Read Those three - 45 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 45

విలేకర్ల సమావేశంలో హరీష్ రావు వివరణ , ఆపరేషన్ విజయవంతం గా ముగించటంలో ఇంతియాజ్ సాహసం, సమయస్ఫూర్తి ప్రభుత్వ ప్రతిష్ఠ ను కాపాడాయి. మీడియా విశాల్ ఉగ్రవాదానికి , భయంకరమైన డ్రగ్స్ కు బలైన అమాయక యువకుడిగా హైలైట్ చేసింది. .
" A Father's Anguish ' అనే మకుటంతో ఓ ప్రముఖ
ఆంగ్ల పత్రిక ప్రచురించిన ఆర్టికల్ సమాజం లో అన్ని వర్గాల వారిని కదిలించింది. దేశంలో చాలా చోట్ల ప్రదర్శనలు , నిరసనలు కలకలం రేపాయి. మత్తుకు బానిస కాకుండా యువతను కాపాడుకోవాలన్న ఆరాటం అందరిలో కనిపించింది. కాలంతో పాటు మారాలి. మతం ముద్ర పడకుండా జూన్ స్రవంతి లో కలిసిపోవాలి. సామరస్యంగా జీవించాలి" అన్న ఆలోచన ఎలా ముస్లిం యువత ముందుకు వచ్చి సంఘీభావం తెలిపింది. కేంద్రం, దిదాదా
దాదాపు అన్ని రాష్ట్ర ప్రజా ఉద్యమాలకు అనుకూలంగా స్పందించాయి. " Anti-drug operation" కు మరింత కట్టుదిట్టం చేసేందుకు వ్యూహాలు, చట్టాలు మార్చుకోసాగాయి. అటు ప్రజల్లో , ఇటు ప్రభుత్వం లోనూ కుదుపులాంటి కదలిక.

ఇంటరాగేషన్ సెల్. ఆ లాంగ్ టేబుల్ కు అటు ఇంతియాజ్, ఇటు ఫయాజ్,.... తలవంచుకుని .....శిల్పం లా .
ఎందుకింత రిస్క్ చేశావ్ ఫయాజ్. సమాజంలో నీకున్న స్థాయి, పేరు, గౌరవం పేకమేడల్లా కూలిపోయాయి. ఒంటరిగా మిగిలిపోయావు. నీకు చివరికి మిగిలింది జీరో....ఎ బిగ్ జీరో.

" బట్ నో రిగ్రెట్స్...." మెల్లగా అన్నాడు ఫయాజ్.
" నో రిగ్రెట్స్ ! నీ డ్రగ్స్ మాఫియా కు అమాయకుడు విశాల్ బలైపోయాడు. ఆ పొజిషన్ లో ఒక్కసారి మీ వాడిని ఊహించుకో " ఇంతియాజ్ మాటల్లో వేడి, చురుగ్గా చూశాడు ఫయాజ్.
" కోపం వచ్చిందా ? మరి విశాల్ తల్లిదండ్రులకు నీమీద ఎంత కోపం రావాలి?"
జవాబు చెప్పలేని ప్రశ్న. ఫ్యాన్ తలవంచుకున్నాడు.
" డా. ఇనాయతుల్లా విద్యావంతుడు, మానవతావాది.మతసహనం, సహజీవనం ఆయన ఆదర్శాలు. మిషన్ జన్నత్ మెయిన్ ప్రిన్స్ పుల్స్ కూడా అవే. మరి....నీ ఆపరేషన్ జన్నత్ ఓ డ్రగ్స్ మాఫియా సెంటర్. నాన్- ముస్లిం యువకులను టార్గెట్ చేసే ఉగ్రవాద సంస్థ. "
" అవన్నీ నాకెందుకు చెప్పటం ? అరెస్ట్ చేసి తీసుకు వచ్చారు. ఇంటరాగేషన్ చేస్తున్నారు. మీకు కావలసిన ఇన్ఫర్మేషన్ అడగండి. చెబుతాను." ఫయాజ్ మొహం లో విసుగు, చిరాకు... భారంగా నిట్టూర్చాడు ఇంతియాజ్.
" ఇంత జరిగినా నీలో మార్పు రాలేదా.. ఓకే" . ఇంతియాజ్ అడిగి నా అన్ని ప్రశ్నలకు ప్రతిఘటన లేకుండా జవాబులు ఇచ్చాడు ఫయాజ్. రొటీన్ ముగిసింది.
" నీలాంటి మొండి వాళ్ళకు , మూర్ఖులకు నేను చెప్పేది ఒకటే.
మనిషి, మనిషిని కలిపేది మతం కాదు. ప్రేమ, స్నేహం, దయ, సానుభూతి. The synonym of divinity is humanity.మతం కేవలం వ్యక్తిగత ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
ప్రతి జాతి వాళ్ళు విధిగా పాటించాల్సిన నియమాలు , జీవిత విధానాలు మతగ్రంధాల్లో ఉన్నాయి. క్రమశిక్షణ తో ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడపాలంటే వాటిని పాటించాలి. అంతే .మతమే భగవంతుడు కాడు. మతమొక్కటే జీవితం కాదు. ఇనాయతుల్లా ఫిలాసఫీ ఇదే. మీలాంటి ఉన్మాదులు ఈ నిజం ఎప్పుడు తెలుసుకుంటారు ? ఎవరు తెలుసుకున్నా, తెలుసుకోకపోయినా ఆ మంచి రోజు వచ్చేవరకు మనం ప్రయత్నించాలి. ముందు తరాల వాళ్ళ కు మనం ఒకliving example కావాలి. నువ్వన్నది ముమ్మాటికీ నిజం. మిషన్ జన్నత్ దేశమంతటా పందిరిలా అల్లుకోవాలి. మతాలకు అతీతంగా యువతలో మార్పు రావాలి. ప్రతి యువకుడు తాను ఎదగాలి. తన. దేశ క్షేమం, ప్రగతి అతడి లక్ష్యాలు కావాలి. అందుకు మాది నీ బాట కాదు. మనిషికి మనిషే సాయం అన్నట్లు మానవహారంగా ఉద్యమిస్తాం. నేషన్వైడ్ కమిటీ నెట్ వర్క్ తో ఇనాయతుల్లా ఈ ఉద్యమాన్ని నడిపిస్తాడు. " భావావేశం పొంగే ఇంతియాజ్ మాటల్లో భవిష్యత్తు ధ్వనించింది. ఫయాజ్ మొహం లో నమ్మలేని నిజాన్ని వింటున్నట్లు ఆశ్చర్యం.

ఆ విశాలమైన వేదిక వెనుక విశాల్ నిలువెత్తు విగ్రహం.
పెదవులపై చిరునవ్వు. కళ్ళల్లో మెరుపు.
విశాల్ మరిచిపోలేని ఒక బాధా వీచిక. !
వేదికపై ముఖ్యమంత్రి, మరికొంతమంది విశిష్ట అతిథులు, హరీష్ రావు ఆయన సతీమణి.
హాలంతా నిండిపోయింది. సందడి గా ఉంది. ముఖ్యమంత్రి చేతులు జోడించి నమస్కరించాడు. క్షణం వెనక్కి తిరిగి విశాల్ చిత్రం వైపు చూశాడు. ఇటు తిరిగి సభ అంతా కలయజూసి, గొంతు సవరించుకున్నాడు.
నెమ్మదిగా సభలో కలకలం సద్దు మణిగింది.
" నేనెక్కువ మాట్లాడదలచుకోలేదు. ఏం జరిగిందో, మనమిక్కడ ఎందుకు సమావేశమైయ్యామో మీ అందరికీ తెలుసు. జరిగిన దురదృష్టకర సంఘటన కు కారణం.... డ్రగ్స్ మాఫియా. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మత్తు రాక్షసి. ఎలా రూటౌట్ చేయాలి ? ఎ హిమాలియన్ టాస్క్.
మనం బలహీనతలే డ్రగ్స్ ట్రేడర్స్ కు రాజమార్గాలు. అసలు లోపం ఇక్కడే ఉంది. ఈ లోపం సవరించటం సులభం కాదు. మార్పు మొదట తల్లిదండ్రుల్లో రావాలి. ఈ వేదిక మీద ఉన్న
హరీష్ రావ్, ఆయన సతీమణి మనకో హెచ్చరిక చేయనున్నారు. "
విశాల్ ఆత్మహత్య మనకో గుణపాఠం.
ఇప్పటి కైనా తల్లి దండ్రులు మేల్కోవాలి. పిల్లల్ని దారికి తెచ్చుకోవాలి. ప్రేమ తో, మంచి మాటతో వారికి నచ్చజెప్పాలి. నేటి సమాజంలో పరిస్థితులు సరిగా లేవు.
చెడిపోవడానికి ఎన్ని దారులో ! అందుకే మీరు అన్ని విధాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కొంటేనే వాడు అమ్ముతాడు. మనం ఆపేస్తే వాడేం చేయగలడు ? ఈ చైతన్యం మీలో, మీ పిల్లల్లో వేస్తే ఎంత పెద్ద మాఫియా అయినా కుప్ప కూలుతుంది. ఇది ప్రజా ఉద్యమం. మీరు ధైర్యంగా అడుగేస్తే, మాతో సహకరిస్తే, ప్రభుత్వం తన వంతు
బాధ్యత త్రికరణశుద్ధిగా చేస్తుంది.
" Anti - drug operations " చురుగ్గా, త్వరగా నిర్వహించడానికి , కమీషనర్ స్థాయి అధికారి పర్య వేక్షణ లో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తున్నాం. చట్టాలలో మార్పు తేవడానికి, మరింత కఠినంగా చేయడానికి న్యాయ నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి. శిక్షల స్థాయి అనూహ్యం గా పెరుగుతుంది. నాలుగు డీ- అడిక్షన్ సెంటర్స్
రాష్ట్రంలో నాలుగు ముఖ్యమైన చోట్ల ఏర్పాటు చేస్తున్నాం.
ప్రతి స్కూల్ లో, ప్రతి కాలేజీ లో సర్ప్రైజ్ చెకింగ్స్ ఉంటాయి. విద్యా సంస్థలు కళ్ళు తెరవాలి. స్టూడెంట్స్ పై నిఘా పెట్టాలి. నిర్లక్ష్యము చేస్తే భారీ జరిమానాలు ఉంటాయి. ' This is mandatory 'ఎవరూ తప్పించుకోలేరు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ అవినీతి
నిర్లక్ష్యము కనిపించినా, చట్టం మిమ్మల్ని వదలదు. మీ సంస్థల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. " ముఖ్యమంత్రి గొంతు లో వాడి, వేడి వినిపించాయి. సభా మౌన సంద్రం లా మౌనం గా ఉండి పోయింది.
" విశాల్ కు మనమిచ్చే నివాళి ఇదే "
గంభీరంగా ముగించాడు.
చప్పట్ల తో హాలు ప్రతిధ్వనించింది. సాగర్ బి స్కూల్ విద్యార్థులు క్యాండిల్స్ తో వేదిక పైకి వచ్చారు. వారి రాకతో వేదిక నక్షత్ర మండలం లా వెలిగి పోయింది. సభికులందరూ స్టాండింగ్ ఒవేషన్ లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. అందరి మొహాల్లో బాధ, ఉద్విగ్నత. హరీష్ రావ్ దంపతుల కళ్ళ నుండి స్రవిస్తున్న ధారలు.

******************************"*****"*************
కొనసాగించండి 46 లో