Read Will this journey reach the coast.. - 8 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 8

పర్వీన్ కి మాటలు రావటం లేదు... అసద్ " అమ్మి ..." అని పిలిచాడు పర్వీన్ వడిలో నుండి లేచి... అయిన పర్వీన్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా దైర్యం తెచ్చుకొని " అసద్ ఈ రోజు మీకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నాము... ఏమి చెయ్యాలో నీకు తెలుసు కదా..." అని అడిగారు...


అసద్ కి కోపం వచ్చేసింది... కళ్ళు ఎర్రబడ్డాయి... పిడికిలి బిసుకుంది... ఏమి మాట్లాడకుండా లేచి అతని వీల్ చైర్ లో కూర్చొని వెళ్ళిపోయాడు...


అసద్ ఏమి మాట్లాడ కుండా వెళ్ళే సరికి లోపల బాధగా వున్నా కూడా పనివాళ్లని పిలిపించి ఆ గది నీ అలంకరించి రమ్మని పురమాయించి వెళ్ళిపోయారు పర్వీన్...


గది నుండి బయటకి వచ్చిన అసద్ గార్డెన్ కి వెళ్ళాడు... అక్కడ వీస్తున్న చల్ల గాలి నీ కూడా ప్రశాంతంగా ఆస్వాదించలేరు... అహ్వనించలేడు... అలాగే కళ్ళు మూసుకొని ' ఎందుకు అమ్మి నీకు అర్దం కావటం లేదు... నేను తనని శారీరకంగా కానీ మానసికంగా కానీ తనని నేను సుఖ పెట్టలెను... అది ఎందుకు నీకు అర్దం కావటం లేదు...' అని అనుకోని చాలా సేపు అక్కడే వున్నాడు అసద్.


ఎంత సేపు అక్కడే అలానే కదలకుండా వున్నాడో తెలియదు కానీ కిందకి వచ్చి ఆలోచనలు మొదలు అయిన చాలా సేపటికి అతను ఒక నిర్ణయానికి వచ్చి వెంటనే పార్కింగ్ లాట్ కి వెళ్లి అతని కార్ లో కూర్చున్నాడు...


అసద్ కి నడవటం రాకపోయినా రోజులో అతి తక్కువ సేపు నడవగలిగిన కూడా అతను డ్రైవింగ్ నీ నేర్చుకున్నాడు... అది కూర్చొని చేసే పని అయిన కూడా కాళ్ళు కదపాలి కదా... ఎంత కష్టం వున్న కూడా డ్రైవింగ్ నీ మాత్రం వదలలేదు...


అలానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు.... ఎక్కడికి వెళ్ళాడు...🤔🤔🤔🤔 మీకు ఎమైన తెలుసా ఫ్రెండ్స్...



అక్కడ పెళ్లి కూతురు నీ రెఢీ చేసి అసద్ రూమ్ కి పంపించారు పర్వీన్... ఆ అమ్మాయి రూమ్ లోకి వెళ్ళింది... రూమ్ చాలా అంటే చాలా పెద్దది... దాదాపుగా ఒక పడి కార్లు పార్క్ చేసుకోవచ్చు ఆ బెడ్ రూం లో...🙄🙄🙄....


తనకి ప్రస్తుతం వున్న భయం వల్ల తను అంతగా ఆ గది నీ పరిశీలించి చూడలేదు... చూసే ఇది కూడా లేదు... చాలా భయం గా వుంది... ఒక వేళ తను ఒప్పుకోక పోతే మృగం లా తన పశు తత్వాన్ని చూపిస్తే... అనే ఆలోచనే తను నిలువునా వణికిపోతుంది .... అరికాలులో నుండి మొదలు అయ్యింది... ఒంటి నిండా పాకింది.... గుండె దడ గా వుంది.... చాలా సేపు తను వచ్చినప్పటి నుండి ఎక్కడ అయితే నుంచిందో... అక్కడే అలానే నుంచొని వుంది... చాలా సేపు నుంచొని కాళ్ళు నొప్పులు పుట్టి... కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంటే నెమ్మదిగా తల ఎత్తి చూసింది ఆ రూమ్ మొత్తం నిశ్శబ్ధం గా వుంది... ప్రస్తుతం తనకి వినిపిస్తున్న రెండు శబ్దాలు అఒకటి తన గుండె చప్పుడు తనకే వినిపిస్తుంది... రెండవది గడియారం లో వున్న ముళ్ళు శబ్ధం... నిజం చెప్పాలి అంటె తనకి ఆ గడియారం లో వినిపిస్తున్న సెకను ముళ్ళు చేసే శబ్దానికి కూడా తన గుండె పెలిపోతుంది ఏమో అని భయం వేస్తుంది.


నెమ్మదిగా తల ఎత్తి గడియారం వైపు చూస్తుంది... సమయం 3 అవుతుంది... ఎక్కడ పడుకుంటే ఎం అంటారో అని ఒక సారి రూమ్ అంతా కలియ చూసింది....


అంత పెద్ద బెడ్ రూం లో పెద్ద కింగ్ సైజ్ బెడ్... బెడ్ కి లెఫ్ట్ సైడ్ అంతా కూడా పెద్ద బుక్ రాక్ వుంది... అందులో ఒక వైపు ఆఫీస్ లో ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని వున్నాయి... ఇంకో వైపు బిజినెస్స్ కి సంబందించిన కొన్ని బుక్స్, కొంత మంది పెద్ద పెద్ద బిజినెస్స్ మగ్నెట్స్ యొక్క ఇంటర్వ్యు లు, వాళ్ల ఎక్స్పీరియన్స్.., బిజినెస్స్ లో మెళకువలు కి సంబందించిన చాలా బుక్స్ వున్నాయి... వాటిని చదువుకోవటానికి వీలుగా వాటి దగ్గర్లో రెండు పెద్ద పెద్ద సోఫాలు... వాటి ఎదురు నాలుగు చిన్ని చిన్ని సింగిల్ సోఫా లు వున్నాయి...


బెడ్ కి రైట్ సైడ్ లో ఒక రూమ్ వుంది... రూమ్ వున్నట్టు కూడా తెలిసేది కాదు ఏమో అక్కడ డోర్ వుంది కాబట్టి తెలుస్తుంది... బెడ్ కి ఎదురు గా ఒక పెద్ద ఫోటో ఫ్రేమ్ వుంది... పచ్చని పర్వతాలు... వాటి మధ్యలో నుండి అల్లరిగా ఎగురుకుంటూ తుల్లుతు వస్తున్న జలపాతం... ఆ జలపాతం రంగు కూడా చాలా అంటే చాలా కొత్తగా... బహుశా ఆకాశం కి నిలువద్దం అనుకుంటా... ఆ ఆకాశం ఏ రంగు లో వుందో ఆ రంగు లోనే కనిపిస్తుంది... ఆకాశం మాత్రం అస్తమిస్తున్న సూర్యుడు తో నారింజ రంగు కి ఎక్కువ ఎరుపు రంగు కి తక్కువ మద్యలొ అక్కడక్కడ పింక్ కలర్ కలిసినట్టు ఏదో ఒక ఇంద్ర ధనస్సు లోనుండి ఆరు రంగులు కలిపి కనిపిస్తున్నాట్టు వుంది... (మరి ఏడో రంగు ఎక్కడ వుంది అంటారు...🤔🤔🤔)....



ఆ పక్కనే ఇంకో రూమ్ వుంది... బెడ్ కి రైట్ సైడ్ కూడా సోఫా లు వున్నాయి ఆ వెనుక వర్ద్బో వుంది... బెడ్ కి అటు పక్క ఇటు పక్క సైడ్ లంప్స్ వున్నాయి... ఎంట్రెన్స్ నుండి స్త్రైట్ గా వెళ్తే ఇంకో గ్లాస్ డోర్ వుంది... అక్కడికి వెళ్ళలేదు...


అడుగు పడకపోయినా( భయం వల్ల...) కూడా అతి కష్టం మీద బెడ్ దగ్గరకి వెళ్లి కింద కూర్చొని బెడ్ కి అనుకోని ఒక చెయ్యి బెడ్ మీద వేసి ఆ చేతి ఆసరాగా తల అంచుకొని పడుకుంది...


కొనసాగుతుంది...