరుగుతూ.. ఇదిగో ఇక్కడ అంటూ గుండెల మీద చెయ్యి పెట్టుకొని చూపిస్తూ.. ఏదో ఒక రకంగా వుందిరా.. దీనిని ప్రేమ అంటారు అంటే ఎస్ ఐ లవ్ హర్.. కానీ కానీ ఏంటో రా.. అంతా కొత్త కొత్తగా.. వింత వింతగా వున్నట్టు వుంది.. ఎం చెయ్యాలో తెలియటం లేదు.. తనని చూడాలి అని వుంది.. ఎస్ తనని చూడాలి అని వుంది.. ప్రణయ్ పదా.." అంటూ ఫాస్ట్ గా వెళ్లి కార్ లో కూర్చున్నాడు


కొనసాగుతుంది...