Read Will this journey reach the coast.. - 4 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 4

ఇంట్లో ధరణి అమ్మ తాపీగా సోఫా లో కూర్చొని బయట గేట్ సౌండ్ కి వచ్చింది వీరూ నే అనుకోని " వచ్చావా... వచ్చి నా కాళ్ళు వత్తు.." అనింది.


కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో లోపలికి తన తల్లి ముందు నిప్పులు కక్కుతున్న కళ్ళతో కల్చేసెల చూస్తుంది. ఆ టైమ్ లో ధరణి నీ అక్కడ ఊహించని తన తల్లి ఎక్కడ లేని ప్రేమంతా చూపిస్తూ " ధరణి ఇప్పుడైనా రావటం... వెళ్ళు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా అమ్మ..." అంది...


ధరణి ఆవిడ వైపు చూసే చూపుల్లో ఎం మాత్రం మార్పు లేకుండా అలానే చూస్తూ... " మ్మ వీరూ ఎక్కడ...???" అని ఒకే ప్రశ్న అడిగింది.


ధరణి చుపులోని, మాటలోని తీవ్రత చుసి ఒక్క క్షణం భయం వేసిన కూడా చూపు తిప్పేసి " వీరూ...వీరూ... హా... అది... వీరూ... బయట... పిల్లల్ల తో... హా... వీరూ పిల్లల తో ఆడుకోవటానికి వెళ్ళాడు... వాడికి ఈ మధ్య ఆటలు ఎక్కువ అయ్యాయి... ఎలా పడితే అలా వెళ్లి ఆడుకుంటూ దెబ్బలు తగిలి ఇంటికి వస్తున్నాడు..." అని కట్టు కథ అల్లేసింది.


ధరణి కి కోపం పెరిగిపోయి " ఎందుకు మా అబద్ధాలు చెప్తున్నవు... వీరూ ఇవాళ మా హాస్పిటల్ ఎదురు కన్స్ట్రస్క్షన్ జరిగే చోటు లో పని చేస్తున్నాడు..." అంటూ మోకాల మీద కూల బడి తన మొహాన్ని తన చేతుల్లోకి దాచుకొని ఏడుస్తూ వుంది...


అలానే చాలా సేపు ఏడ్చి... " ఎందుకు మా... ఎందుకు ఇది అంతా చేస్తున్నారు... వాడిని... పసి వాడిని పనికి పంపించి ఎం సాధించాలి అని చేస్తున్నారు అమ్మ... వాడు పనికి వెళ్తే తప్పా తినడానికి గతి లేదా ఈ ఇంట్లో... నా ముందు ప్రేమ నటించి నా వెనుక ఎందుకు మా వాడిని టార్చర్ పెడుతున్నారు..." అని కోపం గా అడుగుతుంది.


దానికి ధరణి తల్లి సమాధానం చెప్పదు కానీ వెనుక నుండి తన తండ్రి గొంతు వినిపిస్తుంది. " ఎందుకంటే వాడి వల్లే నీ జీవితం, మా జీవితాలు ఇలా వున్నాయి కాబట్టి..."


ధరణి కళ్ళ నీళ్లతో " ఎం మాట్లాడుతున్నారు నాన్న..." అంటే...


ఆయన " నిజం ధరణి... నిజం మాట్లాడుతున్నాను... వాడి వల్లే ఇంత వయసు వచ్చిన నువ్వు పెళ్లి చేసుకోకుండా ఏకాకి లా వున్నావు... వాడి వల్లే నా అన్న వదినలు చనిపోయారు... వాడి వల్లే మేము మా కుటుంబం మొత్తం నిందలు మొస్తున్నాము... అదే వాడే లేకపోయి ఉంటే జరిగిన దాన్ని ఒక పిడ కళ గా మర్చిపోయి నీకు ఎంతో ఉన్నతమైన కుటుంబం లో వ్యక్తి నీ ఇచ్చి పెళ్లి చేసి పంపించే వాడిని... ఆ తర్వాత నీ జీవితం లో ఆ మరక పడిన రోజును తుడిచి పెట్టే వాడిని... ఆ రోజు వీడు నీ కడుపున పడ బట్టే ఈ రోజు నువ్వు ఒంతరివి అయ్యావు... పెళ్లి వద్దు అనుకున్నవు... పెళ్లి చేసుకోకుండా నే నీ కూతురు తల్లి అయ్యింది అని నన్ను మి అమ్మ ను ఈలోకం ఎలా మాట్లాడుతుంది నీకు తెలుసా... ధరణి...


నా మాట విను అమ్మ నువ్వు ఇప్పుడిప్పుడే నీ జీవితం మొదలు పెడుతున్నావు... పెళ్లికి ఒప్పుకో కావాలి అంటే వీడిని మేము దత్తత తీసుకున్నాం అని సంజానికి చెప్తాము... ఒంటరి బతుకు ఎంత నరకమో మాకు తెలుసు ధరణి నా మాట విను..." అని చెప్పి వెళ్ళిపోయారు...


ధరణి కి ఎం చెయ్యాలో అర్దం కాలేదు... తన తల్లి తండ్రులకి తన మీద అమితమైన ప్రేమ అనుకోవాలా లేకపోతే ఒక పసి వాడి గురించి కూడా ఆలోచించ లేని ముర్కత్వం అనుకోవాలా అర్దం కాలేదు... కానీ ధరణి కి ఒకటి తెలుసు ఒకవేళ ధరణి పెళ్లికి ఒప్పుకున్న కూడా తన తల్లి తండ్రులు వీరూ ఇప్పటి వరకు ఎలా అయితే చూసారు ఇక మీద కూడా అలానే చూస్తారు... పైగా ఇంక హింస పెట్టే దానికే ఎక్కువ ఛాన్స్ వుంది తప్పా ప్రేమగా దగ్గరకి తీసుకుంటారు అని నమ్మకం లేదు... ఆ రాత్రికి అక్కడే గడిపి... తన స్నేహితరాలికి ఫోన్ చేసి తను వుండటానికి చిన్నది అయిన సరే ఒక రూమ్ చూడమని చెప్పింది.


ఆ రోజు హాస్పిటల్ కి తను జాబ్ కి రీజియన్ చేసింది. అక్కడి వాళ్లు " ఎందుకు అమ్మ నీకు మంచి ఫ్యూచర్ వుంది.." అంటే ధరణి... " నా జీవితం కోసం నా ప్రాణాన్ని నేను వదులుకోలేను..." అని చెప్పింది.


ధరణి ఫ్రెండ్ తన బంధువులలో ఒకరి ఇల్లు కాలిగా వుంటే చూసింది... అది పెంట్ హౌస్... రెండు గదులు ఒక బాత్రూం వున్న ఇల్లు బయట కొంచం కాలి ప్లేస్ వుంది.


ఏదైనా పర్వాలేదు అని చెప్పి... ఇప్పటి వరకు తను సంపాదించిన డబ్బుతో తన ఇంటికి కావలసిన చిన్న చిన్న వస్తువులు కొన్ని కొని తన తల్లితండ్రులు వుంటున్న ఇంటికి వెళ్ళి తనవి వీరూ వి బట్టలు... వీరూ బొమ్మలు...ఇంక తన సర్టిఫికెట్స్... ఇలా అవసరం అయ్యే వరకు తీసుకొని వీరూ నీ తీసుకొని వెళ్ళిపోయింది.


" ఎక్కడికి ?" అని ఇంట్లో వాళ్ళు అడిగితే.... " వీరూ నీ వద్దు అనుకుంటే నన్ను వద్దు అనుకున్నట్టే... నాకు ఏమి కానీ వాళ్ల ఇంట్లో నేను ఉండలేను... మీకు అడిగే హక్కు కూడా లేదు... అని చెప్పి కన్నీరు వస్తున్న ఆపుకుంటూ నేను డబ్బు కానీ నగలు కానీ తీసుకువెళ్లడం లేదు... కావాలి అంటే మా బ్యాగ్స్ చూడొచ్చు.. మేము వెళ్ళిపోయాక ఇంట్లో అన్ని సరిగ్గా వున్నాయి లేదు అనేది కూడా చూసుకోవచ్చు." అని చెప్పేసి కనీసం వాళ్ల మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయింది.


ఆ రోజు నుండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇంటిని నెట్టుకొస్తున్న ధరణి. ఉదయం, సాయంత్రం పిల్లలకి టుషన్ చెప్తుంది... డాబా మీద వుండే కొంచం కాలి ప్లేస్ లో కూరగాయల మొక్కలు వేసి వాటికి పండే కాయగూరలు తో వంట చేసేది... మళ్లీ ఉదయం 10 గంటల కి ఒక హోటల్ లో చెఫ్ గా కూడా చేసేది... వీరూ నీ ఒంటరిగా వదలటం ఇష్టం లేక వీరూ నీ కూడా తనతో నే తీసుకువెళ్ళడం అలవాటు చేసుకుంది. సాయంత్రం రేడియో జాకీ గా వెళ్ళేది అక్కడికి కూడా వీరూ నీ తీసుకువెళ్ళడం నేర్చుకుంది. ఒక్క ముక్క లో చెప్పాలి అంతే ఏ రోజు అయితే తన తల్లితండ్రుల నుండి వచ్చేసింది ఆ రోజు నుండి వీరూ నీ వదిలి ఒక్క క్షణం కూడా వుండేది కాదు.


కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వీరూ మళ్లీ తన తల్లితండ్రుల దగ్గర వుంటే ఇదివరకు కన్న ఇంక హీనం గా చూస్తారు ఏమో అని తన ఫ్రెండ్ అయిన డాక్టర్ నళిని దగ్గర వీరూ నీ కొన్ని రోజులు వుంచాలి అనుకుంది. అనుకోవటానికి అయితే కొన్ని రోజులు అనుకుంది కాని ఎన్ని రోజులో తనకి కూడా తెలియదు అసలు వీరూ నీ తీసుకువెళతాను అంటే అక్కడి వాళ్లు ఒప్పుకుంటారు లేదో కూడా తెలియదు. ఇప్పుడు తన దృష్టి లో వీరూ ఒక రెక్కలు మొలవని పక్షి లా కనిపిస్తున్నాడు...


ఆఫీస్ లో ప్రణయ్ తో మాట్లాడిన తర్వాత అసద్ కళ్ళు మూసుకొని మనసులో ' ఎందుకు షివి వీళ్ళకి అర్దం కావటం లేదు... నా లైఫ్ లో నేను నిన్ను తప్ప ఎవరినీ ఊహ లోకి కూడా రానివ్వను... అలాంటిది వీళ్ళు ఎందుకు నాకు బలవంతంగా పెళ్లి చెయ్యాలి అని చూస్తున్నారు... ఒక వేళ నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకో అన్నా చేసుకోలేని స్థితి లో వున్నాను నేను ఎందుకు వీళ్ళు అర్దం చేసుకోవటం లేదు.... ఐ లవ్ యూ షివి... లవ్ యూ ఫర్ మై లాస్ట్ బ్రీత్ షివి..." అని కళ్ళు మూసుకున్నాడు... అప్పుడే డోర్ ఎవరో నాక్ చేసిన చప్పుడు వినిపించి " ఎస్..." అన్నాడు...


ప్రణయ్ లోపలికి వచ్చి " అసద్ నీకు నచ్చిన నచ్చక పోయినా రేపు ఉదయం 10 గంటలకి నీ పెళ్లి... గుర్తు వుంది కదా... నీ పెళ్లి..." అని వత్తి పలికి వెళ్ళిపోయాడు.


ధరణి తన వస్తువులు అన్ని ప్యాక్ చేసి తన తల్లితండ్రులు వుంటున్న ఇంటికి వీరూ నీ తీసుకొని వెళ్ళింది.


ధరణి వచ్చే సరికే రాత్రి అయ్యింది. చివరి సారి వీరూ కి అన్నం తినిపించి పడుకోబెట్టి తను కూడా కొంచం తిని పడుకోవటానికి వెళ్ళే లోగా ధరణి తల్లితండ్రులు తనతో మాట్లాడాలి అన్నారు...


కొనసాగుతుంది...