Read Will this journey reach the coast.. - 7 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 7

ప్రణయ్ " సరే అత్త..." అని తనని తీసుకొని వెళ్లి " నా పేరు ప్రణయ్ అండి... మీకు అన్నయ్య నీ అవుతాను..." అని చెప్పాడు...


తను తల ఆడించింది తప్పా సమాధానం చెప్పలేదు... ప్రణయ్ ఇల్లు చూపించటం మొదలు పెట్టాడు... ఇంట్లోకి రావటం రావటమే హాల్ లోకి వస్తాము... హాల్ కి కుడి వైపు పూజ గది వుంటే ఎడమ వైపు వంట గది వుంది.


వంట గది పక్కన డైనింగ్ హాల్... ఆ పక్కన లార్న్ లా వుంది... దాని పక్క రూమ్ స్టోర్ రూం... ఆ పక్కన లిఫ్ట్ వుంది... ఇంక పూజ గది పక్కన రూమ్ పర్వీన్ గది... ఆ పక్కన రూమ్ అన్ని గెస్ట్ రూమ్ లే పెద్ద వాళ్లు పైకి ఎక్కలేని వాళ్ల కోసం కింద వున్నాయి... కావాలి అంటే లిఫ్ట్ కూడా వుపోగించ వచ్చు... అసద్ నడవలేదు కాబట్టి అసద్ కోసం లిఫ్ట్ కట్టించారు...


ఇంక ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తే... మొదట అసద్ రూమ్... బయట నుండి చూడటానికే చాలా పెద్ద గది అని తెలుస్తుంది... అసద్ గది పక్కన ప్రణయ్ రూమ్.. ఆ పక్కన ఇంకో రూమ్ వుంది చూడటానికి అది పిల్లల గది లా వుంది... ఆ పక్కన వున్న గదికి లాక్ వేసి వుంది... ఇంక ఆ ఫ్లోర్ లో కొన్ని కాలి గదులు..


సెకండ్ ఫ్లోర్... అక్కడ లేని గది అంటూ లేదు... ఒక మినీ కిచెన్... ఇంక చెప్పాలి అంతే ప్రోటీన్ డ్రింక్స్, కూల్డ్రింక్స్, జూస్ అన్ని వున్నాయి... ఇంకో గది బార్, ఒక గది జిమ్, ఇంకో గది స్విమ్మింగ్ పూల్, ఆ నెక్స్ట్ కిడ్స్ ప్లేయింగ్ రూమ్, నెక్స్ట్ హోమ్ థియేటర్... అంటే మన ఇళ్ళల్లో వుండే సౌండ్ సిస్టమ్ కాదు అండి... చిన్న సైజ్ సినిమా హాల్ లా వుంది... దాదాపుగా ఒక యాభై మంది కూర్చొని చూసే అంతా పెద్దది... డ్రాయింగ్ రూమ్, డాన్సింగ్ రూమ్, మెడిటేషన్ అండ్ యోగ చెయ్యడానికి వీలుగా జిమ్ రూమ్ లో 30% వరకు వీలు చుసి కట్టించారు... అండ్ మిని దియేటర్ కూడా దొల్బెయ్ అటొమ్స్ వారి సౌండ్ స్పీకర్స్ పెట్టించారు...


కాస్ట్లి ఇంటీరియర్... విత్ హైలీ ఫర్నీచర్ రూమ్స్ అన్ని కూడా ప్రతి రూమ్ లో దాదాపుగా ఒక నలుగురు కూర్చోవటం కోసం సోఫా ఫర్నీచర్... చైర్స్... అన్ని వున్నాయి... ఆ చూస్తున్న అమ్మాయి కి అయితే ఇది ఏదో సినిమా సూటింగ్ లో వాడే ఇల్లు లా అనిపించింది... ఇంక థర్డ్ ఫ్లోర్ అది అసలు లాక్ చేసి వుంది... ఇంక టర్రెస్... టెర్రస్ మీద ఇంకో రూమ్ వుంది... అది కూడా అసద్ రూమ్ అని చెప్పాడు ప్రణయ్...


తనకి ఒక గది చూపించి " మీ లగేజ్ అంతా ఇక్కడే వుంది... కాసేపు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో..." అని చెప్పి ప్రణయ్ వెళ్ళిపోయాడు... తనకి ఇంటి మొత్తం మీద తనకి బాగా నచ్చినవి రెండు ఒకటి... ఇంటి ముందు వెనుక వున్న గార్డెన్, ఫౌంటెన్... రెండు ఇంట్లోకి రావటమే ఎదురుగా పైకి వెళ్ళటానికి స్టెప్స్ వుంటాయి... ఆ స్టెప్స్ దిగే అప్పుడు ఎదురుగా అసద్ ది ఐదు సంవత్సరాల క్రితం దిగిన ఫోటో ఒకటి ఎంట్రెన్స్ లో వుంటుంది... ఒక రాజ సింహాసనం లాంటి చైర్ లో చాలా స్టైల్ గ కాలు మీద కాలు వేసుకొని చాలా చిన్న చిరు నవ్వుతో కళ్ళల్లో ఒక రకమైన పొగరు, దైర్యం, తెగింపు.. తో ఎంతో అంటే ఎంతో నచ్చేసాడు... ఏమో ఫ్లాట్ అయిపోయింది ఏమో... మరి ఇప్పుడు ఇలా ఎందుకు వున్నాడు... భోజనం చేసే అప్పుడు లేచి నడవలేక అక్కడే కుర్చీలో పడిపోయారు... అని అనుకుంటూ వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంది...


అప్పుడు పడుకున్న తను రాత్రి 7 గంటలకి పర్వీన్ వచ్చి డోర్ తట్టే అంతవరకు మెళుకువ రాలేదు... ముఖాన మేలి ముసుగు వేసుకొని వెళ్లి డోర్ తెరిచింది.


పర్వీన్ లోపలికి వచ్చి ఒక చీర... కొన్ని నగలు ఇచ్చి " ఇవి తీసుకొని స్నానం చేసి రెఢీ అవ్వు అమ్మ..." అని చెప్పి వెళ్ళిపోయింది...


తను స్నానం చేసి పర్వీన్ ఇచ్చిన వాటి తో రెఢీ అయ్యింది... అప్పుడే వాటితో పాటు మేలి ముసుగు వుండటం చుసి అప్పుడే తన మీద వేసుకుంది... సరిగ్గా అప్పుడే పర్వీన్ కూడా లోపలికి వచ్చింది...


" అమ్మ ఇదే నీకు చెప్తున్న... ఈ రోజు మీకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేసాము... ఈ మేలి ముసుగు ముందు నీ భర్త తీసి తనే నీ మొహం చూడాలి... వాడు చూసే వరకు నువ్వు ఈ మేలి ముసుగు వేసుకొనే వుండాలి... వాడు చూసిన తర్వాత నే నువ్వు చెయ్యాల్సిన పని... తెల్లవారి తలస్నానం చేసి అదే ముసుగు వేసుకొని దేవుని గది కి వెళ్లి పూజ చేసి ఆయన ముందు తీసి ఆ తర్వాత మాకు చూపించాలి... గుర్తు ఉంచుకో..." అని భుజం మీద చెయ్యి వేసి " నువ్వు ఎం కంగారు పడకు అమ్మ... నీకు ఏమి ఇబ్బంది లేదు... " అని చెప్పారు... అంతకన్నా తన కన్న కొడుకు గురించి చెప్పలేక పోయింది పర్వీన్...


మొదటి రాత్రి అని చెప్పిన దగ్గర నుండి తనకి భయం వేసింది... అలానే బిగుసుకు పోయింది... పర్వీన్ గారు మాట్లాడి గది నుండి బయటకి వెళ్ళిన మరుక్షణం అలానే బెడ్ మీద కూలబడి పోయింది...


ఇక్కడ అసద్ తన రూం లో ఆఫీస్ కి సంబంధించి వర్క్ చేసుకుంటూ వుంటే పర్వీన్ డోర్ నాక్ చేసింది... చేస్తున్న వర్క్ పక్కన పెట్టు... " ఎంటి అమ్మి... నువ్వు నా రూమ్ కి రావటానికి పర్మిషన్ తీసుకోవటం ఎప్పటి నుండి నేర్చుకున్నావు..." అని అడిగాడు...


దానికి పర్వీన్ నవ్వుతూ వచ్చి అసద్ పక్కన సోఫా లో కూర్చుంటే అసద్ పర్వీన్ వాడి లో తల పెట్టుకొని మనసులో ' ఎందుకో అమ్మి నాకు నీ వడిలో పడుకుంటే నాకు మొదట గుర్తు వచ్చేది షివి నే అమ్మి... నాకు నువ్వు షివి వుంటే చాలు...' అని కళ్ళు మూసుకున్నాడు... తెలియకుండానే కళ్ళల్లో నుండి నీళ్ళు వస్తున్నాయి...


పర్వీన్ గారూ ప్రేమ అసద్ తల నిమురుతూ వుంటే... అసద్ " ఎమైన చెప్పాలా అమ్మి..." అని అడిగాడు...


కొనసాగుతుంది...


రీడ్ కౌంట్ బానే వుంది కానీ నో కామెంట్స్.. మీ ఎంకరేజ్మెంట్ ఎక్కడ ఐ సే.. 😤😤