Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

జీవిత సత్యాలు - 1

జీవిత సత్యాలు.............
విత్తనం తినాలని
చీమలు చూస్తాయి...
మొలకలు తినాలని
పక్షులు చూస్తాయి...
మొక్కని తినాలని
పశువులు చూస్తాయి...
అన్నీ తప్పించుకుని ఆ మొక్క
వృక్షమైనపుడు.....
చేమలు,పక్షులు, పశువులు
ఆ చెట్టు కిందకే నీడ కోసం వస్తాయి...
జీవితం కూడా అంతే...
వచ్చేవరకు వేచి ఉండాల్సిందే
దానికి కావాల్సింది ,ఓపిక మాత్రమే
జీవితంలో వదిలి వెళ్ళిన
వాళ్ళ గురించి ఆలోచించకు,
జీవితంలో ఉన్నవాళ్లు
శాశ్వతం అని భావించకు,
ఎవరో వచ్చి నీ బాధను,
అర్థం చేసుకుంటారని ఊహించకు...
నీకు నువ్వే ధైర్యం కావాలి...
నీకు నువ్వే తోడుగా నిలబడాలి...
లోకులు కాకులు
మనిషిని చూడరు
వ్యక్తిత్వాన్ని చూడరు
కనిపించింది,వినిపించింది,
నమ్మేస్తారు ,మాట అనేస్తారు...
ఒక్కోసారి మన కళ్ళే మనల్ని
మోసం చేస్తాయి.మరొకసారి
చెప్పుడు మాటలు జీవితాలను
తలకిందులు చేస్తాయి...
అబద్దాలతో మోసాలతో
కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా
నిర్మించుకొన్నా ,అవి కుప్పకూలి
పోవడానికి ఒక "నిజం" చాలు
అందుకే ఎంత కష్టమైనా సరే
నీతిగా బ్రతకడమే మనిషికి
ఉత్తమం మార్గం...
ఒక చిన్న ముక్క నాటి
ప్రతిరోజు వచ్చి కాయ కాసిందా
అని చూడకూడదు.....
ఎందుకంటే అది పెరగాలి,
ఒక్క వృక్షం కావాలి.
పుష్పించాలి ,పిందెలు కావాలి.
అవి కాయలై పండితే తినగలం
అలాగే నేను ఇది కావాలి
అనే కోరిక కూడా,
మొలకై వృక్షమై
ఫలవంతం అవుతుందని
తెలిసి మసలుకోండి
స్నేహితులారా!!!!
జీవితంలో కష్టమూ, కన్నీళ్లు
సంతోషము, భాద ఏవి
శాశ్వతంగా ఉండవు.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు.
ఆనందం ,ఆవేదన కూడా అంతే
కష్టము ,శాశ్వతం కాదు...
సంతోషము, శాశ్వతము కాదు...
ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి...
మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి.... చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి... గెలుపును ఎలా తట్టుకోవాలో
తెలిసిన వాడికంటే,
ఓటమిని ఎలా తట్టుకోవాలో
తెలిసిన వారే గొప్పవారు...
దెబ్బలు తిన్న రాయి
శిల్పం అవుతుంది కానీ,
దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం
ఎప్పటికీ సుత్తిగానే మిగిలిపోతుంది.
ఎదురు దెబ్బలు తిన్నవాడు,
నొప్పి విలువ తెలిసినవాడు,
మహనీయుడు అవుతాడు...
ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు,
ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు...
డబ్బుతో ఏమైనా కొనగలం
అనుకుంటున్నారా........
అయితే కొనలేనివి ఇవిగో....
మంచం పరుపు కొనవచ్చు
కానీ నిద్ర కాదు........
గడియారం కొనవచ్చు కానీ,
కాలం కాదు.......
మందులు కొనవచ్చు కానీ,
ఆరోగ్యం కాదు.......
భవంతులు కొనవచ్చుకానీ
ఆత్మీయత కాదు......
పుస్తకాలు కొనవచ్చు కానీ
జ్ఞానం కాదు.....
పంచవక్ష పరమాన్నాడు కొనవచ్చు
కానీ, జీర్ణశక్తిని కాదు....
ఆకులు తింటేనే
బ్రహ్మ జ్ఞానం వస్తే,
అందరి కన్నా ముందు
మేకలే జ్ఞానులు కావాలి......
స్నానాలతోనే పాపాలు పోతే
ముందు చేపలే
పాప విముక్తులు కావాలి.....
తపస్సు చేస్తేనే పరమాత్మ
ప్రత్యక్షమైతే ముందు
గబ్బిలాలకే ఆ వరం దక్కాలి.....
ఈ విశ్వం అంతా ఆత్మలో ఉంది....
నీలో ఉన్న ఆత్మను వదిలి,
పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు...
నీలో లేనిది బయట ఏమీ లేదు....
బయట ఉన్నదంతా నీలోనే ఉంది....
తెలిసి మసలుకో___ కలిసి జీవించు



ప్రకృతి తత్వమే మానవ ధర్మం...
ఈ లోకంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని
బాగు చేయలేడు. అలాగని చెడగొట్టే లేదు కూడా... ఒక వ్యక్తి బాగుపడాలంటే, చెడిపోవాలంటే, కావాల్సిన
అవకాశాలన్నీ ఈ లోకంలో ఉన్నాయి
వ్యక్తులు బాగుపడటం చెడిపోవడం,
తమ స్వయం కృతాపరాధమే...
వ్యక్తులే తమకు తాము ప్రశ్నించుకుని, విశ్లేషించుకుని దాన్ని ఎన్నుకోవడం,
వారి వ్యక్తిగత ఆలోచన విధానమే....
వ్యక్తిగత అభివృద్ధికి ,తద్వారా సామాజిక అభివృద్ధికి బాటలు వేస్తాయి...
బాబాజీలు ,స్వామీజీలు ,ప్రవచన కారులు చెప్పేవి వారి సందేశాలు,
వారి ప్రవచనాలు ,అన్ని వారి వారి మత ధర్మానికి చెందినవి... కానీ
మానవ ధర్మానికి చెందినవి కావు...
మానవుని మానవునిగా
చూడటమే మానవ ధర్మం.....
మానవ జీవితాన్ని సక్రమమైన
మార్గంలో నడుపుకొనుటకు
ప్రకృతిలోనే మానవ ధర్మాలు
ఇమిడి ఉన్నాయి .....
ప్రకృతి ఏ ప్రాణి కోసం, మన కోసము
లేదు..... ఉన్న ప్రకృతిని
మనం మన అవసరాలకు ,
మన సుఖానికి, మన సంతోషానికి వాడుకుంటున్నాం....
అంతే కానీ మన కోసం ప్రకృతి లేదు...
ఏ ప్రాణి ఉన్నా, లేకపోయినా,
మనం ఉన్నా లేకపోయినా,
ప్రకృతి ఉంటుంది....
ఎందుకంటే మన కన్నా ముందు కూడా
ప్రకృతి ఉన్నది.....మానవ ధర్మాలు అన్నీ,
కూడా ప్రకృతిలో ఇమిడి ఉన్నాయి......
ప్రకృతి యొక్క తత్వాన్ని
పూర్తిగా అవగాహన చేసుకుంటే
మానవ ధర్మాలు నేర్చుకోవచ్చు.....

ప్రకృతి అంటే!!!!!!!!!!
ప్రకృతి ఒక పెద్ద పాఠశాల.....
ప్రకృతి అంటేనే మానవ ధర్మం....
ప్రకృతి అంటేనే విజ్ఞాన శాస్త్రం.....
ప్రకృతి అంటేనే మానవతా ధర్మం....
ప్రకృతి అంటే గొప్పగా
తయారు చేయబడినది...
ప్రకృతి తత్వాన్ని తెలుసుకుంటే
ఏ గురువు అక్కర్లేదు....
ప్రకృతి మాత్రమే మానవ
ధర్మాన్ని బోధిస్తుంది.....
ప్రకృతి అనంత విజ్ఞానానికి నిలయం...
ప్రకృతి మానవ ధర్మానికి ప్రతీక...
ప్రకృతి మానవులకు ఆదర్శం ....
శాస్త్రజ్ఞులు ప్రకృతిలోని సంఘటనలను,
ప్రకృతి తత్వాన్ని గమనించకుండా
అర్థం చేసుకోకుండా ,పరిశీలించకుండా
ఏ ఆవిష్కరణలు చేయలేదు...
చేయబోడు కూడా......
మనం అనుభవిస్తున్న
శాస్త్ర సాంకేతిక ఫలితాలు
నీయమబద్ద ప్రకృతి సంఘటనల
నుండి రూపుదిద్దుకున్నవే.......
ప్రకృతికి దేవుడికి ఏ సంబంధం లేదు!!!!!!!!!!
ప్రకృతికి దేవుడికి పూర్తిగా వ్యతిరేకం...
ప్రకృతి నుండి దేవుడు పుట్టలేదు...
దేవుడి వలన ప్రకృతి పుట్టలేదు....
దేవుడు పూర్తిగా మానవుని ఊహలలో, అల్లుకున్న రూపమే....
కొందరు ప్రకృతిని దేవుడు సృష్టించాడని, అజ్ఞానంగా ,అనాలోచితంగా, మాట్లాడుతున్నారు....
దేవుడి రూపకల్పనకు కూడా ప్రకృతి ఆధారమైంది.....ప్రకృతిలో దొరికే రాయిని శిల్పాలుగా మార్చి ,దాని ముందు
ప్రకృతిలో దొరికే పుష్పాలను
ఉంచి పూజలు చేస్తున్నారు....
సాగిలపడి మొక్కుతున్నారు....
అలాంటప్పుడు దేవుడే ఈ ప్రకృతిని, సృష్టించాడు అంటే నమ్మడం ఎలాగా!!!
ఒకవేళ ఈ ప్రకృతిని దేవుడు సృష్టించాడని నమ్మితే మరల ఈ ప్రకృతిలోని,
వాటినే మరలా దేవుని కి సమర్పించడం, ఏమిటి!!!కొందరు మత గురువులమని, స్వామీజీలమని ,వేషాలు వేసుకుని,
సకల జనులకు మానవ తత్వాన్ని బోధిస్తున్నామని, మానవ ధర్మాన్ని బోధిస్తున్నామని ,వారి వారి
మత ధర్మాన్ని బోధిస్తారు.....
గాని వారు ప్రకృతి తత్వాన్ని
మాట మాత్రమైన చెప్పరు ....ఎందుకంటే
వారి మతం ,వారి దేవుడు
కనుమరుగవుతారని.....
వేషాలు, వేసుకున్న స్వామీజీలు ,బాబాజీలు అందరూ వారి స్వార్థానికే ,
స్వలాభం కోసమే బోధనలు ,
ప్రవచనాలు చెప్తున్నారు......
పర్యావరణం చెడిపోవడానికి,
గాలి కలుషితం కావడానికి ,
ప్రకృతి ప్రకంపాలైన భూకంపాలు, అగ్నిపర్వతాలు ,తుఫాన్లు ఉప్పెనలు, ఏర్పడటానికి శాస్త్ర సాంకేతికాలే,
కారణం అని కొందరు అజ్ఞానంగా, అనాలోచితంగా ,మాట్లాడుతున్నారు......
కానీ అదంతా మనిషి యొక్క
అనాలోచిత చర్యల వలననే
అని వారు ఆలోచించడం లేదు...

శాస్త్ర సాంకేతిక రంగాలలో
అద్భుతమైన ప్రగతిని,
ఉపయోగించుకొని అనేక
ఆవిష్కరణలు చేసి
మనిషి ఒక జీవనం సాగిస్తున్నాడు....
స్వేచ్ఛను పొందాడు .....అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేస్తున్నాడు....
ప్రకృతి తత్వాన్ని తెలుసుకున్న
ప్రతి మానవుడు అన్నింటికి ప్రకృతి మూలం అన్న సత్యాన్ని గ్రహిస్తాడు .....
ప్రకృతిని గమనిస్తే,
ప్రకృతిని నిశితంగా పరిశీలిస్తే ,
మానవ ధర్మం అంతా బోధపడుతుంది....
మానవులు మరో మానవుని పట్ల
ఎలా ప్రవర్తించాలో, ఈ సమాజంలో,
ఎలా మెలగాలో,ప్రకృతి చెప్పకనే చెబుతోంది.... ప్రకృతిని బిన్నకోణాల
నుండి పరిశీలిస్తే ,మనకు
మన జీవన విధానానికి,
మన మానవ ధర్మానికి
ఏ గురువు, ఏ ధర్మాన్ని
మనకు బోధించవలసిన
అవసరం లేదు.......