Featured Books
  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 30 - లక్కవరం శ్రీనివాసరావు

యాకూబ్ ను " బి" స్కూల్ దరిదాపుల్లో వదిలి వెళ్ళి పోయారు పోలీసులు. నెమ్మదిగా తన గదికి చేరుకున్నాడు యాకూబ్. మనసంతా ఏదోలా ఉంది . ఆలోచనలు ఆగిపోయినాయి. మెదడు మొద్దు బారి పోయింది. సాయంత్రం ఆరుగంటలు. మాల్ కోసం రాలేదేమని అన్వర్ నుండి కాల్ వచ్చింది. షెడ్యూల్ ప్రకారం తను ఆరుగంటలకు అన్వర్ ను కలవాలి. ఈ గందరగోళంలో పడి ఆ విషయమే మరిచిపోయాడు. జ్వరం గా ఉంది. రాలేను. రెండు రోజుల తర్వాత కలుస్తానని అన్వర్ కు చెప్పాడు.
ఆ రోజు డ్యూటీ కి వెళ్ళలేదు. వార్డెన్ పర్మిషన్ తీసుకున్నాడు.
ఓం గ్లాసు వేడి పాలు తాగి హాస్టల్ ముందు లాన్ లో కూర్చున్నాడు. మెహర్ టైం అయింది. హాస్టల్ కారిడార్ స్టూడెంట్స్ తో సందడి గా ఉంది.
యాకూబ్ మనసును ఆలోచనలు కమ్ముకున్నాయి. ఆదిత్య కు పవన్ గురించి ఎవరు చెప్పి ఉంటారు ? పవన్ క్లోజ్ ఫ్రెండ్స్
అరవింద్, విశాల్. విశాల్ డ్రగ్ అడిక్ట్. చెప్పాడు. అరవింద్. అవకాశం ఉంది. అరవింద్ చాలా డిసిప్లిన్డ్ బాయ్ . అసలు పవన్ డ్రగ్స్ మానింది అరవింద్ జోక్యం తోనా ?ఉండొచ్చు.
అరవింద్ పవన్ గురించి ఆదిత్య కే ఎందుకు చెప్పాడు ?
వచ్చిన కొద్ది రోజుల లోనే అరవింద్ స్టూడెంట్స్ కు క్లోజ్ అయినాడు. ఆ చనువు తో చెప్పి ఉంటాడు.
డిన్నర్ ముగించుకుని తన గదికి వెళుతున్న అరవింద్ కనిపించాడు యాకూబ్ కు . అరవింద్ ను పిలిచాడు. బెదురు చూపులతో దగ్గరకు వచ్చాడు అరవింద్.
" చెప్పన్నా !" యాకూబ్ కు ఎదురుగా నిలుచున్నాడు.
" కూర్చో ! నీతో మాట్లాడాలి " అన్నాడు యాకూబ్.
కూర్చున్నాడు అరవింద్.
" ఆదిత్య సార్ కు పవన్ గురించి ఏం చెప్పావ్ ?"
" నేనా ?" అరవింద్ ఊహించని ప్రశ్న.
" అవును ! నువ్వే పవన్ ప్రాణ స్నేహితుడివి. నువ్వు గాక మరెవరు చెబుతారు ?" మాటలు పదునుగా ఉన్నాయి. అరవింద్ తల వంచుకున్నాడు.
" ఆదిత్య కే ఎందుకు చెప్పావ్?"
" ఆదిత్య మా అన్న". క్షణం తటపటాయించి చెప్పాడు.
" మీ అన్నా ?" యాకూబ్ నమ్మలేనట్లుగా చూశాడు.
" ఈ విషయం కాలేజీ లో కొద్ది మంది కే తెలుసు. "
" నేను డ్రగ్స్ సప్లై చేస్తానన్న అనుమానం ఎలా వచ్చింది ? పవన్ చెప్పి ఉండడు. వాడు పిరికి. పైగా వాడిని బెదిరించాను. వాడి వల్ల మా డ్రగ్స్ సప్లై ఆగిపోకూడదు. "
ఎలా తను తెలుసుకున్నాడో అదురుతున్న గుండెలతో అరవింద్ చెప్పాడు.
యాకూబ్ కళ్ళు తిరిగి పోయాయి. ఒక టీనేజర్ తన ప్రాణ స్నేహితుడి కోసం ఎంతో సాహసం చేశాడు.
అరవింద్ యాకూబ్ ను బేలగా చూశాడు.
" నీకు మేమంటే ఎంతో ఇష్టం. మాతో సరదాగా మాట్లాడతావ్. ఎంతో ప్రేమగా మాకు కావలసినవి తెచ్చి పెడతావు. ఇంత అభిమానం గా ఉంటూ భయంకరమైన డ్రగ్స్ మాకెందుకు అమ్ముతున్నావ్ "?
అరవింద్ ప్రశ్న కు ఏమని జవాబు చెప్తాడు.
" అన్నా ! నీ జీతం నీకు చాలదనుకుంటాను. నీ అవసరాలు
తీరడానికి నువ్వు మరింత సంపాదించాలి. అందుకు ఇది మార్గం కాదన్నా. నీకు ఏదైనా కష్టం వేస్తే మేము లేమా ?
డబ్బులు లేక బాధపడుతుంటే మేము చూస్తూ ఊరుకుంటారా ?"
ఇరవై కూడా నిండని ఆ కుర్రాడు అలా బేలగా అడుగుతుంటే యాకూబ్ గుండె కదిలింది. కళ్ళు చెమర్చాయి. అరవింద్ భుజం తట్టి అక్కడి నుంచి కదిలాడు. తను గదికి వెళ్లి అన్వర్ కు ఫోన్ చేశాడు.
" భాయి ! అస్సలు ఒంట్లో బాగా లేదు . వారం రోజులు సెలవు కావాలి . ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి ." అన్వర్ అందుకు కావాల్సిన ఫార్మాలిటీస్ ఒక గంటలో పూర్తి చేశాడు . యాకూబ్ కు సెలవు మంజూర్ అయింది .
కంప్యూటరు images తో ఆదిత్య టీం యాకూబ్ చెప్పిన ప్రాంతాలన్నీ చెడ తిరిగింది . చాలా మందిని వాకబ్ చేసింది . కొంతమంది చూశామని చెప్పారు . కానీ అతడి రూట్ మ్యాప్ వివరాలు చెప్పలేక పోయారు . నిజానికి ఆ వివరాలు తెలుసుకోవాలిసిన అవసరం వారి కేముంది ? అతడో మొబైలు స్ట్రీట్ వెండర్ . అవసరం అనుకొంటే అతడి దగ్గర సరుకులు కొంటారు . కొన్న తర్వాత ఎవరి దారి వారిది .
టీం లో అందరూ teenagers ఆలోచన కన్నా దూకుడు ఎక్కువ. ఇచ్చిన పని detection కనుక మితిమీరిన ఉత్సాహం తో చెడామడా తిరిగారు . ఏ క్లూ దొరక్క పోయేసరికి డీలా పడిపోయి ఇంటిదారి పట్టారు . ఆదిత్య మాత్రం అన్వేషణ కన్నా ఆలోచనే ఎక్కువ చేశాడు . ఎంతైనా టీం లీడర్ కదా !
కొనసాగించండి 31