Read Secret.. - 6 by Madhu in Telugu Motivational Stories | మాతృభారతి

Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

రహస్యం.. - 6

3... రహస్యాన్ని ఎలా ఉపయోగించాలి

మీరొక సృష్టికర్త ...మీరు ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ సృష్టించే ఓ తేలికైన ప్రక్రియ ఉంది... గొప్ప గొప్ప బోధకులు, అవతార పురుషులు తమ అద్భుత కృషితో అసంఖ్యాకమైన రూపాల్లో ఈ సృజనాత్మక ప్రక్రియలో కల్పించుకున్నారు ....కొందరు మహా బోధకులు ఈ ప్రపంచం ఎలా నడుస్తుందో విశదీకరించడానికి కథలు సృష్టించారు... ఆ కథల్లో ఉన్న విజ్ఞానం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తూ పురాణ గ్రంథాలయ్యాయి.... కథల్లోనీ సారమే జీవిత సత్యం ..అని అంశం ఇప్పుడున్న వారిలో చాలామందికి తెలియదు....



జేమ్స్ రే :-----మీరు అల్లావుద్దీన్ అద్భుతదీపం గురించి ఆలోచించండి... అల్లావుద్దీన్ దీపం తీసుకుని పైనున్న దూళిని తుడుస్తాడు....
వెంటనే భూతం పెద్దగా చప్పుడు చేస్తూ బయటికి వస్తుంది ...భూతం ఎప్పుడు అంటూ ఉంటుంది ..."మీ కోరిక నాకు ఆజ్ఞ"


ఇప్పుడు కథ ఎలా నడుస్తుంది అంటే ,ఉన్న కోరికలు మూడు... కానీ కథలోని మూలాల్లోకి వెళ్తే ఆ కోరికలని వాటికి అసలు హద్దు అనేది ఉండదు... ఇప్పుడు ఆ సంగతే ఆలోచించండి ...మీరా ఉపమానాన్ని తీసుకుని జీవితానికి అనువయించి చూడండి ....అల్లావుద్దీన్ ఎప్పుడూ తనకు ఏది కావాలో అదే అడుగుతాడని గుర్తించుకోండి... మన ముందున్న ఈ ప్రపంచమే భూతం..... దీన్ని సంప్రదాయాలు మీ పవిత్ర సంరక్షక దేవత అని ,మీ పరమాత్మ అని, రకరకాల పేర్లతో వ్యవహరిస్తూ ఉన్నాయి.... దానిమీద మీరు ఎలాంటి ముద్ర అయినా వేయవచ్చు... అయితే మీకు ఉత్తమమైనదిగా ఉపయోగపడే దాన్ని ఎంపిక చేసుకోండి.... ప్రతి సంప్రదాయము మనకు చెప్పిందేమిటంటే మనకంటే ఉన్నతమైనది ఏదో ఉందనే!!! ఈ భూతం ఎప్పుడు ఒకటి చెబుతోంది...." మీ కోరిక నాకు ఆజ్ఞ"


ఈ అద్భుత కథ మీకు విసదీకరించేది ఏమిటంటే, మీ సంపూర్ణ జీవితం అందులోని ప్రతి అంశము మీరు సృష్టించింది.... భూతం చేసేది మీ ఆజ్ఞకు కేవలం సమాధానం ఇవ్వటమే! భూతం అనేది ఆకర్షణ సిద్ధాంతం ...అది ఎప్పుడూ మీ ముందు ఉంటుంది... మీరు ఆలోచించేది, మాట్లాడేది, చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటుంది ...మీరు ఆలోచించే ప్రతి అంశాన్ని మీరు కోరుకుంటున్నారని, అది అనుకుంటుంది ...అలాగే మీరు మాట్లాడే ప్రతి అంశo మీరు కావాలని కోరుకుంటున్నారని అనుకుంటుంది... మీరు ఈ విశ్వానికి యజమాని ...మీకు సేవ చేయడానికి భూతం సంసిద్ధంగా ఉంది... మీ ఆజ్ఞలను భూతం ఎప్పుడు ప్రశ్నించదు.... మీరు అలా ఆలోచించండి చాలు మొత్తం మీ కోరిక తీర్చడానికి ప్రజలు, పరిస్థితులు, సందర్భాల ద్వారా ప్రపంచాన్ని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది.....


🌹సృజనాత్మకత ప్రక్రియ 🌹

రహస్యంలో ఉపయోగించిన సృజనాత్మక ప్రక్రియను బైబిల్లోని న్యూ టెస్ట్ మెంట్ నుంచి స్వీకరించడం జరిగింది.... మీరు కోరుకునే దాన్ని సృష్టించడానికి ఇది సులువైన మార్గదర్శన సూత్రం ...దీనికి మూడే మూడు సోపానాలు ఉన్నాయి....

1.సోపానం :--అడుగు

లిసా నికోల్స్ :----మొదటి సోపానం ఏమిటంటే అడగడం.... విశ్వాన్ని ఆజ్ఞాపించు... మీకు కావలసింది ఏమిటో ప్రపంచానికి తెలియాలి... మీ ఆలోచనలకు ప్రపంచం స్పందిస్తుంది....


బాబ్ ఫ్రాక్టర్ :---మీకు నిజంగా కావలసింది ఏమిటి కూర్చుని ఓ కాగితం మీద అదేమిటో రాయండి... అది వర్తమాన కాలంలో రాయండి ...మీరు ఇలా రాయడం ప్రారంభించవచ్చు... నాకు ఎంతో సంతోషంగా ఉం,ది నేను ఈ పరిస్థితికి కృతజ్ఞతా పూర్వకంగా, అని రాస్తూ మీరు ప్రతి దశలోనూ మీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు ,వివరించండి... మీకు కావాల్సిన దాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. అయితే మీకు కావలసిందేమిటనే విషయంలో స్పష్టంగా ఉండాలి... ఇది మీ పని ...మీలో స్పష్టత లేకపోతే ఆకర్షణ సిద్ధాంతం మీరు కోరుకునే దాన్ని తీసుకురాలేదు... మీరు పొంతనలేని అసంబద్ధమైన కోరికల్ని అడిగితే, ఆ ఫలితాలు పొంతన లేకుండా ఉంటాయి.... బహుశా మీ జీవితంలోనే మొదటిసారిగా కావచ్చు... మీకు నిజంగా కావాల్సిందేమిటో దాని గురించి ఆలోచించి ,నిర్ణయానికి రండి... ఇప్పుడు మీకు తెలుసు మీకు కావలసినవి పొందగలరు, మీరు అనుకున్నట్లుగా అయిపోగలరు... చేయాలనుకున్నది చేయగలరు... అందుకు హద్దులు లేవు ..మరి మీకు ఏం కావాలి??? సృజనాత్మక ప్రక్రియలో అడగడం అనేది, మొదటి సోపానం.... అందుకని అడగడాన్ని అలవాటు చేసుకోండి ...మీరు ఏదైనా ఎంపిక చేసుకోవాలనుకున్నారు.. కానీ అందుకు మార్గం ఏమిటో మీకు తెలియలేదు... అడగండి ..జీవితంలో మీరు దేని గురించి ఏదో కోల్పోయినట్లుగా నిరాశకు గురి కాకూడదు... అందుకే ఒకసారి అడిగి చూడండి...


డాక్టర్ జో విటాల్:--- ఇది నిజంగా గమ్మత్తైన విషయం ...ఇది ప్రపంచాన్ని ఒక కేటలాగ్ గా చేసుకోవడం... ఆ పేజీలు తిప్పుతూ నాకు ఇలాంటి అనుభవం కావాలి, నాకలాంటి ఉత్పాదన కావాలి, నాకు అలాంటి వ్యక్తి కావాలి, అని అంటారు... అది ప్రపంచానికి మీరు కావాల్సిందేమిటో ఆర్డర్ ఇవ్వడమే ...నిజంగా అంత సులభమైనది... మీరు మళ్ళీ మళ్ళీ దాని గురించి అడగాలని లేదు.. ఒక్కసారి అడిగితే చాలు... అది కేటలాగుల నుంచి ఒక ఆర్టరు ఇవ్వడం వంటిదే ...మీరు ఏదైనా ఆర్డర్ ఇస్తే ఒక్కసారిగా ఇస్తారు... మీరో ఆర్డర్ ఇచ్చి అది అందుకున్నారో లేదో, అని సందేహంతో మళ్లీ ఆర్డర్ ఇవ్వడం, ఆ తర్వాత మళ్లీ ఇవ్వడం, మళ్లీ ఇవ్వడం, అలా ఉండదు.. కదా !!!మరొకసారే ఆర్డర్ ఇస్తారు….. సృజనాత్మక ప్రక్రియలో అలాగే ఉంటుంది... మొదటి సోపానం ఏమిటంటే మీకు కావాల్సిందేమిటో స్పష్టంగా తెలుసుకొని, ఉండడం ...అలా మీ మనసులో స్పష్టత ఏర్పడగానే మీరది అడగాలి అంతే....


2...సోపానం:-- నమ్మండి

🌹లిసా నీ కాల్స్:---
రెండవ సోపానం నమ్మడం..
అది మీ సొంతం అయిందని మీరు నమ్మాలి... ఎలాంటి ఊగిసలాట లేని విశ్వాసాన్ని మీరు కలిగి ఉండాలని చెప్పడం నా ఉద్దేశం... కనిపించని దాన్ని నమ్మాలి ..మీరు కోరింది అందుకున్నారని మీరు నమ్మాలి మీరు అడిగినది ఆ క్షణంలోనే మీ సొంతమైనదని మీరు తప్పక తెలుసుకోవాలి... మీకు పరిపూర్ణమైన ,ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి ...కేటలాగ్ నుంచి మరొక ఆర్డర్ ఇచ్చాక విశ్రమించాలి ...మీరు ఆర్డర్ చేసింది మీకు అందుతుంది ...అలా జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు పోవాలి .....

🌹రాబర్ట్ కాలియర్:---
మీరు కోరుకున్నది మీకు ఇప్పటికే సొంతమైంది... మీ అవసరానికి తగినట్లుగా అది మీ అందుబాటులోకి వస్తుంది. అని మీరు అనుకోండి... అప్పుడు వాటిని రానీయనీయండి.... వాటి గురించి కంగారుపడుతూ బాధకు గురికాకండి... అవి లేవని ఆలోచించకండి ...అవి నీవేనని ,మీకు చెందినవని అవి ఇదివరకే మీ ఆధీనంలోనే ఉన్నాయని, అనుకోండి...



మీరు అడిగిన ఆ క్షణంలో మీకు కనిపించిన దాన్ని నమ్మి, అవి అప్పటికే మీ వద్ద ఉన్నాయని, అనుకున్నప్పుడు యావత్ ప్రపంచం కనిపించని వాటిని కనిపించేలా చేయడానికి సంసిద్ధమవుతుంది..... అది ఇప్పుడే అనుకుంటున్నట్లుగా మీరు స్పందించాలి... మాట్లాడాలి... ఆలోచించాలి... ఎందువల్ల??? ఈ ప్రపంచం ఒక అద్దం... ఆకర్షణ సిద్ధాంతం అనేది మీ శక్తివంతమైన ఆలోచనల్ని మీకు ప్రతిబింబిస్తుంది... దాన్నిబట్టి మీరు అందుకున్నట్లుగా చూడాలని, మీకు అనిపించడం లేదా!!! ఒకవేళ మీ ఆలోచనల్లో దాన్ని ఇంకా అందుకోలేదని భావం ఉంటే అదే భావం ఆకర్షణ సిద్ధాంతంగా కొనసాగుతుంది... అందువల్ల మీరు అప్పటికే పొందినట్లుగా నమ్మాలి... అప్పటికే స్వీకరించినట్లుగా తప్పక నమ్మాలి... అందుకున్న విషయంలో మీకున్న సందేహాల గందరగోళాన్ని వదులుకుంటే, మీ జీవితంలోకి ఈ చిత్రాలు ప్రవేశిస్తాయి... మీరు అలా చేసినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకు వెళ్లి అన్ని పరిస్థితుల్ని, ప్రజలను, సందర్భాలను కదిలించి ,మీరు కోరుకున్నది మీకు దొరికేలా చేస్తుంది.....


మీరో విహారయాత్రకు బుక్ చేశారు, సరికొత్త కారును ఆర్డర్ చేశారు ,లేదా ఓ ఇల్లు కొన్నారు.. అవన్నీ నీవేనని తెలుసుకోండి... మీరు అదే సమయానికి మరో విహారయాత్రకు బుక్ చేయరు.. లేదా మరో కారు కానీ, ఇల్లు కానీ ,కొనరు ...



మీ రొక లాటరీ గెలుచుకున్నారు... లేదా భారీగా వారసత్వపు ఆస్తి లభించింది.... భౌతికంగా వెంటనే ఆ ధనం మీ చేతికి రాకముందే అది మీ సొంతం అని మీకు తెలుసు... అటువంటి నమ్మకం అనే భావన మీది ...అది మీకు అప్పటికే సొంతమైందన్న నమ్మకమైన భావన మీలో ఉంది... అది మీరు అనుకున్నారన్న నమ్మకమైన భావన కూడా ...అలా అనుకోవడం ,నమ్మడం ద్వారా మీరు అనుకున్న దానిపై హక్కును ఏర్పరచుకోండి ...మీరు అలా చేసినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం శక్తివంతంగా ముందుకు వెళ్లి ,అన్ని పరిస్థితుల్ని ,ప్రజలను, సందర్భాలను కదిలించి మీరు కోరుకున్నవి అందుకునేలా చేస్తుంది....


మరి మీకు ఆ నమ్మకం అనే భావన ఎలా వస్తుంది? నమ్మకం కల్పించుకోవడం మొదలు పెట్టండి ...ఒక పసిపిల్ల వాడిలా నమ్మకం కల్పించుకోండి ...అది అప్పటికే మీ వద్ద ఉన్నట్లు నటించండి ...అలా నమ్మకం కల్పించుకోగానే మీరు అది అనుకున్నారని నమ్మకం మీలో మొదలవుతుంది ...అన్ని సమయాల్లోనూ మీ శక్తివంతమైన ఆలోచనలకు భూతం స్పందిస్తూనే ఉంటుంది ...ఆ స్పందన అడిగిన క్షణానికి మాత్రమే పరిమితం కాదు.... అందువల్లే మీరు అడిగిన తర్వాత ఆ నమ్మకాన్ని ఉందని తెలియడాన్ని తప్పనిసరిగా కొనసాగించాలి.... విశ్వాసం కలిగి ఉండండి... అది మీ వద్ద ఉందనే నమ్మకం చెక్కుచెదరని ఆవిశ్వాసమే మీలోని మహాద్భుత శక్తి ....మీరు అందుకున్నారని నమ్ముతున్నప్పుడు సిద్ధంగా ఉండండి_ ఇంద్రజాలం ఎలా మొదలవుతుందో చూడండి...


"మీరు ఏం కోరుకుంటే అది పొందుతారు... అయితే ఆ కోరికకు మీ సొంత ఆలోచనలో ఎలాంటి ఆకృతిని కల్పించాలో మీకు తెలిసి ఉండాలి... నిజం చేసుకోవడానికి వీలుకాని కలంటూ ఉండదు... అయితే మీలోని సృజనాత్మక శక్తిని ఉపయోగించడం. నేర్చుకుని ఉండాలి... ఒకరికి పని చేసే విధానాలు అందరికీ పని చేస్తాయి ...ఆ శక్తికి కీలకం మీకున్నదాన్ని ఉపయోగించడంలో ఉంటుంది ...అది స్వేచ్ఛగా సంపూర్ణంగా ఉపయోగించాలి... ఆ విధంగా అధిక సృజనాత్మక శక్తి మీ ద్వారా ప్రవహించడానికి విస్తారంగా మార్గాలు తెరవాలి... :---రాబర్ట్ కాలియా


🌹డాక్టర్ జో విటాల్ :---మీకు అనుకూలించడం కోసం ప్రపంచం తనను తాను పునర్నిర్మించుకోవడం మొదలు పెడుతుంది....


🌹జాక్ కాన్ఫిల్డ్ :---మనలో చాలామంది మనకు నిజంగా కావలసింది కోరుకోవడానికి విముఖత చూపిస్తుంటాం... కారణం అది ఏ విధంగా రూపుదిద్దుకుంటుందో మనం చూడలేం....


🌹బాబ్ ఫ్రాక్టర్ :---మీరు కానీ చిన్న పరిశోధన చేస్తే, మీకు తెలిసేది ఏమిటంటే ఎవరైనా, ఏదైనా సాధించడానికి పూనుకున్నప్పుడు అది ఎలా చేయడమో వాళ్లకు తెలీదు... వాళ్లకు తెలిసిందల్లా అది తప్పకుండా తాము సాధించగలమన్నదే....


🌹డాక్టర్ జో విటాల్:-- అది మీకు ఎలా వస్తుందని మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు.... ప్రపంచం తనను తాను ఎలా పునర్మించుకుంటుందో మీకు తెలియవలసిన అవసరం లేదు... అది ఎలా జరుగుతుంది ...ప్రపంచం ఎలా దాన్ని నీ వద్దకు తీసుకు వస్తున్నది మీకు సంబంధించిన విషయం కాదు ...అది మీ పని కాదు... మీ కోసం ప్రపంచాన్ని ఆ పని చేయనీయండి... అది ఎలా జరుగుతుందని మీకు తర్జనభర్జనలు పడుతుంటే ,మీరు విశ్వాస రాహిత్యం అనే ప్రకంపనాలను, (అంటే అది ఇది వరకే మీ వద్ద ఉందని నమ్మకాన్ని పక్కన పెట్టేసి) బహిర్గతం చేసుకున్నారన్నమాట... అది మీరు చేయవలసిన పని అని ఆలోచిస్తున్నారు.... ప్రపంచం మీకోసం ఆ పని చేస్తుందని నమ్మడం లేదు... సృజనాత్మక ప్రక్రియలో ఎలా అనేది మీ అంతర్భాగం కాదు....


🌹బాబ్ ఫ్రాక్టర్:---- ఎలా అనేది మీకు తెలియదు ...మీకు చూపించడమే జరుగుతుంది ...ఆ మార్గాన్ని మీరు ఆకర్షిస్తారు...


🌹లీసా నికోల్స్:---- చాలా సందర్భాలలో మనం అడిగిన వస్తువులను పొందలేకపోయినప్పుడు ,అశాంతికి గురి అవుతాం. ...నిరుత్సాహం పొందుతాం.... సందేహ ప్రాణులమైపోతాం... ఆ సందేహం అనేది నిరుత్సాహభావాన్ని తెచ్చిపెడుతుంది... ఆ సందేహాన్ని తీసి పక్కన పెట్టండి... ఆ సందేహ భావనను గుర్తించి ,దాన్ని తొలగించి ,ఆ స్థానంలో చెక్కుచెదరని విశ్వాస భావనకు తావివ్వండి ...అదెలాంటి విశ్వాసం అంటే నాకు తెలుసు.... అది మన దగ్గరకు వస్తూ ఉంది......






🌹 దన్యవాదములు 🌹