Read Will this journey reach the coast.. - 10 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 10

అవతల వాళ్లు " మ్మ్ బై..." అని కాల్ కట్ అయ్యిన తర్వాత పక్కకి చూసిన తనకి అక్కడే వీల్ చైర్ లో కూర్చొని అసద్ కనిపించాడు... ఒక్క సారి భయం తో వణుకు పుట్టింది తనకి... ' ఎక్కడ వాళ్ల మాటలు విని తప్పుగా అర్దం చేసుకుంటారో అని...'


అసద్ కోపంగా " ఇది ఏమి ఫోన్స్ మాట్లాడుకునే ప్లేస్ కాదు... ఇలాంటివి మాట్లాడాలి అనుకుంటే... ఇక్కడ... అంటే ఈ ఇంట్లో కుదరదు... ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కొడలివి... ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది..." అని చెప్పి..." ఎంటి అర్దం అయ్యిందా..." అని గట్టిగ అడిగాడు...


ఆతని అరుపు కి దడుచుకుని " అలాగే అన్నట్టు తల ఊపి కళ్ళల్లో నీళ్ళు వస్తుంటే బయటకి వెళ్ళిపోయింది...


అసలు అసద్ అక్కడ ఎం చేస్తున్నాడు అంటే అసద్ కింద వర్క్ చేసుకుంటూ వుంటే అతను చేస్తున్న వర్క్ కి సంబందించి ఫైల్ కోసం రూమ్ కి వెళ్ళాడు... తను వెళ్ళే సరికి రూమ్ లో ఎవరు లేరు... నిజం చెప్పాలి అంటే అసద్ కి అసలు ఆ ధ్యాసే లేదు... తన రూమ్ లో ఇప్పుడు ఇంకొకలు వున్నారు అని... వెళ్ళి ఫైల్ తీసుకొని ఆఫీస్ కాల్ వస్తె మాట్లాడుటానికి బాల్కనీ కి వెళ్ళాడు... అతని కాల్ పూర్తి చేసుకొని వెళ్ళే లోగా అక్కడికి తను వస్తుంది... ఫోన్ నీ పట్టుకొని అంత కంగారుగా మాట్లాడటం చుసి ఎందుకో అనుమానం వచ్చి అలానే కేవలం తన మాటలు మాత్రమే వున్నాడు... అవి విన్న ఎవరికి అయిన కోపం రావటం సహజం... అందులోనూ అసద్ తన మీద కోపం గా వున్నాడు...


ఎందుకు కోపం అంటే అతను సంసారానికి పనికి రాడు... అది అతనికి తెలుసు... ఇంక అతను నడవలేడు ఒక్కో సారి అసలు కాళ్ళు కదపలేడు అలాంటి సమయం లో అతనికి నిస్వార్థంగా ఎవరు సేవలు చేస్తారు... ఒక వేళ డబ్బు కోసం అసద్ నీ పెళ్లి చేసుకున్నా కూడా వాళ్లు కేవలం పేరు కి మాత్రమే అతని కి భార్య అవుతారు... అతని లో వున్న లోపం అడ్డు పెట్టుకొని ఆస్తి ఎంత కావాలి అంటే అంత నొక్కేసి వేరే అడ్డదారులు తొక్కి వాళ్ళే ఎక్కువ పైగా అసద్ మనసు కాలి గా లేదు... అందులో షివి ఎప్పుడో సింహాసనం వేసుకొని కూర్చొని తన మది కి తనే మహారాణి అయ్యింది... ఎక్కడ తనని పెళ్లి చేసుకుంటే తనని కష్టాల పాలు చేస్తాను ఏమో అనుకోని... తను అసద్ తో లేకపోయినా సుఖంగా వుండాలి సంతోషం గా వుండాలి అని దూరం గా వున్నాడు...


షివి గురించి ఆలోచించటం కానీ తెలుసుకోవటం కానీ మానేశాడు అసద్ కానీ... కానీ అతని నమ్మకస్తుల్లో ఒకరిని షివి కి షివి లైఫ్ కి సెక్యూరిటీ గా పెట్టాడు... ఎప్పుడైనా షివి కి ఎమైన ప్రమాదం ఉంది అని తెలిస్తే... కష్టం తనకి చేరువలో ఉంది అని తెలిస్తే... తనకి తెలియకుండానే తనకి హెల్ప్ చెయ్యమని చెప్పాడు... కానీ ఇప్పటికీ ఆ వివరాలు అతనిని అడగడు...


ఆలోచనల్లో వున్న అసద్ బయటకి రావటానికి అన్నట్టు అతని ఫోన్ రింగ్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడుతూ కిందకి వెళ్ళాడు... వీల్ చైర్ లోనే....


అసద్ అరిచిన వెంటనే పరుగున బయటకి వచ్చిన ఆ అమ్మాయి ఆయాసం తీర్చుకోవటానికి అని కొన్ని నిమిషాలు అలానే వుంది... తన వెనుకగా తన భుజం మీద చెయ్యి పడటం తో బయపడి వెనక్కి తిరిగింది.


వెనుక పర్వీన్ " అమ్మ ఇంక మేలి ముసుగు వేసుకొని వున్నావు... పూజ చేసిన తర్వాత తేసేయోచ్చు... ముందు వెళ్లి స్వీట్ చేసి పూజ చేసి మేలి ముసుగు తీసెయ్యి.." అంటారు...


తను ఏమి సమాధానం చెప్పదు.. తను సమాధానం చెప్పక పోవటం చుసి ఎందుకో అనుమానం వచ్చి " వాడు నీ మొహం చూడలేదా..." అని అడుగుతుంది.


తను ' లేదు ' అన్నట్టు తల అడ్డంగా ఊపటం చుసి... " అసలు వాడు రాత్రి రూమ్ కి వచ్చాడా...??" అని అడుగుతారు... తనకి మళ్లీ అదే సమాధానం అవుతుంది.


పర్వీన్ " సరే తల్లి... తల పగిలిపోతుంది వెళ్లి కొంచం కాఫీ తీసుకురామ్మ ఆ తర్వాత స్వీట్ చేద్దువు..." అనటం తో వెళ్లిపోతుంది తను...


పర్వీన్ కల్లనీళ్లతో తను వెళ్ళిన వైపే చూస్తూ వుండటం తో వెనుకే వస్తున్న అసద్ అది చూసి " ఏమైంది అమ్మి... అలా వున్నావు..."


పర్వీన్ " రాత్రి ఎక్కడికి వెళ్ళావు... అసద్..."


అసద్ సమాధానం చెప్పలేదు... ఫేస్ వేరే వైపుకు తిప్పుకున్నాడు... పర్వీన్ నీ చూస్తూ సమాధానం ఇవ్వకుండా ఉండలేడు... అలానే పర్వీన్ కి అబద్దం చెప్పలేడు... అందుకే మొహం తిప్పుకున్నాడు...


పర్వీన్ " ఎందుకు రా మొహం తిప్పుకున్నా... ఎందుకు రా ఇలా చేస్తున్నావు..." అంటూ బాధగా అడుగుతుంది.


అసద్ " అమ్మి నీకు తెలుసు నా కండిషన్... ఇలాంటి టైమ్ లో మీరు ఇలాంటి ఏర్పాట్లు చెయ్యటం నాకు అస్సలు నచ్చలేదు... తనకి ఏమని సమాధానం చెప్పాలి... అసలు నేను తనని ఎలా ఫేస్ చెయ్యాలి..." అని అడుగుతాడు అసద్ చాలా అవేదనగ...


అసద్ బాధ పర్వీన్ కి తెలిసిన " నాకు తెలియదా అసద్ నీ గురించి... ఆచారం ప్రకారం నువ్వు నిన్న రాత్రి తన మేలి ముసుగు తియ్యాలి... అందుకే ఆ ఏర్పాట్లు..." అని చెప్తుంది...


పర్వీన్ ఈ క్లారిటీ నిన్ననే ఇచ్చి వుంటే అసద్ అల చేసే వాడు కాదు.. అసద్ అసహనం గా మొహం పక్కకి తిప్పుకునాడు...


పర్వీన్ " నువ్వు ఎం చేస్తావు నాకు తెలియదు అసద్ నేను ఈ రోజు కూడా ఏర్పాట్లు చేస్తాను... కానీ ఈ సారి మాత్రం ఇలాంటిది మళ్లీ జరగకూడదు..." అని అసహనంగా సోఫా లో కూచుంది.


అసద్ మాత్రం ఆలోచనల్లో వున్నాడు... ' అమ్మి ఎందుకు ఇలా పట్టుపడుతుంది... ఏ ఆడపిల్లా అయిన అలాంటి రోజు న ఎన్నో ఆశలు పెట్టుకుంది అని అమ్మి కి ఎందుకు అర్దం కావటం లేదు...' అని ఆలోచనల్లో వున్నాడు...


కిచెన్ లోకి వెళ్ళిన ఆ అమ్మాయి ముందు కాఫీ చేసి బయటకి వచ్చి పర్వీన్ కి ఇచ్చి అసద్ కి ఇచ్చే దైర్యం లేక అసద్ ముందు టేబుల్ మీద కప్ పెట్టింది... అక్కడే వున్న ప్రణయ్ కి కూడా ఒక కప్ ఇచ్చింది...


అసద్ వర్క్ చేసుకునే చోట అసద్ లాప్టాప్ పక్కనే నాలుగు కప్పులు కాఫీ వున్నాయి... అన్ని జస్ట్ సిప్ చేసి వదిలేసినవే... ఆలోచనల్లో వున్న అసద్ కి తల పగిలిపోయి ఎదురుగా చూస్తే... వేడి వేడి పొగలు కక్కుతున్న కాఫీ దర్శనం ఇచ్చింది.


కాఫీ అందుకొని ఒక సిప్ వేసాడు... అందరూ కూడా అసద్ రియాక్షన్ ఎంటి అని చూస్తున్నారు... అక్కడ వున్న పనివాళ్ళు తో సహా... కానీ తను మాత్రం చూడటం లేదు...


అసద్ అవి ఏమి పట్టించుకోకుండా కాఫీ కప్ లో ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేశాడు... అది చూసి ప్రణయ్ షాక్ అయ్యాడు... అసద్ అంత తేలికగా ఏమి తినడు... తాగడు... ఇంటి ఫుడ్ నే తింటాడు... బయట అయితే సన్విచ్, బర్గర్, సలాడ్ లే తింటాడు... ఇంక కాఫీ అయితే పర్వీన్ చేసినదే తాగుతాడు.. ఇంక ఎవరు చేసిన ఫస్ట్ సిప్ చేస్తాడు నచ్చితే తాగుతాడు... నచ్చకపోతే పక్కన పెట్టేస్తాడు... అలాంటిది అసద్ ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగటం చూసి పర్వీన్, ప్రణయ్ లు తాగరు... వాళ్ళకి అయితే డౌట్ వచ్చింది ఇది కాఫీ నే నా... లేక అమృతం ఆ అని అంత బాగుంది...


కొనసాగుతుంది...