Read Will this journey reach the coast.. - 12 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 12

పర్వీన్ " నువ్వు ఆఫీస్ కి వెల్లావు కదా రా.." అని అన్నారు.. ప్రణయ్ " ఒక ఫైల్ నీకు ఇచ్చాను కదా ఇంపార్టెంట్ అని అది మర్చిపోయి వెళ్ళాను.. గుర్తు వచ్చి వస్తె మీరు కనిపించలేదు.. గంగ నీ అడిగితే గార్డెన్ లో వున్నారు అంటే వచ్చాను.. అంతే ఇక్కడే ఆగిపోయాను.."


పర్వీన్ " ఎంత సేపు అయ్యింది రా వచ్చి..."


ప్రణయ్ " మా చెల్లి డాన్స్ మొదలు పెట్టక ముందు.."


పర్వీన్ ' సరిపోయింది ' అన్నట్టు లుక్ ఇచ్చి ఇంక ఎవరివో చప్పట్లు వినపడుతు వుంటే అటు చూశారు.. పైగా అసద్ చప్పట్లు కొడుతూ వున్నాడు.. ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాడు...


పర్వీన్ కి ప్రణయ్ కి షాక్ గా వుంది..అసద్ ఎప్పటి నుండి చూస్తున్నాడు..?? అని డౌట్ వచ్చింది.. అసలు అసద్ ఎప్పటి నుండి చూస్తున్నాడు.. ప్రణయ్ ఇంక ఆఫీస్ కి రాలేదు అని ఒక ఇంపార్టెంట్ ఫైల్ కోసం ప్రణయ్ నీ కాంటాక్ట్ చేస్తుంటే ప్రణయ్ లిఫ్ట్ చెయ్యడం లేదు అని ఆఫీస్ నుండి కాల్ వస్తె ' వీడు ఎక్కడికి వెళ్ళాడు..' అని బాల్కనీ లోకి వచ్చి ఫోన్ చెయ్యబోతు అప్పుడే తను షివి కోసం అని స్పెషల్ గా కట్టించుకున్న దాంట్లోకి ఆ అమ్మాయి వెళ్ళే సరికి కోపంగా చూస్తూ వున్నాడు... అతను కళ్ళు ఎర్రబడ్డాయి.. అసలు అయితే కొట్టేయాలని అని అంతా కోపం వచ్చింది.. దగ్గరికి వెళ్లి ఎవరు నువ్వు అని అడగాలి అనిపించింది..


అయిన పర్వీన్ అక్కడ వుండటం తో ఆలోచించి ఆగాడు.. అనుకొని విధంగా ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటే మొదటి సారి ఇలా క్లాసికల్ డాన్స్ చూడటం గుర్తు వచ్చి అప్పుడు ఎలా అయితే చూసాడు ఇప్పుడు కూడా అలానే కళ్ళు అర్ప కూడా చూస్తున్నాడు.. ఎక్కడ కళ్ళు అర్పితే ఒక అద్భుతమైన అజంతా శిల్పం మిస్ అవుతుందో అని అలానే చూస్తూ వున్నాడు.. తన డాన్స్ ఆపి కింద కూల బడే సరికి ఒక్క క్షణం అసద్ కి టెన్షన్ గా అనిపించింది అయిన తన డాన్స్ చూసి చప్పట్లు కొట్టకుండా వుండలేక పోయాడు..


అతనితో పాటు కొడుతున్న చప్పట్లు ఆగిపోవటం అతని కాల్ రావటం ఒకే సారి జరగటం తో ఫోన్ వైపు చూసాడు.. ఫోన్ రింగ్ అప్పుడే ఆగిపోయింది.. అప్పటికే 30 మిస్డ్ కాల్స్ వున్నాయి.. అసలు ఆ డాన్స్ చూస్తుంటే తనకి ఫోన్ కాల్ కూడా చెవికి ఎక్కలేదు.. ఈ లోగా మళ్లీ ఫోన్ మోగితే మీటింగ్ పోస్ట్ పోన్ చెయ్యమని చెప్పి కట్ చేసి ఆ అమ్మాయి వైపు ఒక సారి చుసి లోపలికి వెళ్లి బాల్కనీ డోర్స్ క్లోజ్ చేసుకొని కర్తెన్స్ వేసి డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ కి కొంచం పైకి వున్న లైట్ ఒక్కటి వేసుకొని బెడ్ ఎదురు వున్న పెయింటింగ్ నీ రివర్స్ లో తిప్పాడు.. అప్పుడు గానీ అర్దం కాలేదు అది ఒక సీనరి ఫోటో కాదు అది షివి ఫోటో.. ఆ ఫోటో లో స్వచంగా నవ్వుతున్న షివి నీ చూస్తే మళ్లీ మళ్లీ ప్రేమ లో పడుతున్నాడు అసద్.. ఆ ఫోటో పెయింటింగ్ వేసింది అసద్ నే.. ఆ ఫోటో చూస్తూ తన గతం లోకి వెళ్ళాడు.. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం షివి నీ మొదటి సారి చూసిన రోజు గుర్తు వచ్చింది..


సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం అసద్ తన కంపనీ నీ స్థాపించి సంవత్సరం లోనే ఎదురు లేని వాడిలా గొప్ప గొప్ప మహా మనులనే ఎదిరించి దైర్యం గా ముందు అడుగు వేస్తున్నాడు..

అసలు అసద్ దమ్ము కి దైర్యనికి ఏ బిజినెస్ మెన్ కి అయిన చెమటలు పడుతున్నాయి.. అసద్ తెలివి అలాంటిది.. ఎదురువున్న వాడు ఎవడు ఎంత పెద్ద వాడు అని లేకుండా.. డీ అంటే ఢీ అని అతని తెలివి ఆలోచన అవేశం తో కూడిన తెలివితో ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ ఎదుగుతూ వచ్చాడు..


అలానే ఒక ప్రిస్తేజియస్ ప్రాజెక్ట్ ఒకటి ఎనౌన్స్ చేశారు.. ఆ ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి హైద్రాబాద్ కి రమ్మని చెప్పారు... ఇండియా లో వున్న టాప్ బిజినెస్స్ మెన్స్ అందరూ ఆ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నారు.. అందులో అసద్ కూడా వున్నాడు..


అందుకే హైద్రాబాద్ కి వచ్చాడు... అసద్ వుండడానికి నోయిడా లో వున్న కూడా అతనికి తెలుగు చాలా బాగా వచ్చు.. ఎందుకు అంటే అతని తండ్రి తెలుగు వాడు.. పైగా పర్వీన్ కూడా తెలుగు రాష్ట్రం లో పుట్టి పెరిగిన ఆమే..


హైద్రాబాద్ కి వచ్చి రెండు రోజులు వుండాలి కాబట్టి అలానే అన్ని ముందుగానే బుక్ చేసుకున్నాడు.. ఆ రోండు రోజులు వుండటానికి హోటల్ అంతా కూడా బుక్ చేసుకున్నాడు.. ప్రణయ్ కి పది సంవత్సరాల వయసు వున్నప్పుడే పర్వీన్ కి దొరికాడు..


అల ప్రణయ్ నీ కూడా అసద్ తో సమానంగా చూసేది పర్వీన్.. ప్రణయ్ కూడా పర్వీన్ నీ అత్త అని పిలిచే వాడు.. అప్పటి నుండే అసద్ ప్రణయ్ లు బెస్టీస్ అయ్యారు.. అసద్ తన లైఫ్ లో అన్ని కూడా ప్రణయ్ తో పంచుకుంటాడు.. అండ్ అసద్ స్టార్ట్ చేసిన కంపనీ కూడా ప్రణయ్, అసద్ ఇద్దరూ పార్టనర్స్ గా పెట్టారు.. ప్రణయ్ ఎండీ అయితే అసద్ సీఈఓ.. అలానే నోయిడా నీ ప్రణయ్ కి అప్పజెప్పి అసద్ హైద్రాబాద్ వచ్చాడు..


ఆ రెండు రోజులు మీటింగ్ హోరాహోరీగా జరిగింది.. చాలా కంపనీ లు అందులో పర్టిపెట్ చేశాయి.. అందులో కొంత మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి నెక్స్ట్ డే మీటింగ్ ఏర్పాటు చేశారు.. అందులో అసద్ కూడా వున్నాడు.. అక్కడి బిజినెస్స్ పీపుల్ లో ఒక తెలుగు బిజినెస్స్ మేన్ తో అసద్ ఫ్రెండ్షిప్ కుదిరింది.. ఆ రోజు అసలు కాలి లేకుండా అతని దగ్గర బిజినెస్స్ కి కావాల్సిన నాలెడ్జ్ నీ సంపాదిస్తున్నాడు.. అల ఆ రోజు గడిచిపోయింది.


ఆ తర్వాత రోజు మార్నింగ్ సెక్షన్ లోనే చాలా వరకు క్లియర్ అయ్యారు.. ఒక ఐదుగురు నీ హోల్డ్ చేశారు అందులో అసద్ కూడా వున్నాడు.. అయితే మిగిలిన నలుగురిలో ఇద్దరూ క్రురమైన బిజినెస్స్ మెన్స్ కలిసి అసద్ నీ ఎలా అయిన తప్పిస్తే అతని తర్వాత బెస్ట్ అయిన వాళ్ల కంపనీ కే ప్రాజెక్ట్ రావటం జరుగుతుంది అని ప్లాన్ చేశారు.. లంచ్ బ్రేక్ ఇవ్వడం తో అసద్, ఇంక అతని తెలుగు ఫ్రెండ్ కలిసి మీటింగ్ జరిగే రిసార్ట్ లోనే రెస్టారెంట్ వుంటే అక్కడే భోజనం కోసం వెళ్లారు..


అసద్ ఫుడ్ చూసి అతను " ఎంటి అసద్ ఎప్పుడు ఈ బర్గర్, సలాడ్ లేనా.. ఇంకేమి తినవ.. మా తెలుగు భోజనం ఎలా వుంటుందో ఒక సారి రుచి చూడు.." అన్నాడు.


అసద్ చిన్నగా నవ్వి " నేను రోజు తినేది తెలుగు భోజనమే.. కాకపోతే నాకు బయట ఫుడ్ పడదు.. అందుకే ఇవి.." అని అంటాడు.. అతను ఫుడ్ తిని జుస్ తాగే లోపు ఎవరో వచ్చి తన చెయ్యి పట్టుకొని ఇంకో చేత్తో చేతిలో వున్న గ్లాస్ నీ తోసేశారు..


అది చూసి కోపం వచ్చిన అసద్ కోపంగా తన చేతిని పట్టుకున్న వ్యక్తి వైపు చూస్తే.. ఒక అందమైన అమ్మాయి.. కాటుక దిద్దిన కళ్ళు, చిన్న ముక్కు, బుజ్జి పెదవులు.. అందంగా ఆకటుకున్న ఆ కళ్ళు.. ఆ కళ్ళలోకి చూస్తూ వున్నాడు..


కొనసాగుతుంది...