Read Will this journey reach the coast...- 3 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 3

తను రెంట్ కి వున్న ఇంట్లో ప్యాక్ చెయ్యాల్సిన మిగిలిన వస్తువులు అన్ని ప్యాక్ చేయించి నిన్న జరిగిన సంఘటన కళ్ళ ముందు మేదులు తుంటే అలానే నెల మీద చతికిల పడి ఆ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది ధరణి.


నిన్న మధ్యాహ్నం సమయం లో కుట్టు పని కి వెళ్ళిన ధరణి కి వెంటనే ఇంటికి రమ్మని ఎమర్జెన్సీ అని తన తల్లి ఫోన్ చేసే సరికి ఏమైందో ఏమో అని కంగారుగా ఇంటికి వెళ్ళిన తనకి ఎదురుగా హల్ లో నవ్వుతూ మాట్లాడుతున్న తన తల్లితండ్రులు కనిపించిన వెంటనే కోపం వచ్చి కూడా తమాయించుకొని ఫాస్ట్ గా వాళ్ల ముందుకు వెళ్లి " అమ్మ నాన్న ఏమైంది అర్జెంట్ గా రమ్మనారు.." అని కంగారుగా అడిగింది.


ధరణి వెనుక వుండి ధరణి నీ కింద నుండి పై వరకూ స్కాన్ చేస్తున్న ఒక 45 నుండి 47 సంవత్సరాలు వుండే వ్యక్తి చూపు తనకి ఇబ్బందిగా అనిపించి కొంచం దూరం వచ్చి ఇబ్బందిగా వున్న కూడా ఏమైందో ఎంటో అని టెన్షన్ గా నుంచొని వుంది.


ధరణి నీ చూసిన తన తల్లి... " ధరణి ఈయన పేరు ఫణి భూషణ్ నీకు కాబోయే..." అని మాట పూర్తి కాకముందే...


అతను లేచి " భర్త నీ... నేను నీతో కొంచం మాట్లాడాలి ధరణి..." అన్నాడు.


అంత మందిలో అతను అల మాట్లాడటం ఇబ్బంది గా వున్న కూడా అమ్మ నాన్న లా మాట కాదు అనలేక తల దించుకొని హాల్ కి కనెక్ట్ అయ్యి వున్న బాల్కనీ లోకి దారి తీసింది. ధరణి వెనుకే అతను కూడా....


వచ్చిన వెంటనే చూపుల తో నే తినేసేలా చూస్తూ... " ఎంత అందంగా వున్నావు ధరణి నువ్వు... అందరిలో లోపాలు వుంటాయి నీకు నీ కొడుకు లోపం అయితే నాకు నా బలహీనత లోపం... నాకు ఆడపిల్లల బలహీనత వుంది ధరణి... దాని కోసం అదే ఒక రాత్రి కోసం ఎంత అయిన ఇస్తాను... కానీ నిన్ను మొదట ఒక గుడిలో చూసాను నా రెండో భార్య తో గుడికి వెళ్లి వస్తున్న నన్ను నా కళ్ళను నువ్వు నీ రూపం నీ ఎత్తైన స్తనం ఆకట్టుకున్నాయి... నాకు నీ మీద కలిగింది ఒక రాత్రికి తీరేది కాదు అని త్వరగానే అర్దం అయ్యింది అందుకే ఈ పెళ్లి... నువ్వేం దిగులు పడకండి నేను నిన్ను అసలు ఎందులోనూ దిస్సపాయింట్ చెయ్యను... ముఖ్యంగా ఆ విషయం లో అని వంకరగా నవ్వాడు.."


అతను మాటలు... అతని చేష్టలు... అతని చూపులు అన్ని గుర్తు వచ్చి జీవితాంతం అతనితో అని ఊహించు కోవటానికి కూడా భయం వేసి ఏడుపు తన్నుకు వస్తుంటే అలానే నోట్లో తన చున్ని నీ పెట్టుకొని సౌండ్ రాకుండా ఏడుస్తుంది.


అప్పటిదాకా బయట ఆడుకొని ప్యాక్ చెయ్యాల్సిన అన్ని వస్తువులు ప్యాక్ చేసి బయట పెట్టేయడం తో ఇంక అమ్మి లోపల ఎం చేస్తుంది... అనుకుంటూ లోపలికి వచ్చిన వీరూ కి చున్ని నీ నోట్లో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న తల్లి కనిపించిన వెంటనే పరుగున వెళ్ళి వాళ్ల అమ్మి చుట్టేసుకొని ఆ బుజ్జి వాడు కూడా ఏడవటం మొదలు పెట్టాడు...


వీరూ ఏడుపు విని తనని తనూ సర్దుకొని వీరూ వైపు చూస్తూ " నాన్న వీరూ ఎందుకు ఏడుస్తున్నావు... ఏది ఇటు చుడు వీరూ..." అంటూ ఆ బుజ్జి వాడిని ఓదారుస్తూ వుంది.


వీరూ " నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మి..." అని అడిగాడు వాడి చిన్ని చిన్ని చేతులతో ధరణి కళ్ళు తుడుస్తూ...


ధరణి కి ఏడుపు ఆనందం రెండు ఒకే సారి వచ్చాయి... గత ఐదు సంవత్సరాలుగా తనకి ఏ బాధ వచ్చిన తను పంచుకునే తన ప్రాణ స్నేహితుడు అయిపోయాడు వీరూ... ఇంక ఈ మధ్య అయితే తానే తన తల్లికి దైర్యం చెప్తున్నాడు... కనీల్లు తుడుస్తున్నడు... వాడిలో ఈ పెద్దరికం బాగా నచ్చేసింది ధరణి కి తోడు లేని తన జీవితానికి వీరూ నే ఒక తోడు అనుకుంది కాని అనుకోని విధం గా ఇలా పెళ్లి అనే మలుపు తిరుగుతుంది అని తెలియదు... కళ్ళు తుడుచుకోనీ " ఎం లేదు నాన్న కొన్ని రోజులు నీకు దూరంగా వుండాలి కదా అందుకే అది తలుచుకుంటే ఏడుపు వస్తుంది."


వీరూ " ఎం పర్లేదు అమ్మి... కొన్ని రోజులే గా నళిని ఆంటీ ఇంట్లో వుంటాను... నాకు కూడా నీకు దూరం గా వుండటం నాకు కూడా రాదు కానీ తప్పదు కదా అమ్మి... ఎం కాదు నేను నళిని ఆంటీ నీ అడిగి డైలీ నీకు ఫోన్ చేస్తాను... నీకు రోజులా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ నేనే చెప్తాను..." అంటూ హగ్ చేసుకున్నాడు.


ధరణి ఇంక వెక్కుతు వుండటం గమనించి వీరూ దూరం జరిగి పరుగున లోపలికి వెళ్ళి వాటర్ తెచ్చి " ముందు ఇది తాగు..." అంటూ తనే గ్లాస్ తెచ్చి తన నోటి దగ్గర పెట్టి తాగిస్తు తన గుండెల మీద తన చిన్ని చిన్ని చేతులు వేసి నిమురుతూ ధరణి కాస్త నార్మల్ అయ్యే వరకు వుండి... మళ్లీ దాని గురించి మాట్లాడితే అమ్మి ఎక్కడ ఎదుస్తుందో అమ్మి తో వుండే ఈ కొన్ని క్షణాలు హ్యాపీ గా వుండాలి అని ఆ పసి మనసు లో అనుకోని మళ్లీ కదిలించలేదు.


ఏదో ఒక పిడ కల వచ్చిన రాత్రి చేసే జాగారం లా ఆ రాత్రి ఎవరికి నిద్ర లేదు.


22 సంవత్సరాలు తన చదువు పూర్తి చేసుకొని తన ఆశ వైపు ఆశయం వైపు తన తొలి అడుగు వేయక మునుపే తను కడుపుతో వున్నది తెలిసి ఎగరడానికి అని విప్పిన రెక్కలకి ఆ ప్రాణం లేని పిండం తాడు లా తన రెక్కల నీ కట్టి పడేసింది. అయిన కూడా తను అల అనుకోకుండా కడుపులో వున్న క్షణం నుండి తన కదలికలు ధరణి కి ఎందుకో చెప్పలేని దైర్యం నురి పోసింది ఏదో తెలియని ఆత్మీయత... అభిమానం ఆరాధన ఏర్పడ్డాయి ధరణి కి...


అలానే తన వీరూ ఈ ప్రపంచం లోకి వచ్చిన క్షణం నుండి తన మీద తెలియకుండా అభిమానం పెంచుకుంటూ వీరూ నే ప్రపంచం గా బ్రతికించి ధరణి.


నిజానికి ధరణి ఒక డాక్టర్ తన చదువు పూర్తి చేసి ట్రైనింగ్ కి వెళ్ళే సమయం లో వీరూ కడుపున పడటం వల్ల కొన్ని రోజులు సెలవు తీసుకుంది... అలానే వీరూ బయట పడ్డ తర్వాత తన తల్లి బిడ్డ నీ చూసుకుంటాను తనని తన డ్రీమ్ వైపు వెళ్ళమని చెప్పింది.


ధరణి కూడా తన తల్లిని నమ్మి వెళ్ళింది... కానీ పాపం ధరణి కి ఎం తెలుసు తన తల్లి పగలు పసి వాడు ఎంత ఏడ్చిన కనీసం ఒక్క నీటి చుక్క కూడా ఇచ్చేది కాదు తను సాయంత్రం అలిసిపోయి ఇంటికి వచ్చే సరికి బాబు సొలసిపోయి నిద్ర పొతే ఏమైంది అని అడిగితే ఇప్పుడే కడుపు నిండా పాలు తాగి పడుకున్నాడు అని చెప్పేది... ధరణి నిజమే అని అనుకునేది... మద్య రాత్రి ఎప్పుడో గుక్క ఆపకుండా ఏడుస్తూ వుంటే కంగారుగా తన పాలు పడితే కానీ ఆ పసి ప్రాణం నిలువ లేదు...


అలా కొన్ని రోజులు అయిన తర్వాత కూడా బాబు ముద్దు ముద్దు మాటలు నేర్చుకునే సమయం లో కూడా బాబు చేత పనులు చేపించేసి మొద్దు పనులు వాటి వాళ్ల పాపం బాబు చాలా బక్కచిక్కి పోయాడు... రాత్రి మీ అమ్మ కి చెప్తే తర్వాత రోజు మి అమ్మ పని కి వెళ్ళినప్పుడు నిన్ను తీసుకువెళ్ళి రైలు పట్టాల మీద పడేస్తం అని బెదిరించింది... ధరణి తండ్రి కూడా ఈ బాబు వల్లే నా అన్నయ్య వదిన చనిపోయారు అని వీరూ నీ చాలా టార్చర్ చేశారు...


అలా ఒక రోజు తన షిఫ్ట్ త్వరగా పూర్తి చేసుకొని బయటకి వచ్చే సరికి బయట ఇద్దరూ నర్స్ లు మాటలు తన చెవిలో పడ్డాయి...


ఒక నర్స్ " చూడవే బాబు ఎంత బాగునాడో కానీ చూడు ఎం పని చేస్తున్నాడు..." అంటే


రెండో నర్స్ " అవును ఆ చిన్ని చిన్ని చేతులతో ఇటుకలు మోస్తూ ఈ కులి పని చేస్తున్నాడు... ఇంత చిన్న వయసులో ఇలాంటి పని చేస్తున్నాడు. వాడి తల్లి, తండ్రి ఎం చేస్తున్నారే... ఛీ..." అని కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అనింది.


మొదటి ఆమె " ఆ ఏముంది కారణం లేని... కొవ్వు పట్టి కొంతమంది వాళ్ల క్షణిక ఆనందం కోసం చేసే పని కి ఇలాంటి వాళ్లు కడుపున పడతారు అంతా బరువు అయితే కడుపున పడిన క్షణం లో నే ఇంత బోపాయ తింటే సరిపోయేది నవ మాసాలు మోసి కని ఇలా తన పుట్టుకకు కారణం అయిన వారి మీద వున్న కోపం నీ ఈ పసి ప్రాణుల మీద చూపిస్తున్నారు..." అనుకుంటూ వుండగా ఆ మాటలు విన్న ధరణి అటు వెళ్లి చూస్తే వీరూ పని చేస్తూ కనిపించాడు...


ఒక్క క్షణం తన గుండె ముక్కలు అయిపోయింది... తన చిన్ని చిన్ని చేతులతో తల కి ఒక తుండు కట్టుకొని రెండు ఇటుకలు తల మీద పెట్టుకొని బుడి బుడి అడుగులు వేస్తూ వెళ్లి వేరే చోటు పెడుతున్నాడు...


ధరణి అది చూసి బరించలేకపోయినది. వెంటనే పరుగున వెళ్లి వీరూ నీ చుట్టుకొని వాడి తల మీద వున్న ఇటుకలను తోసి పడేసి వాడిని చుట్టేసి తన తనువు అంతా ముద్దుల వర్షం కురిపించింది ధరణి.


అక్కడ వీరూ చుసి " నువ్వేంటి కన్న ఇలాంటి పనులు చేస్తున్నావు... అసలు ఎవరు చెప్పారు నిన్ను ఈ పనులు అన్నీ చెయ్యమని..." అని అడిగింది కన్నీరు ధారాళంగా కారుతున్నా పట్టించుకోకుండా ఆ లేత చేతులు ఎర్రగా కందిపోయింది చుసి చుసి తట్టుకోలేక వాడి చేతుల తో నే తన చెంపలు వాయించుకో సాగింది ధరణి.


రెండు సంవత్సరాల వయసు వున్న వీరూ ధరణి ఏడుస్తుంటే తన చేతులు బలవతం గా లాక్కొని ధరణి కళ్ళు తుడుస్తూ... " అమ్మి ఎందుకు ఏడుస్తున్నావు...??" అని అడిగాడు ముద్దు ముద్దు మాటలతో...


వీరూ ఎంత మాట్లాడుతున్న ధరణి ఏడుపు ఆపటం లేదు... అక్కడే ఏడ్చి ఏడ్చి వెంటనే ఏదో తట్టినట్టు వెంటనే పరుగున వీరూ నీ తీసుకువెళ్ళి ఇంటికి వెళ్ళింది.


కొనసాగుతుంది...