Read Aruna Chandra - 5 by BVD Prasadarao in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరుణ చంద్ర - 5

రచయిత : బివిడి ప్రసాదరావు


ఎపిసోడ్ 5


ఆదివారంతో కూడి వరసగా మూడు పబ్లిక్ హాలిడేస్ రావడంతో, కృష్ణమూర్తి చొరవతో, లక్ష్మి, అరుణ, చంద్ర లాంగ్టూర్కు బయలుదేరారు. ఇక్కడకు అని అనుకోలేదు వారు. కానీ, కారులో బయలుదేరారు, సైట్సీయింగ్కు అన్నట్టు. లక్ష్మికి తప్పా, ఆ ముగ్గురూ కారు డ్రయివింగ్ చేయగలరు. కనుక, ఓపిక మేరకు ముందుకు వెళ్తూ, చూడవలసిన వాటి దగ్గర ఆగుతూ, లేదా, బడలిక అనిపిస్తే, హోటళ్లులో బస చేస్తూ ఈ సెలవుల కాలం గడిపేసేలా ఒక ఆలోచన మాత్రం వారిలో ఉంది. అదే ప్రస్తుతం కొనసాగుతోంది.
అరుణ కారు డ్రయివ్ చేస్తోంది. తను ఎప్పుడూ 60కి 70కి మధ్య స్పీడుతోనే డ్రయివింగ్ చేస్తోంది. అదే జరుగుతోంది ప్రస్తుతం.
అరుణ పక్కన లక్ష్మి ఉంది. వెనుక సీట్లలో కృష్ణమూర్తి, చంద్ర కూర్చున్నారు.
వారంతా చక్కగా సంభాషించుకుంటున్నారు.
కారులో మ్యూజిక్ప్లేయర్లోంచి సరళంగా శాస్త్రీయ సంగీతం వస్తోంది.
"మామయ్యా రాత్రి నేను, అరుణ ఒకటనుకున్నాం. అది మీతో మాట్లాడాలను కుంటున్నాను" అని అన్నాడు చంద్ర.
"ప్రోసీడ్ చంద్రా" అన్నాడు కృష్ణమూర్తి, తన ఎడమ చేతిలోని అపిల్ని కుడి చేతిలోని చాకుతో కోస్తూ.
"మా పెళ్లికి ముందుటి, మా సంపాదనలో మేము కూడబెట్టుకున్నది, ఎవరివి వారివే అని అనుకున్నామని చెప్పాను కదా. కానీ, మా ఇరువురి ఆ మొత్తంతో ఎంత మేరకు వస్తే అంత లాండ్ను జాయింట్ రిజిస్ట్రేషన్తో కొనుగోలు చేసి అట్టిపెట్టుకోవాలనుకున్నాం. ఏమంటారు" అని అడిగాడు చంద్ర.
కృష్ణమూర్తి అపిల్ముక్కలను చెరొకటి చొప్పున ఆ ముగ్గురూకు పంచాడు. పిదప తను ఒక ముక్క తింటూ, "గుడ్. మంచిదే. అలానే కానీయండి" అని చెప్పాడు, ఉత్సాహంగా.
అరుణ ఆ మొత్తం ఎంతో చెప్పింది.
"మంచి అమౌంటే. మంచిగానే లాండ్ సెక్యూర్ అవుతోంది." అని అని, తర్వాత, "నేను కొనుగోలు చేసిన వైపు లాండ్స్ ఉన్నాయి. వీలైతే చూడండి. అక్కడా బాగుంటుంది" అని కూడా అన్నాడు కృష్ణమూర్తి.
"సరే మామయ్యా. అక్కడా చూద్దాం. మీరూ వీలుచేసుకొని రండి. మనం వెళ్దాం" అని చెప్పాడు చంద్ర, హుషార్గానే.
"ఇటే దారిగా. ఐతే అటే ఇప్పుడు వెళ్తే పోలే." అంది లక్ష్మి.
"మనం పక్కాగా ఎటు వెళ్లాలో అనుకోలేదుగా ఏమీ. సో, అటే ఇప్పుడు అనుకొని, వెళ్దాం. ఏమంటావు చంద్రా" అన్నాడు కృష్ణమూర్తి.
"సరే. అరుణా ఆ రూట్ నీకు తెలుసా" అన్నాడు చంద్ర.
"తెలుసు. వెళ్లి చూద్దామా" అంది అరుణ.
"తప్పక. మనం అనుకున్నది కూడా తొందరగా అవుతోందికదా, అక్కడ కుదిరితే" అన్నాడు చంద్ర.
సరిగ్గా తొంబయ్నిముషాలు తర్వాత, ఆ కారు ఆ ప్రాంతాన్ని చేరింది.
ఆ నలుగురూ కారు దిగారు.
చిన్న ములుపు తిరిగి, కొద్దిగా ముందుకు వెళ్లి ఆగాడు కృష్ణమూర్తి.
మిగతా వాళ్లు అతనిని అనుసరించారు.
"ఈ మూడూ నేను తీసుకున్నవి. ఆ కుడి వైపు బిట్లు సేల్స్కు ఉండేవి. ఇప్పుడు వాటి స్థితి ఏమిటో. ఇక్కడ ఇంకా సేల్స్కు ఆ దూరంగా కనిపిస్తున్న బిట్లూ ఉంటాయి" అంటూనే, సెల్ఫోన్ తీసి, ఎవరికో ఫోన్ చేసి మాట్లాడేడు.
తర్వాత, "ఆ కుడి వైపు వాటిలో రెండు బిట్లు ఖాళీయట. విస్తీర్ణాలు, రేట్లు మనకు అందుబాటులోనే ఉన్నాయి. మాట్లాడదామా" అని అన్నాడు కృష్ణమూర్తి.
చంద్ర, అరుణతో కలిసి ఆ బిట్లు వైపు నడిచాడు.
వాళ్లని అనుసరించారు మిగతా ఇద్దరూ.
"వీటిలో ఏవైనా బాగున్నట్టు ఉన్నాయి మామయ్యా" అన్నాడు చంద్ర, కృష్ణమూర్తితో.
"ఈ ఏరియానే బాగుంటుంది. ఈ బిట్లు 2000, 2500 స్కేర్ఫీట్ వరకు ఉంటాయి." అని చెప్పాడు కృష్ణమూర్తి.
"ఏమంటావ్ అరుణా" అడిగాడు చంద్ర.
"నాన్నా తీసుకున్నారు. మనమూ మాట్లాడదామా" అని అడిగింది అరుణ, చంద్రను.
"మాట్లాడండి మామయ్యా" అని చెప్పాడు చంద్ర.
"సరే" అన్నాడు కృష్ణమూర్తి, సరదాగా.
ఆ పిమ్మట, 15 రోజులు గడిచే సరికి, అక్కడది, 2800 స్కేర్ఫీట్ లాండ్ అరుణ, చంద్రల పేరున రిజిస్ట్రేషన్ కాబడింది, చాలా ప్రశాంతంగా. దానికి ముందు, చంద్ర తల్లిదండ్రులు, కృష్ణమూర్తి పిలుపుతో రావడం, కొడుకు, కోడలును మెచ్చుకోవడం, అభినందించడం, వారు మిక్కిలి ఆనందాన్ని ప్రదర్శించడం, చేబదులుగా తాము కొంత మొత్తం సర్దడం, చకచకా జరిగిపోయాయి కూడా.


***

మజిలీలు, స్పీడ్ బ్రేకర్లు లేని కాలం తన ఆనవాయితీగా కొనసాగిపోతుంది.
అలా ఏడు సంవత్సరాలు తర్వాత -

***

వాళ్ల డిన్నర్ మొదలయ్యింది.
"ఈ స్వీట్ బాగుంది శ్రీరాజ్కు మరొకటి ఇవ్వు" చెప్పాడు కృష్ణమూర్తి, లక్ష్మితో.
అరుణ, చంద్రల కొడుకు శ్రీరాజ్. వాడికి ఐదేళ్లు.
"వద్దు నాన్నా ఇప్పటికి ఇవి రెండు తిన్నాడు" అంది అరుణ.
"తాతే చెప్పారు. ఇవ్వు అమ్మమ్మా" అన్నాడు శ్రీరాజ్.
లక్ష్మి నవ్వుతూ ఆ స్వీట్ ఒకటి వాడికి ఇచ్చింది.
శ్రీరాజ్ ఫస్ట్ స్టాండర్డ్ క్లాస్లో చదువుతున్నాడు.
గతేడాది అరుణ, చంద్ర కిడ్స్ స్కూలు ఒకటి ప్రారంభించారు. అంతకు ముందేడాదే రొటీన్గా సాగిపోతోందే తప్పా పూర్తి పుల్పిల్గా తమ లైఫ్ సాగుట లేదంటూ, తమ ఉద్యోగాలును విడిచి పెట్టేసి, ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ నిర్వాహణ వైపు మొగ్గు చూపారు. అందుకు కారణం కూడా కృష్ణమూర్తే.
కృష్ణమూర్తి, తన రిటైర్మెంట్ తర్వాత, మెడికల్ కాలేజీ ఒకటి పెట్టే తలంపు తనకు ఉందని వెల్లడి చేశాడు ఆ మధ్య. అటు ప్రయత్నాలూ మొదలెట్టాడు. దాంతో అప్పటికే చేస్తున్న ఉద్యోగాలు మొత్తి ఉన్న అరుణ, చంద్రలు అలా అటు మొగ్గారు. కానీ ఇనిషియల్ స్టేజ్ నుండి ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్స్ పెట్టే ప్రయత్నంలో, తొలుత కిడ్స్ స్కూలు పెట్టారు, ఇది వరకు తాము కొన్న లేండ్లో. లోన్తో బిల్డింగ్ కూడా కట్టించారు. అన్ని వసతులు పద్ధతి ప్రకారం కల్పించారు. ఆ ఇద్దరూ డైరెక్టర్స్గా మంచి స్టాప్ను క్రోడికరించుకొని, దానిని నిర్వహిస్తున్నారు, చక్కగా.
ఆ స్సూల్లోనే శ్రీరాజ్ చదువుతున్నాడు.
"పెరుగు ఇలా అందించు అరుణా" అన్నాడు చంద్ర.
అరుణ ఆ పని చేసింది.
"తాతా ఈ రోజు పడుకొనే ముందు పాలు తాగను" అని చెప్పాడు శ్రీరాజ్.
"ఏమి నాన్నా" అడిగింది లక్ష్మి.
"మూడు స్వీట్సు తిన్నా. కడుపు మరి పట్టదు" చెప్పాడు శ్రీరాజు.
"పాలు మంచివి. ఆ స్వీట్స్ అందుకే వద్దన్నది" అన్నాడు చంద్ర.
"ఇది మీ స్కూలు కాదు. ఇది ఇల్లు. మీ ఫనిష్మెంట్లు ఇక్కడ వద్దు" అన్నాడు శ్రీరాజ్, ఉడికిస్తున్నట్టు.
దాంతో అక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా రూపొందింది.


***

మరో నాలుగేళ్ల తర్వాత -
కృష్ణమూర్తి జాబ్ నుండి రిటైరైపోయాడు, రేండేళ్ల క్రితమే.
ప్రస్తుతం ఒక మెడికల్ కాలేజీ నిర్వాహకుడుగా బిజీగా ఉన్నాడు.
తను కొనుగోలు చేసి పెట్టుకున్న లాండ్స్లోనే ఆ కాలేజీకై బిల్డింగ్స్ కట్టించాడు. అందుకు కొంత బ్యాంక్ సహాయం వాడుకున్నాడు.
అలాగే, లక్ష్మి అన్నయ్య కొడుకు, కిరణ్ను రప్పించాడు. తనకు చేదోడుగా నియమించుకున్నాడు. అతడి కుటుంబానికి ఆ కాలేజీ హాస్టల్ పైన రెండు రూంల నివాస పోర్షన్ కేటాయించాడు. అందులో అన్ని సౌకర్యాలూ కల్పించాడు.
అరుణ, చంద్రల ఇనిస్టిట్యూట్స్కూడా అక్కడే బాగా డవలప్ అయ్యాయి.
శ్రీరాజ్ కూడా కృష్ణమూర్తి, అరుణల నేతృత్వంలో సూపర్ కిడ్గా రూపొందుతున్నాడు.


***


ఉదయం నుండి ఆ జూనియర్ కాలేజీ వేడుకులకై రడీ ఐ ఉంది.
రిజల్ట్స్కై వేచి ఉంది.
ఆ కాలేజీకి ఫస్ట్బ్యాచీగా గుర్తింపుబడ్డ ఆ స్టూడెంట్స్లో మాత్రం ఎట్టి టెన్షన్ లేదు. కారణం వారంత ఈజీగా రేంక్లు పొందగలమన్న థీమాతో ఉన్నారు. అందుకు తమ కాలేజీ పనితనం మీద వారికి మంచి గురి ఏర్పడి ఉంది.
రిజల్ట్స్ వచ్చేశాయి.
అంతా అనుకున్నట్టే అరుణ, చంద్రల ఆ జూనియర్ కాలేజీ ఫస్ట్ ప్లేస్లో నిలించింది. అక్కడి ఆ స్టూడెంట్స్ అంతా మంచి రేంక్లుతో పాసయ్యారు. వాళ్లలో శ్రీరాజ్ కూడా ఒకడై ఉన్నాడు.
అక్కడ వేడుక మొదలై, ఉల్లాసంగా కొనసాగుతోంది.
స్టూడెంట్సే కాదు వారి పేరెంట్స్ కూడా అందులో స్వచ్ఛందంగా భాగస్తులయ్యారు.


***

(మిగతాది తరువాయి ఎపిసోడ్ లో)