Read Those three - 44 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 44

పరాంకుశరావు మాట తీరు , అనుభవం , హరీష్ రావ్ వివరణ వల్ల ప్రభుత్వ పరిస్థితి కుదుటపడింది. ముఖ్యమంత్రి ఊపిరి పీల్చుకున్నాడు.ప్యాంటు రావు ను అభినందించాడు.
హరీష్ రావ్ ఇంటికి వెళ్ళి భార్యా భర్తల బాధ సిన్సియర్ గా పంచుకున్నాడు.
ఆ రోజు రాత్రి ఇంతియాజ్ ఛాంబర్ లో ఇంతియాజ్, ఆదిత్య, విహారి అన్వర్. అప్పుడు టైం పదకొండు.
" నువ్వు, హ్యాకర్స్ మా కస్టడీ లోకి వచ్చాక రహీం ఒక్క సారి కూడా ఫోన్ చేయలేదు కదా.
" ఎందుకు చేస్తాడు సార్ ? చేస్తే మీకు దొరికి పోతాడు. "
ఇంతియాజ్ ఆలోచిస్తూ ఉండి పోయాడు.
" నిన్ను ముందు గానే అరెస్టు చేయకపోవడం మంచి దేరింది. కనీసం హ్యాకర్స్ ను పట్టుకోగలిగాం."
" మరి మాస్టర్ మైండ్ మాటేమిటి ? వాడెవరో కనీసం రహీం కైనా తెలుసో లేదో ? వీడిక కన్పించడు. How to break this iron wall ?" ఆదిత్య.
" ఐరన్ వాల్ బ్రేక్ అయింది. ఆపరేషన్ జన్నత్ మాస్టర్ మైండ్ మిషన్ జన్నత్ రెగ్యులర్ డోనార్స్ లో ఒకడు.....,. ఫయాజ్, ఎక్స్పోర్ట్ మర్చంట్. అతడే నన్న విషయం దాదాపు గా తేలిపోయింది. కానీ అనుకోకుండా కధ అడ్డం తిరిగింది.
" ఏమైంది ?" ఆదిత్య లో ఆతృత.
". ఈ రోజు ఉదయం హోం మినిస్టర్ పర్సనల్ ఫోన్ కు ఒక anonymous కాల్ వచ్చింది. ఆ " మిస్టర్ నో " రిక్వెస్ట్....." నన్ను సిట్ నుంచి తప్పించాలి. వారి కదలికల్ని పట్టించుకోకూడదు ".
డ్రగ్స్ రాకెట్ వ్యవహారం సద్దుమణిగే వరకు సానుభూతి చూపిస్తూ మొసలి కన్నీటి తో ప్రజలను మభ్యపెట్టాలి. ఇందుకు హోం మినిస్టర్ కు బాగానే ముట్ట చెబుతారట " నవ్వాడు ఇంతియాజ్.
" హౌ డేర్ దే ఆర్"
" అదే నాకూ అర్థం కావటం లేదు. పరాంకుశ రావు లాంటి పెద్ద మనిషి కి అంత ధైర్యంగా ఫోన్ చేస్తారా ? మరో విషయం........ పొలిటికల్ సర్కిల్లో నలుగురికి మాత్రమే
హోం మినిస్టర్ పర్సనల్ నెంబరు తెలుసు. ఆ నలుగురిలో ఒక్కరే .......... రెవెన్యూ మంత్రి షేక్ మస్తాన్."

అన్వర్, ఆదిత్య అదిరి పడ్డారు.
" యూ మీన్ షేక్ మస్తాన్ తరఫున ఎవరైనా ఫోన్ చేసుంటారా ?" నమ్మలేనట్టు చూశాడు ఆదిత్య.
" అవును"
" ఎవరై ఉంటారు ?"
" నా అనుమానం నిజమైతే ఆ ఫోన్ చేసింది ఆరిఫ్ కావచ్చు. "" ఆరిఫ్, వాడెవడు ?"
" షేక్ మస్తాన్ కా సారా "!
" సో, ఆపరేషన్ జన్నత్ తెరవెనుక వ్యక్తుల్లో ఒకరు షేక్ మస్తాన్. "

" ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాగే అనుకోవాలి. "
" మరి ఫయాజ్.?"
" అదే అర్థం కావటం లేదు. కొంపదీసి ఆ ఇద్దరూ తోడు దొంగలేమో "
" షేక్ మస్తాన్ లాంటి ఓ బాధ్యత కల్గిన వ్యక్తి anti- social element అంటే ఎలా నమ్మడం ?

" నా అనుమానం కూడా అదే . ఆయనదీ మా ఊరే. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఎప్పుడూ ఆయనలో అగ్రెసివ్ నెస్ చూడలేదు. అందరితో ఇట్టే కలిసిపోతాడు. మా అందరికీ ఆప్తుడు. మంచి స్నేహితుడు. ఈ ఫోన్ కాల్ తో
హోం బాగా డీలా పడిపోయాడు. ఎంతైనా మస్తాన్ చిన్న నాటి స్నేహితుడు కదా !"
" మరిప్పుడేం చెయ్యాలి. ?"
" ఏముంది ? ఆరిఫ్ ను అరెస్ట్ చేసి నాలుగు పీకితే నిజాలు బయట పడతాయి. "
" సార్ ! మీరు అనుమానిస్తున్న వారిలో అదే మిషన్ జన్నత్ డోనార్స్ లో ఆరిఫ్ కూడా ఉన్నాడు కదా "
ఉన్నాడు. కానీ అతడు డ్రగ్స్ మాఫియా హెడ్ కాదని తేలిపోయింది. ఇప్పుడు మా ఫోకస్ అంతా ఫయాజ్ పైనే.
కానీ ఆ ఫోన్ కాల్ తో మా పరిస్థితి మళ్ళీ మొదటి కొచ్చింది. అవునూ ! ఆ వివరాలు ఎందుకు అడుగు తున్నావు?"
" ఆ ఇద్దరి వాయిస్ వినే అవకాశం ఉందా ?"
" అవకాశం!........ టెన్షన్ తో నుదురు కొట్టుకున్నాడు.
" సార్ ! సద్భావనా సమావేశంలో వారిద్దరూ మాట్లాడారు కదా ! " గుర్తు చేశాడు విహారి.
" యస్ ! ఆ ఈవెంట్ మన ఫైల్స్ లో ఉందా ?"
" ఉంది సార్ " విహారి ఆ మానిటర్ ముందు కూర్చున్నాడు.
" అన్వర్ ! అసలు నీ అయిడియా ఏమిటి ?"
" మాకు ప్రతి నెలా రెవ్యూ మీటింగ్స్ ఉంటాయి. చివర ఒక వాయిస్ మాకు ఫ్యూచర్ ప్లాన్స్ వివరిస్తుంది. సంస్థ లక్ష్యాలు
రిపీట్ చేసి మాలో ఉత్సాహం నింపుతుంది. ఆ వాయిస్ ఆరిపొతోంది లో , ఫయాజ్ దో నేను చెప్పగలను. "

ఇంతియాజ్ శరీరంలో ఒక్కసారి విద్యుత్ ప్రవహించినట్లయింది. ఉత్సాహంగా అన్వర్ భుజాలపై చేతులు వేశాడు.
కంప్యూటర్ స్క్రీన్ మీద సద్భావనా సమావేశం.అందులో వక్త స్థానం లో, రోష్ట్రం ముందు ఆరిఫ్. అన్వర్ స్క్రీన్ ముందు కళ్ళుమూసుకుని కూర్చున్నాడు. ఆరిఫ్ కంఠ స్వరం పై లగ్నం చేశాడు. నిమిషం ఆరిఫ్ మాడ్యులేషన్ , చెప్పే తీరు
ఆలకించాడు. ఆదిత్య, విహారి, ఇంతియాజ్ మొహంలో టెన్షన్. అన్వర్ కళ్ళు తెరిచాడు.
" మా మీటింగ్స్ లో విన్నది ఈ వాయిస్ కాదు. "
" ఇంతియాజ్ మొహంలో రిలీఫ్.
" కచ్చితంగా ఈ వాయిస్ కాదు"
ఆదిత్య మొహం లో ప్రసన్నత.
ఈసారి స్క్రీన్ పై ఫయాజ్. క్షణం గడిచింది.
" నేను విన్న వాయిస్ ఇదే".
" అన్వర్ ! హోం మినిస్టర్ తో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి ఫయాజే నని ఎలా చెప్ఫగలవు ?" ఐ వాంట్ గా లిటిల్ బిట్ క్లారిఫికేషన్.
" అతడు మాట్లాడే ఉర్దూ భాష కాస్త పొయిటిక్ స్టైల్ లో ఉంటుంది. అతడూ తరచూ వాడే కొన్ని. ప దాలు, వాక్యం ముగించే తీరు నన్ను బాగా ఆకర్షించాయి. "
" అతడు వెరి గుడ్ స్పీకర్. చాలా జోష్ తో మాట్లాడుతాడు. ఇప్పుడు నేను విన్న వాయిస్ లో ఈ ప్రత్యేకతలన్నీ ఉన్నాయి.
" థ్యాంక్ గాడ్" ఇంతియాజ్ కు పెద్ద రిలీఫ్.
" ఫయాజ్ కు హోంమంత్రి పర్సనల్ నెంబరు ఎలా తెలిసింది. ? " ఆదిత్య లో సందేహం.
" ఫయాజ్ , ఆరిఫ్ కజిన్ బ్రదర్స్. ఫయాజ్ కి చాలా క్లోజ్.
మాస్టర్ మైండ్. నెంబర్ తెలుసు కోలేడా ? ఫయాజ్ గల్ఫ్ దేశాలకు స్పైసెస్.. ఎగుమతి చేస్తాడు. టూ రెలిజియన్ అండ్ మోర్ ప్రాక్టికల్. సమాజంలో ఇస్లాం ప్రభావం పెరగాలన్నా , రాజకీయంగా ఎదగాలన్నా , యువకులు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలన్నది అతడి అభిప్రాయం. జీహాద్ యువశక్తి ని బలిదీసుకుంటుంది. అందుకే వ్యతిరేకిస్తాడు. మిషన్ జన్నత్ కు అన్ని విధాలా సరిపోతుంది."
" ఆ సంస్థ నెట్ వర్క్ త్వరగా దేశమంతటా వ్యాపించాలంటే
భారీ స్థాయిలో ఫండ్స్ కావాలి. ఆపరేషన్ జన్నత్ ఆ ఫండ్స్ కోసమే స్థాపించాడు. కానీ ఈజీ ఫ్లో ఆఫ్ మనీ కోసం డ్రగ్స్ ట్రేడ్ ని ఎంపిక చేసుకోవటం అతడు చేసిన దారుణమైన తప్పు. డ్రగ్స్ మాఫియా సాఫీగా జరగాలంటే మిలిటెంట్ ఫోర్స్ అవసరమనుకున్నాడు. అందుకే అన్వర్ ను , మరో నలుగురు మిలిటెంట్స్ ను నీ.ఓ.కే నుండి దిగుమతి చేసుకున్నాడు. వీళ్ళు సరిహద్దు దాటుతూ సరిహద్దు టీంకు దొరికిపోయారు. వారి కాల్పుల్లో అలీ అనే మిలిటెంట్ గాయపడ్డాడు. మిగిలిన ముగ్గురూ ఆ కాల్పుల్లో చనిపోయారు. అవీ ఇన్ ఫార్మర్ గా మారి అన్వర్ తప్పించుకున్నట్లు నిఘా వర్గాల కు సమాచారం అందించాడు. ఈ వార్త ఫయాజ్ కు తెలియదు. అలీ బ్రతికి ఉన్నాడు, అన్వర్ తప్పించుకున్నాడు వార్త సెన్సార్ చేయబడింది. " సరిహద్దు దాటుతూ, నలుగురు మిలిటెంట్స్
కాల్పుల్లో చనిపోయారు అన్న సెన్సార్ చేయబడిన వార్త ఈ కధకు ఊహించని మలుపు. అన్వర్ గురించి నిఘా వర్గాల కు తెలియదనుకున్నాడు. ఫయాజ్ కు అన్వర్ కూడా చెప్పలేదు. అందుకే డ్రగ్స్ రాకెట్ ఊపిరి పోసుకుంది. బట్ ఫయాజ్ సోషల్ ప్రొఫైల్ చాలా క్లీన్ గా ఉంటుంది. పైకి చాలా సౌమ్యుడిగా కనిపిస్తాడు. వెరీ వెరీ ఫ్రెండ్లీ !
అంతేగాదు...." వెరీ వెరీ పాపులర్ ఫిలాంత్రోఫిస్ట్.." ఇంతియాజ్ సుదీర్ఘ కధనం ముగించి ఊపిరి పీల్చుకున్నాడు.
అంత క్లియర్ ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి పై అనుమానం ఎలా వచ్చింది ?"
" మేము అనుమానించిన నలుగురూ ముస్లిం కమ్యూనిటీలో
గొప్ప శ్రీమంతులు. ఫ్యామిలీ ను మినహాయిస్తే మిగిలిన ముగ్గురి బ్యాంక్ అకౌంట్స్, ఐ.టీ స్టేట్మెంట్స్, చారిటబుల్ కంట్రీబ్యూషన్స్ దాదాపు సరిపోయాయి. ఫయాజ్ మాకు ఇక్కడే దొరికాడు. మిషన్ జన్నత్ కు అతడి చచ్చిన విరాళాలు, ఆదాయపు పన్ను మినహాయింపులకు అసలు పొంతనే లేదు. ఈ నిజం తెలుసుకున్నాకే అతడి ప్రతి కదలిక, ప్రతి చర్య అతడి వెంటే నీడలా ఉంటూ గమనించాం. అప్పుడే అతడి నిజస్వరూపం బయటపడింది." ఇంతియాజ్ మొహంలో విజయ గర్వం.
అంతలో అతడి పర్సనల్ సెల్ మోగింది. అవతల ఎవరో చాలా సేపు మాట్లాడారు. ఇంతియాజ్ మొహంలో క్షణ క్షణం మారే రంగుల్ని ఆదిత్య ఆసక్తి గా గమనించ సాగాడు.
సెల్ స్విచ్ ఆఫ్ చేసి " హుర్రే" అంటూ చేతులు ఊపాడు ఇంతియాజ్.
" నేను వర్క్ టెన్షన్ లో పడి పర్సనల్ సెల్ స్విచ్చాఫ్ చేసిన విషయం మర్చిపోయాను. గంట ముందే యాక్టివేట్ చేసింది. ఇప్పుడు మాట్లాడింది ఇనాయతుల్లా. వారం రోజుల ముందు ఫయాజ్ ప్రొఫెసర్ ను కలిశాడట. మిషన్ జన్నత్ సెంటర్స్ మరిన్ని స్థాపించాలని ప్రపోజల్ పెట్టాడట. ఫండింగ్ బాధ్యత తనదే అన్నాడట. ఓ నేషనల్ లెవెల్ కమిటీ తరఫున ఫండింగ్ ఫ్లో ఉంటుందట. ఇలాంటి ఐడియాస్ తో ఎవరొస్తారో వారే ఆపరేషన్ జన్నత్ మాస్టర్ మైండ్. అని ఆయన్ను కలిసినప్పుడు చెప్పాను. పాపం నాలుగు రోజులుగా ఆయన నా సెల్ కు ట్రై చేస్తున్నాడట. మరి నా సెల్ స్విచ్చాఫ్ కదా !
" సో....ఫయాజ్ ఈస్ ది మాస్టర్ మైండ్. "
ఆదిత్య కళ్ళు ఆనందంతో మెరిసాయి.
ఇంతియాజ్ పరాంకుశరావుకు వివరాలన్నీ చెప్పాడు తన పై అధికారుల తో మాట్లాడాడు. విహారి ని ఉత్సాహం గా చూశాడు.
" విహారి ! గెట్ రెడీ ఫార్ ది ఆపరేషన్. ఇప్పుడు ప్రతి క్షణం విలువైంది" ఇంతియాజ్ మెరుపులా కదిలాడు.
ఎందుకో క్షణం ఆగాడు. విహారి అర్థం కానట్లు చూశాడు.
" ఎయిర్పోర్ట్ కు ఫోన్ చేసి ఉదయం ఆరు గంటల లోపు గల్ఫ్ దేశాలకు బయలుదేరే ఫ్లయిట్స్ వివరాలు కనుక్కో "
విహారి వెంటనే ఆ పనిలో మునిగి పోయాడు.
" ఈ అనుమానం ఎందుకు వచ్చింది ?" ఆశ్చర్యం తో ఆదిత్య కళ్ళు మెరిశాయి .
" ఫయాజ్ పరాంకుశ రావు కు ఫోన్ చేసినప్పటి పరిస్థితి వేరు. తర్వాత హ్యాకర్స్ అరెస్ట్ అయినారు. అన్వర్ అప్రూవర్ గా మారాడని అర్థమైంది. సో ... తను అన్ని విధాలా హెల్ప్ లెస్. ఈ దేశంలో ఉండటం తనకు క్షేమం కాదు. ఏదో విధంగా మనం రహీం ను అరెస్ట్ చేస్తామని తెలుసు. ఈ స్థితిలో దుబాయ్ కో, సౌదీ కో ఉడాయిస్తే మిగతా విషయాలు చూసుకోవచ్చు. ఫయాజ్ లాంటి క్రిమినల్ ఇంత చురుగ్గా నే ఆలోచిస్తాడు. దేశంలో ఎక్కడున్నా. సులభంగా పట్టుకోవచ్చు. సరిహద్దు దాటితే కష్టం."
" సర్ ! ఉదయం 3.25 గంటలకు దుబాయ్ ఫ్లైట్ ఉంది " ఆదిత్య కృషి ఫలించింది.

ఫుల్ వింటర్ సూట్ లో, పెట్టుడు గడ్డం తో , హ్యాట్ తోపు ట్యాక్సీ దిగుతున్న ఫయాజ్ ను పోలీస్ లాంఛనాలతో
ఉదయం 1. 15 గంటలకు ఇంతియాజ్ ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకున్నాడు.
" గుడ్ మార్నింగ్, మిస్టర్ ఫయాజ్"
" గుడ్ మార్నింగ్ మిస్టర్ ఇంతియాజ్!" కూల్ గా స్పందించాడు ఫయాజ్. అతడి మొహం లో నెత్తురు చుక్క లేదు.
" సారీ ! కొన్ని కారణాల వల్ల మీ ట్రిప్ ఆపవలసి వచ్చింది.
" ఇట్సాల్ రైట్, ఆఫీసర్ " .


****************†*********†*********†******"******
కొనసాగించండి 45









..