Read Will this journey reach the coast.. - 15 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 15

పొద్దునే 7:20 కి ఫ్లైట్ లాండ్ అయ్యింది.. అనిరుధ్ షివి తీసుకొని వాళ్ల కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు.. అసద్ ఎక్కడ వీళ్ళని మిస్స్ అవుతాను అని ఐర్పోట్ లో ఫాస్ట్ గ తన లగేజ్ నీ కలెక్ట్ చేసుకొని వీళ్ళని ఫాలో అయ్యాడు..


షివి చదువుకునే కాలేజ్.. షివి పేరు, తన అన్నయ్య పేరు, తన ఊరు తెలిసాయి.. ఇంక షివి డాన్సర్.. నిన్న ప్రైజ్ అందుకుంది ఈ డిటైల్స్ తో తన కంప్లీట్ డిటైల్స్ కావాలి అని ఒకడిని పురమాయించాడు.


ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్రణయ్ కి షివి గురించి చెప్పి.. ప్రణయ్ నీ తీసుకొని కాలేజ్ కి వెళ్లి షివి నీ ప్రణయ్ కి చూపించాడు.. ప్రణయ్ కూడా ఇద్దరూ మెడ్ ఫర్ ఈచ్ అదర్ లా వున్నారు అని మనసులో అనుకున్నాడు..


డోర్ సౌండ్ అవ్వడం తో గతం నుండి బయటకి వచ్చాడు అసద్.. టైమ్ చూస్తే 7 అయ్యింది.. మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేదు అని పర్వీన్ వచ్చారు అసద్ నీ పిలవడానికి..


నిజానికి పర్వీన్ గారికి, ప్రణయ్ కి ఇది అలవాటే.. అసద్ ఒక సారి తన రూమ్ కి లాక్ వేసుకుంటే ఒక్కో సారి కొన్ని గంటలు.. ఒక్కో సారి రెండు మూడు రోజులు కూడా తియ్యడు.. ఈ మధ్యే తగ్గించాడు అనుకుంటే మళ్లీ ఇవాళ అలానే చేశాడు..


వేరే ఎవరూ వెళ్లి తలుపు కొట్టిన రెస్పాన్స్ రాదు అందుకే పర్వీన్ ఏ స్వయంగా వెళ్ళింది.. అసద్ డోర్ తీసుకొని బయటకి వచ్చాడు.. రూమ్ అంతా చీకటిగా వుంది.. అసద్ నీ తీసుకొని కిందకి వెళ్లి అసద్ కి అన్నం తినిపించారు.. పని వాళ్ళకి చెప్పి అసద్ రూమ్ డెకరేట్ చేయించింది..


అటు అమ్మాయి ని కూడా రెఢీ చేయించారు.. అసద్ కన్న ముందే తను తినేసి వెళ్ళింది.. పర్వీన్ నే బలవంతంగా పంపింది.. అసద్ తిన్నాక.. పర్వీన్, ప్రణయ్ లు తిన్నారు.. కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత టైమ్ చూసింది.. 9:10 లేచి వెళ్ళి ఆ అమ్మాయి నీ అసద్ రూమ్ లో వదిలిపెట్టి వచ్చింది..


కిందకి వచ్చి " అసద్ నువ్వు ఎం చెయ్యాలో నీకు తెలుసు కదా.." అని అన్నారు.. అసద్ కి విషయం గుర్తు చెయ్యాలి అన్నట్టు.. అసద్ అసహనంగా ఫీల్ అయ్యాడు.. పర్వీన్ " వెళ్ళు అసద్.." అన్నారు.. అసద్ " అమ్మి.." పర్వీన్ అసద్ మాట వినలేదు..


అసద్ అది బరించలేక పోయాడు.. వెళ్ళిపోయాడు.. తన రూమ్ నిన్నటి లా డెకరేట్ చేశారు.. వీల్ చైర్ లో లోపలికి వెళ్లి చైర్ బెడ్ కి ఒక వైపు పెట్టీ లేచి వాష్ రూమ్ వైపు వెళ్ళాడు.. ఫ్రెష్ అయ్యి 10 నిమిషాల లో వచ్చి చూసాడు.. మొదట్లో ఎక్కడ నించుంది అక్కడే నుంచొని వుంది.


అసహనం గా ఫీల్ అయ్యి తనని అసలు పట్టించుకోనట్టే వెళ్ళబోయాడు.. ఈ లోగా ఆ అమ్మాయి " ప్లీస్.. " అనే సరికి ఆగిపోయాడు.. తన వైపు చూసాడు మేలి ముసుగు వేసుకొని వుండటం వల్ల మొహం కనిపించటం లేదు.


తను మాట్లాడుతూ " ప్లీస్ మొహం చూడండి.. అత్తమ్మ బాధ పడతారు.." అని అనింది అతి కష్టం మీద.. తన మాటల్లో వణుకు.. భయం తెలుస్తున్నాయి.. అసద్ కి ఇష్టం లేకపోయినా కూడా పర్వీన్ కోసం తప్పదు..


నడుచుకుంటూ తన దగ్గరికి వెళ్ళాడు.. తనకి రెండు అడుగులు దూరం లో వున్నాడు.. అయిష్టం గానే తన మేలి ముసుగు తీస్తున్నాడు.. చేతులు రెండు బిగేసి పట్టుకొని చిన్నగా వణుకుతున్నాయి.. కళ్ళు మూసుకొని తన ముసుగు తీసి కళ్ళు తెరిచాడు..


తను కళ్ళు రెండు గట్టిగ మూసుకొని భయం తో కింద పెదవిని పంటితో కొరుకుతూ చిన్నగా వణుకుతూ వుంది.. తన నుదురు నుండి చెమటలు కారి పోతున్నాయి..


తనని చూసి అసద్ కాళ్ళ కింద భూకంపం వచ్చింది.. అసద్ సత్తువ లేని వాడిలా అయ్యాడు.. కళ్ళు ఎర్రబడ్డాయి.. అసద్ కూడా వణుకుతున్నాడు.. అప్రయత్నం గా అతని నోటి వెంట వచ్చిన పేరు "షివి..."


తనకి భయంగా వున్న కూడా అసద్ పిలిచే సరికి కళ్ళు తెరిచి చూసింది.. ఒకప్పుడు ఏ కళ్ళ మాయలో అయితే పడిపోయాడు ఇప్పుడు అవే కళ్ళు కానీ ఇప్పుడు ఆ కళ్ళల్లో కళ లేదు.. అంతులేని బాధ, భయం మాత్రమే కనిపిస్తున్నాయి..


అసద్ కి అవేశం కట్టెలు తెంచుకుంది.. కావాలని ప్రణయ్ తనకి ఈ పెళ్లి చేశాడు అని.. ఆ కోపంలో షివి పక్కన నుండి వెళ్లి గోడని తన పిడికిలి తో గుద్దాడు...


ఆ సౌండ్ కే ఇక్కడ తను వణికిపోయింది.. వెనక్కి తిరిగి చూస్తే మళ్లీ గుద్దబోతున్నడు.. అంతే వెంటనే వెళ్ళి గోడ కి ఆనుకొని నిలబడింది.. అతని పిడికిలి దెబ్బ కానీ ఆమె మీద పడితే నిమిషాల్లో చనిపోతుంది.. కానీ అసద్ అల చెయ్యలేదు.. ఆ పిడికిలి తనని తాకే ఒక్క సెకను ముందే తన పిడికిలి నీ ఆపేశాడు..


మొదట తగిలిన దెబ్బకి వెళ్ళ దగ్గర చర్మం చిట్లి వస్తున్న రక్తం తన నుదుటిన సిందూరం అయ్యి నిలిచింది.. తను మాత్రం భయం తో కళ్ళు ఇంక మూసుకునే వుంది..


ఒకప్పుడు షివి కి ఇప్పటి షివి కి ఎంత తేడా.. అప్పట్లో అల్లరి తో పాటు కాస్తో కూస్తో మొండి దైర్యం వుండేది.. ఇప్పుడు భయం తప్పా ఏమి లేదు.. అనుకొని తను భయపడటం చూడలేక ఆ చేతిని అలానే తన చెంప మీద వేసాడు..


అసద్ చెయ్యి తన మీద పడిన వెంటనే.. తన జీవితం లో జరిగిన కాల రాత్రి జ్ఞాపకం వచ్చి నిలువునా వణికిపోయింది.. తన లో ఆ భయం అసద్ కి నచ్చలేదు.. అలానే తనని చూస్తూ.. వెనక్కి నడుస్తూ వెళ్లి బెడ్ మీద కులబడ్డట్టు కూర్చుండిపోయాడు...


తన ఎదురుగా కనిపిస్తున్న పెయింటింగ్.. దాని కిందగా నించోని వున్న షివి నీ చూసి.. " కళ్ళు తెరవు షివి.." అన్నాడు..


తను నెమ్మదిగా కళ్ళు తెరిచింది.. ఆ పెయింటింగ్ కి అటు వైపు ఇటు వైపు కొంచెం దూరం లో రెండు డోర్స్ వున్నాయి... పెయింటింగ్ కి లెఫ్ట్ సైడ్ వున్న ది బాత్రూం.. దానికి కనెక్టింగ్ డ్రెస్సింగ్ రూమ్..


అసద్ నెల చూపులు చూస్తున్నాడు.. తను అసద్ వైపే చూస్తుంది.. అసద్ తన కుడి చేతి వైపు చూపిస్తూ " ఆ రూమ్ లో బెడ్ వుంది.. నువ్వు ఆ రూమ్ లో పడుకో షివి.." అన్నాడు..


తను మాత్రం అసద్ నే చూస్తూ వుంది.. అసద్ నీ చూసే హక్కు తనకి మాత్రమే వుంది అన్నట్టు అసద్ కూడా ఏమి మాట్లాడలేదు.. అసద్ తప్పు చేసిన వాడి లా తల వంచుకొని వున్నాడు.. తనకి అది నచ్చలేదు.. ఏదో తప్పు చేసినట్టు తల దించుకోవటం..


అలానే చాలాసేపు వున్నారు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అసద్ చూపించిన గదికి వెళ్ళింది తను.. తను అటు వెళ్ళిన వెంటనే కూర్చున్న చోటే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అసద్.. చాలా సేపు చూసి బయటకు వచ్చింది.. క్రమ బద్ధంగా తీసుకుంటున్న శ్వాసని చూసి అతను పడుకున్నాడు అని నిర్ధారించుకొని వెళ్లి బుక్స్ రాక్ లో ఓ పక్కకి వున్న ఫస్ట్ అయిడ్ బాక్స్ తెచ్చి అసద్ చేతిని క్లీన్ చేసి చేతికి కట్టు కట్టి.. " ఎందుకు మీరు దేనికో బాధ పడుతున్నట్లు అనిపిస్తుంది నాకు.. ఎందుకో తెలియదు కానీ మీ బాధ నీ పంచుకోవాలి అనిపిస్తుంది అసద్ గారు.." అంటూ అసద్ తల నిమిరి అప్రయత్నంగా అసద్ నుదిటి మీద ముద్దు పెట్టి అతని చేతిని తన రెండు చేతులలో వుంచుకొని కింద కూర్చొని అలానే పడుకుంది..


కొనసాగుతుంది...