Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 27 - లక్కవరం శ్రీనివాసరావు

అతడో  దగా పడ్డ తమ్ముడు .  అతడి ప్రతి మాటలో నిజం ఉంది . అతడినిలా వదిలేస్తే చాలా ప్రమాదం . " నీ పరిస్తితి అర్థమైంది . నీ మనసు మార్చుకొని అప్రూవర్ గా మాతో  సహకరిస్తే "  నీ భవిష్యత్తుకు నేను భరోసా ఇస్తాను . "

నవ్వాడు యాకూబ్ " నన్ను మీరు ఉచ్చు లోకి లాగుతున్నారు . ప్రతి పోలీస్ ఆఫీసర్  ఇలాగే మాట్లాడుతాడు ."

" నేను నీ మంచికే చెబుతున్నాను . నీవిప్పుడు వెళ్ళే దారిలో ఎక్కువ కాలం సాగలేవు .  ఈ స్తితిలో బయట పడే అవకాశం ఉంది . ఆ తర్వాత  మీ సంస్థ పాపాలు బయట పడ్డాక ఎవరూ ఏమీ చేయలేరు . "

" మా సంస్థను మీరనుకున్నంత సులభంగా  టార్గెట్ చేయలేరు . నా విషయం వదిలేయండి . చీమలాంటి వాడిని . ఈ నెట్వర్క్ మూల స్తంభాలు చాలా బలమైనవి . వారెవరో మాకూ  తెలియదు .  మేము అప్రూవర్స్ గా మారినంత మాత్రాన మీకు ఒరిగేదేమీ లేదు .  మమ్మల్ని ఇలా వదిలేస్తే మా ప్రాణాలైనా దక్కుతాయి . "

యాకూబ్ అబడ్డలు చెప్పటం లేదు .  అతడ న్నట్లు అతడికి తెలిసింది చాలా తక్కువ. అతడు ఒక పరిధిలో ఉన్నాడు . ఆ పరిధి దాటి అతడి  చూపు  బయటకు పోలేదు  .

" ఓకే  ! నిన్ను వదిలేస్తాను . But on one condition . నీకు తెలిసినంతవరకు  ఒక్కటి కూడా దాచకుండా మాకు చెప్పాలి ."

ఆర్య నిమిషం ఆలోచించి 'ఒకే' అన్నాడు యాకూబ్.  ఆదిత్య కూడా ఇంతియాజ్ పక్కన కూర్చున్నాడు . 

" ఆపరేషన్ జన్నత్ లక్ష్యం ఏమిటి ?"

" సమాజం లో ముస్లిం యువకుల స్థాయిని అన్నీ రంగాలలో పెంచటం . అదే మా లక్ష్యం . "

 " అందుకు భారీగా ఫండ్స్ కావాలి. ఈజీ మనీ కి రాజమార్గం ఈ డ్రగ్స్ ట్రేడ్ . అందుకే ఈ anti - social activity  ప్రారంభించారు ."

యాకూబ్ నవ్వాడు " ఇది anti - social activity కాదు . It's a kind of trade . "

పొంగుతున్న కోపాన్ని నిగ్రహించుకున్నాడు ఇంతియాజ్ . " యువకుల్ని తప్పు దారి పట్టించి  చివరకు ప్రాణాలు తీసే డ్రగ్స్ ఒక వ్యాపారమా ?"

" ఆల్కహాల్ ప్రజల ఆదాయాన్ని , ఆరోగ్యాన్ని గుల్ల చేయటం లేదా ? ప్రభుత్వాలు ఆ వ్యాపారాలను కంట్రోల్ చేస్తున్నాయా ? Statutary warning  తో చేస్తులు దులుపుకోవటం లేదా ?  వేల కోట్ల రాబడిని వాడులుకొంటున్నాయా ? మరి మాకెందుకు ఈ మినహాయింపు ?"

" అలాగని మీ మాస్టర్ మైండ్స్ మీకు brain wash  చేసాయా ?"

" సర్ ! ఇది సింపుల్ లాజిక్ . brain wash  చేసేంత  గొప్ప విషయం కాదు . "

" ఒకే . ఇప్పుడు ఆ విషయం వదిలేద్దాం. ఇప్పుడు ఆ టాపిక్ అనవసరం . మీరు భారీ స్థాయి లో సంపాదిస్తున్నారు కదా , ఈ మొత్తాన్ని  ఏ విధం గా పేద యువకులకోసం ఖర్చు చేస్తున్నారు  ?"

 " వారి చదువుకు సహాయం చేస్తాం. వారికి ఉద్యోగాలు వచ్చేవరకు వారి భాద్యత తీసుకుంటాం . వారి వారి చదువు, తెలివితేటల ఆధారం గా  ఉద్యోగాలు సంవదించటానికి కావలసిన ట్రయినింగ్  ఇస్తాం. "

" అంతే వారి కోసం మీరొక సంస్థ నడుపుతున్నారా  ? ఆ సంస్థ పేరేమిటి ?"

" ఆ వివరాలు నాకు తెలీదు. ఒక సంస్థ నాడుపుతున్నారని మాత్రం తేకూసు , "

" ఆ సంస్థ పేరు " మిషన్ జన్నత్ , అవునా ?"

యాకూబ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు . 

" ఆపరేషన్ జన్నత్ , మిషన్ జన్నత్ .. రెండింటిలో కామన్ వర్డ్ 'జన్నత్'. ఈ క్లూ చాలదా రెండు సంస్థలు ఒకటే అని చెప్పటానికి  ?"

యాకూబ్ లో కదలిక లేదు 

" చూడు యాకూబ్ ! నువ్వు ఇప్పుడు మా కంట్రోల్ లో ఉన్నావు. నీ చేత నిజం చెప్పించటానికి మాకు ఏమంత కష్టం కాదు " ఇంతియాజ్ మాటలు చాలా కటువుగా అనిపించాయి యాకూబ్ కు.  ఎదుగుగా ఉన్నది A well trained police officer. చాలా సిన్సియర్ . అనుకున్నది సాధించడానికి ఎంత రిస్క్ అయినా చేయగలడు . మొండిగా మొరాయించటం చాలా ఫూలిష్ . తనేతవ్వ వారికి దొరికి పోయాడు . అడిగినది చెప్పటం మంచిది. చెప్పినందువల్ల వచ్చే నస్తమేమీ లేదు . 

" ఆపరేషన్ జన్నత్, మిషన్ జన్నత్ ---రెండూ ఒకటి కావు . మిషన్ జన్నత్ కు మేము ఫండింగ్  చేస్తాం. "

" ఫండింగ్ చేస్తారా ? ఏ పేరుతో ?" ఆతృత కనిపించింది ఇంతియాజ్ స్వరం లో . 

" ఎవరో ఎలా తెలిస్తుంది సర్ ! ముందే చెప్పానుగా నేనొక హ్యా కర్ నని ." నవ్వుతూ అన్నాడు యాకూబ్ . "

"ఔనాన్నట్లు తల ఊపడు ఇంతియాజ్ . 'మిషన్ జన్నత్ donors లిస్ట్ చూస్తే తెలుసుకోవచ్చు అనుకున్నాడు . కానీ అదంతా సులభం కాదని  తర్వాత తనకు తెలిసింది .

" మీరీ సంస్థ లో ఎలా  చేరారు ?" 

" మేము అల్ అమీన్ మినారిటీ కాలేజీ స్టూడెంట్స్ ము . నేను ఇంటర్ చేసి కరెస్పానడేన్స్  కోరస్ కూడా ఆ కాలేజీ ద్వారానే చేశాను . మా బయో డేటాలు వెరిఫై చేసి మాలో కొందరిని సెలెక్ట్ చేశారు .  మా కుండవలసిన మొదటి క్వాలిఫికేషన్  పేదరికం,. కొద్దో గొప్పో ఇంగ్లీష్ లో మాట్లాడగలగాలి. తెలుగు భాష తడుముకోకుండా , అరబ్బీ, ఉర్దూ యస్య లేకుండా మాట్లాడాలి "

" పాత బస్తీ లో ముస్లిములు మాతృభాష ప్రభావం లేకుండా ఎలా మాట్లాడగలరు ?" చిరునవ్వు తో ప్రశ్నించాడు ఇంతియాజ్ . 

" మాతో సెలెక్ట్ అయిన వాళ్లెవరో పాత బస్తీ యువకులు కారు. అంతా  సిటీ లో ఉంటున్న వాళ్ళే . మాకు తెలుగు వారితో మంచి పరిచయాలు ఉన్నాయి . తెలుగు చక్కగా మాట్లాడగళం . పైగా తెలుగు మాట్లాడటం లో మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు . "

ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు ఆదిత్య, ఇంతియాజ్ లు . " నాది విలేజ్ background , తెలుగు తడుముకోకుండా మాటలాడ గలను  . "

అవునన్నట్లు తల ఊపాడు ఇంతియాజ్ . 

" మాకు చాలా చాలా పరీక్షలు పెట్టారు .   మమ్మళం అన్నీ కోణాల్లో టెస్ట్ చేశారు . మా సాహసం, మా తెలివి. presence of mind , మాటకరితనం ఇలా ఎన్నో !

అనుకోని పరిస్తితులు ఎదురైనప్పుడు .. సెల్ఫ్ డిఫెన్సు కోసం ఫైరింగ్ కూడా నేర్పించారు . 

వెంటనే ఇంతియాజ్ వివరాలు తన సిబ్బందిని అడిగాడు. 

" లేదు సర్ ! అతడిని సెర్చ్ చేస్తున్నప్పుడు ఎలాంటి వెపన్స్  దొరకలేదు . ఒకడు సమాధానం చెప్పాడు . యాకూబ్ నవ్వాడు ." నేనీ రోజు డ్యూటి లో లేను . 

నమాజ్ చేసి  వెళుతుంటే  మీ వాళ్ళు పట్టుకున్నారు . డ్యూటి లో లేనప్పుడు  నా దగ్గర పిస్టల్ ఉండదు . 

."

" కంటిన్యూ " ఇంతియాజ్ తొందర చేశాడు . " ముందుగా పైలట్ ప్రాజెక్టు అనుకున్నారు . ఇందులో సెలెక్ట్  చేసిన వారిలో ఇరవై మందిని క్రీమ్ బ్యాచ్ గా మళ్ళీ 

సెలెక్ట్ చేశారు .