" ప్రీతీ...!! ప్రీతీ... ఐ లవ్ యూ... ఐ లవ్ యూ రా... నాకింకా బ్రతకాలని వుంది... నీతో కలిసి బ్రతకాలని వుంది... నీతో కలిసి బ్రతకాలని వుంది ప్రీతీ నాకు... " కష్టంగా శ్వాస తీసుకుంటూ చెప్తూనే, ఆమె ఒడిలో తన ఆఖరి శ్వాస విడిచాడు అతను...
" అరుణ్...!!! " ఉలిక్కి పడి లేచింది ఆమె...
ఒళ్లంతా చిరు చెమటలు...
బిక్కు బిక్కుమంటూ చుట్టూరా చూసుకుంది...
వణికే చేతులతో, పక్కనే బెడ్ ల్యాంప్ స్టాండ్ మీదున్న వాటర్ బాటిల్ తీసుకొని, సగం నీళ్ళు తాగేసింది...
బాటిల్ పక్కన పెడుతూ, గోడకున్న గడియారం వైపు చూసి, అప్పటికే టైం తెల్లవారి నాలుగున్నర గంటలు అవ్వడంతో, అరి చేతులతో మొహాన్ని రబ్ చేసుకొని, బెడ్ దిగి, తన గదిలోంచి బయటకు నడిచి, ఇంటి పనులు మొదలుపెట్టింది ప్రీతి...
ఇళ్ళు, వాకిలి శుభ్రం చేసి, వాకిట్లో కళ్ళాపి జల్లి, ముగ్గు పెట్టేసరికి సమయం అయిదు గంటలు...
" ప్రీతీ...!! లేచేసావా తల్లీ...!? " అంటూ తన గదిలోంచి బయటకు వచ్చింది మాధవి...
" హా... అమ్మా...!! గుడ్ మార్నింగ్... నేను ఫ్రెష్ అయ్యి వచ్చి, టీ రెడీ చేస్తాను... ఈ స్ట్రీట్ చివర పార్క్ వుంది... నువ్వీలోగా వెళ్ళి, కొంచెం సమయం వాకింగ్ చేసిరా... "
" హా..!! ఈరోజే ఎందుకు...!? నిన్నే కదా వచ్చాం... ఇంకా ఇక్కడెవ్వరూ మనకి తెలియదు కదా తల్లీ... అలా నలుగురూ పరిచయం అయ్యాక, వెళ్తానులే... " వాకింగ్ చెయ్యకుండా తప్పించుకోవడానికి ఎప్పటిలానే,
సాకులు చెప్పింది మాధవి...
" అలా వాకింగ్ చేస్తూ కూడా, నలుగురిని పరిచయం చేసుకోవచ్చు... తెలుసా అమ్మ...!? " ఉచిత సలహా మొహాన కొట్టి లోపలికి వెళ్ళిపోతున్న ప్రీతిని, మొహం నల్లగా పెట్టుకొని చూస్తూ,
" తప్పదా........!? " సాగదీస్తూ అడుగుతుంది మాధవి...
" తప్పదు... " గదిలోంచే అరిచి చెప్తుంది ప్రీతి...
" హు... హు... హు... " ఏడుపు మొహంతో కాళ్ళీడ్చుకుంటూ బయటకు నడుస్తుంది మాధవి...
గంట తరువాత వాకింగ్ పూర్తి చేసుకొని, ఇంటికి వచ్చి మాధవి సోఫాలో కూలబడితే, ఆమె ముందు రెండు గ్రీన్ టీ కప్స్ తో ప్రత్యక్షమయింది ప్రీతి...
చిన్న స్మైల్ తో మాధవి ఒక కప్ తీసుకుంటే, రెండో కప్ తను తీసుకొని ఆవిడ పక్కన సెటిల్ అయ్యింది ప్రీతి...
" హుమ్మ్...!! ఎలా వుంది... " కళ్ళు మూసుకొని, తన టీని ఆస్వాదిస్తూ అడిగింది ప్రీతి...
" నీ చేతి టీ రుచి కోసం అడగాలా ప్రత్యేకంగా...!? " అంటూ టీని ఆస్వాదిస్తోంది మాధవి కూడా...
" నేనడుగుతుంది టీ కోసం కాదమ్మా... కొత్త ప్లేస్ కదా... ఎలా వుంది... ఊరు నచ్చిందా అంటున్నాను... " కప్ పక్కన పెడుతూ, అడిగింది ప్రీతి...
" హుమ్మ్..!! ఇంకా వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా పూర్తి కాలేదు... అప్పుడే ఎలా చెప్తాను... " గ్రీన్ టీ ఆఖరి సిప్ చేస్తూ మాధవి...
ఆవిడ చేతిలోని ఖాళీ కప్ తీసుకుంటూ,
" పార్క్లో ఎవ్వరూ పరిచయం అవ్వలేదా అమ్మా...!? "
" మన ఎదురింట్లో ఉంటారట... సంగీత గారు... ఆవిడ, పరిచయం అయింది... "
" హుమ్మ్...!! సరేమ్మా...!! నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెఢీ చేస్తాను వెళ్ళి... నాక్కూడా టైమ్ అవుతుంది... కాలేజ్ ఫస్ట్ డే కదా... చర్చ్ క్కూడా వెళ్తాను ఒకసారి వెళ్ళేప్పుడు... "
" నేను హెల్ప్ చెయ్యనా కుకింగ్లో...!? "
" నో నీడ్ మా... నేను చేస్తాను... నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు... " చెప్పేసి, కిచెన్ లోకి వెళ్ళిపోయింది ప్రీతి...
ఎనిమిది గంట కొట్టే సరికి, వండిన వంటకాలను డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తుంది ప్రీతి... తన కోసం బాక్స్ ప్యాక్ చేసుకొని, మాధవిని పిలుస్తుంది బ్రేక్ఫాస్ట్ కోసం...
ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ, అరగంటకి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు...
తన బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ.............
" అమ్మా...!! ఇది గ్రేటెడ్ కమ్యూనిటీ... నీకేం భయం లేదు... ప్రశాంతంగా వుండచ్చు ఇంట్లో నువ్వు.. బోర్ అనిపిస్తే, టీవీ చూడు... కానీ ఎక్కువ టైమ్ కాదు... ట్యాబ్లెట్స్ టైం కి వేసుకో... రెస్ట్ తీసుకో... నేను ఈవినింగ్ వచ్చాక హాస్పిటల్ కి తీసుకువెళతాను... " మాట్లాడుతూ పోతున్న ప్రీతి తల ప్రేమగా నిమురుతూ,
" చాల్లేవే... నేనేం చిన్న పిల్లని కాదు ఇన్ని జాగ్రత్తలు చెప్పడానికి... నీకు లేట్ అవుతుంది బయల్దేరు ముందు... చర్చ్ క్కూడా వెళ్తాను అంటున్నావ్ కదా... "
" హా...!! ఓకే అమ్మా... బై... " మాధవిని హగ్ చేసుకొని వదిలి, బ్యాగ్ తీసుకొని బయటకు నడిచింది ప్రీతి...
St. Peter's Church... (ఎక్కడ అని అడక్కండి... నా స్టోరీలో ప్రదేశాలు కల్పితాలు... రియల్ గా కనిపించవు... ఒకవేళ ఈ పేరిట ఏదన్నా చర్చ్ కనిపిస్తే, దానికి నాకూ ఏ సంబంధం లేదు...😇)
నీస్ మీద కూర్చోని, కళ్ళు మూసుకొని వుంది ప్రీతి...
" ప్రీతి...!! ఇంకా ఎంతసేపు... ఇంత టైం నీల్ డౌన్ చేస్తే, నీ నీస్ నొప్పి పుడతాయి... లే ప్రీతి... " మూసిన కనురెప్పల మాటు నుంచి కూడా, కన్నీళ్ళు బయటకు వస్తుంటే, క్రాస్ వేసుకొని, కళ్ళు తుడుచుకుంటూ పైకి లేచింది ఆమె...
వెంటాడుతున్న జ్ఞాపకాలను తోడు తీసుకొని, బయటకు నడిచింది భారమైన నడకతో...
శ్రీ వేదమాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ...
ఆటో వాడికి డబ్బులిచ్చి, కాలేజ్ లో అడుగుపెట్టింది ప్రీతి...
ఎవ్వరినీ పట్టించుకోకుండా, తన మానాన తను వెళ్ళిపోతుంటే,
" ఇదిగో అమ్మాయ్... బ్లాక్ శారీ... " అంటూ వినిపించిందొక గొంతు...
తను వేసుకున్నది బ్లాక్ శారీ అవ్వడంతో, నన్నేనా...!? అనుకుంటూ పక్కకు తలతిప్పి చూసింది...
అప్పటికే తననే చూస్తూ నుంచున్న ఒక బ్యాచ్, వెంటనే మేము కాదు... వాళ్ళు అన్నట్టు, మరో సైడ్ వున్న బ్యాచ్ వైపు చూపిస్తారు సైగ చేస్తూ...
" రామ్మా బ్లాక్ శారీ... ఇటు... ఇటు రావాలి... మేమే పిలిచాం నిన్ను... " అంటూ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ విరాజ్ పిలుస్తాడు ప్రీతిని...
చిన్నగా నిట్టూరుస్తూ, విరాజ్ అండ్ కో దగ్గరికి వెళ్తుంది...
ప్రీతిని టాప్ టు బాటమ్ స్కాన్ చేసి, " నీ పేరేంటి..!? " అడుగుతాడు విరాజ్...
" ప్రీతి...!! " చిన్నగా బదులిస్తుంది...
" కాలేజ్కి శారీలో వచ్చావేంటి పాప...!? హా...!! "
" కుర్రాళ్ళని వెంట తిప్పుకోనీకి అనుకుంటరా... " విరాజ్ ప్రశ్నకి, అతని బ్యాచ్ లో వుండే నేహా సమాధానమిస్తుంది వెటకారంగా...
అక్కడున్న వారందరినీ ఒక చూపు చూసి, ముందుకు కదులుతుంది ప్రీతి...
" ఓయ్ పాప...!! ఎక్కడికి వెళ్ళిపోతున్నావ్ మేము మాట్లాడుతుంటే...!? హా...!! సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదా...!? ఏ ఇయర్...!? న్యూ అడ్మిషన్ హా...!? అయినా కాలేజ్ స్టార్ట్ అయ్యి 2 మంత్స్ అవుతుంటే, ఇప్పుడు జాయిన్ అయ్యావేంటి...!? " ఒకదాని వెంట ఒకటి ప్రశ్నల వర్షం కురిపిస్తూనే, ఆమె ఎదురుగా వచ్చి నిలబడి,
" నేను మాట్లాడుతుంటే వెళ్ళడం కరెక్ట్ కాదు కదా...!? తప్పు కదా...!? సో...!! పనిష్మెంట్ వుందిప్పుడు నీకు... " అంటూ ప్రీతి చెయ్యి పట్టుకుంటాడు విరాజ్...
మరుక్షణంలో అతని చెంప మీద ప్రీతి చేతి వేలి ముద్రలు పడతాయి...
" ఏయ్..!! ఎంత ధైర్యముంటే నన్నే కొడతావే...!? " ముందుకు కదిలిన ఆమె పైట చెంగుని పట్టి ఫోర్స్ గా వెనక్కి లాగుతాడు విరాజ్...
కానీ వాడే వెళ్ళి, ముందుకు ప్రీతి కాళ్ళ ముందు బొక్క బోర్లా పడతాడు...
ఒక్క క్షణం ఆమెకు ఏం జరిగిందో అర్థం కాలేదు... విరాజ్ ఫోర్స్ గా లాగడంతో, షోల్డర్ దగ్గర పిన్ నుంచి పక్కకు తప్పుకున్న తన పైట చెంగుని జారకుండా, గట్టిగా పట్టుకొని, బొమ్మలా నిలబడి ఉందామె...
భయంతో వణికిపోతుంది ప్రీతి... అక్కడేం జరుగుతుందో పట్టించుకునే స్థితిలో ఆమె ఇప్పుడు లేదు...
" ఆర్ యూ ఓకే...!! " అంటూ అతను ఆమె ముందుకు వచ్చి నిలబడతాడు... కానీ అతన్ని పట్టించుకునే స్థితిలో ఆమె లేదు...
షాక్ లో ఉన్న ఆమెను మామూలు స్థితికి తీసుకువచ్చే ప్రయత్నంలో, అతను ఆమె భుజం మీద చెయ్యి వేస్తాడు...
అంతే...!! మరు క్షణం అతని చెంప మీద ప్రీతి చేతి వేలి ముద్రలు పడతాయి...
ముట్టుకుంటే మాసిపోయే రంగులో వున్న అతని చెంప మీద, ప్రీతి నాలుగు వేళ్ళు పింకిష్ కలర్లో ముద్రపడి కనిపిస్తుంటే, చుట్టూ వున్న వాళ్ళంతా, అతని వైపు భయంగా, ఆమె వైపు జాలిగా మార్చి మార్చి చూస్తూ వుంటారు...
ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అక్కడ జరగబోయే విధ్వంసాన్ని గ్రహించి, ప్రిన్సిపల్ రూంకి పరుగులు పెట్టారు..
భయం భయంగా చుట్టూ చూస్తూ, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రీతి, వణికిపోతున్న తన కాళ్ళను కదిపి, అడుగు ముందుకు వేస్తుంది...
అంతే...!! మరుక్షణం అతను ఆమెను రెక్కపట్టి మీదకు లాక్కొని, వారిరువురి పెదవులను జత చేసేస్తాడు...
ఈసారి అక్కడున్న వారందరికీ షాక్ కొడుతుంది... కళ్ళు పెద్దవి చేసుకొని, నోళ్ళు కప్పల్లా తెరుచుకొని చూస్తూ ఉండిపోతారు ఆ అద్భుత సన్నివేశాన్ని...
విషయం తెలుసుకొని అప్పుడే అక్కడికొచ్చిన ప్రిన్సిపల్ కూడా షాక్ అయ్యి, షేక్ అవుతాడు...
అతని పెదవుల దాడికి ఆమె గింజుకుంటూ వుంది... కానీ అతను లెక్కచేయడం లేదు... మూడు నిమిషాల పాటు ఆమె పెదవుల మీద దాడి చేసి, ఫైనల్ గా ఆమె రక్తాన్ని టేస్ట్ చేసి వదులుతాడు...
అప్పటికే ఫెయింట్ అయిన ఆమె, అతని గుండెల మీదనే వాలిపోతుంది...
పదిహేను నిమిషాల తరువాత:
డైరెక్టర్ ఛాంబర్:
" అధర్వ్...!! నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా..!? అంతమంది ముందు ఆ అమ్మాయిని...... "
బాబాయ్..!! అంతమంది ముందు తను నాకు స్లాప్ ఇచ్చింది... ఈ " అక్కినేని అధర్వ్ కృష్ణ " ఇగో మీద దెబ్బ కొట్టింది... (అక్కినేని అన్నాను కదాఅని ఈ అధర్వ్ బాబుని, కింగ్ నాగార్జున గారి తాలూకా అనుకున్నారు గనక... ఈ అక్కినేని అధర్వ్ కృష్ణ కి, అక్కినేని నాగార్జున గారికీ మధ్య ఎటువంటి సంబంధం లేదు బాబు...)
" అధర్వ్...!! ఆ అమ్మాయి భయంతో, షాక్లో అలా రియాక్ట్ అయ్యింది... కావలనైతే కాదు కదా... "
" అవన్నీ నాకనవసరం బాబాయ్... బట్ తను నన్ను అందరి ముందూ అవమానించి చాలా పెద్ద తప్పు చేసింది... షి విల్ డెఫినెట్లీ పే ఫర్ థిస్... " ఆవేశంగా చెప్పి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అధర్వ్ కృష్ణ...
వెళ్ళిపోతున్న కొడుకునే చూస్తూ స్తబ్దుగా నిల్చున్నాడు ధర్మేంద్ర...
To be continued...!!