The Author Madhu ఫాలో అవండి Current Read రహస్యం.. - 5 By Madhu తెలుగు Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 13 ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ... మాయాలలోకం SCREENPLAY& LYRICS WRITER…. SRINIHARIKA….. ... ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 12 ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ... తొలి రాత్రి అది ఒక నిజం. అందమైన నిజం. సంవత్సరాలుగా కలలు కన్న కళ్ళకు, జీవ... Trembling Shadows - 18 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... కేటగిరీలు Short Stories ఆధ్యాత్మిక కథ Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories పత్రిక పద్యం ప్రయాణ వివరణ Women Focused నాటకం Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science సైకాలజీ ఆరోగ్యం జీవిత చరిత్ర Cooking Recipe లేఖ Horror Stories Film Reviews Mythological Stories Book Reviews థ్రిల్లర్ Science-Fiction వ్యాపారం క్రీడ జంతువులు జ్యోతిషశాస్త్రం సైన్స్ ఏదైనా Crime stories Novel Madhu ద్వారా తెలుగు Motivational Stories Total Episodes : 6 షేర్ చేయబడినవి రహస్యం.. - 5 3.3k 7.1k 🌹 రహస్యం తేటపరచబడింది🌹 Part _2జాక్ కాన్ఫిల్డ్ :---మనం అనుభూతులు మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా ?మనం సరైన దిశలో పండిస్తున్నామా లేదా? అనే విషయంలో మనకు ఫీడ్బ్యాక్ అందజేసే ఒక నిర్మాణం.... మీలోని ఆలోచనలు ప్రతి దానిని ప్రభావితం చేస్తాయన్న విషయాన్ని గుర్తు ఉంచుకోండి... అందుకే ఏ విషయం గురించి అయినా మీరు అదే పనిగా ఆలోచిస్తున్నప్పుడు తక్షణం అది ఈ విశ్వంలోకి పంపబడుతుంది..... ఆలోచన దానితో సమానంగా ఉన్నా ఫ్రీక్వెన్సీ కు అయస్కాంతంలా అతుక్కుపోతుంది.... తర్వాత కొద్ది సెకండ్లలోనే ఫ్రీక్వెన్సీ తాలూకు రీడింగులు మీ భావనల ద్వారా మీకు తిరిగి పంపుతుంది ....మరోలా చెప్పాలంటే మీరు ప్రస్తుతం ఏ ఫ్రీక్వెన్సీ లో ఉన్నారన్న సమాచారాన్ని, విశ్వం మీ ఆలోచనల ద్వారా తిరిగి మీకు అందజేస్తుంది..... మీ భావనలే మీ ఫీడ్ బ్యాక్ మెకానిజం..... మీరు సంతోషంగా ఉంటూ మంచి ఆలోచనలు చేస్తుంటే, మీరు మంచి ఆలోచనలు చేస్తున్నారు అని ,అది విశ్వం నుంచి వెనక్కి వస్తున్న సందేశం.... అలాగే మీరు భయపడుతున్నట్లయితే విశ్వం నుంచి మీకు సందేశం మీకు మీరు చెడు ఆలోచనలు చేస్తున్నారని చెబుతుంది..... అందుకే మీరు బాధపడుతున్నప్పుడు ,అది విశ్వం మీకు పంపే సందేశం ...ఆ సందేశం మీకు ఏం చెబుతుందంటే ! "జాగ్రత్త నీ ఆలోచన సరళిని వెంటనే మార్చుకో.... వ్యతిరేకార్థక ఫ్రీక్వెన్సీ రికార్డు అవుతోంది.... త్వరలో అది బయటపడబోతోంది... జాగ్రత్త ఈసారి మీరు బాధపడుతున్నప్పుడు, వ్యతిరేక భావాలు మీలో తలెత్తుతున్నప్పుడు, విశ్వం నుంచి మీకు అందుతున్న సంకేతాన్ని వినండి... ఈ క్షణంలో మీ దగ్గరికి వద్దనుకున్న మంచినీ మీరు అడ్డుకుంటున్నారు ...ఎందుకంటే మీరు వ్యతిరేకమైన ఫ్రీక్వెన్సీ లో ఉన్నారు...... మీ ఆలోచనలని మార్చుకుని ఏవైనా మంచి ఆలోచనలు చేయండి... మనసులో మంచి భావాలు కలగటం మొదలు పెడితే, మీరు కొత్త ఫ్రీక్వెన్సీ కి మారటమే దానికి కారణమని మీరు తెలుసుకుంటారు.... అందుకే విశ్వం మంచి ఆలోచనలని మీ దగ్గరికి పంపి,దాన్ని రూడీ చేస్తుంది.....బాబ్ డాయ్ ల్:---- మీరు ఏ అనుభూతిని పొందుతున్నారో అదే మీకు అందుతోంది.. తప్ప మీరు ఆలోచిస్తున్నది కాదు... అందుకే ఎవరైనా నిద్రిస్తూనే అడుగులు తడ బడి తమ బొటన వేలికి దెబ్బ తగిలించుకుంటే,ఇక ఆ రోజంతా వాళ్లకి అలాగే బాధపడుతూనే గడుస్తుంది.... చాలా సులభంగా తమ భావాలని మరో వైపుకి మళ్ళించవచ్చని, అప్పుడు ఆ రోజంతా_ తమ జీవితమంతా ఆనందంగా గడుస్తుందని వాళ్ళు ఆలోచించలేరు...మీ రోజు ఆనందంగా మొదలై ,రోజంతా అలా ఆనందంగానే గడిస్తే ,మీరు ఇంకేదీ మీ ఆనందాన్ని పాడు చేయకుండా చేసుకోగలిగితే, మీరు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం , ఆ ఆనందాన్నీ నిలిపి ఉంచే మనుషులని, పరిస్థితులని మీ వైపు ఆకర్షించుకుంటారు... ఒకదాని తర్వాత ఒకటిగా ఏది సరిగ్గా జరగకపోవటమనే పరిస్థితిని మనమందరం ఎదుర్కొనే ఉంటాం.... ఆ గొలుసు కట్టులాటి ప్రతిక్రియ ఒక ఆలోచనతో ప్రారంభమైంది.... మీకు ఆ సంగతి తెలియవచ్చు, తెలియకపోవచ్చు ,ఒక చెడు ఆలోచన మరెన్నో చెడు ఆలోచనలని ఆకర్షించింది... ఫ్రీక్వెన్సీ దాన్ని పట్టి ఉంచింది.... ఆ తర్వాత ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ,ఆ ఒక్కదానికి వీరు ప్రతిక్రియ తెలియజేసినప్పుడు మీరు మరిన్ని పొరపాట్లని ఆకర్షించారు .....ప్రతిక్రియలు ఎప్పుడు అలాంటి ప్రతిక్రియలనే మరిన్నిటిని ఆకర్షిస్తాయి... అప్పుడు ఆ గొలుసు కట్టు అలా కొనసాగుతూ ఉంటుంది... మీరు స్వయంగా ఉంటే ఆకర్షణ సిద్ధాంతం, ప్రేమ సిద్ధాంతం, విపరీతమైన ప్రతిస్పందనని వెలువరిస్తాయి ....ఎందుకంటే మీరు వీలైనంత అతి హెచ్చు ఫ్రీక్వెన్సీ లో స్పందిస్తూ ఉంటారు.... మీరు ఎంత ఎక్కువ ప్రేమని అనుభవించి వెలిబుచ్చుతారో ,మీలో ఆ శక్తిని కూడా అంత ఎక్కువగా ఉపయోగించుకోగలుగుతారు...... "ఒక ఆలోచనని దాని వస్తువుతో జోడించి ప్రతికూలమైన అనుభవాల మీద విజయాన్ని సాధించడానికి ,పనికి వచ్చే సూత్రమే, ఆకర్షణ సిద్ధాంతం .....ఇది ఒక శాశ్వతమైన ప్రాథమిక సూత్రం.... ఇది అన్నిటిలోనూ ఉంటుంది ....ప్రతి తాత్విక వ్యవస్థ లోను, ప్రతి మతంలోనూ ,విజ్ఞాన శాస్త్రంలోనూ ఉంటుంది ....ప్రేమ సిద్ధాంతం, నుంచి తప్పించుకోవటం సాధ్యం కాదు.... భావమే ఆలోచనకి జీవశక్తినిస్తుంది.... భావన అంటే కోరిక, కోరిక అంటే ప్రేమ.... ప్రేమతో నిండిన ఆలోచన అజేయమైనది....మార్సి షిమోఫ్ :------నిజంగా మీరు మీ ఆలోచనలని, భావాలని అర్థం చేసుకుంటూ, మీ ఆధీనంలో ఉంచుకోగలిగితే, మీ నిజమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోగలరో మీకు తెలుస్తుంది.... అక్కడే మీ స్వేచ్ఛ ఉంటుంది.. అక్కడే మీ శక్తి మొత్తం ఉంటుంది ....మార్సి షమోఫ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ,చెప్పిన ఒక అద్భుతమైన ఉవాచని మనతో పంచుకుంది..... ఈ విశ్వం స్నేహంతో నిండి ఉందా ?అనేదే ఏ మనిషి అయినా తనని తాను ప్రశ్నించుకోవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న .....ఆకర్షణ సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత దీనికి ఒకే ఒక్క సమాధానం ఇవ్వగలం.... "అవును ఈ విశ్వం స్నేహపూర్వకమైనదే!" ఎందువల్ల ?ఎందుకంటే, మీరు ఇలా సమాధానం ఇవ్వగలిగినప్పుడు ఆకర్షణ సిద్ధాంతం వల్ల మీరు దానిని అనుభవించగలరు..... ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈ శక్తివంతమైన సవాలు వేశారు.... ఎందుకంటే ఆయనకి ఈ రహస్యం తెలుసు.... ఆ ప్రశ్న తను వేయడం వల్ల అది మనల్ని ఆలోచింపజేస్తుందని , ఆ సమస్యకు సమాధానాన్ని ఎంచుకునేల చేస్తుందని ఆయనకు తెలుసు ....కేవలం ఆ ప్రశ్న అడగటం ద్వారా ఆయన మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు.... ఐన్స్టీన్ ఉద్దేశాన్ని మరికొంత ముందుకు తీసుకువెళ్తే, మీరు దాన్ని ధ్రువీకరిస్తూ ప్రకటించగలరు.... ఇదొక వైభవో పేతమైన ప్రపంచం.... ఈ విశ్వం ఎన్నో మంచి వస్తువులను నా వైపు తీసుకువస్తోంది ...నేను చేసే ప్రతి విషయంలో ఈ విశ్వం నాకు మద్దతుని ఇస్తుంది.... ఈ విశ్వం నా అవసరాలన్నిటిని తక్షణం తీర్చేస్తోంది.... ఇది ఒక స్నేహపూర్వకమైన ప్రపంచం. అన్న విషయం మీరు తెలుసుకోండి.....జాక్ కాన్ఫీల్డ్ :-------నేను రహస్యాన్ని తెలుసుకొని దానిని నా జీవితానికి అనువయించాక ,నిజంగానే నా జీవితం మంత్రించినట్టు అధ్బతంగా రూపొందింది.... ప్రతి ఒక్కరూ తమ జీవితం ఎలా ఉండాలో అని కలలు కంటారు... బహుశా ప్రతిరోజు నేను అలాగే జీవిస్తానని అనుకుంటాను... నాలుగున్నర మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే భవనంలో నివసిస్తున్నాను... నా భార్య ఎంత గొప్పదంటే ఆమె కోసం తమ ప్రాణాలు అర్పించడానీకైనా జనం సిద్ధంగా ఉంటారు..... ఈ ప్రపంచంలోని మహత్తరమైన ప్రదేశాలకి సెలవులు గడపటానికి వెళ్తుంటాను ...పర్వతాలను అధిరోహించాను... అన్వేషణ యాత్రలో పాల్గొన్నాను... సఫారీ యాత్రలకు కూడా వెళ్లాను ...ఇవన్నీ సాధ్యం అవటానికి రహస్యాన్ని జీవితానికి ఎలా అన్వయించుకోవాలో తెలియటమే కారణం.....బాబ్ ఫ్రాక్టర్ :---- రహస్యాన్ని ఉపయోగించడం మొదలు పెట్టాక జీవితం అసాధారణంగా మారిపోయే అవకాశం ఉంది ...మారాలి ,మారుతుంది కూడా..... ఇది మీ జీవితం... మీరు దాన్ని ఆవిష్కరించాలని అది ఎదురుచూస్తూ ఉంది.... ఇప్పటివరకు జీవితం ఎన్నో కష్టాలతో నిండి ఉందని సంఘర్షణతో కూడుకున్నదని అనుకుంటూ ఉన్నారు..... ఆకర్షణ సిద్ధాంతాన్ని అనుసరించి మీరు కష్టాలనీ ,సంఘర్షణలని, తక్షణం విశ్వానికి ఎలుగెత్తి చాటండి ...జీవితం చాలా సులభం అయింది ...జీవితం బాగుంది.... అన్ని మంచి విషయాలు మీ దగ్గరికి చేరుతున్నాయి ....మీ మనసు లోతుల్లో ఒక వాస్తవం కనుమరుగై ఉంది... దాన్ని మీరు ఆవిష్కరిస్తారని అది ఎదురుచూస్తోంది... ఆ వాస్తవం ఏమిటంటే జీవితం మీకు అంది ఇవ్వగల అన్ని మంచి విషయాలని గ్రహించే అర్హత మీకుంది ...మీకు ఆ సంగతి స్వతసిద్ధంగా తెలుసు... ఎందుకంటే మంచి విషయాల కొరత మిమ్మల్ని అమితంగా బాధపడుతుంది.... అన్ని మంచి విషయాలను పొందటం మీ జన్మ హక్కు ...మిమ్మల్ని సృష్టించుకునేది మీరే ...అదే విధంగా మీరు జీవితంలో కావాలని కోరుకునే వాటిని సృష్టించుకునేందుకు ఆకర్షణ సిద్ధాంతం ఒక అద్భుతమైన సాధనం.... జీవితంలోని ఇంద్రజాలానికి మీలోని అద్భుత శక్తికి స్వాగతం.......🌹ఆకర్షణ సిద్ధాంతం ప్రకృతికి సంబంధించిన ఒక సిద్ధాంతం ....అది గురుత్వాకర్షణ శక్తి లాగే నిష్పాక్షికమైనది....🌹మీరు అదే పనిగా ఆలోచిస్తూ పిలిస్తే తప్ప, ఏది కూడా మీ అనుభవంలోకి రాదు...🌹మీరేం ఆలోచిస్తున్నారో తెలుసుకోవాలంటే, మీకు ఎలాంటి భావన కలుగుతుందని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ...భావనలు మనం ఏం ఆలోచిస్తున్నామో వెనువెంటనే మనకి తెలియజేసి విలువైన సాధనాలు....🌹మంచి ఆలోచనలు చేస్తున్నప్పుడు, చెడు భావనలు కలగటం అసంభవం...🌹మీ ఆలోచనలే మీకు ఫ్రీక్వెన్సీని నిర్ధారిస్తాయి ...మీ భావనలు మీరు ఏ స్థాయి ఫ్రీక్వెన్సీ లో ఉన్నారో వెంటనే తెలియజేస్తాయి... మీలో చెడు భావాలు కలిగినప్పుడు మీలోని ఫ్రీక్వెన్సీ మరిన్ని చెడు విషయాలని మీ వైపుకి ఆకర్షిస్తుంది.... మీలో మంచి భావాలు కలిగినప్పుడు ఎంతో బలంగా మీరు మరిన్ని మంచి భావాలని ఆకర్షిస్తారు....🌹మార్పు తీసుకువచ్చే రహస్యాలు అంటే సంతోషకరమైన జ్ఞాపకాలు ,ప్రకృతి ,మీకు ఇష్టమైన సంగీతం, ఇలాంటివి మీ భావనలో మార్పు తీసుకువచ్చి ఒక్క క్షణంలో మీ డిఫెన్స్ స్థాయిని మార్చగలవు...🌹మీరు వెళ్ళబుచ్చ గల అతి హెచ్చు స్థాయి ఫ్రీక్వెన్సీ "ప్రేమ "మీరు ఎంత ఎక్కువగా ప్రేమ అనే భావాన్ని అనుభవించి పెళ్లి బుచ్చగలిగితే ,మీరు ఉపయోగించగల శక్తి అంత ఎక్కువగా ఉంటుంది...... 🌹 ధన్యవాదములు 🌹 ‹ మునుపటి చాప్టర్రహస్యం.. - 4 › తదుపరి చాప్టర్ రహస్యం.. - 6 Download Our App