Read Adi Pita - 1 by Bk swan and lotus translators in Telugu జీవిత చరిత్ర | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆది పిత - 1

ఓంశాంతి.. భగవద్భంధువులారా... ఆత్మిక, ఆత్మీయ సోదర సోదరీ మణులారా ... ఒక మహాద్భుతమైన ఘనతను సాధించిన ఈ మహా యుగ పురుషుని యదార్ధ జీవిత గాధను పఠించి పులకించి తరించనున్న మీ అందరికీ ముందుగా మనః పూర్వక అభినందనలు ... హృదయ పూర్వక శుభాకాంక్షలు .

సర్వ సాధారణంగా ప్రతి మానవుని జీవితం లో గడిచిపోయినా కాలాన్ని గతం అంటారు 'గతం గతః' అని మర్చి పొమ్మంటారు. కానీ కొందరి గతాన్ని మాత్రం మనం ఇప్పటికీ చరిత్రగా చదువుకుంటున్నాం. అంతే కాక ఆ మహనీయుల జీవన విధానాలను నిత్య జీవితం లో ఆచరించటం ద్వారా ఆ మహనీయుల సమానంగా కావాలన్న శ్రేష్ఠ సంకల్పం నిరంతరం చేస్తూనే వున్నాం. ఇది ఎంతగానో అభినందించదగిన విషయం.వాస్తవానికి ప్రతి మానవుని అంతరంగం లో ఎన్నో దివ్య గుణాలు,మరెన్నో ప్రత్యేకమైన విశేషతలు.. ముత్యపు చిప్ప లో దాగిన ముత్యాలవలె సాగర గర్భం లో నిక్షిప్తమైన మణి మాణిక్యాల వలె వజ్ర వైఢూర్యాల వలె దాగి ఉంటాయి . మీరు వాటన్నింటిని ఏర్చి, పేర్చి, కూర్చి వైజయంతి మాలగా మార్చుకోవటాన్నికి మేము చేసిన ఈ ప్రయత్నం మీకు సంపూర్ణంగా సహరిస్తుందని ఆశిస్తున్నాం
ఇప్పటి వరకూ మనం ఎందరో మహాత్మలు, పుణ్యాత్మలు, పూజ్యాత్మలు అయిన మహనీయుల జీవిత గాధలను వింటూ వచ్చాము.
వీరంతా తమ బోధనల ద్వారా.... శోధనల ద్వారా.... జీవన విధానాల ద్వారా ఈ సమాజాన్ని ఒక మహోన్నత స్థాయి లోకి తీసుకు రావాలన్న
ప్రయత్నం తమ జీవితాంతం చేశారు. కానీ వాటిని స్థాయి లో ఆచరణ లోనికి తీసుకుని రాలేక పోయారు . ఐతే మేము ప్రస్తుతం మీముందుకు తీసుకు వస్తున్న ఈ దివ్య పురుషుని జీవిత వాటన్నింటికన్నా భిన్నమైనది. అద్భుతమైనది.ఈ చరిత్ర గలిగిన వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆర్తత్రాణ పరాయణులు , అంటే కాక స్వయంగా పరమ పీత శివ పరమాత్మ వీరి తనువందు దివ్య అవతరణ గావించి సృష్టి పరివర్తనా కార్యాన్ని అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు... ఇది మానవ జీవన లక్ష్యమైన సంపూర్ణ స్థితికి చేరుకున్న వారి యదార్ధ జీవన గాధ . వీరి ద్వారా పరమాత్మ చేస్తున్న అద్భుతాలను ప్రత్యక్షంగా మేము అనునిత్యం ఆస్వాదిస్తున్నాము.ఈ అనిర్వచనీయ ఆనందానుభూతి లో పాల్గొనమని మిమ్మల్నీ ఆహ్వానిస్తున్నాము. వినటానికి నమ్మశక్యం కానంత ఆశ్చర్యకర విషయంలా కనిపించినా ... .. ఇది నిజంగా నిజం! కాబట్టి పాఠకులు
ఈ కధనాన్ని పూర్తిగా పఠించాకే ఒక నిర్ణయానికి రాగలరని మా మనవి.

వీరిని అందరూ స్నేహ పూర్వకముగా 'దాదా' అని పిలిచేవారు. కానీ,పరమ పిత పరమాత్మ ప్రవేశించాకా వీరికి 'ప్రజా పిత బ్రహ్మా'గా దివ్య కర్తవ్య నామాన్నొసగారు. . వీరినందరూ 'బ్రహ్మా బాబా' ,'బాబా' అంటూ గౌరవంగా పిలిచేవారు.
మరి త్రికాల దర్శి , సర్వజ్ఞులు ఐన పరమాత్మ ఇక్కడున్న కోటానుకోట్ల మానవులలో వీరినే తన మాధ్యమంగా ఎన్నుకోవడానికి గల కారణాన్ని స్వయంగా
ఆ పరమాత్ముడే వివరించారు ఇందుకోసం వారు దాదాగారి సంపూర్ణ జన్మల వృత్తాంతాన్ని తెలియచేసారు . వాటిని ప్రస్తుతానికి వదిలి వేసి , దాదా వర్తమాన జీవితాన్ని పరిశీలించినా చాలు.. వారు కచ్చితంగా అద్భుతమైన వ్యక్తిత్వంగల వ్యక్తి అని తెలుస్తుంది.
దాదాగారి శరీర సౌష్టవం మధుర వ్యక్తిత్వం సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని తలపించేవి. ఈ విశేషత కారణంగా అందరికీ వారి పట్ల విశేష గౌరవం ఉండేది. ఆ సుగుణాలు విశేషతలే వారిని నిజంగా నారాయణునిగా మార్చాయి.
దాదాకు బాహ్య, ఆంతరంగిక సౌందర్యాలు రెండూ జన్మతః ప్రాప్తిచాయి. తెల్లని శరీర వర్ణం కాంతులీను మోము గంభీరమైన సమతుల్యమైన దేహధారుడ్యం
ఉన్న కారణంగా వారిని చూసిన ప్రతి ఒక్కరికీ స్నేహ భావం కలిగేది. వారు ససామాన్యునిగా కనిపించినా నడకలో... నడవడికలో ..రాచ ఠీవీ స్పష్టంగా
కనిపిస్తుండేది. సదా సర్వుల పట్ల సద్భావనను కలిగి ఎల్లపుడూ అందరి క్షేమాన్నే కాంక్షించడం , ఇందుకోసమే ఆ సర్వేశ్వరుడిని ప్రార్ధించడం దాదాలోని మరో విశేష సుగుణం. వారిలో జాతి ,మతం,ప్రాంతం వంటి సంకుచిత భావాలు లవలేశమంతైనా ఉండేవి కాదు. అందుకే పరమాత్మ కూడా తన సంతానమైన విశ్వాత్మల ఉద్ధరణ కోసం తన లాంటి గుణాలే ఉన్న బ్రహ్మ బాబా అనగా దాదా తనువులో అవతరించారు.
అలాగే, వారి బుద్ధి కుశలత కూడా ఎంతో దివ్యంగా ఉండేది. అందువల్లనే సామాన్య కుటుంబంలో జన్మించినా తన అసాధారణ అద్వితీయ మేధస్సుని ఉపయోగించి మెరుపు వేగంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు. వజ్రాల వ్యాపారం ఎంతో ఉన్నతమైనది. ఎందుకంటే మేలైన వజ్రాలు గుర్తించే శక్తి అందరికీ ఉండదు.దాదా వజ్రాన్ని చూసిన వెంటనే దాని సరైన వెలను చెప్పేసేవారు. తనలోని ఈ విశేష ప్రతిభ కారణంగానే దాదా ప్రముఖ వజ్రాల వ్యాపారిగా ఎదిగారు. పరమాత్మ కూడా గువ్వల్లా విలువ హీనమైన మన జీవితాలను వజ్రతుల్యంగా మార్చటం కోసం దాదా లో అవతరించారు. దాదా అచంచలమైన భక్తి ప్రపత్తులు ఉన్న వ్యక్తి.. నియమ నిష్ఠలు గలవారు. జీవితం లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన సదాచారాన్నీ, సద్వ్యవహారాన్నీ ఏనాడూ వదలలేదు. తన శ్రేష్ఠ వ్యక్తిత్వం తో రాజులకూ పుర ప్రముఖులకూ సమ ఉజ్జీగా నిలిచారు. వ్వారి నిజాయితీని అందరూ విశ్వసించేవారు.. ఎవ్వరూ శంకించే వారు కాదు. ఈ సత్యత కారణంగానే' సత్యం శివమ్ సుందరం'గా కీర్తించబడే పరమాత్మను వీరి తనువులో అవతరించేలా చేసింది.

వజ్రాన్ని ఏ కోణం నుంచి చూసినా వజ్రమే. అలాగే దాదా జీవితాన్ని ఎటు వైపు నుంచి చూసినా మహోన్నతమే. ఈ మహనీయుని జీవిత చరిత్ర తెలుసుకోవడం వలన మన జీవితం లో అనేక దివ్య గుణాల ధారణ జరుగుతుంది. జీవితం పవిత్రమవుతుంది. ఈ వృత్తాంతం విన్నవారి జీవితంలో సుఖ శాంతులు వెల్లి విరిసి సన్మార్గము లో పయనించును.

ఇది షుమారు 80 సంవత్సరాల నాటి మాట.అది ఆంగ్లేయుల పాలన మన దేశం లో జరుగుతున్న సమయం. ఆనాటి అవిభాజ్య భారత దేశం లోని సింధు ప్రాంత పరిస్థితి చాలా దిగజారి పోయి ఉండేది. పాశ్చాస్త్య సంస్కృతి ప్రభావం వలన ప్రజల ఆహార వ్యవహహారాల లో భ్రష్టత్వం తమో ప్రధానత ఏర్పడింది. ఒక వైపు
భక్తి మార్గాన్ని అవలంభిస్తున్నా మనసు విషయ వికారాలతో మమేకమై ఉండేది. వృధా ఖర్చులు విపరీతంగా జరిగేవి. పూజారులూ, పండితులూ,ఉపదేశకులూ ఉపన్యాసాలకు పరిమితమయ్యారు. కానీ,ప్రజల జీవితాలను పునీతం చేసే జ్ఞానాన్ని ఎప్పుడూ ప్రబోధించలేదు.

స్త్రీల పరిస్థితి మరింత అధ్వానంగా ఉండేది. పురుషాహంకారానికీ వారి కామ వికార వికృత దాహానికీ బలై .....మేలి ముసుగులో
తల దాచుకుని నాలుగు గోడల మధ్యన నలిగిపోతూ బందీలుగా కాలం వెళ్లబుచ్చేవారు. ఘోర కలి యుగంలో మనో వికారాలు బంధనం లో బంధింపబడి ఆత్మళ్లన్నీ నిర్లక్ష్యపు నిద్ర లో జోగుతున్న సమయమది. ఇటు వంటి వాతావరణం లోనే సింధ్ హైదరాబాదు లో ఒక ప్రత్యేకమైన,ఉన్నతమైన వ్యక్తిత్వం గల వ్యక్తి ఉండేవారు. వారిని అందరూ 'దాదా' అని పిలిచేవారు.
ఆయన పూర్తి పేరు 'దాదా లేఖ రాజ్'. వారి జననం 1876న అవిభాజ్య భారత దేశం లోని సింధు ప్రాంతం లో కృపాలాని వంశంలో వల్లభాచార్య సంప్రదాయానికి చెందిన కుటుంబం లో జరిగింది. దాదా గారి తండ్రి పాఠాశాల ప్రధానాధ్యాపకులు. వారిది మధ్య తరగతి కుటుంబము. దాదా చిన్ననాటినుండే విలక్షణమైన ఆలోచనా సరళిని కలిగి వుండి, అందరి లోనూ తన ప్రత్యేకతను చాటుకునే వారు.
ఇందుకు ఒక చిన్న ఉదాహరణ... ఒకసారి దాదా ఆడుకోవాలని మిత్రుల తో కలసి ఒక తోట లోకి వెళ్లారు. దాదా మిత్రులు అక్కడ ఉన్న పువ్వుల అందం చూశా సంతోషిస్తుంటే... లేఖరాజ్ వారితో ఇలా అన్నారు.... " మిత్రుల ఇలా రండి నా మాటలను వినండి. కేవలం ఈ పువ్వుల అందాలన్నీ చూసి ఆనందించటం తోనే సరి పెట్టుకోకండి. ఈ పరిమళ భరితమైన కుసుమాల్లా స్నేహ సుగంధాన్నీ ఈ పువ్వుల లో దాగున్న తేనె లా ఆత్మీయ మకరందాన్నీఇవ్వండి.. " అని.
ఆహా!... అంత చిన్న వయసులోనే ఎంతటి ఆత్మిక చింతన. దాదా లోని ఈ అలౌకిక గుణమే పంచతత్వాలకూ అతీతులైన పారాలౌకిక నివాసి పరమ పిత పరమాత్మను దాదాలో అవతరించేంతగా ఆకర్షించింది.
కానీ విధి విచిత్రమైనది. లేఖ రాజ్ చిన్నతనం లోనే, వారి తండ్రిగారు కాలం చేశారు. ఇది జరిగిన కొద్దీ కాలానికే వారి తల్లిగారు కూడా తనువు చాలించారు. అందువలన దాదా కొన్నేళ్ళపాటు వారి అన్నయ్యల ఇంట్లో ఉన్నారు. దాదా సోదరులది గోధుమల వ్యాపారం ఆ వ్యాపారం లో దాదా వారికి సహాయకులుగా ఉండేవారు.
చిన్నతనం నుండే దాదా లో జాలీ,దయ చాలా ఎక్కువగా ఉండేవి. వీటి తో పాటు నీతీ-నిజాయితీ కూడా ఉండేవి.అవినీతి మార్గం లో అక్రమార్జనకు అలవాటుపడిన
దాదా సోదరులకు దాదా పద్ధతులు నచ్చక బయటకు పంపించారు. ఇనాకానీ స్థిత ప్రజ్ఞులైన దాదా నిరాశ చెందక సొంతంగా గోధుమల వ్యాపారం ప్రారంభించి ఆనతికాలం లోనే సుప్రసిద్ధ వజ్రాల వ్యాపారిగా ఎదిగారు.

"నింగి నిండా నక్షత్రాలు ఎన్నో ఉంటాయి. అవేవీ చంద్రుని వెన్నెలకు సాటి రావు". అలాగే వ్యాపారస్తులు ఎందరు ఉన్నా డాడాతొహ్ పోటీ పడలేక పోయారు.
వ్యాపారం లో నమ్మకానికి దాదా మారు పేరుగా ఉండేవారు. ధనికులూ, సామాన్యులు అన్న బేధ భావం లేక అందరినీ మర్యాదగా చూసేవారు. దాదా గారి భార్య యశోదా దేవి . అన్నివిధాలా దాదాకు తగిన ఇల్లాలు... వారికి ఐదుగురు సంతానం. పుట్టుక తోటే కన్నవారి గుణ గణాలను పుణికి పుచ్చుకున్నారు. మల్లెల కన్నా తెల్లనైన నవ్వులతో యిట్టె ఆకర్షించే చూపులతో.. చిన్నతనం లోనే చతురతను ప్రదర్శించి అందర్నీ మెప్పించారు.
వజ్రాల వ్యాపారం కారణంగా దాదాకు ఎందరో రాజులతో, వైస్రాయిలతో,జమీందారులతో, సంపన్నుల తో వ్యాపార కార్య కలాపాలు సాగుతుండేవి.ఎవరి అనుమతీ ల్లేకుండానే దాదా నేరుగా రాజా మహల్లోకీ,అంతఃపురం లోకీ ప్రవేసించేవారు.నగలను కొనుగోలుచేయుడానికి 'రాజమాత' వారిని నేరుగా ఆహ్వానించే వారు. ఇతర వ్యాపారస్తులైతే మాత్రం ముందస్తు అనుమతి తీసుకుని అనేక తనిఖీలు ఎదుర్కొని ......... ప్రధాన రాజోద్యోగులకే ఆభరణాలను అప్పగించి వెనుదిరిగేవారు. కానీ దాదాను రాజులే స్వయంగా ఆహ్వానించేవారు. వారు వచ్చిన తరువాత ప్రత్యేక ఆసనం ఇచ్చి గౌరవించే వారు. వీరిలో విశేషంగా ఉదయ్ పూర్ మహారాజుకు దాదా పట్ల ప్రత్యేకమైన అభిమానము ఉండేది. ఇందుకు ఒక చిన్న ఉదాహరణ......
ఒక సారి దాదా తన కుటుంబం తో కలిసి ఉదయ్ పూర్ రాజావారి ఆహ్వానం మేరకు వారి రాజా మహల్లో విడిది చేశారు.
ఆ రోజు రాజావారు సభను ఆరంభించబోతున్నారు... ఇంతలో దాదా ఒక్కరే సభలో ఆసీనులై ఉండటాన్ని రాజావారు గమనించారు. దాదా కుటుంబ సభ్యులెవ్వరూ రాక పోవటానికి గల కారణాన్ని ఆరా తీయగా...... వారు శ్రీనాధ్ దేవాలయాన్ని దర్శించుకునే ఉద్దేశ్యం తో ఉన్నారని తెలిసింది. ఈ సంగతి తెలుసుకున్న రాజావారు
సభను నిలిపివేశారు. దాదా కుటుంబ సభ్యులను మేళ తాళాలతో.. సాదరంగా.. సగౌరవంగా .. సభ లోనికి ఆహ్వానించారు. సభ ముగిసిన తరువాత రాజా వారే స్వయంగా తన స్వంత 'కారు' ఇచ్చి శ్రీ నాథ్ యాత్రకు పంపించారు. ఇంతటి అపూర్వ సంఘటన
'ఉదయ్ పూర్' రాజవంశ చరిత్రలో మునుపెన్నడూ జరగ లేదు.
........ఇంకా వుంది