Read Will this journey reach the coast.. - 9 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 9

కార్ లో వెళ్ళిన అసద్ ఎక్కడికి వెళ్తున్నాడు... ఎలా వెళ్తున్నాడు.... అనేది తెలియదు కానీ చాలా స్పీడ్ గా హై వే మీద దూసుకు పోతున్నాడు... చాలా దూరం వెళ్లి చూస్తే సమయం 1 అయ్యింది... ఇంక ముందుకు వెళ్తే తెల్లారే సరికి ఇంట్లో వుండటం అసాధ్యం... పర్వీన్ లేగవక ముందే అసద్ ఇంట్లో వుండాలి... ఒక పర్వీన్ లేచి అసద్ కోసం చూస్తే... అసద్ ఇంట్లో లేడు అని తెలిస్తే... ఆ అమ్మాయి నీ అల మొదటి రాత్రి రోజు ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినందుకు పరిణామాలు చాలా దారుణంగా వుంటాయి అని అసద్ కి తెలుసు... పైగా అల చూస్తే పర్వీన్ ఇంక బాధ పడతారు... అది అసద్ కి అస్సలు ఇష్టం లేదు అందుకే రిటర్న్ అయ్యాడు...


అసద్ ఇంటికి వచ్చే సరికి 4 అయ్యింది... నేరుగా తన గదికి వెళ్ళాడు... అక్కడ తన రూమ్ మొత్తం సుగంధాలు చిమ్మే కొన్ని రకాల పూలు... మత్తెక్కించే సువాసనలు... గుప్పుమంది... ఎం వున్న... ఎన్ని వున్నా... ఎంటి లాభం..?😏 అని ఒక విరక్తి నవ్వు నవ్వుకొని లోపలికి కొన్ని అడుగులు వేసిన వెంటనే అక్కడ తన బెడ్ కి అనుకోని కింద కూర్చొని మేలి ముసుగు వేసుకొని పడుకొని వున్న ఒక అమ్మాయి కనిపించింది...


తను తన కంట పడిన మరుక్షణం చూపు తిప్పుకొని వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి అతను పెర్సనల్ లాప్టాప్ తీసుకొని కింద హాల్ లోకి వెళ్లి అక్కడే సోఫా లో కూర్చొని వర్క్ చేసుకుంటూ వున్నాడు...


ఎంత సేపు వున్నాడో తెలియదు కానీ ప్రణయ్ వచ్చి పలకరించే వరకు అలానే వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు..


ప్రణయ్ " ఎంటి రా ఇది... ఇంత పొద్దునే లేచి వర్క్ చెయ్యక పోతే ఏమైంది... కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా... ఐదు సంవత్సరాల నుండి విశ్రాంతి లేకుండా పని చేస్తూనే వున్నావు... కనీసం ఇప్పటి నుండి అయిన నీ గురించి అలోచించి రెస్ట్ తీసుకో రా..." అని అన్నాడు...


అసద్ " అప్పటికి ఇప్పటికి నాలో ఎం మార్పు లేదు... ప్రణయ్..." అని సమాధానం చెప్పాడు... వెనుకే వుండి వీళ్ళ మాటలు విన్న పర్వీన్ కి బాధ గా వున్న కూడా లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంటి కోడలు ఇంక కంట పడకపోతే ' ఏమైందో చూద్దాం...' అని అసద్ గదికి వెళ్ళే సరికి బెడ్ కి అనుకోని కింద కూర్చొని నిద్రపోతున్న ఆ అమ్మాయి నీ చుసి దగ్గరకి భుజం మీద చెయ్యి వేసి " అమ్మ.." అని మాట పూర్తి కాక ముందే...


తన మీద ఎవరిదో కొత్త చెయ్యి అయ్యే సరికి ఎంత మంచి నిద్ర లో వున్నా కూడా ఉలిక్కి పడి లేచింది తను...


తను కంగారు పడటం చూసి ఎక్కడో అనుమానం గా వున్నా కూడా... " అమ్మ ఇదిగో చీర... ఫ్రెష్ అయ్యి స్నానం చేసి ఈ చీర కట్టుకో... అని చెప్పి... నీకు ఇక్కడ ఏ ఇబ్బందీ వున్నా... నీకు అమ్మ లాంటి దాన్ని నాకు చెప్పు..." అని అంటుంది...


తను తల ఊపి " అలాగే అండి." అంటుంది... పెళ్లి జరిగినప్పటి నుండి మొదటి సారి తన మాట ఇదే వినటం... గొంతు చాలా బాగుంది... అనుకుంది పర్వీన్... ఎంత గొంతు బాగుంటే ఎంటి... పిలుపు బాగుండాలి కదా... అని " అదేంటి అమ్మ అండి అని బయట వాళ్ళని పిలిచినట్టు పోతున్నావు... మీ అమ్మ నాన్నలు లేరు అంట కదా... నీకు నేను అమ్మ లాంటి దాన్నే... అందుకని అత్తమ్మ... అని పిలువు..." అంటుంది...


తను " అలాగే అ... త్త... మ్మ..." అని అతి కష్టం మీద అంటుంది... తను అల పిలవగానే సంతోషం వుప్పొంగి ముందుకు వచ్చి మేలి ముసుగు మీద నే తన నుదిట ముద్దు పెట్టుకొని... " సరే వెళ్లి ఫ్రెష్ అవ్వు అమ్మ... పద్దతి ప్రకారం ఈ రోజు నువ్వు ఏదో ఒక స్వీట్ చెయ్యాలి... నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చే సరికి నీ లగేజ్ ఇక్కడ పెట్టిస్తాను..." అని చెప్పి వెళ్ళింది పర్వీన్...


తను అలాగె ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చి ఆ మేలి ముసుగు నీ మళ్లీ కప్పుకొని చూసే సరికి ఆ రూమ్ లో తన లగేజ్ వుంది... బెడ్ మీద తన ఫోన్ వుంది... తన ఫోన్ నీ చేతిలోకి తీసుకొని గది మొత్తం తిరుగుతూ గ్లాస్ డోర్ వున్న వైపు వస్తె ఆ డోర్స్ ఓపెన్ చేసి వున్నాయి...


చూస్తే అది ఒక బాల్కనీ... చుట్టూ చెట్లు... పక్కనే వుయ్యల వున్నాయి కానీ పరిసరాలు పట్టించుకునే స్థితిలో లేదు తను... ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసింది... నేను ఇక్కడ రెండు వైపులా మాటలు చెప్తాను...


ఫోన్ రింగ్ అవుతుంది... మొదటి రెండు రింగ్లకే ఫోన్ లిఫ్ట్ చేశారు అవతల వాళ్లు...


" హెల్లొ..." చాలా మధురమైన గొంతు తనది.


అవతల వాళ్లు " హెల్లొ ఎలా వున్నావు... "


మధురమైన గొంతు " గుడ్ మార్నింగ్ రా..."


అవతల వాళ్లు " గుడ్ మార్నింగ్...😊😊😊"


మధురమైన గొంతు " అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావా..."


అవతల వాళ్లు " లేదు... బుద్దిగా వున్నాను..."


మధురమైన గొంతు " గుడ్... అక్కడ ఎవరికి ఎదురు చెప్పకు..."


అవతల వాళ్లు " మ్మ్...😞"


మధురమైన గొంతు " ఎంటి వాయిస్ డల్ అయ్యింది... మిస్స్ అవుతున్నవా..."


అవతల వాళ్లు " చాలా...😞😞😞 ఎప్పుడు వస్తావు...??"


మధురమైన గొంతు " త్వరలోనే వస్తాను నాన్న... నువ్వు ఎం దిగులు పెట్టుకోకు... బీ ఏ గుడ్ బోయ్..."


అవతల వాళ్లు " మ్మ్...😞😞"


అవతల వాళ్లు అంత డల్ గా మాట్లాడటం అర్దం అయ్యి... " సరే... మరి... నేను ఈ రోజు నిన్ను బాగా మిస్స్ అయ్యాను..."


అవతల వాళ్లు " నేను కూడా..."


మధురమైన గొంతు " మరి ఆ ఫీల్ పోవాలి అంటే ఎం చెయ్యాలి...🤔🤔🤔"


అవతల వాళ్లు " ఎం చెయ్యాలి...🤔🤔🤔"


మధురమైన గొంతు "🤔🤔🤔🤔...హా ఒక ఐడియా..."


అవతల వాళ్లు " ఎంటి అది..."


మధురమైన గొంతు " మన డైలీ లంచం ఇచ్చేయి... అప్పుడు మిస్స్ అవుతున్న ఫీల్ రాదు..."


అవతల వాళ్లు " 🤩🤩🤩🤩🤩🤩ఒకే... వుమ్మా....💋💋💋💋💋..."


మధురమైన గొంతు " 🤩🤩🤩🤩 థాంక్యూ బంగారం..."


అవతల వాళ్లు " థాంక్యూ అంటే కాదు నాకు కూడా కావాలి...😏😏😏"


మధురమైన గొంతు " 🤩🤩🤩🤩ఒకే... 💋💋💋💋💋💋... ఇప్పుడు హ్యాపీ నా..."


అవతల వాళ్లు " చాలా..."


మధురమైన గొంతు " ఒకే నాన్న బై..."


కొనసాగుతుంది...


ఏంటి కొత్త క్యారెక్టర్ అనుకుంటున్నారా.. కాదండి పాతదే..