Premam - 2 books and stories free download online pdf in Telugu

ప్రేమమ్ - 2

భారంగా అనిపిస్తున్న కనురెప్పలను నెమ్మదిగా తెరిచింది ఆమె...

కరస్పాండెంట్ వైష్ణవి గారు, ప్రీతి చేతిలో చెయ్యి వేసి,
" అమ్మా ప్రీతి..!! ప్రీతి ఆర్ యూ ఓకే...!? " అని అడుగుతారు...

చెమ్మగిల్లిన కళ్ళతో వైష్ణవి గారిని చూస్తూ, తల నిలువుగా ఊపుతుంది ప్రీతి...

ప్రీతి తల నిమురుతూ, ఆమె పక్కనే కూర్చోని జరిగింది చెప్తారు వైష్ణవి గారు...

ఆవిడ చెప్పింది మొత్తం విన్న ప్రీతికి తనే అధర్వ్ విషయంలో ముందుగా తప్పు చేశానని అర్థం చేసుకుంటుంది...

ఈలోగా ప్రీతిని వుంచిన రూంలోకి వస్తారు ఆ కాలేజ్ ఫౌండర్స్ లో ఒకరైన ధర్మేంద్ర... ఇంకా ప్రిన్సిపల్ విష్ణు మోహన్ కలిసి...

నెమ్మదిగా లేచి కూర్చుంటూ, ప్రిన్సిపల్ విష్ణు మోహన్ ని చూస్తూ చిన్నగా నవ్వి, వచ్చిన వాళ్ళని విష్ చేస్తుంది ప్రీతి...

" అమ్మా ప్రీతి... ఈయన అక్కినేని ధర్మేంద్ర గారు... ఈ కాలేజ్ ఫౌండర్... " ధర్మేంద్ర గారిని పరిచయం చేస్తారు విష్ణు మోహన్...

" సర్..!! తినే ప్రీతి... " ప్రీతిని కూడా ధర్మేంద్ర గారికి పరిచయం చేస్తారు విష్ణు మోహన్...

" అమ్మా ప్రీతి...!! నీ పట్ల జరిగిన దానికి నా కొడుకు అధర్వ్ కృష్ణ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను... " ధర్మేంద్ర మాటల్లో గంభీరత్వం వున్నా, కళ్ళల్లో అపరాధ భావం...

" కొడుకా...!! " ఆశ్చర్యంగా వైష్ణవి గారి వైపు చూస్తుంది ప్రీతి... అవునన్నట్టు కళ్ళతోనే బడులిస్తారు ఆమె...

" సర్..!! తప్పు నాది కూడా వుంది... అసలేం జరుగుతుందో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా నేను మీ అబ్బాయిని నలుగురిలో చెంప దెబ్బ కొట్టాను... ముందు నేనే మీ అబ్బాయిని క్షమాపణ అడగాలి... " చిన్నగా, స్థిరంగా బదులిచ్చింది ప్రీతి...

ప్రీతి మాటలకు ధర్మేంద్ర గారి పెదవుల మీద చిన్న చిరునవ్వు వచ్చి చేరింది... ఆమె బెడ్ పక్కకు వెళ్ళి.....,

" నా కొడుకు కాస్త మొండి... ఇప్పుడు కాస్త ఆవేశంలో వున్నాడు... వాడికి నువ్వెదురుపడక పోవడమే మంచిది... నాలుగు రోజుల్లో వాడే, జరిగింది అర్థం చేసుకొని, ఈ ఇన్సిడెంట్ మరచిపోతాడు... ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా, నీ వర్క్ నువ్వు చేసుకో తల్లి... " చెప్పడం పూర్తి చేసి, ప్రేమగా తల నిమురుతారు...

" లేదు సర్... చిన్న సారీ... రెండక్షరాల పదం... మీ అబ్బాయి ఆవేశానికి భయపడి నేను చెప్పకుండా వుంటే, మేమిద్దరం ఎప్పుడు ఎదురుపడినా, మీ అబ్బాయికి ఈ ఇన్సిడెంట్ గుర్తొస్తుంది... నాకూ కూడా... అదే ఒక్కసారి ఇప్పుడే ధైర్యం చేసి నేను సారీ చెప్పేస్తే, మీ అబ్బాయి కోపం ఈరోజు కాకపోయినా, రేపైనా తగ్గుతుంది కదా... నాకు కూడా గిల్ట్ ఫీల్ పోతుంది... నాకు హెల్ప్ చెయ్యాలని చూసిన పర్సన్ ని నేను నలుగురిలో అవమానించాను... కాలేజ్ మొత్తం తెలిసేలానే మీ అబ్బాయికి నేను సారీ చెప్తాను... " తను చెప్పాలనుకున్నది చెప్పేసి, బెడ్ దిగింది ప్రీతి...

ధర్మేంద్ర, విష్ణు మోహన్, వైష్ణవి గార్లు ఒకరిమొహలు ఒకరు చూసుకున్నారు ప్రీతి ఆలోచనా తీరుకి ఆశ్చర్యపోతూ...

డ్రెస్సింగ్ రూంలో డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న అధర్వ్ కి, మణికట్టు దగ్గర మంటగా అనిపిస్తుంటే, తన చేతిని చూసుకున్నాడు అతను...

రెండు గోర్లతో గీరినట్టున్న గాయాన్ని చూస్తూ, తను ఫోర్స్ గా కిస్ చేసేప్పుడు ప్రీతి విడిపించుకోవడానికి గింజుకుంటూ, తన చేతిమీద రక్కడం గుర్తు చేసుకుంటాడు...

అతనిలో ఆవేశం పీక్స్ కి వెళ్ళిపోయింది... విసురుగా టీషర్ట్ వేసుకొని, బాస్కెట్ బాల్ కోర్ట్ వైపు నడిచాడు...

ఇండోర్ బాస్కెట్ బాల్ కోర్ట్... తన టీమ్ తో కలిసి గేమ్ స్టార్ట్ చేసాడు అధర్వ్... అప్పటికే కాలేజ్ లో సగం మంది పైనే అతని గేమ్ చూడటానికి వెయిట్ చేస్తూ వున్నారు... అతను రావడంతోనే అక్కడి వాతావరణం మొత్తం, గోల గోలగా మారిపోయుంది... అధర్వ్.... అధర్వ్.... అని కోరస్ గా అరుస్తూ అమ్మాయిలు అబ్బాయిలు అరిచి గోల చేస్తున్నారు...

అందరికీ ఒక యాటిట్యూడ్ లుక్ విసిరి, హ్యాండ్ వేవ్ చేసి, గేమ్ స్టార్ట్ చేసాడు...

సడెన్గా అంత గోలలో కూడా, " అధర్వ్... మిస్టర్ అదర్వ్... " అంటూ సన్నని వాయిస్...

అంతవరకూ గోలగోలగా వున్న వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది... అందరి ధ్యాస ఆ వాయిస్ మీదనే వుంది...

అధర్వ్ గోల్ వేసి, ఆమె వాయిస్ని వింటాడు చిన్ని స్మైలీ ఫేస్తో... సగం మంది వరకూ అమ్మాయిలు గుండెల్లో ఆ చిన్ని చిరునవ్వు నవ్వు, పూల బాణమల్లే గుచ్చుకుంది...

" మిస్టర్ అధర్వ్...!! మీరు వింటున్నారనే అనుకుంటున్నాను నేను చెప్పేది... మిమ్మల్ని నేను అందరి ముందు చెంపదెబ్బ కొట్టి అవమానించాను... సో... కాలేజ్ అందరికీ తెలిసేలానే మీకు నేను క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను.. "

ఆమె మాటలు వింటున్న అధర్వ్ పిడికిలి బిగుసుకుంది... బాల్ తీసుకొని గేమ్ స్టార్ట్ చేసాడు ఒంటరిగా...

" అధర్వ్...!! ఐయాం సో సారీ... మీరు నాకు హెల్ప్ చెయ్యడానికి వస్తే, నేనది అర్థం చేసుకోకుండా మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను... ఐ యాం రియల్లీ వెరీ సారీ మిస్టర్ అధర్వ్... మీరు పనిష్ చేసినా నాకు ఓకే... కానీ నా సారీని ఆక్సెప్ట్ చెయ్యండి... " వణుకుతున్న ఆమె స్వరం చెప్పకనే చెప్తుంది ఆమె బాధపడుతుందని...

ఆమె మాటలు ఆగిపోవడంతోనే, మళ్ళీ గోల్ వేసి, కోర్ట్ నుంచి బయటకు కదిలాడు అధర్వ్ తన ఫ్రెండ్స్ పిలుస్తున్నా వినిపించుకోకుండా... అతని అడుగులు అనౌన్స్మెంట్ రూం వుండే బ్లాక్ వైపు పడుతున్నాయి...

" స్పృహలో లేని ప్రీతి, తన చేతుల్లో గువ్వలా ఒదిగిపోయి వుంటే, ఆమెనే చూస్తూ, కరెస్పాండెంట్ గారి రూంకి తీసుకెళ్ళి పడుకోబెట్టడం అతని మైండ్లో స్ట్రైక్ అయ్యింది... "

అప్పటికే అనౌన్స్మెంట్ రూం నుంచి బయటకు వచ్చి, వైష్ణవి గారితో మాట్లాడుతున్న ప్రీతి,
" ఇక నేను క్లాస్కి వెళ్తాను మేడమ్... " చెప్పేసి ముందుకు కదిలింది...

వెళ్ళిపోతున్న ప్రీతిని చూడటంతోనే, అధర్వ్ నడకలో వేగం పెరిగింది... నాలుగు అంగల్లో ఆమెను చేరి, రెక్క పట్టుకొని మీదకు లాక్కున్నాడు...

" ఏయ్...!! " విసుగ్గా అరిచిన ప్రీతి, అధర్వ్ ని చూడటంతోనే కూల్ అయిపోతూ,

" ఐయాం సారీ మిస్టర్ అదర్వ్... " సిన్సియర్ గా చెప్తుంది తన చేతిని అతన్నుంచి విడిపించుకుంటూ...

అధర్వ్ ఇంటెన్స్డ్ లుక్స్ తో చూస్తూ వుంటాడు ప్రీతి చేతిని వదలకుండానే...

ప్రీతి అయోమయంగా చూస్తుంది అతని వైపు... భయం కలుగుతుంది ఆమె మనసులో...

" మిమ్మల్ని అందరి ముందూ చెంప దెబ్బ కొట్టాను... అందుకే అందరిలోనూ నేను మీకు సారీ చెప్పాను... ఈ మ్యాటర్ మనిద్దరం ఇక్కడితో వదిలేస్తే మంచింది... " భయాన్ని మనసులోనే దాచేస్తూ, చిన్నగా చెప్తుంది అతని పట్టు వల్ల కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తుంటే...

" చెంప దెబ్బ కొట్టి సారీ చెప్తే సరిపోతుందా...!? నీ సారీ నేను ఆక్సెప్ట్ చెయ్యాలంటే, నువ్వు నేనిచ్చే పనిష్మెంట్ తీసుకోవాలి... " ప్రీతిని పైనుంచి కింద వరకూ కళ్ళతోనే స్కాన్ చేస్తూ అన్నాడు అధర్వ్...

" పనిష్మెంట్...!!! " ప్రీతితో పాటు, అప్పుడే అక్కడికి వచ్చిన అధర్వ్ ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యంగా అడిగారు...

" నువ్వే అన్నావ్ కదా... మిస్టర్ అధర్వ్ మీరు పనిష్ చేసినా నాకు ఓకే... కానీ నా సారీని ఆక్సెప్ట్ చెయ్యండి అని... " ప్రీతి చేతిని వదిలేస్తూ బదులిస్తాడు అధర్వ్...

బ్లాంక్ ఫేస్తో చూస్తుంది ప్రీతి అధర్వ్ ని...

" బీ మై గర్ల్... "

అధర్వ్ చెప్పిన మాటకు ప్రీతి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి...

అధర్వ్ ఫ్రెండ్స్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలానే వుంది... మొత్తం కాలేజ్ అమ్మాయిలంతా ఎంతలా తన వెంట పడినా పట్టించుకోని అధర్వ్, ప్రీతితో చెప్పిన మాట విని, బొమ్మల్లా బిగుసుకుపోయారు...

" ఓయ్ పాప...!! ఏంటలా చూస్తున్నావ్...!? చెప్పింది అర్థం కాలేదా...!? నా పిల్లగా నిన్ను వుండమంటున్నా... ఈ అధర్వ్ కృష్ణ పిల్లవి నువ్వు ఈ రోజు నుంచి... ఏంటి... అర్థమైందా...!? " ఐబ్రోస్ వేవ్ చేస్తూ చెప్పాడు అధర్వ్...

" గో టు హెల్... " విసురుగా అక్కడి నుంచి ముందుకు కదిలింది ప్రీతి...

" నువ్వు కూడా రా నాతో హెల్ కి... " గట్టిగా చెప్పి, అందంగా నవ్వేసాడు అధర్వ్...

నడుస్తూనే వెనక్కి తిరిగి చూస్తూ, " ఇడియట్ " పళ్ళు బిగించి తిట్టుకుంటుంది ప్రీతి...

" పనిష్మెంట్ అడిగావ్ కదా పాప... తీసుకోకపోతే, నిజంగానే నీకు హెల్ చూపిస్తా... " అరిచి చెప్తాడు అధర్వ్...

" నేనెవరో తెలిస్తే, నువ్విలా మాట్లాడవు... అనవసరంగా నాతో పెట్టుకోకు... సారీ చెప్పాను... బస్...!! పిచ్చి పిచ్చి కహానీలు షురూ చెయ్యకు... బుద్దిగా క్లాస్ కి పోయి చదువుకో... " హెచ్చరించి వెళ్ళిపోయింది ప్రీతి...

వెళ్ళిపోతున్న ఆమెనే చూస్తూ సైడ్ స్మైల్ చేస్తాడు అధర్వ్...

వెనకన్నే వున్న ఫ్రెండ్స్ అందరూ అధర్వ్ ని చుట్టుముట్టి,

" రేయ్...!! ఏం జరుగుతుందిరా ఇక్కడ...!? నువ్వా పోరికి నిజంగానే పడిపోయావా...!? " ఆశ్చర్యంగా అడుగుతాడు అధర్వ్ ఫ్రెండ్ సంతోష్...

ఆ మాటకు కీర్తి చాలా కంగారుగా చూసింది అధర్వ్ వైపు...

" అంతలేదు... అది అందరి ముందూ నన్ను అవమానించింది... అది కొట్టిన దెబ్బ నా చెంప మీద కాదు... ఈగో మీద తగిలింది... నా దెబ్బెలా వుంటుందో దానికి చూపించాలి కదా మరి... " ఎర్రబడిన కళ్ళతో చెప్పి, అక్కడి నుంచి కదిలాడు అతను...

అతని వెనకే ఫ్రెండ్స్ అందరూ...

కీర్తి ఊపిరి పీల్చుకుంది... ఆమె పోతున్న ప్రాణం తిరిగివస్తున్నట్టు అనిపిస్తుంటే, పక్కనే వున్న సంతోష్ భుజం మీద తలవాల్చి నడుస్తుంది...

సంతోష్ కళ్ళల్లో చిన్న మెరుపు...

(అదర్వ్ కృష్ణ గారికి మొత్తం నలుగురు దోస్తులు... ఇద్దరు అమ్మాయిలు... ఇద్దరు అబ్బాయిలు... నలుగురూ ఎప్పుడు అధర్వ్ వెనుకే తోకల్లా తిరుగుతారు... కీర్తి పాపకి బాబంటే స్పెషల్ ఇంట్రస్ట్... సంతోష్ బాబుకి కీర్తి అంటే ఇంట్రెస్ట్... కీర్తి పాపకి అదర్వ్ బాబు మీదున్న స్పెషల్ ఇంట్రెస్ట్ కోసం తెలిసిన సంతోష్ బాబు తన ఇంట్రెస్ట్ ని హోల్డ్ లో పెట్టాడు... మొత్తానికి అయితే అతని ఇంట్రెస్ట్ ను వదులుకోలేదు... ఎందుకంటే అధర్వ్ బాబుకి కీర్తి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు... ఫ్రెండ్ వరకే చూస్తాడు... కీర్తి మీదనే కాదు ఏ అమ్మాయి మీద లేదు ఇంతవరకూ... ఇక మిగిలిన ఇద్దరూ వివేక్ అండ్ వింధ్య... వీళ్ళిద్దరూ మూడు సంవత్సరాల నుంచి లవ్ లో వున్నారు... ఇది కాలేజ్ మొత్తానికి తెలిసిన విషయం... )

ఆఫ్టర్నూన్ క్లాసెస్ కి అటెండ్ అవ్వడానికి, అధర్వ్ అండ్ కో... క్లాసెస్ కి వెళ్తారు హుషారుగా...

అప్పటికే క్లాసెస్ స్టార్ట్ అయ్యి, 5 మినిట్స్ అయింది... ఈ బ్యాచ్ మొత్తం క్యాంటీన్లో, ఈరోజు వాళ్ళు విన్ అయిన మ్యాచ్ కోసం సొల్లు వేసుకొని ఇప్పటికి వచ్చారు...

క్లాస్ లోకి ఎంటర్ అయిన బ్యాచ్ మొత్తం ఒక్కసారిగా స్టన్ అయిపోతారు ఎదురుగా వున్న దృశ్యాన్ని చూసి...

To be continued....!!