Read Premam - 3 by Radhika in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమమ్ - 3

అప్పటికే క్లాసెస్ స్టార్ట్ అయ్యి, 5 మినిట్స్ అయింది... ఈ బ్యాచ్ మొత్తం క్యాంటీన్లో, ఈరోజు వాళ్ళు విన్ అయిన మ్యాచ్ కోసం సొల్లు వేసుకొని ఇప్పటికి వచ్చారు...

క్లాస్ లోకి ఎంటర్ అయిన బ్యాచ్ మొత్తం ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఎదురుగా వున్న దృశ్యాన్ని చూసి...

చాలా శ్రద్ధగా క్లాస్ చెప్తూ వుంది ప్రీతి... అంతకన్నా శ్రద్ధగా క్లాస్ వింటున్నారు స్టూడెంట్స్... చూపు తిప్పకుండా, కళ్ళను ఆమెకు అప్పగించేసి, ఏదో ట్రాన్స్లో వున్నట్టు వుండిపోయారు స్టూడెంట్స్ అంతా...

జరుగుతున్నది మొత్తం చూసి, కీర్తి ముందుగా తేరుకుంటూ, " ఎక్క్యూజ్ మీ మ్యామ్... " చిన్నగా పర్మిషన్ అడిగింది...

కీర్తి మాటలకు డిస్టర్బ్ అయిన ప్రీతి, కనుబొమ్మలు ముడిచి డోర్ వైపు తలతిప్పి చూస్తుంది...

అంతమంది వున్నా ప్రీతి లుక్ అధర్వ్ మీదనే పడుతుంది ముందుగా... తరువాతనే మిగిలిన బ్యాచ్ మొత్తాన్ని ఒక లుక్ వేసి, చిన్నగా నిట్టూరుస్తూ ఎడమ చేతికున్న టైటన్ వాచ్ ని చూసుకుంటుంది...

" ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్క్యూజ్ చేస్తున్నా... మళ్ళీ రిపీట్ అవ్వకూడదు... కమ్ ఇన్ సైడ్... " కోపంగా చెప్పి, లెసన్ స్టార్ట్ చేసేస్తుంది ప్రీతి...

స్టూడెంట్స్ అందరూ మళ్ళీ ప్రీతి లోకంలోకి వెళ్ళిపోయారు క్షణ కాలంలో... మృదుమధురంగా వున్న ఆమె వాయిస్... అందరినీ అలా కట్టిపడేస్తుంది...

లెసన్ చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్ లోకి, తమవైపుకి మార్చి మార్చి చూస్తున్న కాటుక కళ్ళు.....
ఆమె మీద నుంచి ఎవ్వరినీ చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి...

లోపలికి వస్తూనే అందరినీ గమనిస్తున్న అధర్వ్ పిడికిలి బిగుసుకుంది... మిడ్ రోలో థర్డ్ బెంచ్లో కీర్తి పక్కన కుర్చోవలసిన అతను, ఫస్ట్ బెంచ్లో కూర్చున్న సరస్వతీ పుత్రుడి షర్ట్ కాలర్ పట్టుకొని నిలబెట్టేసాడు...

ఇంట్రెస్టింగ్గా క్లాస్ వింటున్న వాడు, వెర్రి మొహం వేసుకొని అధర్వ్ వైపు చూస్తాడు...

" మే....డమ్ క్లాస్ ఎప్పుడు జరిగినా, ఈ ప్లేస్ నాది... పోరా... " సైడ్ లుక్ ప్రీతికి విసిరేస్తూ, బెంచ్ లోంచి బక్కపల్చని సరస్వతీ పుత్రుడిని నెట్టేసి, తను సెటిల్ అయ్యాడు అధర్వ్ దర్జాగా...

అధర్వ్ ని అనవసరంగా కదపడం ఇష్టంలేక, వస్తున్న కోపాన్ని అదిమిపెట్టి, మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసింది ప్రీతి...

పాపం సరస్వతీ పుత్రుడు దీనంగా పోయి, కీర్తి పక్కన అధర్వ్ ప్లేస్లో సెటిల్ అవ్వాలని చూసేంతలో, సంతోష్ వచ్చి, పక్కనే వున్న తన బెంచ్ లోకి వాడిని నెట్టేసి, అతను కీర్తి పక్కన సెటిల్ అవుతాడు...

కీర్తి కోపంగా బుక్ నిండా పిచ్చి గీతలు గీసేస్తుంది...
సంతోష్ ఆమె చేతిని చేతిలోకి తీసుకొని, చిన్నగా ప్రెస్ చేసి వదులుతాడు...

అరగంట పాటు స్టూడెంట్స్ అందరినీ, ఒక్క కీర్తిని తప్పించి, క్లాస్లో ప్రతీ ఒక్కరినీ తన లోకంలోకి తీసుకెళ్ళిపోయి, చెప్పిన క్లాస్ ఎప్పటికీ వాళ్ళకి గుర్తుండిపోయేలా చేసింది ప్రీతి...

నెక్స్ట్ క్లాస్ బెల్ వినిపించడంతో, చిన్ని స్మైలీ ఫేస్తో అందరికీ బై చెప్పి, బయటకు నడిచింది...

" ఓయ్ పాప... నా పనిష్మెంట్ కోసం ఏమాలోచించావ్...!? విల్ యూ బీ మై గర్ల్...!? " స్టయిల్ గా ఒళ్ళు విరుచుకుంటూ అడుగుతాడు అధర్వ్...

" హేయ్...!! నీకు బ్రెయిన్ దొబ్బ్... " వస్తున్న మాటను మింగేసి, విసురుగా అధర్వ్ ముందుకొచ్చి నుంచొని...............
" నీ బ్రెయిన్ వర్క్ చేస్తుందా అసలు... ఐయామ్ యువర్ లెక్చరర్... నన్ను............ " అప్పటికే క్లాసులో స్టూడెంట్స్ మొత్తం నోర్లు వదిలేసి మరీ, వాళ్ళనే చూడటం గమనించి.........
" లుక్... మనిద్దరి మధ్య ఏదైతే జరిగిందో దానికి నేను నీకు సారీ చెప్పాను... బస్... అయిపోయింది... దీన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిది... " కోపంగా చెప్పి వెనుదిరిగింది ప్రీతి...

" హుమ్మ్... నేను కూడా ముందే చెప్పాను కదా లెచ్చరర్ పాప... నువ్వు నా పనిష్మెంట్ తీసుకుంటేనే నీ సారీ ఆక్సెప్ట్ చేసేదని... " బెంచ్ లోంచి లేచి, ప్రీతి ముందుకు వస్తూ చెప్తాడు అధర్వ్...

ఇబ్బందిగా అందరి వైపూ ఒక లుక్ వేసి,
" నువ్వు సారీ ఆక్సెప్ట్ చెయ్యకపోయినా, నాకొచ్చే లాస్ ఏం లేదు... గో టు హెల్... " అధర్వ్ ని దాటుకొని వెళ్ళిపోయింది ప్రీతి...

" అచ్చా.... నువ్వు కూడా వస్తే హెల్ అయినా ఓకే అని చెప్పా కదా లెక్చరర్ పాప... " పెద్దగా అరుస్తాడు వెళ్ళిపోతున్న ప్రీతికి వినిపించేలా...

వెనక్కి కూడా తిరిగి చూడకుండా వడివడిగా వెళ్ళిపోతుంది ప్రీతి...

ప్రీతి వెళ్ళిపోయాక క్లాస్లోకి వచ్చి, అందరికీ సీరియస్ లుక్ ఇస్తూ...............
" లెక్చరర్ పిల్ల నాది... తేడా లుక్స్ పడ్డాయో, ఒక్కడు కూడా ఈ లోకాన్ని చూడలేడు... ఆమె లెసన్ చెప్తున్నంత సేపూ, మీ చెవులు మాత్రమే వర్క్ చెయ్యాలి... కళ్ళు కాదు... అండర్స్టాండ్... " ఖంగు మనేలా వినిపించిన అధర్వ్ అరుపుకి, దెబ్బకి అందరూ ఉలిక్కిపడి, మొహమొహాలు చూసుకొని, తలలు నిలువుగా ఊపారు...

" గుడ్...!! రేయ్ సరస్వతి పుత్రా...!! ముఖ్యంగా నువ్వు... నా పిల్ల క్లాస్లో నీ ట్యాలెంట్ మొత్తాన్ని బయటకు తియ్యకుండా, మడిచి బ్యాక్ పాకెట్లో పెట్టుకో... తనే డౌట్స్ అడిగినా, ముందుగా ఆన్సర్ చెయ్యాల్సింది నేనే... ఓకే... " సరస్వతీ పుత్రుడి కళ్ళద్దాలను తీసి ఆడుకుంటూ వాడిని వార్న్ చేసాడు అధర్వ్...

వాడి చీపురు పుల్లలను తలపించే కాళ్ళు అప్పటికే వణికిపోతుంటే, " ఓకే అధర్వ్... ఓకే... " భయం భయంగా చెప్తూనే అధర్వ్ చేతుల్లోంచి తన అద్దాలను షివర్ అవుతున్న చేతులతో తీసుకొని, వాడి బెంచ్ కి వెళ్ళి కూర్చుంటాడు...

ఇంతలో అటెండర్ వచ్చి................
" అధర్వ్ బాబు...!! మిమ్మల్ని విష్ణు సర్ రమ్మంటున్నారు... " చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడతను...

" రేయ్... ఆమె కంప్లైంట్ చేసినట్టుంది... " అధర్వ్ షోల్డర్ మీద చెయ్యి వేస్తూ సంతోష్...

సంతోష్ కి ఒక అర్రోగెంట్ లుక్ విసిరి బయటకు నడుస్తాడు అధర్వ్...

కీర్తి వెంటనే లేచి, అధర్వ్ వెనుక పరుగందుకుంటుంది... మిగిలిన మూడు తోకలు కూడా క్లాస్ నుంచి బయటకు నడుస్తాయి...

అప్పుడే వచ్చిన మరో క్లాస్ లెక్చరర్ వెళ్ళిపోతున్న వీళ్ళను అయోమయంగా చూస్తూ, క్లాస్ లోపలికి వెళ్తాడు...

ప్రిన్సీ రూంకి వెళ్తున్న వీళ్ళందరికీ, సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఒకమ్మాయితో మాట్లాడుతూ వస్తూ, ఎదురుపడుతుంది ప్రీతి...

సంతోష్, కీర్తి, వింద్య, వివేక్ లు గుర్రుగా చూస్తుంటే, అధర్వ్ మాత్రం ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ తో చూస్తూ వుంటాడు ప్రీతిని...

వీళ్ళను అస్సలు పట్టించుకోకుండా, దాటుకొని వెళ్ళిపోతుంది ప్రీతి...

వెనక్కి తిరిగి బ్యాక్ వాక్ చేస్తూ ప్రీతిని స్కాన్ చేస్తాడు అధర్వ్...
ఎక్స్ప్రెషన్ లెస్ గా వున్న అతని మొహంలోకి ఒక సైడ్ స్మైల్ వచ్చి చేరగా, నాలుక నోట్లో తిప్పుకుంటూ ముందుకు తిరిగి, ప్రిన్సి రూంలోకి వెళ్తాడు...

లోపలికి వచ్చిన అధర్వ్ ని చూస్తూ........
" హుమ్మ్... పెద్దవాడివి అయిపోయావ్... " కూర్చోమన్నట్టు సీట్ చూపిస్తూ ఆంటారు ప్రిన్సిపల్ విష్ణు మోహన్...

" ఏదైనా అనాలి అనుకుంటే డైరెక్ట్ గానే అనచ్చు... ఇండైరెక్ట్ డైలాగ్స్ వద్దు బాబాయ్... " సీట్లో కూర్చుంటూ అన్నాడు అధర్వ్...

చిన్నగా స్మైల్ చేస్తూ..... " హుమ్మ్... మీరు కూడా కూర్చోండి... " మిగిలిన వాళ్ళకి కూడా చెప్తారు ప్రిన్సిపల్...

కాలేజ్ స్టార్ట్ అయ్యి వన్ మంత్ అవుతుంది... బట్ మనం ఇంతవరకూ ఫ్రేషర్స్ కోసం పార్టీ ఎరేంజ్ చెయ్యలేదు... నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం నేనూ, డాడీ...

" హుమ్మ్... మంచిదే కదా బాబాయ్... " పేపర్ వెయిట్ తో ఆడుకుంటూ అధర్వ్...

నువ్వూ, నీ బ్యాచ్ మొత్తం కలిసి, అన్నీ దగ్గరుండి చూసుకోవాలి...

సంతోష్, కీర్తి, వింద్య, వివేక్ లు ఒకేసారి తప్పకుండా సర్ అని కోరస్ గా చెప్పేస్తారు...

" ఇక నేను వెళ్ళచ్చా... " సీట్లోంచి పైకి లేస్తూ అధర్వ్...

" అధర్వ్...!! తను నీకు సారీ చెప్పింది... దట్ టూ... కాలేజ్ అందరికీ తెలిసేలా... ఇక తనని ఇబ్బంది పెట్టకు... "

ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్తో, ప్రిన్సిపల్ ని చూస్తూ..........
" ఆర్డరా... రిక్వెస్ట్ నా..!? " అడుగుతాడు అధర్వ్...

" మీ నాన్న ఫ్రెండ్గా ఆర్డర్... ప్రిన్సిపల్ గా రిక్వెస్ట్... "

" రివర్స్ లో వున్నట్టుంది... " సైడ్ స్మైల్ చేస్తూ అధర్వ్...

" ప్రిన్సిపల్ ఆర్డర్ వేస్తే, వినయంగా తలూపే స్టూడెంట్ కాదు ఈ అధర్వ్... బాబాయ్ రిక్వెస్ట్ చేస్తే, నో చెప్పే వాడు కాదు నా అధర్వ్... సో... రివర్స్ లో వుండటమే కరెక్ట్... " నవ్వుతూ చెప్పారు ప్రిన్సిపల్...

ఆయన నవ్వుతో జత కలుస్తూ,
" నేనేం నువ్వనుకునేంత మంచి వాడిని కాదు బాబాయ్... "

" చెడ్డ వాడివి కూడా కాదు కదా అధర్వ్... రూడ్ గా బిహేవ్ చేస్తావేమో కానీ, నీ మనసు చాలా సెన్సిటివ్... "

" ఐ హావ్ టు లీవ్... " చెప్పేసి, బయటకు వెళ్ళిపోయాడు అధర్వ్ విత్ ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్... అతని వెనుకే మిగిలిన బ్యాచ్...

తన సీట్లో సెటిల్ అవుతూ...... అధర్వ్ గురించిన ఆలోచనల్లో మునిగిపోతారు ప్రిన్సిపల్ విష్ణు మోహన్...

To be continued....