మరోవైపు అన్వి కోసం వెతుక్కుంటూ వెళ్లిన అభయ్ దిక్కులాన్ని పరికించి పరికించి చూసాడు. కానీ తనకి ఎక్కడ అన్వి జాడ కనిపించలేదు .
“ బహుశా నేను దురదృష్టవంతుడిని అనుకుంటా!. నా ప్రేమను తెలియజేసే అదృష్టం నాకు ఉండదనుకుంటా . నేను ప్రేమని తెలియజేస్తాను అని చెప్పడం వల్లే , తనకి ఇలా అయ్యి ఉంటుందా ?” అని ఆలోచనలో పడ్డాడు.
ఇప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే, అక్కడ ప్రతిక్షణం తనకి ఒక నరకమే! త్వరగా కనుక్కోవాలి అంటూ వెతుకుతూ అటు పక్క ఉన్న నగరాన్ని అంతా చూసాడు .కానీ తనకి అన్వి ఎక్కడ కనిపించలేదు.
అప్పుడే తనకి ఎత్తుగా ఉండే ఒక టవర్ కనిపించింది. చుట్టూ అంత గమనించాడు. ఎవరు లేరని నిర్ధారించుకున్న తర్వాతే , ఒక్కసారిగా తన తెల్లని రెక్కలని విప్పి ఆకాశంలోకి ఎగిరాడు అభయ్.
అలా ఎగురుతూ వెళుతున్నప్పుడే అటుగా ఏదో పని పైకి వచ్చినా భూషణ్ కంటికి అభయ్ చిక్కాడు.
“ ఏంటి అభయ్ ఒక ఏంజల్ హా? ” అని మనసులోని ఆశ్చర్యపోతూ , ఆ టవర్ వైపు వేగంగా నడిచాడు . అక్కడే ఉన్న లిఫ్ట్ పై నొక్కగానే, అది కొన్ని క్షణాల్లోనే భూషణ్ ని ఆ టవర్ పై అంతస్తుకి తీసుకొని వెళ్ళింది .
అక్కడ గాలిలో ఎగురుతూ , చుట్టూ అంతా అన్వి కోసం వెతుకుతు చాలా నిరాశగా ఉన్న అభయ్ కనిపించాడు.
అంతస్తుకి చేరుకున్న భూషణ్ ఆయాసంగా పరిగెత్తుకుంటూ వచ్చి, “ అభయ్! నువ్వు ఒక ఏంజల్ వా ?” అంటూ ప్రశ్నించాడు.
వెనకనుంచి ఆ మాటలు రాగానే అభయ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నెమ్మదిగా తలతిప్పి చూస్తే , ఎదురుగా భూషణ్ .
ఇక తనకి అబద్దం చెప్పడం ఎలాగో చేతకాదు కాబట్టి ఔనన్నట్టు తలపాడు.
“ ఏమైంది ఎందుకలా తలదించుకుంటున్నావు? ఏంజెల్ గా ఉండడం నీ తప్పుకాదు ” అంటూ కాస్త మనసుని స్థిమిత పరుచుకొని అన్నాడు ఆయన.
ఆ మాటలకి గాల్లో ఎగురుతున్న అభయ్ చిన్నగా ఆ టవర్ పైకి వచ్చాడు.
“ నిజం చెప్పాలి అంటే , నేను కూడా ఒక ఏంజెల్ నే” అంటూ భూషణ్ తన రెక్కలను విప్పాడు .చీకటిలో అతడి రెక్కలు చాలా కాంతివంతంగా వెలుగుతూ చూడటానికి , మనోహరంగా ఉన్నాయి .
ఇప్పుడు ఆశ్చర్యపోవడం అభయ్ వంతు అయింది .
“ సార్ మీరు .....?” అంటూ ఆశ్చర్యంతో కూడిన కంఠంతో అడిగాడు .
“ అవునా అభయ్! ” అంటూ మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చి, పక్కనే ఉన్న కొంచెం ఎత్తుపాటి సిమెంట్ పిల్లర్ పై కూర్చున్నాడు .
సూటిగా తలెత్తి చూస్తూ, “ నేను ఒక ఏంజల్ . కానీ నిషేధించబడిన ఒక ఏంజెల్నీ . ”
“ ఏంటి మీకు స్వర్గంలో ప్రవేశం లేదా ? కానీ ఎందుకు ? ప్రతి ఒక్క ఏంజెల్ కి ప్రవేశం ఉంటుంది కదా! ” అన్నాడు ప్రశ్నింపగా.
“ నువ్వు చెప్పింది నిజమే ! కానీ ......” అంటూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు ఆయన.
“ సార్ అసలేం జరిగింది ?” అంటూ దగ్గరగా వస్తూ తెలుసుకోవాలన్న ఆశతో, ఆయన వైపు చూశాడు.
“ నిజానికి నేను కూడా నీలాగే ఉండేవాడిని . కానీ నా చివరి మిషన్ ఒక వ్యక్తిని చంపడం. అది దైవ కార్యమే ఉండొచ్చు , కానీ నేను మాత్రం చేయలేకపోయాను. కారణం నేను బేబీ ఏంజెల్ గా ఉన్నప్పుడు నుండి భూమిపై తిరుగుతున్నాను. అప్పుడు నాకంటూ ఎవరు ఉండేవాళ్ళు కాదు.
కానీ నాకు ఈ ప్రపంచాన్ని చూడడం చాలా ఇష్టం. అలాంటి టైంలోనే పరిచయం అయ్యారు నాకు ఛటర్జీ గారు. నేను ఆయనతో స్నేహ మేరుపరుచుకున్నాను. ఆయనతోనే గొడవపడ్డను, సంతోషంగా గడిపాను, కొత్త కొత్తవి చేయడం ఇలా !
మా మధ్య ఎలాంటి దాపరికాలు లేవు .కానీ అప్పుడే తెలిసింది . అతను ఒక డ్రాకులా అనీ! అతని చంపడమే నా చివరి మిషన్ అనీ!
మొదట చంపాలని వెళ్ళను . కానీ అతనితో గడిపిన ప్రతిక్షణం , నన్ను ప్రశ్నించుకునేలా చేసింది. అందుకే ఆ పనిని చేయలేకపోయాను . ఇద్దరికీ నిజాలు దాచడానికి ఏవో ఒక కారణాలు ఉండొచ్చు అని అర్థం చేసుకున్నాను. ఆ పనిని చేయకుండా అలాగే ఉంచేసాను . అందుకే నేను స్వర్గంలోకి ప్రవేశం పొందలేదు ” అని చెప్పాడు.
మొత్తం వింటున్న అభయ్ మళ్ళీ షాక్! ఎందుకంటే వారి కాలేజీ ప్రిన్సిపల్ ఒక డ్రాకులా అనీ. “ మరి డ్రాకులాన్ని చంపడానికి వేరే వాళ్ళని నియమించలేదా ?”
“ నియమించాలని చూశారు. కానీ నేను ఆ ప్రభువుని కోరుకున్నాను . నాకంటూ ఉన్న ఒకే ఒక్క స్నేహితుడా అతడు. అతడి ఉద్దేశాలు కూడా ఈ మనుషులతో మంచిగా నడుచుకోవాలని, అంతేకానీ ఎవరినీ ఇబ్బంది పెట్టాలని కాదు . అందుకే మా ఇద్దరి ఆలోచనలు కలిసి మన మధ్య స్నేహం ఏర్పడింది . దానికి బదులుగా నేను ఎగిరే స్వభావాన్ని , ఆ స్వర్గంలో ప్రవేశించే గుర్తింపుని వదులుకుంటానని చెప్పాను.”
“ మరి ఇప్పుడు మీరు సంతోషంగానే ఉన్నారా? ”
“ ఉన్నాను .చాలా సంతోషంగా ఉన్నాను. ఆ స్వర్గంలో ఉండే వారి కంటే చాలా సంతోషంగా ఉన్నాను . ఆ తర్వాతే నా జీవితంలోకి మౌర్యానే ఒక వ్యక్తి వచ్చాడు . మేము ముగ్గురం స్నేహితులమయం. కలిసి చదువుకోవడం , కలిసి తిరగటం మొదలైంది.
మౌర్య కుటుంబరీత్యా వ్యాపారవేత్తలు! అందుకే అతను ఈ కాలేజ్ ని స్థాపించాడు . మేము అందులో పని చేస్తూ సంతోషంగా గడుపుతున్నాము” అని అసలు విషయం మొత్తం చెప్పుకొచ్చాడు .
అభయ్ నుంచి నిశ్శబ్దం మాత్రమే ఉంది .
“ అయినా నువ్వు ఎందుకు ఇలా గాల్లో ఎగురుతున్నావు. మామూలుగా భూమిపైన ఏంజెల్ తమ గుర్తింపుని వేరే వాళ్ళకి తెలియజేయాలి అనుకోవు కదా ?” అన్నాడు ప్రశ్నిస్తూ.
“ సార్ నా చివరి మిషన్ అన్విని ప్రేమించడం. ఆ విషయం ఈ రోజు చెప్తాను అనుకున్నాను. కానీ కాలం ఆడిన నాటకం వల్ల ఆ విషయం చెప్పక ముందే అన్వి కిడ్నాప్ అయింది . తన కోసమే ఇలా వెతుకుతూ ఉన్నాను ” అన్నాడు బాధగా నిట్టూర్పు విడుస్తూ .
ఇప్పుడు ఆయన దగ్గర నుంచి నిశ్శబ్ద.
“ నిజంగా నా చివరి మిషన్ ఆ దేవుడే నిర్ణయిస్తే, మరి ఎందుకని తనకి ప్రమాదం ఏర్పడింది . నేను తన రాతల్లో ఉంటే తనకి మంచి జరగాలి కదా? నా ప్రేమ వల్ల ఒకరి హని జరగదు అనే విషయం నాకు కచ్చితంగా తెలుసు . కానీ ఇప్పుడు విరుద్ధంగా జరుగుతుంది .ఎందుకని ?” అంటూ నిశ్శబ్దంగా సమాధానం కోసం ఎదురుచూస్తున్న కళ్ళతో చూశాడు.
కొద్దిసేపు ఆలోచించిన భూషణ్ , “ తన రాతల్లో ఇంకా వేరే ఎవరో ఉన్నారు అనుకుంటా ! నీ రాతల్లోకి తను వచ్చింది.....తన రాతల్లోకి ఇంకొకరు వచ్చారు. అందుకే ఈ పరీక్ష! నాకు తెలిసి నువ్వు ఒక విషయాన్ని గుర్తించుకో; జీవితం ప్రతి ఒక్కరికి పరిస్థితిలో ఒకే నిర్ణయం తీసుకునే వెసులుబాటును కల్పిస్తుంది .
ఆ క్షణం నీ నిర్ణయం ఏంటి అన్న దానిపైనే నీ జీవితం ఆధారపడుతుంది . అలాంటి నిర్ణయం నేను తీసుకోన్నాను . ఆ డ్రాకులాను చంపకుండా ఉండటం. అందుకే నేను ఇలా భూమిపైన మిగిలాను” అన్నాడు వివరిస్తూ.
అభయ్ ఆలోచనలో పడ్డాడు ......... !!!
“ నాకు చాలా సంతోషంగా ఉంది . ఇన్ని రోజులకి ఒక ఏంజెల్ ని కలిసినందుకు ” అంటూ అభయ్ ని గట్టిగా హత్తుకున్నాడు భూషణ్ .
తనకి మరింత ఇబ్బంది కలిగించకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు.
నెమ్మదిగా సూర్యోదయం అవుతుంది. వేకువజాము అవడం వల్ల సూర్యకిరణాలు అప్పుడప్పుడే మేఘాలను తాకుతున్నాయి.
అభయ్ నడుచుకుంటూ చాలా బాధగా , అన్వి గురించి ఆలోచిస్తున్నాడు. అప్పుడే అతడికి ఇంతకు ముందు కనిపించిన ఒక పెద్దాయన కనిపించాడు.
ఆయనని చూడగానే అభయ్ కళ్ళల్లో చిన్న మెరుపు . ఏదైనా సమాధానం దొరుకుతుందేమో అనీ! అందుకే చాలా ఆశగా అతని దగ్గరికి వెళ్ళాడు.
ఆయన టీ తాగుతూ పేపర్ ని చదువుతూ ఉన్నాడు . ఆయన పక్కన నిశ్శబ్దంగా కూర్చున్న అభయ్, “ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ” అన్నాడు .
“ నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. కానీ నేను ఆ విషయం చెప్తే నా ప్రాణాలే పోవచ్చు ” అన్నాడు చిన్నగా.
అభయ్ ఆశ్చర్యపోతూ, “ ఎందుకలా అవుతుంది? " అన్నాడు ప్రశ్నార్థకంగా.
“ ఎందుకంటే నువ్వు అనుకున్నట్టు నేను మనిషిని కాదు . నేను చేసుకున్న పుణ్యాల కారణంగా ఈ రూపం మాత్రమే మిగిలింది . ఇప్పుడు నేను నీకు నిజం చెప్తే, ఇక నేను ఆత్మగానే తిరగాల్సి వస్తుంది ” అన్నాడు అసలు విషయం చెప్తూ!
ఆ మాటలు వినగానే స్తంభించిపోయిన అభయ్, “ నేను ఇంకా మిమ్మల్ని మనిషి అనుకుంటున్నాను. కానీ మీకు ఈ విషయం ఇప్పుడు నాకు చెప్పాలని ఎందుకు అనిపించింది ” అంటూ కళ్ళు రెండు పెద్దవి చేసీ .
“ ఎందుకంటే ఏంజెల్స్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు కదా! ” అన్నాడు చిన్నగా నవ్వుతూ.
నా విషయం కూడా తెలుసా అంటూ విసుపోయి ఆయన వైపే చూస్తూ ఉన్నాడు .
“ సరే ఒకటి చెప్పు? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావా ?”
అవును అన్నట్టుగా తలువుపాడు.
“ సరే అయితే , ఆ అమ్మాయి గురించి నీకు చెప్తాను. నా శక్తిని అంతధార పోసి ” అని చిరునవ్వు చిందిస్తూ ....
ఆ పేపర్ అభయ్ చేతికి ఇచ్చాడు. కానీ సమాధానం కోసం ఎదురు చూస్తున్న అభయ్, ఆయన వంకే చూస్తూ ఉన్నాడు.
కాలం స్తంభించిపోయింది. చూట్టు జరిగే పరిస్థితులన్నీ ఏవి కదలకుండా అయిపోయాయి.
“ నీకు కావలసిన సమాధానం ఆ న్యూస్ పేపర్ లోనే ఉంది. సరిగ్గా వెతుకు ” అని నవ్వాడు .
అంతే అతడి శరీరం మిరిమిట్లు గోలిపే మినుగురు పురుగుల్లాగా , గాలిలో మాయం అవ్వటం మొదలైంది.
“ ఇంతకీ మీరెవరు ? నేను మిమ్మల్ని మళ్లీ కలుస్తానా ?” అన్నాడు గాభరాగా, మాయమవుతున్న అతని వైపు చూస్తూ .
” నేనే , మౌర్యనీ! . కచ్చితంగా మళ్లీ కలుద్దాం ” అంటూ మాయమైపోయాడు.
అతని మానవ రూపం మాయమాయి ఆత్మగా మారిపోయి , అభయ్ కంటి నుండి దూరమయ్యాడు. జరుగుతున్న ఒక్కొక్క విషయాన్ని చూస్తూ ఉంటే అభయ్ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు.
తన కలలో కూడా ఊహించిన విషయాలు ఎదురుగా జరుగుతూ ఉండేసరికి , ఏం చేయాలో అర్థం కాలేదు .
అలాగే ఆ న్యూస్ పేపర్ ని చేతిలో తీసుకొని చూశాడు . అందులో పెద్ద అక్షరాలతో ఒక ఫోటో ఉంది . ఆ ఫోటోలో అభిషేక్ తన తండ్రి నెంబర్ వన్ కంపెనీ అయిన మౌర్య ఇన్ఫినిటీస్ వారసురాలు అన్విని కనుకున్నారు అంటూ ప్రచురించారు .
అదంతా చూసి తన కళ్ళను తానే నమ్మలేక ఆశ్చర్యంగా విషయం మొత్తం చదివాడు . అందులో......
“ ఇప్పటిదాకా సోమనాథ్ గారు సీఈఓగా ఉన్నారు. ఇప్పుడు అసలైన వారసురాలైన అన్విని సీఈవోగా చేద్దామనుకున్నారు. ” అనీ అర్ధం అయింది.
అంటే సోమనాథ్ మరెవరో కాదు. అభిషేక్ వాళ్ళ నాన్న ! అంటే ఈ కిడ్నాప్ కి సోమనాథ్ గారికి ఏమైనా సంబంధం ఉందా ? అని ఆలోచన రాగానే జరిగిన విషయం అంత అర్థం అయిపోయింది.
అభిషేక్ అడ్రస్ సంపాదించిన అభయ్ వాళ్ళ ఇంట్లో ఉందేమోఉందేమో అనీ, చూడడానికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు.
——— ***** ———