Read Will this journey reach the coast.. - 16 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 16

ఉదయం అసద్ లేచే సరికి అతని కుడి చెయ్యి బరువుగా అనిపించి లేచి కూర్చొని అటు చూసాడు.. తన చేతికి కట్టు కట్టి ఆ చేతిని తన రెండు చేతులతో బందీ చేసి పడుకుంది షివి.. అతని ఎడమ చేతితో అతని నుదురు తడుముకొని చిన్న నవ్వు నవ్వి.. ఆ చేత్తోనే షివి తల నిమిరి ఆ చేతిని ముద్దు పెట్టుకొని నెమ్మది తన చేతిని విడిపించుకొని తను లేచి చిన్న గా తన నిద్ర డిస్ట్రబ్ అవ్వకుండా లేపి మంచం మీద పడుకోబెట్టి తను లేచి ఫ్రెష్ అయ్యి ప్రణయ్ కి " లేచిన వెంటనే నాకు కాల్ చెయ్యి.." అని మెసేజ్ పెట్టీ వెళ్ళిపోయాడు అసద్...


కొంచం సేపటికి పర్వీన్ వచ్చే సరికి తన మీద మేలి ముసుగు వేసి వుంది.. తన దగ్గరకి " అమ్మ ధరణి.." అని పిలిచింది.. రాత్రి ఆలస్యంగా పడుకోవటం వల్ల లేట్ గా లేచింది.. " హా అత్తమ్మ.." అని లేచి నిల్చుంది.


పర్వీన్ " అది రాత్రి వాడు.." ధరణి " చూశారు అత్తమ్మ.." అంతే పర్వీన్ ఆనందానికి అవధులు లేవు " సరే అమ్మ ముందు రెఢీ అవ్వు.. వంట చెయ్యాలి.. పూజ చెయ్యాలి కదా.." అని హడావుడిగా వెళ్తారు.. పర్వీన్ నేరుగా ప్రణయ్ గదికి వెళ్తారు...


ధరణి లేచి రెఢీ అయ్యి.. మేలి ముసుగు కూడా వేసుకుంది.. కిందకి వెళ్లి కిచెన్ లోకి వెళ్లి ముందు దేవుడికి నైవేద్యం చేసి టిఫిన్ కోసం అంతా రెఢీ చేసింది...


ధరణి నీ నిద్ర లేపిన పర్వీన్ పరుగున ప్రణయ్ దగ్గరకి వెళ్తుంది.. ప్రణయ్ ఇంక పడుకొనే వుంటాడు.. పర్వీన్ వచ్చి ప్రణయ్ నీ నిద్ర లేపి సంతోషం గ ప్రణయ్ నీ హత్తుకున్నారు..


ప్రణయ్ " ఏమైంది అత్త.. ఇంత పొద్దునే లేపి.." అంటుంటే.. పర్వీన్ " వాడు ధరణి నీ చూసాడు రా.." అంటుంది.


అంతే ప్రణయ్ షాక్.. ' అయితే ఈ రోజు నాకు చాలా పని వుంది..' అనుకొని " అత్త పదా.. నువ్వు కూడా చుద్దువు నీ కోడలిని.." అన్నాడు.


పర్వీన్ " అవును రా నాకు నా కోడలిని చూడాలి అని కోరికగా వుంది.. త్వరగా రెఢీ అవ్వు.." అంటూ ప్రణయ్ నీ తొందర పెట్ట సాగింది..


ప్రణయ్ పర్వీన్ ఆనందం చూసి నవ్వుతూ.. " అత్త నీ కోడలిని చూసాక షాక్ అవుతావు.. జర్రా జాగ్రత్త.." అని అల్లరిగా ఆనాడు...


పర్వీన్ " చాల్లే రా.. త్వరగా రా.." అని వెళ్ళిపోయారు.. ఈ లోగా ధరణి వంట గదిలో నైవేద్యం చేస్తూ వుంది.. వెళ్లి ధరణి కి ఎం చెయ్యాలి అనేది చెప్పి.. నైవేద్యం పూర్తి అయ్యిన తర్వాత పర్వీన్ చెప్పినట్టు పూజ గది కి వెళ్లి పర్వీన్ చెప్పినట్టు పూజ చేసి నైవేద్యం పెట్టి.. తన ఎదురుగా ఒక మూకిటి లో నూనె పోసి అందులో నుండి శివుడి విగ్రహం కనిపించే లా చూసి ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఆ మహేశ్వరుడికి నమస్కరించి పర్వీన్ వైపు తిరిగింది..


పర్వీన్ కూడా తనని చూసి షాక్ అయ్యింది.. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా తన దగ్గరకి వెళ్లి ఆమె భుజాలు పట్టుకొని మెల్లిన తన మొహం అంతా తడిమి చుసుకున్నట్టు తడిమి.. కళ్ళ నీళ్లతో ప్రణయ్ వైపు చూసారు.. ప్రణయ్ ' అవును ' అన్నట్టు కళ్ళ నీళ్లతో తల ఆడించాడు.. పర్వీన్ సంతోషంగా తనని గుండెలకి హత్తుకొని.. కన్నీళ్లు కారుస్తూ వున్నారు..


ఆవిడ తనని చూసి ఎందుకు అంతా ఎమోషనల్ అవుతున్నారు అనేది తెలియక పోయిన కూడా తన చుట్టూ చేతులు వేసి వెన్ను నిమురుతూ " ఏమైంది అత్తమ్మ..." అని అడిగింది..


ప్రణయ్ కి అది చాలు అనిపించింది. అతి త్వరలో మళ్లీ ఈ కుతుంబం లో నవ్వులు వినిపిస్తాయి అని అనిపించింది.. ఎవరైనా మనల్ని చుట్టుకొని బాధ పడుతున్నారు అంటే దాని అర్దం వాళ్ళకి మనం దైర్యం అవ్వాలి అని.. పర్వీన్ బాధ పడుతుంటే దైర్యం చెప్పక పోయిన పర్వీన్ బాధ నీ అర్దం చేసుకొని అక్కున చేర్చుకుంది.. అది చాలదా.. మనం ఆ వ్యక్తి దగ్గర స్వాంతన పొందటానికి... ప్రణయ్ కి చాలా సంతోషంగా వుంది.


పర్వీన్ నెమ్మదిగా స్థిమిత పడి " అహ ఏమి అమ్మ.. నా కొడుకు కి ఇంత అందమైన భార్య దొరికినందుకు సంతోషంతో.." అంటూ కళ్ళు తుడుచుకుంటూ " ఇలా.." అని చెప్తారు..


ధరణి " ఇలా అనొచ్చొ లేదో తెలియదు అత్తమ్మ.. కానీ ఇదే నిజం.. మీ అబ్బాయి లో లోపం వుంది అని మీరు అనుకుంటున్నారు కానీ నాకు మాత్రం ఎం లోపం కనిపించటం లేదు.. అతని మనసు.. బుద్ది అన్ని స్వచంగా వున్నాయి.. అతను నన్ను తప్పుగా కూడా తాకలేదు.. అలాంటిది అతనిలో లోపం వుంది అన్నట్టు చూసి నేను ఏదో అదృష్టవంతురాలు నీ అన్నట్టు మాట్లాడకండి అత్తమ్మ.. నిజానికి నేనే అదృష్టవంతురాలు నీ.. మీ లాంటి మంచి కుటుంబం లోకి కోడలిగా వచ్చాను.." అంటుంది కళ్ళ నీళ్లతో...


ధరణి చెప్పింది అర్దం అయ్యింది.. అసద్ కి కాళ్ళు లేవు అని ఏదో లోపం వుంది అని అనుకుంటున్నారు అని అర్దం అయ్యింది.. కానీ అసలు లోపం తనలోనే వుంది అని తన బాధ.. పెళ్లికి ముందే తల్లి అయ్యింది.. అదే తప్పు కానీ తను ప్రాణం పోసిన పసిగొడ్డు మంచి వాడు.. పైగా పర్వీన్ తన కొడుకును ఒప్పుకుంది.. ఇంక అసద్ నీ ఒప్పిస్తె చాలు.. ప్రణయ్ అసలు అడ్డు చెప్పడు... ఆ విషయం ప్రణయ్ నీ చూస్తేనే అర్దం అయ్యింది.. మొదట్లో ప్రణయ్ నే కదా ధరణి కి తోడు గా వున్నాడు.. అందుకే ప్రణయ్ మీద అంతా నమ్మకం.


పర్వీన్ " అదేం లేదు అమ్మ.. అల అనకు మీరు ఇద్దరూ ఒకరికి ఒకరు దొరకటం మీ ఇద్దరి అదృష్టం.." అని " సరే పద పద టిఫిన్ చేద్దాం.." అని ప్రణయ్ నీ కూడా తీసుకువెళ్ళి టిఫిన్ పెట్టింది..


ప్రణయ్ లో తన అన్నయ్య నీ చూసుకుంటూ వుంది ధరణి.. అల ఏవో వుసులు చెప్పుకుంటూ టిఫిన్ పూర్తి చేసి ప్రణయ్ " అత్త నేను బయటకి వెళ్తున్న.." అని చెప్పి వెళ్తుంటే.. పర్వీన్ " అసద్ ఎడి రా..??" అన్నది కళ్ళ నీళ్లతో... ప్రణయ్ ధరణి వైపు ఒకసారి చూసి " అది చూడటానికే వెళ్తున్న.." అని ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు..


ధరణి " అత్తమ్మ మిమల్ని ఒకటి అడగవచ్చ.."


కొనసాగుతుంది...