Read Will this journey reach the coast.. - 13 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 13

ఆ అమ్మాయి " సారీ బాస్.. నేను ఆ టేబుల్ లో కూర్చొని వున్నాను.. ఇందాక మీకు ఈ జూస్ సర్వ్ చేస్తున్న అతను మా పక్క టేబుల్ మీద పేట్టి ఏదో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి ఇందులో కలిపి మీకు ఇచ్చాడు.. ఎందుకో అతని వాలకం చూస్తే డౌట్ వచ్చి ఎవరికి ఇస్తున్నది చూసాను మీకు ఇచ్చాడు.. ఒక వేళ అది ప్రమాదకరం అయితే.. వామ్మో.. అందుకే ఇలా చేశాను.. కావాలి అంటే నేను ఇంకో జూస్ ఆర్డర్ చేస్తాను.." అని సర్వర్ నీ పిలబోయి ఆగి " బెటర్ మీరు ఇక్కడ వున్న అంతా సేపు కొంచెం జాగ్రత్తగా వుంటే మంచిది.. ఇప్పుడు ఇలాంటివి ఏమీ వద్దులెండి బాస్.." అని చెప్పి తను ఇంటి నుండి తెచ్చుకున్న వాటర్ బాటిల్ అతనికి ఇచ్చి వెళ్ళిపోయింది..


అసద్ మాత్రం అలానే వున్నాడు.. అతని ఫ్రెండ్ కదపటం తో ఈ లోకం లోకి వచ్చి అతని డ్రెస్ క్లీన్ చేసుకొని వచ్చే సరికి అతను " అసద్ అటు చూడు " అన్నాడు.. అక్కడ ఒక చిన్న పిల్లి కదలకుండా చలనం లేకుండా పడి ఉంది.. దానిని చుసి " ఏమైంది.." అడిగాడు అసద్.


అతను " ఇందాక నువ్వు తాగబోయిన జూస్ అది తాగింది అసద్ అది తాగిన వెంటనే అది అల పడిపోయింది.. అంటే అందులో ఏదో పాయిజన్ కలిపినట్టు వున్నారు.. నిజంగా ఆ అమ్మాయి కరెక్ట్ టైమ్ కి వచ్చింది లేకపోతే నా.. వామ్మో.. ఊహించుకోవటానిక్ భయం వేస్తుంది." అన్నాడు.


అసద్ కి ఆ అమ్మాయి గుర్తు వచ్చింది.. ' నిజంగా నా ప్రాణాలు కాపాడిన దేవత... యూ అర్ మై ఏంజెల్..' అనుకున్నాడు మనసులో.. అలానే మీటింగ్ కి అటెండ్ అయ్యాడు.. ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని డౌట్స్ రైస్ చేశారు అందరూ ఆన్సర్ చేశారు.. టైమ్ నాలుగు మళ్లీ బయట వెయిట్ చెయ్యమని పంపారు..


అసద్ కి టెన్షన్ గా వుంది.. ఈ ప్రాజెక్ట్ గాని అతను దక్కించుకుంటే అతని కి ఇంక తిరిగే లేదు.. అన్ని ప్రాజెక్ట్స్ అతని కాళ్ళ కిందకి వస్తాయి.. అందుకే అతని ఆరాటం.. ఆ టెన్షన్ ఎక్కువ అవుతుంది.. పానిక్ అవ్వసాగడు.. అతని పక్కన వున్న అతను కళ్ళు మూసుకొని నీకు ఇష్టమైన వాళ్ళని తలుచుకో టెన్షన్ వుండదు అని చెప్పాడు..


అసద్ కళ్ళు మూసుకుంటే అతని కళ్ళ ముందు ఇందాక అతని చెయ్యి పట్టుకొని గ్లాస్ విసిరేసిన అమ్మాయి.. ఆమె కళ్లే తన కళ్ళ ముందు మెదిలాయి.. ఆ కళ్ళు.. ఎం వున్నాయి.. సముద్రం అంత లోతు.. ఆకాశం అంతా కాంతి.. ఏదో ఆకర్షిస్తుంది.. ఎంటి అది.. అని అలానే కొంచం సేపు వున్నాడు.. ఆ తర్వాత అతని పక్కన వున్న అతను పిలవటం తో కళ్ళు తెరిచి చూసి అతని పెదవులు విచ్చుకున్నాయి..


ఈ లోగా అతనికి పిలుపు వచ్చింది.. అతనికే ప్రాజెక్ట్ ఫైనల్ చేశారు.. అసద్ సంతోషానికి అవధులు లేవు.. చాలా సంతోషంగా వెళ్లి బయట వున్న తన ఫ్రెండ్ నీ వాటేసుకొని అతని కి విషయం చెప్పాడు.. అతను కూడా హ్యాపీ.. పార్టీ కావాలి అన్నాడు అసద్ " sure " అన్నాడు..


ఈ లోగా మిగిలిన వాళ్ళు కూడా వచ్చి విష్ చేశారు.. ఒకడు మాత్రం వార్నింగ్ ఇచ్చాడు.. " నాకు నిన్ను ఇక్కడ చూసినప్పుడే అనుమానం వచ్చింది.. అయిన లైట్ తీసుకున్న కానీ ఇవాళ ఫైనల్ కాడిడెట్స్ లో నిన్ను చూసి కోపం వచ్చి చంపించాలి అని చూసాను.. జస్ట్ మిస్ ఆ అమ్మాయి వచ్చి కాపాడింది లేకపోతే ఈ పాటికి నీ స్టొరీ ఫినిష్.. అని అయిన నువ్వు ఈ ప్రాజెక్ట్ అనుకున్న టైం కి పూర్తి చెయ్యాలి కదా..చూద్దాం అన్నాడు.." షేక్ హ్యాండ్ కోసం పట్టుకున్న అసద్ చెయ్యి పట్టు బిగుసుకుంది.. అసద్ పట్టు కి నొప్పి పుట్టి అతను చెయ్యి లాగేసుకుని వెళ్ళిపోయాడు..


కానీ అసద్ మాత్రం వదలలేదు.. వెంటనే ఆ రిసార్ట్ సీసీ ఫుట్టేజ్ కలెక్ట్ చేసి అతను అసద్ తో మాట్లాడిన మాటలు రికార్డ్ అవ్వటం చేత ఆ ఫుట్టేజ్.. తో పాటు కింద రెస్టారెంట్ లో ఆ అమ్మాయి అసద్ చెయ్యి పట్టుకొని నెట్టడం జూస్ కింద పడటం ఆ కింద పడిన జూస్ పిల్లి తాగటం విత్ ఇన్ సెకండ్స్ లో పిల్లి చనిపోవటం.. ఇంక వెయిటర్ ఆ జూస్ లో ఏదో కలపటం హోటల్ బ్యాక్ సైడ్ అసద్ కి వర్న్ చేసిన వ్యక్తి ఆ వెయిటర్ తో మాట్లాడి ఆ ప్యాకెట్ ఇవ్వటం మొత్తం కలెక్ట్ చేసి అటెంప్ట్ టూ మర్డర్ కేస్ ఫైల్ చేసి.. బిజినెస్స్ పరంగా అతని నీ క్లోజ్ చేశాడు.. అతను ఇంక ఏ బిజినెస్స్ పెట్టడానికి లేదు.. అలాగ తీర్పు వచ్చేలా అసద్ అతని మీద కేస్ పెట్టాడు..


అప్పుడు అసద్ వయసు 24.. హైట్ ఆరు అడుగుల ఎత్తు క్లీన్ షేవ్ చేసుకుని పెర్ఫెక్ట్ బిజినెస్స్ మేన్ లా వున్నాడు.. చురకత్తుల లాంటి కళ్ళు.. భాణం లాంటి చూపు.. తీక్షన.. ఎర్రటి గులాబీ రేకుల్లాంటి పెదవులు.. ఇది అసద్ స్ట్రక్చర్...😜😜😜😜


అప్పటికి టైమ్ 6 అయ్యింది ఇందాక పార్టీ అడిగిన ఫ్రెండ్ కి ఒక కాల్ వచ్చింది అతని గర్ల్ఫ్రెండ్ కి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం తనకి నేర్చుకోవటం కుదరలేదు అని ఎక్కడ క్లాసికల్ డాన్స్ జరిగిన అక్కడికి వెళ్తుంది.. తనతో పాటు ఇతనిని తీసుకెళ్తుంది.. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి లో బెస్ట్ క్లాసికల్ డాన్సర్ కాంపిటీషన్ ఫైనల్స్ టికెట్స్ కొనింది మూడు.. తన కసిన్ హ్యాండ్ ఇవ్వడంతో ఇతనికి కాల్ చేసింది.. మూడు టికెట్స్ వుండటం తో అసద్ నీ కూడా లాక్కువెల్లాడు.. నిజానికి అసద్ కి మామూలు డాన్స్ నే రాదు ఇంక క్లాసికల్ డాన్స్ అంటే పరమ భోర్ గా ఫీల్ అవుతాడు కానీ తను వచ్చిన దగ్గర నుండి అతను తనకి సహాయం గా వున్నాడు ఆ విషయం గుర్తు వచ్చి ఒక రెండు గంటలు కళ్ళు మూసుకుంటే సరి అని అనుకొని వచ్చాడు..


షో స్టార్ట్ అయ్యింది అసద్ కి అయితే నిద్ర వస్తుంది.. అలానే కూని రాగాలు తీస్తూ వుండటంతో మైక్ లో ఏంకర్ మాటలకి మళ్లీ లోకం లోకి వచ్చి ఇక్కడ అతను ఫీల్ అవుతాడు అని ఫేస్ వాష్ చేసుకున్నాడు.. ఈ లోగా స్టేజ్ మీదకు ఒక అమ్మాయి వైట్ సారీ విత్ రెడ్ బోర్డర్ కట్టుకొని వచ్చి వెనుకకి తిరిగి నించుంది..


మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది.. మ్యూజిక్ కే అసద్ కి పోయిన నిద్ర మళ్లీ వచ్చింది.. అయిన అలానే బలవంతంగా చూస్తున్నాడు.. కానీ ఆ అమ్మాయి డాన్స్ చేస్తూ ఇటు తిరిగే సరికి షాక్ అయ్యాడు.. తను మధ్యాహ్నం తనని కాపాడిన అమ్మాయి.. ఆమే కళ్ళు కాటుకు దిద్దిన కళ్ళు ఏదో మాజిక్ చేస్తుంది అతనిని అలానే చూస్తున్నాడు.. ఆమె వేసే నాట్యం కన్న కూడా ఆమె కళ్ళు వేసే నాట్యం అతనికి బాగా నచ్చింది.. అలానే చూస్తూ వున్నాడు..


ఫైనల్ రౌండ్ కి తను ఇంకో అమ్మాయి సెలెక్ట్ అయ్యారు.. ఎక్కువ సేపు ఎవరు చేస్తే వాళ్ళే విన్ అల మళ్లీ తన డాన్స్ చూసాడు.. దాదాపుగా గంట కన్న ఎక్కువ సేపే ఆపకుండా డాన్స్ చేసింది తను.. కానీ అసద్ మాత్రం తన కల్లనే చూస్తూ వున్నాడు..


అందరూ డాన్స్ చేస్తుంటే చూసేది వంపుసోపులు అయితే పాపం అసద్ ఆ కళ్ళ మాయ లో పడిపోయాడు.. విన్నర్ గా తనని కాపాడిన అమ్మాయి నే గెలిచింది.. అసద్ కి అయితే వెళ్లి హగ్ చేసుకోవాలి అనిపించింది.. కానీ తమాయించుకున్నాను అంత ఆనందంగా వుంది.. తన గెలుపు.. ఆమె గెలుపు అయ్యింది.. ఆమె గెలుపు లో తనకి వాట ఇచ్చింది..


యాంకర్ అనౌన్స్ చేస్తుంది.. " మిస్ షివిధ 19 సంవత్సరాలకే బెస్ట్ క్లాసికల్ డాన్సర్ అవార్డ్ తీసుకుంది అని ఇంక ఏదో చెప్పుకుంటూ పోతుంది.." ఇంక అసద్ ఎం పట్టించుకోలేదు.. తన పేరు షివిధ.. వయసు 19.. అతనికి ఆమె కి సరిగ్గా సరిపోతుంది అనుకున్నాడు.. అలానే నవ్వుకున్నాడు అతని ఇమాజినేషన్ ' నీకు ఆ అమ్మాయి కి సరిపోయేది ఎంటి రా.. పడిపోయావ ఎంటి కొంపదీసి అనుకోని.. అందంగా సిగ్గుపడ్డాడు.. అవును పడిపోతే తప్పు ఎంటి??' అని అనుకున్నాడు...


కొనసాగుతుంది...