Read Will this journey reach the coast.. - 5 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 5

ధరణి వచ్చే సరికే రాత్రి అయ్యింది. చివరి సారి వీరూ కి అన్నం తినిపించి పడుకోబెట్టి తను కూడా కొంచం తిని పడుకోవటానికి వెళ్ళే లోగా ధరణి తల్లితండ్రులు తనతో మాట్లాడాలి అన్నారు...


ధరణి ఏమి మాట్లాడ లేదు అలానే వాళ్ళతో పాటు వెళ్లి మౌనంగా వుంది.


అది గమనించి ధరణి తల్లి " ఎంటి అమ్మ నీకు మేము అంత పరాయి వాళ్ళం ఐపోయామ..." అని అడుగుతుంది కళ్ళ నిండా నీళ్లతో...


ధరణి సమాధానం చెప్పలేదు... మళ్లీ ఆవిడే " నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ధరణి..." అయిన కూడా ధరణి నుండి ఎటువంటి కదలిక లేదు.


ఇంక ధరణి నుండి ఎటువంటి సమాధానం వాళ్లు ఎక్స్పెక్ట్ చెయ్యటం లేదు అందుకే వాళ్లు చెప్పాలి అనుకుంది చెప్పటం మొదలు పెట్టారు... " అమ్మ ధరణి మేము నీకు మొదట చూసిన వ్యక్తి మంచి వాడు కాదు అని తెలిసింది... అందుకని వేరే వ్యక్తి తో నీ పెళ్లి నిశ్చయించాము... నీకు ఇందులో ఎలాంటి అభ్యంతరం వుండదు అనే అనుకుంటున్నాము... అని కొన్ని నిమిషాలు పాటు సైలెంట్ గా వుండి... రేపు 10 గంటలకి ఒక చిన్న రిసార్ట్ లో పెళ్లి... అంత వాళ్ళే చూసుకుంటున్నారు... మేము ఇప్పటి వరకు నీ జీవితం లో ఎలాంటి తప్పు చేశాం అనేది మాకు తెలిసి వచ్చింది తల్లి... నీకు చెప్పే హక్కు, అర్హత లేకపోయినా నీ మంచి కోరుకునే వాళ్ల లో మేము కూడా వున్నాం కాబట్టి అలానే చెప్తున్నాను ఒక బయట వ్యక్తి అనే అనుకో అమ్మ... అని మళ్లీ కాసేపు ఆగి... అతను చాలా మంచి వాడు ధరణి... అతనితో పెళ్లి బంధం మొదలు పెట్టు అని బలవతం చెయ్యలేను కానీ అతనిలో ఒక స్నేహితుడిని చూడు అమ్మ... నీ అన్ని ప్రశ్నల కి అతనే జవాబు... నీ అన్ని కష్టాల కి అతనే ఒక అడ్డు... నీకు, నీ కొడుకు కి అతనే జీవితం... ఇంతకీ మించి మేము ఏమీ చెప్పలేము తల్లి..." అని కళ్ళ నీళ్లతో నమస్కారం చేస్తారు...


వాళ్ళు చెప్తుంది విన్న ధరణి మనసులో ' తల తీసుకువెళ్ళి రాయి కి కొట్టుకోవాలి అనుకుంటే అది ఏ రాయి అయితే ఎంటి... హమ్ అని ఒక విరక్తి నవ్వు నవ్వుకుంది..' అలాంటిది వాళ్ల మాటల మద్య వచ్చిన మార్పు... మాటలు పూర్తి అయ్యిన తర్వాత వాళ్లు చేసిన పనికి ఎంతైనా పెంచిన వాళ్లు కదా దూరం ఉండలేకపోయింది...


వెంటనే తన తల్లి నీ చుట్టేసి ఏడ్చేసింది. వాళ్ళు కూడా ఏమి మాట్లాడలేని పరిస్తితి... కాబట్టి ఏమి మాట్లాడలేదు. తన తండ్రి వచ్చి ధరణి తల నిమురుతూ " ఇప్పటికీ అయిన ఆ పాయిజన్ బాటిల్ ఇటు తల్లి.." అని చెయ్యి చాస్తు అడిగారు...


ధరణి ఇంక తట్టుకోలేకపోయింది... తన తల్లితండ్రులను చుట్టేసి ఏడుస్తూ... " నన్ను క్షమించండి నాన్న... నాకు వేరే దారి తోచలేదు..." అని అంటుంది.


తన తండ్రి " పిచ్చి తల్లి వేరే దారి తోచలేదు అని ఇలా చనిపోవాలని అని చూస్తే... రేపు నీ కొడుకు జీవితం ఎం అవుతుంది అని ఆలోచించలేద... వాడి కోసం అయిన బతుకు అమ్మ... అక్కడి వాళ్లు మంచి వాళ్లు అని తెలిసింది. ఎలా అయిన వీరూ నీ నీతో పాటు తీసుకు వెళ్ళటానికి వాళ్ళని ఒప్పుంచు... అప్పటి వరకు వాడి నీ మాతో ఉంచుకుంటాను... కానీ ఈ సారి నిన్ను చుసుకునట్టు చూసుకుంటాను..." అని అన్నారు...


ఈ సారి ధరణి కి వాళ్ల మాటల్లో నిజం కనిపించింది... వాళ్ల కళ్ళల్లో పశ్చాతాపం కనిపించింది... వాళ్ల స్పర్శ లో ప్రేమ కనిపించింది... తల ఊపటం తప్పా ఏమి చెయ్యలేక పోయింది...


తన తల్లి " సరే అమ్మ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది... రేపు నా కూతురి పెళ్లి... అప్పుడు తను ఇలా వుండటం నాకు ఇష్టం లేదు... వెళ్ళు వెళ్లి పడుకో..." అని అనింది.


ధరణి వెళ్లి ఆలోచనలతో పడుకుంది... అక్కడ ఆసద్ కి కూడా నిద్ర పట్టలేదు... ఎలాగో అర్థరాత్రి కి పడుకున్నాడు...


తెల్లవారింది... ఎవరికి వారు ఏ భావం లేకుండా ముభావం గానే ఈ పెళ్లికి సిద్ధం అవుతున్నారు... వీరూ కూడా బాగా రెఢీ అయ్యాడు... తన తల్లిని పెళ్లి కూతురు గా చూడాలి అని ఎగురుకుంటూ వెళ్ళాడు...


ధరణి కి చాలా అంటే చాలా కాస్ట్లు ఎర్ర పట్టు చీర కట్టి రకరకాల నగలు పెట్టీ మేలి ముసుగు వేసి పెళ్లి కూతురు సిద్దం చేస్తున్నారు...


వీరూ వచ్చి " అమ్మి ఎంటి ఇది వేసుకున్నావు..." అంటూ ఆ ముసుగు నీ చూపిస్తూ అడిగాడు...


అక్కడ వున్న కొంతమంది ఆడవాళ్ళల్లో ఒకరు " అది వేసుకోవాలి విరాట్ అది సంప్రదాయం..." అని చెప్పింది.


సమాధానం చెప్పిన ఆవిడ వైపు కోపంగా చూస్తూ... " నేను నిన్ను అడగలేదు... మైండ్ యువర్ టంగ్.." అన్నాడు.


దానికి ధరణి " వీరూ తప్పు... సే సార్రీ టూ ఆంటీ..."


వీరూ " నో అమ్మి.." అని పరుగున బయటకి వెళ్ళిపోయాడు... వీరూ నీ చుసి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి కానీ అక్కడ వాళ్లు చూస్తే బాగోదు అని కన్నీళ్లు తుడిచేసుకుని చిన్న జీవం లేని నవ్వు నీ పెదవుల పై బలవతంగా పులుముకుంది.


సమయం ఆరు అవుతుండగా అందరూ పెళ్లి జరిగే చోటుకి బయలు దేరారు...


ఇక్కడ అసద్ నీ కూడా తెల్లవారు జామున లేపి రెఢీ చేసి పెళ్లి జరిగే చోటుకి తీసుకువెళ్ళారు... అసద్ వాళ్లు అక్కడికి చేరుకునే సరికి 7 అయ్యింది. అప్పటికే అక్కడికి పెళ్లి కూతురు వాళ్లు వచ్చేశారు...


అందరూ కొంచం సేపు విశ్రాంతి తీసుకోవటం కోసం ఎవరికి కేటాయించిన గదికి వాళ్ళు వెళ్ళారు... సరిగ్గా ఒక గంట పురోహితుడు అక్కడికి చేరుకున్నాడు...


అసద్ తల్లి అయిన పర్వీన్ పురోహితుడిని స్వాగతం పలికి కొంచం దూరం గానే నించుకున్నారు... ఎంతైనా ఆవిడ భర్త చనిపోయారు కదా... మీకు చెప్పలేదు కదా ఇప్పుడే నోట్ చెప్తున్నా...


పురోహితుడు వచ్చి పెళ్లి కి అన్ని సిద్దంగా వున్నాయా... లేవా... అని చుసి ముహూర్తము కి లేట్ అవుతుంది అని చెప్పటం వల్ల అసద్ నీ పిలిచి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి చేయించాల్సిన పూజ మొదలు పెట్టారు...


కూర్చొని చెయ్యాల్సిన పుజే అయిన కూడా బాసిమటం వేసి కింద కూర్చోవటం వలన అసద్ కి కాళ్ళు బాగా పైన్ గా వున్నాయి అది ఎవరికి తెలియకుండా ఫేస్ లో ఎలాంటి భావం చూపించ కుండ నే కూర్చున్నాడు...


దాదాపు అరగంట వరకు ఆపుజ ఈ పూజ అంటూ అది ఇది అంటూ కూర్చోబెట్టి తర్వాత పెళ్లి కూతురిని తీసుకురమ్మని చెప్పారు...


పంతులు మాట వినిన వెంటనే ఎందుకో అసద్ కి తెలియకుండా నే టెన్షన్ మొదలు అయ్యింది. చేతులకు చెమటలు పట్టేస్తున్నాయి... తల వంచుకుని చేతులు చూసుకుంటున్న సమయాన... అక్కడ అంత హైరానా గా వున్న కూడా ఒకరి అందెల సవ్వడి మాత్రం అతని గుండె కి ఏదో కలవరం కి గురి చేసింది... అది అతను గమనించ లేదు అతనికి వెంటనే షివి గుర్తు వచ్చింది. కళ్ళు మూసుకొని బాధ నంత దిగమింగి అలానే కూర్చున్నాడు...


ఎవరో వచ్చి పక్కన కూర్చున్నారు... పంతులు ఏదో చెప్తున్నాడు ఇలా చెయ్యండి అల చెయ్యండి అంటు... అతను చెప్పేవి అన్ని కూడా ఏదో ఒక మర బొమ్మ లా చేస్తూ వున్నాడు...


అటు ధరణి పెళ్లి లో కూడా అంతే పీటల మీద కూర్చొని పక్కన వేదమంత్రాల వినిపిస్తూ వున్నా అవి ఉచ్చారణ చేస్తున్న అతను చెప్పేవి చెవికి ఎక్కక పోయినా కూడా తన వెనుక కూర్చున్న తల్లి చెప్పినట్టు చేస్తుంది... అచ్చం ఒక కీలుబొమ్మ లా....


అసద్ పెళ్లి : అసద్ చేత జీలకర్ర బెల్లం పెట్టించారు... అటు వైపు నుండి తను అసద్ తల మీద చెయ్యి పెట్టిన మరుక్షణం అసద్ కంటి నుండి ఒక కన్నీటి చుక్క రాలింది.


అన్ని చేయించి మంగళ సూత్రం ఇచ్చి అమ్మాయి కి కట్టమని ఇచ్చాడు... అతి కష్టం మీద లేచి నిల్చొని తన పక్కన కూర్చున్న అమ్మాయి కి మంగళ సూత్రం అలంకరించాడు...


ఆ తర్వాత అమ్మాయి నీ అసద్ దగ్గరా ఆశీర్వాదం తీసుకోమని చెప్తే తను అసద్ కాళ్ళను తాకింది... తన స్పర్శ అసద్ కి ఇష్టం లేకపోయినా కూడా ఆ స్పర్శ ఎందుకో అసద్ నీ ఏదో అడుగుతున్న ట్టు అనిపించింది... ' దయచేసి ఒప్పుకోండి...' అన్నట్టు వుంది ఆ స్పర్శ అసద్ కి ఎందుకో ఆశ్చర్యం గా వుంది.


అసలు స్పర్శ వల్ల కూడా పట్టుకున్న వాళ్ల భావం తెలుస్తుందా... అనిపించింది అసద్ కి. ఎందుకు తెలియదు ఆఫీస్ నుండి వచ్చిన భర్త తన భార్య నీ తాకిన మరుక్షణం తన భార్య కి తెలిసిపోతుంది... అలిసి పట్టుకున్నారా... లేక ఇష్టం తో పట్టుకున్నారు... లేక ప్రేమ తో పట్టుకున్నారా అని... అసద్ ఆలోచన ఒక్క క్షణం ఎక్కడికి వెళ్లిందో కూడా అర్దం కాలేదు... ' చ్చా... నేను ఎంటి ఇలా ఆలోచిస్తున్నాను...' అని అనుకున్నాడు మనసులో...


కొనసాగుతుంది...