Read Tana Premakai - 1 by Rayugha Kumar in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తన ప్రేమకై - 1

"తన బిడ్డ భవిష్యత్తే గమ్యం"అతనికి..
"అతనే గమ్యం" ఆమెకి ఈ ఇద్దరి ప్రేమకథే నా
ఈ 💞ప్రేమపాశం💞....





ఎప్పుడూ నవ్వుతూ ఉండే "హరిణి"మొహం చిన్నబోయింది.. కారణం! తను కొన్ని సంవత్సరాలాగా ఎంతగానో ప్రేమిస్తున్నా.. కాదు కాదు ఆరాధిస్తున్న
"శ్రీవిష్ణు" బిడ్డని మొదటిసారి చూసింది..

అతని ఒడిలో బుడ్డిది నాన్న నాన్న అంటూ అంటిపెట్టుకుపోతుంది.. హా మై బేబీ! నా చిన్ను బంగారం అంటూ ముద్దు చేస్తున్నాడు విష్ణు.. వాళ్లిద్దరి ఆప్యాయతని చూసి ఒక్క నిమిషం హరిణి కి ఏమి అర్థం కాలేదు.. తను ప్రాణంగా ప్రేమించిన మనిషి తనకు తెలియకుండా ఒక బిడ్డకి తండ్రి అయ్యాడు..

మనం నిజంగా ప్రేమిస్తే మన ప్రేమ ఎదుటివారిని కదిలిస్తుంది అంటారు కదా! మరి నా ప్రేమ నీకెందుకు తెలియలేదు విష్ణు.. నువ్వే నా గమ్యం అనుకున్నానే మరి నువ్వెందుకు నాకు ఒక్క అడుగులో కూడా తోడు లేకుండా దూరంగా వెళ్ళిపోయావు.. నేను ప్రతిరోజు నీ ఆలోచనల్లోనే బ్రతుకుతున్నాను.. నీ గురుంచిన ప్రతి ఆలోచన నా ఊహే కావొచ్చు.. కానీ నీ ఊహల్లో నేను జీవించిన నా జీవితం ఊహ కాదు కదా!

నీ ధ్యాసలోనే ఎప్పుడు బ్రతికే నేను, ఎందుకు నీకు కనీసం కలలో కూడా లేను.. అయితే నీ మీద నాది నిజమైన ప్రేమ కాదా!అబద్ధమా?.. నో నో విష్ణు యు ఆర్ మై లవ్.. యు ఆర్ మై లైఫ్.. ఐ కాంట్ లివ్ విత్ అవుట్ యు.. ఎవరైనా ఆత్మ లేకుండా జీవించగలరా? ఆత్మ లేదు అంటే అది శవమే కదా! అలాగే నువ్వు లేని నేను కూడా శవాన్నే..జీవచ్చవాన్ని..

ఆత్మ హత్య చేస్కునేంత పిరికిదాన్ని కాదు.. అలా అని నువ్వు లేకుండా బ్రతికేంత ధైర్యవంతురాలిని కాదు..

కానీ నువ్వు నా జీవితంలో లేవు.. నువ్వు ఇంకొకరి సొంతం..నా విష్ణు ఎప్పటికి నా విష్ణు కాదు..
కాలేడు..తను ఇప్పుడు ఒక బిడ్డకి తండ్రి .తను ఇప్పటికి ఎప్పటికి నా ఊహల్లోనే ఉన్నాడు.. ఉంటాడు..ఇంకా నా జీవితంలో లేడు.. నేను ఈ నిజాన్ని ఒప్పుకోవాల్సిందే..

నేను ఇన్నిరోజులు నిన్ను చేరుకోడానికి అడుగులు వేస్తున్నా.. ఏదో రోజు నిన్ను చేరుతా అనుకున్న.. కానీ నేను ఒక్కో అడుగు ముందుకి వేస్తుంటే.., నువ్వు నా నుంచి ఒక్కో అడుగు వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోయావు..ఇంకా నేను ఆగిపోవాలి..ఇంకా నేను ఎన్ని అడుగులు వేసినా నిన్ను చేరుకోలేను..అంటూ తనలో తానే కుమిలిపోతు రాత్రంతా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూనే ఉంది హరిణి...

"హరిణి" అంటే మహాలక్ష్మి అని మీనింగ్.. హరిణి పేరుకి తగ్గట్టే సిరిగల పిల్ల.. సిరి అంటే సంపదే కాదు.. ఆడపిల్ల ముఖంలోని అందం, కళ, ముఖ్యంగా ఆమె నవ్వు.. ఇవన్నీట్టిని కూడా సిరి అనే అనొచ్చు.. ఆ విషయంలో మన హరి టాప్ లో ఉంటుంది ఎప్పుడు అందంగా నవ్వుతూ.. అందరితో గలగలా మాట్లాడుతూ అంటే మరీ వాగుడుకాయని కాదు..పలకరించిన వారికి పలుకుతూ..పలకరించని వారిని పలకరిస్తూ.. తెలిసిన వాళ్ళతో తెలిసినట్టు.. తెలియని వారితో తెలియనట్టు చక్కగా చెదరని చిరునవ్వుతో మాట్లాడుతుంది...

తెల్లని రంగు, చక్కటి చిన్ని చిన్ని కళ్ళు అంటే మరీ అంత చిన్నవి కావు.. కొద్దిగా పెద్ద కళ్లు.. సన్నని ముక్కు, చెర్రీ పళ్ళలాంటి పెదవులు, చెప్పానుగా ఆ పెదవుల మీద ఎప్పుడూ చెరగని చిరునవ్వు.. మొత్తానికి బంగారు బొమ్మలా ఉంటుంది మన హరిణి..

హరిణికి ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కెమిస్ట్రీ అంటే పిచ్చి..ఎంత పిచ్చి అంటే ల్యాబ్ లోని ప్రతి సాల్ట్ని, ప్రతి సబ్స్టెన్స్ ని టేస్ట్ చెయ్యాలనిపించేంత పిచ్చి.. అదే పిచ్చిలో అన్నిటిని టేస్ట్ చేసేది.. దానివల్ల ఒక్కోసారి నోరు పాడయితే.., ఒక్కోసారి హెల్త్ పాడయ్యేది..టేస్ట్ అంటే మరీ భోజనం చేసినట్టు కాదులే.. ఏదో కూరలో ఉప్పు చూసినట్టు.. ల్యాబ్ లో ఉప్పు (సాల్ట్ ) టేస్ట్ చేసేది.. అదే పిచ్చి అలవాటుతో ఒకసారి టెస్ట్ కోసం ఉంచిన ఆల్కహాల్ టేస్ట్ చెయ్యబోతే మేడం చూసి చిత్తక్కోట్టేసింది.. ఆ దెబ్బతో ల్యాబ్ సబ్స్టాన్సెస్ టేస్ట్ చెయ్యడం మానేసింది.. కానీ కెమిస్ట్రీ ని వదల్లేదు.. అదే ఊపులో ఎం ఎస్ సి కెమిస్ట్రీ చేసింది..

ఎదో రకంగా తన డిగ్రీ తో కనీసం ఒక 2 ఇయర్స్ అయినా జాబ్ చెయ్యాలని తరవాత తన గమ్యమైన తన విష్షును చేరుకోవాలని తన ఆశ... కానీ ఆ రెండు సంవత్సరాల కాలమే తన జీవితాన్ని తలక్రిందులు చేసేసింది.. తన సోల్ ని తనకి కాకుండా చేసేసింది..

ఇంకా మన హరి ఫ్యామిలి విషయానికొస్తే ఆమె తండ్రి చంద్రశేఖర్ బ్యాంకు మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు.. తల్లి ఉమా మహేశ్వరీ హౌస్ వైఫ్.. భర్త పిల్లలు ఇల్లే ఆమె లోకం.. ఇంకా హరి కి ఒక అక్క ధరణి.. పేరుకి తగ్గట్టే ఓర్పు,సహనం, అందం ఉన్న పిల్ల.. హరి కన్నా రెండేళ్లు పెద్ద.. వాల్ల నాన్నమ్మ చివరి కోరిక మూలంగా తన మేనత్త కొడుకు పృథ్వినారాయణ్ తో ఇంటర్ అవ్వగానే పెళ్లి జరిపించేశారు.. వాళ్ల పేర్లలానే వాళ్ళ మనసులు కూడా కలిసినవే.. బావా మరదళ్ళు కదా! చిన్నప్పట్నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టమే.. కాకపోతే నానమ్మ చివరి కోరికతో తొందరగా ఒకటయిపోయారు.. ప్రస్తుతం వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా ఆరేళ్ళ తేజస్వి కూడా ఉన్నాడు.. ఇది హరిణి ఫ్యామిలీ..

ఇంకా మన కథలోకి వెళ్ళిపోదాం..

రాత్రంతా ఏడ్చి ఏడ్చి హరిణి ముఖం ఎర్రగా కందిపోయింది.. కళ్ళు వాచిపోయాయి.. మెల్లగా సూర్య కిరణాలు కిటికీలోంచి గది లోపలకి ప్రసరిస్తుంటే.. తల పైకెత్తిన హరిణికి ఆ వెలుతురు కూడా చీకటిగానే కనిపిస్తుంది..శూన్యం తప్ప ఏమిలేదు తన జీవితంలో.. తన కన్నీటి ప్రవాహానికి సూర్యుని వెళుతురు కూడా మసాగ్గానే ఉంది ఆమెకి..తనకి మళ్ళీ మళ్ళీ నిన్న సాయంత్రం పార్కులో డాడీ అంటూ చిన్ను, విష్ణుని అతుక్కుపోయిన సంఘటనే గుర్తొస్తుంది..

ఎంత వద్దనుకున్న ఆ బుడ్డిదాని రూపం తన మనసుని వదలడంలేదు.. ఎందుకంటే ఆ బుడ్డిది తన విష్ణు సంతానం.. అంతా బాగుండి ఉంటే తను నవమాసాలు మోసి జన్మనివ్వాల్సిన సంతానం.. కానీ తనకి ఆ భాగ్యం లేదు.. ఆ పసి ప్రాణానికి జన్మనిచ్చింది వెరెవరో.. ఇలా తన ఊహల్లో తనుండగా.. తన తల్లి ఉమా వచ్చి తలుపు కొట్టింది..ఏయ్ హరి ఇంకా లేవలేదా? ఇలా అయితే రేపు నిన్ను అనరు..నన్ను అంటారు.. ఇలా పెంచింది ఆ మహాతల్లి అని అరుస్తూ..

ఆ పిలుపుకి హరి ఈ లోకంలోకి వచ్చి హా అమ్మా! లేచాను వస్తున్నా అంది కళ్ళు తుడుచుకుంటూ అమ్మకి అనుమానం రాకుండా మాట్లాడుతూ...

త్వరగా రా.. మీ నాన్న నీకోసం టిఫిన్ చెయ్యకుండా వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ఉమా అక్కడ్నుంచి వెళ్లిపోయింది...

హరిణి ఒకటిన్నర సంవత్సరాలుగా బెంగుళూరు లోని ఒక ఫార్మ కంపెనీ లో ల్యాబ్ కెమిస్ట్ గా వర్క్ చేస్తుంది..
రెండు రోజుల క్రితమే హైదరాబాద్ కి వచ్చింది.. వచ్చి రాగానే విష్ణు విషయం తెలిసి ఆ బాధలో మునిగిపోయింది..

ఉమ వెళ్ళగానే హరిణి లేచి ఫ్రెషయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది.. హరిణి ముఖాన్ని చూడగానే చంద్రశేఖర్ షాక్ అయ్యాడు.. ఏంటీ బేబీ అలా ఉన్నావ్ ? ఏమయ్యింది? ఒంట్లో బాలేదా ఏంటో కంగారుగా హరిణి చెయ్యిపట్టుకోగానే... నాన్న అంటూ ఏడుస్తూ ఆయన గుండెల్లో ఒదిగిపోయింది..

ఎందుకంటే తన దుఃఖం ఎంత కంట్రోల్ చేసుకున్న ఆగేది కాదు.. అది చూసిన ఉమా కూడా ఏమయ్యిందే అంటూ కంగారు పడేసరికి, వాళ్ళని బాధపెట్టడం ఇష్టం లేక.. ఏమి లేదమ్మా భయం వేసింది అంటూ కళ్ళు తుడుచుకుంటూ తలవంచుకుని సమాధానం చెప్పింది..

భయం దేనికే ఆ కళ్లేంటి అలా అయిపోయాయి.. అసలు ఏమయ్యిందే అని కంగారు కంగారుగా ఇంకా గట్టిగా అడిగేసరికి హరిణి ఉలిక్కిపడిపోయింది..

చంద్రశేఖర్ ఆగమన్నట్టు ఉమాకి చేతితో సైగ చేసి.., మమ్మీ ఏమైంది.. నువ్వెందుకిలా ఉన్నావ్ నువ్వు చెప్పకుంటే నాకెలా తెలుస్తుంది.. అని నిదానంగా తల నిమురుతూ అడిగాడు.. అయినా సరే హరి తన దుఃఖం ఇది అని చెప్పలేదు.. ఎవరికీ ఏమి చెప్పుకోవాలని లేదు తనకి.. ఎందుకంటే విష్ణు తో తనకున్న బంధం ఇకనుంచి.. ఈ దుఃఖం తనకేప్పటికి తన విష్ణుని దగ్గరగా ఉంచుతుంది.. ఈ దుఃఖం తోనే విష్ణు జ్ఞాపకాలు ఎప్పటికి తన మనసులో పదిలం..

ఎవరితో ఏమి చెప్పడం ఇష్టం లేక అది కాదు నాన్న రాత్రి ఏదో పీడకల వచ్చింది.. చాలా భయమేసింది.. అస్సలు నిద్రపట్టలేదు . అందుకే కళ్ళు ఇలా ఉన్నాయ్.. మిమ్మల్ని చూసేటప్పటికి ఆ కల గుర్తొచ్చి ఏడుపొచ్చేసింది అంటూ మళ్ళీ తండ్రి గుండెల మీద వాలిపోయింది.

పీడకల అంటూ హరి మాటమార్చి నమ్మకంగా చెప్పినా, ఆమె ధైర్యం ఏంటో తెలిసిన తండ్రికి అది నమ్మశఖ్యంగా లేదు.. అంతేనా అమ్మా అంటూ మళ్ళీ తరికించి అడిగాడు.. హ్మ్మ్ అంటూ తల ఎత్తి చూస్తూ కళ్ళతోనే సమాధానమిచ్చింది హరి..

ఇంకా అడిగి కూతుర్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక., సరే నా హరి ఇంత పిరికిగా ఎప్పుడు అయిపోయింది.. పిచ్చిదాన అని నవ్వుతూ.! చూడు బేబీ మనిషి జీవితానికి కష్టాలు.. నిద్రలోకి పీడకలలు రావడం కామన్ కదా! కష్టం వచ్చిందని జీవితాన్ని ఒదులుకోకూడదు.. పీడకల వచ్చిందని నిద్ర వదులుకోనుకూడదు..
అప్పుడే వాడు అసలైన మనిషిగా నిలవబడతాడు..
నా హరి ఏంటో నాకు తెలుసు.. తాను దేన్నయినా సరే తట్టుకుని లేచి నిలబడగలదు కదా!అంటూ సూటిగా హరి కళ్ళల్లోకి చూస్తూ ధైర్యం చెప్తున్నాడు..

ఓసి దీనికేనా ఓ ఇంత చేసేసావ్ అంటూ మధ్యలో వెటకారంగా అందుకుని.. నేనింకా ఏమయిపొయిందోనని భయపడి సచ్చిపోయాను కదే!.. ఓ పగల్భాలు పలుకుతావ్ కదా నేను హరిణి ని అంటూ.. ఇదేనా అమ్మాయిగారి ధైర్యం.. సరిపోయింది సర్లే పదా టిఫిన్ చేద్దురు అంటూ డైనింగ్ టేబుల్ పై అన్నీ సర్దింది..

ప్లేట్ ముందు కూర్చుందే కాని తినకుండా హరి తనలోకంలో తనుంది.. ఇంతలో వాళ్ళ నాన్న తనకి దగ్గరగా జరిగి తిను మమ్మీ అంటూ నోటికి అందించాడు.. అబ్బో కారిపోతుంది తండ్రీకూతుళ్ళ ప్రేమ అంటూ ఉమ తన టిఫెన్ తను తింటుంది.. తరవాత చంద్రశేఖర్ బ్యాంకు కి వెళ్ళిపోయాడు.. ఉమ వంటగదిలో తన పనిలో తనుంది.. హరి కూడా తన రూంకి వెల్లి మళ్ళీ తన లోకంలో మునిగిపోయింది.. ఈవెనింగ్ చంద్రశేఖర్ కి ఇంటికొచ్చేప్పటికి మళ్ళీ అదే డల్నెస్ తో ఉన్న కూతుర్ని చూసి మనసు చీవుక్కుమంది.. మళ్ళీ బలవంతంగా నాలుగు ముద్దలు తినిపించాడు..

ఇదీ దీని వరస మధ్యాహ్నం కూడా ఎంత బ్రతిమాలినా ఒక్క మెతుకు కూడా ముట్టలేదు.. ఏమయ్యిందో తెలుసుకోమని గదిలో పోరుపెట్టసాగింది ఉమ.. చెప్పేదయితే తనే చెప్తుంది.. తనక్కోంచెం టైం ఇవ్వాలి కదా! అంతవరకు నువ్వు దాన్ని ఏమనకుండా కామ్ గా ఉండు అని సర్దిచెప్పాడు చంద్రశేఖర్.. ఉమకి అయితే నచ్చచెప్పాడు కానీ! ఎప్పుడు చలాకిగా ఉండే కూతురు ఎప్పుడూ ఎదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంటే రెప్ప మూత పడకుంది.. అలా అని కూతుర్ని ప్రలోబపెట్టి అడిగి తెలుసుకోలేడు...





కొనసాగుతుంది