Read Will this journey reach the coast.. - 6 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 6

పెళ్లి తంతు అంతా పూర్తి చేసుకొని నూతన వధూవరులను తీసుకొని ఇంటికి పయనం అయ్యారు పర్వీన్, ప్రణయ్ లు...


ప్రణయ్ వచ్చి పెళ్లి కూతురు కుతుంభం తో " ఇంక మీద మీకు తనకి ఎలాంటి సంబధమూ లేదు... ఒకవేళ తను కోరుకుంటే తప్పా... అని వార్నింగ్ లా చెప్పి... ఒక్క క్షణం ఆగి ప్రస్తుతం ఎవరి పరిస్తితి కూడా బాలేదు కాబట్టి ఈ పెళ్లి జరిగింది అని ఎవరికి బయట ఎనౌన్స్ చెయ్యటం లేదు... మీరు ఇంక వెళ్లొచ్చు..." అని చెప్పాడు.... ఆ కుటుంబం అంత కూడా ప్రణయ్ కి నమస్కరించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు.


అసద్ కార్ లో అసద్ తో పాటు తన భార్య బయలుదేరితే... ప్రణయ్ కార్ లో ప్రణయ్ ఇంక పర్వీన్ లు బయలుదేరారు...


కార్లు అన్ని కూడా బంజారాహిల్స్ లో చాలా పెద్ద ఇంటి లోపలికి వెళ్ళాయి... బయట గేట్ నుండి దాదాపుగా ఒక అరకిలో మీటర్ వరకు ప్రయాణం తర్వాత ఇంకో గేట్ వచ్చింది.


అక్కడ అంతా గార్డెన్ ఒక వైపు వెళ్తే ఔట్ హౌస్ వస్తుంది ఇంకో వైపుకి పార్కింగ్ ఏరియా వుంది... ఇంటి ఎంట్రెన్స్ లో గడప ఒకే సారి పది మంది వెళ్ళే అంతా పెద్దది గా వుంది.


ఆ ఎంట్రెన్స్ కి వెళ్ళాలి అంటే మైన్ గేట్ నుండి రెండు దారులుగా చీలి పోయి వుంది... ఆ గాప్ లో అందమైన గార్డెన్ లా అలంకరించి వుంది దానికి మద్యలొ ఒక ఫౌంటెన్ వుంది... కార్లు చాలా వేగంగా వెళ్లి ఇంటి ఎంట్రెన్స్ ముందు ఆగాయి...


కార్ లో నుండి అందరూ దిగారు... కార్ నుండి దిగిన అసద్ ఎవరిని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటే...


పర్వీన్ " ఆగు అసద్..." అసద్ ఆగిపోయాడు. వెనక్కి తిరిగి చూడలేదు...


పర్వీన్ " ఇప్పటి నుండి నీకు బాగా గుర్తు వుండాల్సిన విషయం నీతో పాటు ఇంకొకరు వున్నారు... నీతో పాటు వాళ్ళని కూడా తీసుకువెళ్ళాలి... అది ఇష్టం వున్న లేకపోయినా కష్టం వచ్చినా కూడా చెయ్యి వదలకూడదు... నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని నాకు తెలుసు... మరి ఈ అమ్మ మాట మీద నీకు గౌరవం వుందా..." అని అడిగింది.


పర్వీన్ ఇంటెన్షన్ అర్దం అయ్యిన అసద్ " అమ్మి నాకు కాళ్ళు పైన్ గా వున్నాయి..." అన్నాడు ఎటో చూస్తూ...


ఆ మాట విని పెళ్లి కూతురు ఆశ్చర్య పోయింది... మనసులో ' ఇతను ఎంటి అచ్చు అలానే " అమ్మి " అని పిలుస్తున్నాడు...' అనుకుంది.


పర్వీన్ " అవునా... వుండు " అని గంగా... అని పిలిచింది. ఆల్రెడీ చెప్పి వుండటం వల్ల ఏర్రనీల్లు పట్టుకొని వున్న గంగ అనబడే పని అమ్మాయి ఎర్ర నీళ్ళు తీసుకువచ్చి దిస్టి తీసి బయటకు వెళ్ళిపోయింది.


పర్వీన్ " ఇద్దరూ మొదట కుడి కాలు పెట్టి లోపల కి రావాలి..." అని చెప్పారు...


ఇద్దరూ అలానే చేశారు... లోపలికి వెళ్ళిన వెంటనే అసద్ తన రూం కీ వెళ్ళిపోయాడు... ఆ అమ్మాయి మేలి ముసుగు లోనుండి ఇల్లు చూస్తుంది... ఇంద్ర భవనం లా తలపిస్తుంది ఇల్లు... మొత్తం మూడు ఫ్లోర్ లు వున్నాయి...


అసద్ గది ఫస్ట్ ఫ్లోర్ లో... ఒక్కో ఫ్లోర్ లో కనీసం 10 గదులు ఉన్నాయి... ఎక్కడికి వెళ్ళాలి ఎం చెయ్యాలి తెలియక ఎక్కడ అయితే అసద్ తనని వదిలి వెళ్ళాడో అక్కడే నుంచొని వుంది తను...


పర్వీన్ వచ్చి తన భుజం మీద చెయ్యి వేసి పిలిచింది. అప్పుడు చుసి ఏమి మాట్లాడ కుండా అలానే చూస్తూ వుంటే... " అమ్మ నువ్వు వెళ్లి పూజ మందిరం లో దీపం వెలిగించు తల్లి..." అని చెప్పారు... అలాగే అన్నట్టు తల ఊపి... వెళ్లి అక్కడ పూజ గది అంతా శుభ్రం చేసి చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసి దేవుడికి నమస్కారం చేసుకొని బయటకు వచ్చింది... అప్పటికే చాలా లేట్ అయ్యే సరికి అందరినీ పిలిచి గంగ చేసిన భోజనాన్ని వడ్డించారు పర్వీన్...


అసద్ కూడా వచ్చాడు తింటానికి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకొని తినాలి అనిపించక లేచి వెళ్ళబోయాడు కానీ అప్పటి వరకు తిరిగిన కాళ్ళు కింద కూర్చొని ఇప్పటి వరకు అలవాటు లేని పని తన కాళ్ళకి చెప్పటం వల్ల అతను లేచి నుంచుని ఒక్క అడుగు ముందుకు వేయబోయాడు కానీ అతని కాళ్ళు షివర్ అయ్యి బలం సరిపోక తుల్లి పడబొయాడు... అసద్ కి ఒక పక్క ప్రణయ్ కూర్చుంటే ఇంకో పక్క అసద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి కూచుంది... పర్వీన్ అసద్ కి వడ్డిస్తూ అసద్ పక్కనే నుంచొని వున్నారు...


అసద్ అల పడబోతే ఒకే సారి ముగ్గురు వచ్చి అసద్ నీ చుట్టుకున్నారు.. కుడి వైపు ప్రణయ్ అతని చెయ్యి తన భుజాన వేసుకుంటే ఎడమ వైపు తను పెళ్లి చేసుకున్న అమ్మాయి అలానే పట్టుకుంది. పర్వీన్ మాత్రం కళ్ళ నీళ్లతో అసద్ భుజాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ వున్నారు...


అసద్ కి ఎందుకో తన స్పర్శ... అంత చెరువుగా వుండటం నచ్చలేదు పైగా ఎందుకో మనసులో అలజడిగా వుంది ' ఎంటి ఇలా అనిపిస్తుంది...' అనుకుంటూ... వెంటనే వెనుక అతను లేవాలి అని అనుకున్న కుర్చీ లోనే కూల బడ్డాడు... అసద్ కూర్చోవటం చుసి " చూడు నాన్న నువ్వు తినకుండా లేచి సరికి నీ కాళ్ళు నీకు సహకరించటం లేదు..." అని తనకి ఆమె అన్నం కలిపి అసద్ నోటికి అందించింది.


ఇప్పుడు అయితే అసద్ కి అర్దం అయ్యింది... తను తినకపోతే ఎవరు కూడా తనకి సహాయం చెయ్యరు అని... అందుకే ఎం మాట్లాడకుండా తన తల్లి పెట్టింది అంతా తిన్నాడు...


పర్వీన్ కి కూడా తెలుసు అసద్ వద్దు అని వెళ్ళే వాడు కూడా పర్వీన్ ప్రేమగా తినిపిస్తే వద్దు అని అనలేడు... అందుకే తనే తినిపిస్తుంది...


ఇది అంతా ఇలా వుండగా ఆ అమ్మాయి మాత్రం ' ఇది ఎంటి ఇతను ఇలా పడాబోయాడు... అంటే అతనికి కాళ్ళు...' ఇంక అతకన్న ఆలోచించ లేకపోయింది... ఆలోచనలోనే తనకి పెట్టినది తినేసింది తను...


ఇంతకు ముందుగానే తినటం పూర్తి చేసిన అసద్.. ప్రణయ్... అసద్ నీ రూం లో వదిలి పెట్టడానికి సహాయంగా వెళ్ళాడు...


పర్వీన్ తినకపోవడం గమనించి... " మీరు కూడా తినండి..." అని పర్వీన్ కి కూడా ఒక ప్లేట్ లో ఫుడ్ సర్వ్ చేసి పర్వీన్ కి ఇచ్చింది తను... పర్వీన్ నవ్వుతూ తీసుకొని... " అమ్మ వెళ్లి ఇల్లు చుసి రా... కొంచం సేపు నీకు కూడా రిలాక్స్ గా వుంటుంది... ఆ తర్వాత ప్రణయ్ నీకు గది చూపిస్తాడు... కాసేపు ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో సాయంత్రం నేను వచ్చి లేపుతాను..." అని అన్నారు..


దానికి తను సరే అన్నట్టు తల ఊపితే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణయ్ కి " ప్రణయ్ తనకి ఇల్లు అంతా చూపించి... తన కి ప్రస్తుతం వుండడానికి ఒక గది చూపించు..." అని అన్నారు.. పర్వీన్.



కొనసాగుతుంది...