Read Aruna Chandra - 9 - last part by BVD Prasadarao in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరుణ చంద్ర - 9 - last part

రచయిత : బివిడి ప్రసాదరావు


ఎపిసోడ్ 9


శ్రీరాజ్ అన్ని నార్మ్స్ని పుల్ఫిల్ చేస్తూ, అతి జాగ్రత్తగా, అతి పొందికగా, తన పేపర్స్ను సబ్మిట్ చేశాడు, కన్సర్న్పర్సన్స్కు, కొద్ది నిముషాల ముందు. పిమ్మట అతి సామాన్యంగా ఆ ఆఫీస్నుండి బయటకు వచ్చేశాడు.
ఆ బయట, శ్రీరాజ్కై వేచి ఉంది, మధుమతి.
శ్రీరాజ్ తను ఈ వేళటి ఈ ప్రొగ్రాంను ముందుగా మధుమతికి చెప్పి, తనను రమ్మనమని ఫోన్ ద్వారా కోరాడు, కృష్ణమూర్తి ప్రేరణతో.
అందుకే మధుమతి రావడమైంది.
ఆమె అందించగా అందుకున్న ఆ పేపర్స్ను శ్రీరాజ్ సబ్మిట్ చేయడమైంది.
"డన్" అన్నాడు శ్రీరాజ్, తన కుడి బొటన వేలును పైకెత్తి చూపుతూ.
"ఆల్ ఆర్ బెస్ట్ పేవర్" అంది మధుమతి, తనూ తన కుడి బొటన వేలును పెకెత్తి చూపుతూ.
ఆ పిమ్మట, ఆ ఇద్దరూ, దగ్గరలోనే ఉన్న కాఫీ కేప్కులోకి నడిచారు.
"రెండు బ్లాక్ కాఫీ" చెప్పింది మధుమతి.
"నీకూ ఆ బ్లాక్ కాఫీ ఇష్టమా" అడిగాడు శ్రీరాజ్.
"ఉ. అప్పటి నుండి" అంది మధుమతి, చిరునవ్వుతో.
"అంటే" అన్నాడు శ్రీరాజ్, గమ్మున.
"నీకు బ్లాక్ కాఫీ ఇష్టం అని నాకు తెలిసినప్పటి నుండి అని" చెప్పింది మధుమతి,, ముద్దుముద్దుగా.
"అవునూ. నా విషయాలు నువ్వు ఎలా తెలుసుకున్నావు. ఇప్పుడు చెప్పి తీరాలి" అన్నాడు శ్రీరాజ్, కాస్తా మారంగా.
అందుకు, మధుమతి, సరళ విషయంతో పాటు, మారు వేషాలుతో శ్రీరాజ్ను ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ తను ఫాలో అయిందో అన్నీ చెప్పేసి, "ఇలా తెలుసుకున్నాను" అని ముగింపు ఇచ్చేసింది.
ఈ లోగా బ్లాక్ కాఫీలు తేవడం, వారిద్దరికీ సర్వ్ చేయడం కూడా జరిగింది.
"అమ్మో, నేనివేవీ గుర్తించనే లేదు." అన్నాడు శ్రీరాజ్, ఖాళీ కాఫీ కప్పును పక్కగా పెడుతూ.
"తప్పదుగా, అతి జాగ్రత్తలు నేను కోరి పాటించాను మరి" చెప్పింది మధుమతి.
"ఎందుకు ఇంత ప్రయాస పడ్డావు" అని అడిగాడు శ్రీరాజ్, అమాయకంగా.
తన చేతిలోని ఖాళీ కాఫీ కప్పును పక్కన పెట్టి, "నువ్వు నా ఓటువిగా" అని చెప్పింది మదుమతి, కొంటెగా.
"ఓటువినా" అన్నాడు శ్రీరాజ్, చిత్రంగా.
"ఓటువి కాదు ఓటు ... నా ఓటు ... వి" అంది మధుమతి, కాస్తా విడతీస్తూనే.
శ్రీరాజ్ అయోమయంగా చూస్తున్నాడు.
"నువ్వు కెమిస్ట్రీ సబ్జెక్ట్ పేవరెట్టువేగా" అంది మధుమతి, చిన్నగా.
"ఓ, ఓటు ... ఓకెఓకే." అన్నాడు శ్రీరాజ్.
"చాల్లే. ఇప్పుడు చెప్పు, నేను ఏమన్నాను. నువ్వు నా ... వి. అని కదా. ఆ డేష్లో ఏమిటి" అడిగింది మధుమతి.
"ఓటు" అన్నాడు శ్రీరాజ్.
నవ్వింది మధుమతి.
"ఓ నేను నీ అక్సిజన్న్నా. ఓ మై గాడ్. థాంక్యూ" అని అన్నాడు శ్రీరాజ్.
మధుమతి నవ్వుతూనే ఉంది.
తర్వాత, బిల్లు శ్రీరాజ్ చెల్లించాడు.
ఇద్దరూ బయటకు వచ్చేరు.
"రేపు సండే. మా తాత మీ ఇంటికి వస్తున్నారు. మీ నాన్నగారు ఉంటారుగా" అడిగాడు శ్రీరాజ్.
"రేపు ఈవినింగ్ బయటకు వెళ్లాలనుకున్నాం. ఉదయం ఉంటారు. మీ తాతగారు వస్తున్నారా. నువ్వూ వస్తున్నావా." అడిగింది మధుమతి, కుతూహలంగా.
"నేను రాను. ముందు మా తాత వస్తారట. మన గురించి మాట్లాడతారు" చెప్పాడు శ్రీరాజ్.
"అవునా. మన గురించి మీ వాళ్లతో మాట్లాడేవా" అడిగింది మధుమతి, సంతోషంగా.
"మామూలుగానే మాట్లాడాను. మా తాత మాత్రం మన పెళ్లికి ప్రపోజల్ చేశారు" చెప్పాడు శ్రీరాజ్.
"ఐతే నేనూ నీకు చెప్పాలి. ముందు నుంచి మా నాన్నకు నీ విషయాలు చెప్తున్నాను నేను. నా మాటలుతో, ఆయన, నిన్ను నేను ప్రేమిస్తున్నానని గుర్తించేశారు. తను హెచ్చరించారు కూడా. నీ వైపు నుండి గ్రీన్ సిగ్నేల్ లేనిదే ఏమీ తొందరపడొద్దని కూడా చెప్పారు. నీ వైపు నుండి సవ్యమైతేనే, తను వచ్చి, మీ పెద్దల్ని కలిసి మాట్లాడతానన్నారు కూడా. నీ నుండి నాకు సరైనది ఏదీ తెలియక, నేనూ అడగలేక, తికమక పడుతున్నాను." అని చెప్పింది మధుమతి.
"అహా, అన్నీ కలిసొస్తున్నాయే. మా అమ్మమ్మ అన్నది నిజంలా ఉంది" అని చెప్పాడు శ్రీరాజ్.
"అమ్మమ్మా. ఏమన్నారు" అడిగింది మధుమతి.
"మనిద్దరికీ వ్రాసి పెట్టి ఉందేమో అని. అందుకే ఈ మాటలు జరుగు తున్నాయి అని" అని చెప్పాడు శ్రీరాజ్.
"నమ్ముతావా" అని అడిగింది మధుమతి.
"జరుగుతున్నాయిగా. నమ్మాలి" అన్నాడు శ్రీరాజ్.
"ఐతే ముందు మా నాన్నకు చెప్పి, ఆయనను పంపనా" అడిగింది మధుమతి.
"వద్దులే. మా తాత వస్తామన్నారుగా. తనే రానీ. ఐనా ఎవరైతే ఏం. విషయం ఒకటేగా" అన్నాడు శ్రీరాజ్.
మధుమతి చక్కగా నవ్వింది, "అవునా" అంటూనే.
"కాదా మరి" అన్నాడు టక్కున శ్రీరాజ్.
"అవునవునవును" అని అంది మధుమతి, గబుక్కున.
"అయ్యో, ఏమిటా గాభరా" అడిగాడు శ్రీరాజ్.
"నీ చెంతకు చేరిపోవాలని" అని చెప్పింది మధుమతి, మురిపెంగా.
నవ్వేడు శ్రీరాజ్, పసందుగా.
ఆ పిమ్మట, అక్కడ నుండి, కారులో శ్రీరాజ్, స్కూటీ మీద మధుమతి, తమ తమ ఇళ్లకు బయలుదేరారు, ఖుషీతో.


***

పరిచయాలు ముగిశాయి.
అప్పుడే, కృష్ణమూర్తి, "నా భార్య అన్నయ్య పేరూ సుబ్బారావే" అన్నాడు, మధుమతి తండ్రి సుబ్బారావుతో.
హాలులో ఆ ముగ్గురూ కూర్చుని ఉన్నారు.
"చెప్పండి సార్" అన్నాడు సుబ్బారావు, చిన్నగా.
కృష్ణమూర్తి, "మాట్లాడతాను. తల్లీ ప్రస్తుతం నాన్నతోనే మాట్లాడాలి" అని చెప్పాడు, తన చేతిలోని ఖాళీ కాఫీ కప్పును టీపాయ్ మీద పెడుతూ.
"షూర్ షూర్" అంటూ మధుమతి అక్కడ నుండి వెళ్లిపోయింది, నవ్వుకుంటూ.
అక్కడ, ఇప్పుడు, ఆ ఇద్దరే ఉన్నారు.
"శ్రీరాజ్, మధుమతిల పెళ్లికై మాట్లాడాలి" అని అంటూన్న కృష్ణమూర్తికి అడ్డు తగిలి,
"ముందు నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్" అని చెప్పాడు సుబ్బారావు, నెమ్మదిగా.
కృష్ణమూర్తి ఆగాడు.
"నాది నా భార్యది లవ్ మ్యారేజీ. మా ఇరువైపుల వారూ సంప్రదాయం కాదని మా పెళ్లికి అడ్డు పడ్డారు. కానీ, మేము వాళ్ల నుండి బయటకు వచ్చేశాం. రిజిస్ట్ర్డ్ మ్యారేజీ చేసుకున్నాం. మా అమ్మాయి మా ఇద్దరి బిడ్డ. అంతే." అని ఆగాడు సుబ్బారావు.
ఆ సమయంలోనే, కృష్ణమూర్తి, "అది చాలు. పైగా అదే సరైన గుర్తింపు. సో, నేను ఇక మాట్లాడతాను. మా అరుణ, అదే, శ్రీరాజ్ తల్లి, పెళ్లికీ మేము ఇవేవీ పరిగణలోకి తీసుకోలేదు. ఒక పెళ్లికి, ఆడ, మగ, వావి, వరస తప్ప మిగతావేవీ అనవసరం అని నమ్మేవాళ్లం మేము. ఆ కోవకు చెందిన వాడే, మా అల్లుడు, చంద్ర, అంటే శ్రీరాజ్ తండ్రి. అతని కుటుంబం కూడా అంతే. సో, మేమంతా హాఫీ. అదే ముందుగా మీతో నేను చెప్పతలిచాను. కానీ, మీరే, మీ గురించిన ఆ విషయం ముందుగా కదిపేరు. మేము దానిని స్వాగతిస్తున్నాం. అది అడ్డు కానే కాదు అని చెప్పుతున్నాను. సరేనా. ఇంకేమైనా ఉంటే చెప్పండి" అన్నాడు.
"నేను సామాన్యమైన కుటుంబీకుడ్ని. ఉండడానికి ఈ ఇల్లు, బ్రతకడానికి జీతం, ఆ పై వచ్చే పెన్షన్. అంతే. కానీ అమ్మాయి మధుమతికై కొంత మొత్తం కూడతీశాను." అని చెప్పాడు సుబ్బారావు.
"ముందే మనవి చేశానుగా సుబ్బారావు గారూ, ఒక పెళ్లికి, మాకు ఏముంటే చాలో అని" అని అన్నాడు కృష్ణమూర్తి, నవ్వుతూ.
సుబ్బారావు ఇంకా ఏమీ అనలేదు.
అప్పుడే, కృష్ణమూర్తి, "సుబ్బారావు గారూ, ఇచ్చిపుచ్చుకోవాలి, చేసి తీరాలి, వగైరాలు లాంటివి వీడాలి. ఆధునికాన్ని ఆహ్వానిస్తూనే, అనాలోచితంగా ఇంకా వ్యవహరిస్తే ఎలా. ఇది సరి కాదు కదా. హద్దు మీరని ప్రతిదీ ఆనంద మయమే. ఇది నా, కాదు, మా భావన, మా అనుభవం కూడా. సో, మీరు, నో, మనం, పిల్లల ఇంటరెస్ట్ని గుర్తించి, వారికి పెళ్ళి జరిపిద్దాం. ఏమంటారు." అని అడిగాడు.
సుబ్బారావు లేచి, నిల్చున్నాడు. నమస్కరించాడు.
కృష్ణమూర్తీ గమ్మున లేచాడు. నమస్కరించాడు.
ఆ పిమ్మట, ఆ ఇద్దరూ కౌగిలించుకున్నారు, ఆనందంగా.


***

ఆ తర్వాత, సరిగ్గా 45 రోజులు గడిచాయి.
శ్రీరాజ్, మధుమతిలకు రిజిస్ట్ర్డ్ మ్యారేజీ జరపబడింది.
దానికి ముఖ్యులంతా హాజరయ్యారు, వేడుకగా.


***


కాల గమనంలో మరో యేడు వచ్చి, నాలుగు నెలలు దాటేసి, సాఫీగా నడుస్తోంది.
ఆ సాయంకాలం పూట -
ప్రత్యేక సమావేశం నిర్వహింపబడుతోంది, అక్కడ.
శ్రీరాజ్ను అందరూ కొనియాడుతున్నారు.
అతను రూపొందించిన పేపర్స్, చరిత్ర పుటల్లో సగర్వంగా నిలపబడ్డాయి.
చివరిగా, శ్రీరాజ్ మాట్లాడుతూ, "సో హాఫీ. నేను చేపట్టింది ఇంత వరకు టెక్స్ట్ మెథడ్లో పెద్దలంతా వివరించారు. అది కొద్ది మందికే అర్ధమై ఉంటుంది. సో, నేను మాత్రం ఈ ఇన్వెస్ట్గేషన్ని అంతటికీ, అందరికీ అందించడం కోసమే చేశాను. సో, అందుకే, అది, అర్ధమయ్యేలా వివరిస్తున్నాను, ఇప్పుడు. మన చుట్టూ ఎన్నో విధాలుగా కాలుష్యం ఆవరించి ఉంది. దీనిని మాపడం ఇక బహు కష్టం. సో, ఈ కాలుష్య ప్రభావం మనలో లేమి అవుటకు వీలుగా, నేను ఒక టాబ్లెట్ ఫార్ములాని రూపొందించాను. అదే ఆ థీరిటికల్ పేపర్సు సారాంశం. అది గుర్తింపు బడింది. సో, ఇక అందరికీ అది అందుబాటు లోకి తీసుకు రాబడుతోంది త్వరలో. ఇక, అది రెండు ఎలిమేట్స్, అదే, సింపుల్గా ఐతే, రెండు కాన్సెప్ట్స్ మిశ్రమం తో ఏర్పడింది. ఆ రెండు ఏమిటంటే, ఒకటోది, అవసరం, మన జీవంకు కావలసినది మాత్రమే మన శరీరానికి చేకూరుస్తోంది, రెండోది, అనవసరం, మన శరీరంలో చేరకూడని, ఉండకూడని వాటిని హరిస్తోంది. ఇది నా ఈ టాబ్లెట్ సారాంశం. దీనిని టాబ్లెట్ అంటున్నా, ఇది ఒక ఆహార పదార్ధంగా వినియోగించేలా చూడ తలుస్తున్నాను. దీనికి అవసరమైన, కావాలసిన పరీక్షలు ఎన్నో జరిగాయి అని, జరిపాము అని, అన్నింటా సత్ఫలితాలు వచ్చాయి అని ఈ పెద్దలు ఏకగ్రీవంగా చెప్పి ఉన్నారు. కనుక, నా ఆశ, ఆశయం మనకు త్వరలో చేరువవుతోంది. అలాగే, దీనికి ఒక పేరు కూడా పెట్టి ఉన్నాను. నా కోరిక మేరకు, ఈ పెద్దలు దానిని వెల్లడి చేయక, నన్నే దానిని చెప్పమని నాకు అనుమతి ఇచ్చారు. వారికి ధన్యవాదాలు చెప్పుతూ, ఈ నా టాబ్లెట్కు నేను పెట్టిన పేరు, మీ అందరి సమక్షంన వెల్లడి చేస్తున్నాను, మిక్కిలి, ఆనందంతో. దీని పేరు, ఆఁ, దానికి ముందు, మరి కొద్ది వివరణ. అది, నా ఈ ఉన్నతికి ఆసరా నా ఉనికి. ఆ నా ఉనికికి కారణం, నా పుట్టుక. ఆ నా పుట్టుకకు కారణం, నా తల్లిదండ్రులు. సో, ఈ నా టాబ్లెట్కు పేరు, అరుణ చంద్ర, థట్సు ఇట్." అని ముగించేశాడు.
అంతే, ఆ పరిసరాలే కాదు, ఈ కార్యక్రమం, టివి లైవ్ అవుతూన్న ప్రతి చోట, చప్పట్ల హోరు ఎగిసి పడింది, ఆనందాల కేళిగా.

***

(ముగిసినది)