Read Adi Pita - 2 by Bk swan and lotus translators in Telugu జీవిత చరిత్ర | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆది పిత - 2

దాదా ప్రతి నిత్యం గీతా పఠనం చేసేవారు. ఆ తరువాతే తన దినచర్య ప్రారంభించేవారు. వారు అమర్ నాధ్ , బద్రీనాధ్, ప్రయాగ,కాశీ, .... వంటి యాత్రలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేశారు. వారికి గురువులన్నా సాధువులన్నా అపార గౌరవం. దాదాకు పన్నెండుగురు గురువులు ఉండేవారు. వారందరి పట్లా దాదా అచంచలమైన భక్తి,విశ్వాసాలను ... గౌరవ మర్యాదలను కలిగి ఉండేవారు. వారి రాక సందర్భంగా.... స్వాగత సత్కారాల కోసం.... అలాగే,వసతి ఏర్పాట్ల కోసం ఆ రోజుల్లోనే లక్షల రూపాయలు ఏ మాత్రం వెనకాడకుండా వెచ్చించేవారు. వారి ప్రతి మాటనూ ఆజ్ఞగా తలచి తక్షణమే శిరసావహించేవారు. దాదా ఇంట్లో ప్రతి రోజూ సత్సంగం
జరుగుతుండేది. అందులో దాదా విధిగా హాజరయ్యేవారు. దాదా తన కుమార్తెల వివాహాలను కూడా భక్తి ప్రపత్తులు కల వారి కుమారులతోనే చేశారు... ఆ సందర్భంగా ఇచ్చే కానుకలతోపాటు భగవద్గీతను ఒక చిన్న వెండి మందిరం లో ఉంచి బహూకరించేవారు. దాదాగారి పినతండ్రి పేరు కాకా మూల్ చంద్. ఆయనఒక ప్రముఖ ఏనుగు దంతాల వ్యాపారి. 'బాబాయి-అబ్బాయి'లిద్దరికీ దాన గుణం వున్నా కారణంగా ఇద్దరూ కలసి తరచుగా దాన ధర్మాలు చేసేవారు.
సోదర సోదరీ మణులారా.... మన దాదాగారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఎంతో ఆదర్శప్రాయమైనది.
అనుక్షణం అనుసరించదగినది. వజ్రాల హారం లో వుండేవన్నీ వజ్రాలే... అలాగే పరమ శ్రేష్ఠమైన దాదాగారి జీవితంలో జరిగిన ప్రతి సంఘటనా ఎంతో శ్రేష్టమైనది అత్యంత ఉత్కృష్టమైనది. కానీ సమయాభావం వలన కొన్ని సంఘటనలను మాత్రమే అందించగలుగుతున్నాము.
ఒక రోజు దాదా తన వ్యాపారకేంద్రం లో కూర్చొని వజ్రాలను పరిశీలిస్తున్నారు. అదే సమయానికి మరొక కార్యార్థమై వారు వేరొక చోటికి వెళ్లవలిసి వచ్చింది. దాదా ఆ వజ్రాలను దుకాణం లోనే వదిలి వెళ్లారు. తన దగ్గర పనిచేసేవారిని దాదా అంతగా నమ్మేవారు.దాదా బయటకు వెళ్ళాక ఒక స్వర్ణకారుడు తన పిల్లల తో అక్కడకు ఒక పని నిమిత్తమై వచ్చారు. అమాయకులైన ఆ పిల్లలు పసితనం కారణంగా అక్కడ దాదా వదిలి వెళ్లిన వజ్రాలను తీసి జేబు లో వేసుకున్నారు. ఈ విషయం ఆ పిల్లల తండ్రి తో సహా అక్కడున్న వారెవ్వరూ గమనించలేదు. కనుక ఎవ్వరికీ ఈ సంగతి తెలియదు. ఆ స్వర్ణకారుడూ అతని పిల్లలూ వెళ్ళిపోయిన కొద్దీ సేపటికి దాదా తిరిగి దుకాణానికి వచ్చారు.. రావడం తోనేవజ్రాలు కనిపించక పోవడాన్ని గమనించారు. ఐనా కానీదాదాఎవ్వరినీఅనుమానించలేదు,అవమానించలేదు, నిందించలేదు,
అక్కడున్న వారి లో ఒక్కరినైనా బాధించే మాట ఒక్కటి కూడా అనలేదు. "నేను లేని సమయం లో ఇక్కడికి ఎవరైనా వచ్చారా ? " ... అని మాత్రమే అడిగారు. దుకాణం లో పని చేసే వారి ద్వారా జరిగిన సంగతి తెలుసుకున్న దాదా ఆ స్వర్ణ కారుని ఇంటికి బయలుదేరారు. వెల్తూ వెల్తూ తన వెంట అనేక రకాల మిఠాయిలూ,బొమ్మలూ తీసుకు వెళ్లారు. వాటిని ఆ పిల్లలకు ఇచ్చి ఎంతోప్రేమగా నచ్చ చెప్పి వజ్రాలను తీసుకొచ్చారు. జరిగిన విషయాన్ని ఆ పిల్లల తండ్రికి కూడానా చెప్పలేదు.
'కొమ్మ విరగకుండా పూలు కోయడం' అంటే ఇదే. దాదా లో ఉన్న ఈ సౌమ్య గుణమే... సోమ నాధుడైన శివ పరమాత్మను ఆకర్షించింది.
ఒక సారి దాదాగారి అత్తయ్యగారు దాదా ఇంటికి వచ్చారు ఆవిడ దాదా భార్య యశోదగారి పెంపుడు తల్లి. బయటకు వెళ్లే తొందరలో ఉన్న దాదా తన భార్య తో " యశోదా! నీ పెంపుడు తల్లి వచ్చారు." అని చెప్పి బయటకు వెళ్లి పోయారు. బయటకు వెళ్లిన కొంత సేపటికి తాను తొందరపాటుతో అన్న ఆ మాట గుర్తుకువచ్చి ఎంతో మాధానపడ్డారు... ఆ బాధ తో వారు ఆ రాత్రి భోజనం చేయలేక పోయారు. మరుసటి రోజు తానె స్వయంగా అతన అత్తగారి ఇంటికి వీలు జరిగిన పొరపాటుకు పడే పడే క్షమాపణ చెప్పి తేలిక పడ్డారు.
ఈ విధంగా దాదా తన వలన ఏ చిన్న పొరపాటు జరిగినా, అందుకు క్షమాపణ చెప్పేందుకు వెనుకాడేవారుకాదు. దాదాలోని ఈ గుణమే క్షమా సాగరులైన పరమాత్మను ఆకర్షించింది. ఒక సారి దాదా ఒక వ్యక్తికి దానం చేస్తుండటాన్ని ఆయన కుమార్తె చూసారు. పిన్నవయస్కురాలైన ఆమె "ఇలా ఎందుకు చేస్తున్నారు ?" అని అడిగారు.
"ఇలా చేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది." అని దాదా ఆమెకు బదులిచ్చారు.. అది విని ఆమె కూడా ఆ వ్యక్తికి తన బంగారు గాజులు ఇచ్చారు. ఆ వ్యక్తి తీసుకోవడానికి సంకోచిస్తుంటే, బలవంతంగా అతని చేతి లో పెట్టి వెళ్లి పోయారు. ఆ తరువాత ఆ వ్యక్తి తిరిగి వచ్చి దాదాకు ఆ గాజులు తిరిగి ఇవ్వబోగా..... "ఒక సారి దానం చేసిన వస్తువు తిరిగి తీసుకోకూడదు. " అని చెప్పి పంపించారు. ఈ విధంగా దాదా తన పిల్లలకు పసి వయసు లోనే దానగుణాన్ని అలవరచారు.
ఇలా రోజులు గడవ సాగాయి కాల చక్రం గిర్రున తిరగ సాగింది....... దాదాకు 60 సంవత్సరాల వయసు రాగానే ఆయన సతీమణి " ఇక సంపాదించింది చాలు.ఇప్పుడు వానప్రస్థులమవుదాము." అని అనగా "మరి కాస్త ధనాన్ని సంపాదించనీ... ఇంకా సమయం ఉంది. " అని దాదా అన్నారు. కానీ ఆ పరమాత్ముని ప్రణాళిక మరో విధంగా వుంది . అందుకు తగ్గట్టుగానే దాదా ఆలోచనా విధానం లో మార్పు రాసాగింది. వారు క్రమక్రమంగా ఏకాంతాన్ని ఇష్టపడసాగారు. ఎక్కువ సమయం మౌనంగా ఉండేవారు.
ఇలా రోజులు గడుస్తుండగా... ఒక సారి వ్యాపార నిమిత్తం ముంబాయి వెళ్లిన దాదా,అక్కడ ఉన్న ప్రసిద్ధ శివాలయం 'బబుల్ నాధ్' మందిరం ఎదురుగా ఉన్న తన ఇంట్లో సత్సంగం వింటున్నారు. తన గాడి లోకి వెళ్లాలని అకస్మాత్తుగా వారికి అనిపించింది. వారు వెంటనే తన గాడి లోకి వెళ్లిపోయారు.. అలా లోపలి వెళ్లిన దాదాకు తాను తన తన శరీరం నొంది అతీతంగా అవుతున్న అనుభూతి కలగసాగింది.
అటువంటి దివ్య అలౌకిక స్థితి లో దాదాకు చతుర్భుజ విష్ణు సాక్షాత్కారం జరిగింది. దాదాకు చాలా ఆనందం కలిగింది.
తనకు జరిగిన ఈ దివ్య సాక్షాత్కారాన్ని తనకు తన గురువులే చేయించివుంటారని దాదా తొలుత భావించారు. ఐతే ఇదే విషయాన్ని తన గురువుల ముందు ప్రస్తావించినప్పుడు వారి ముఖమండలం లో కనిపించిన హావభావాలను బట్టీ ... ఇటువంటి సాక్షాత్కారాలు చేయించే శక్తి తనకున్న పన్నెండుమంది గురువులలో ఏ ఒక్కరికీ లేదని గ్రహించారు. మరి తన గురువులెవ్వరూ తనకు చేయించలేని ఆ దివ్య సాక్షాత్కారం తనకు చేయించింది ఎవరై ఉంటారన్న ప్రశ్న దాదా మాది లో మెదిలింది.
ఇది జరిగిన కొన్ని రోజుల తరువాత, దాదా వ్యాపార నిమిమత్తమై వారణాశి వెళ్లారు. అక్కడ కూడా దాదాకు అనేక దివ్య అనుభూతులు కలిగేవి.దాదా లేఖరాజ్ ఆ అనుభూతులను తన ఇంటి వారికి లేఖలలో తెలియజేసేవారు. ఆలేఖలలో ఇటువంటి వ్యాఖ్యలు ఉండేవి.

"ఖజానాలభించించింది..పొందుతున్నాను..పొందుతున్నాను",
"తాళం చెవి దొరికింది. పొందాను..పొందాను."
" పొందాల్సింది పొందేశాను,ఇక పొందటానికి ఏమీ లేదు.." అని.
ఈ లేఖలు చదివి విషయం అర్ధం కాక దాదాకు ఏమయ్యి ఉంటుందో అని ఆయన కుటుంబ సభ్యులు కంగారు పడేవారు.
ఆ సమయంలోనే వారికి కలియుగ మహా వినాశనం 'అణు బాంబు'ల ద్వారా.... కలహాల ద్వారా.. ప్రకృతి వైపరీత్యాల ద్వారా.. జరగనున్నట్టు సాక్షాత్కరించింది. వీటినే శాస్త్రాల్లో అగ్ని బాణాల్లా బ్రహ్మాస్త్రంగా చూపించారు.
ఆ భయంకర దృశ్యాలను చూడలేక ,కనుల నుండి అశృ ధరలు ధారాపాతంగా స్రవిస్తుండగా, దాదా ఇలా అన్నారు. ....... " ఇక చాలు ప్రభూ... చాలు.
ఇంత భయంకరమైన వినాశనమా!!!.... ఇక నాకు మీ మోహన రూపాన్ని చూపించండి. " అని. దాదాకు ఈ సాక్షాత్కారం జరిగిన సమయంలో ఆటం బాంబులు ఇంకా తయారు కాలేదన్నది గమనించదగ్గ విషయం. అమెరికా జపాన్ పై బేబీ బాంబును కూడా ప్రయోగించలేదు. ఈ దృశ్య సాక్షాత్కారం దాదా లో అప్పుడప్పుడే పెరుగుతున్న వైరాగ్యాన్ని తారాస్థాయికి చేర్చింది. ఇక అప్పటి నుండీ దాదాకు వజ్రాలు కూడా రాళ్ల వలే విలువ హీనంగా తోచేవి.
అందు వలన వజ్రాల వ్యాపారం నుండి శాశ్వతంగా వీడ్కోలు తీసుకోవాలని నిర్ణయించుకొన్నారు. ఈ విషయాన్ని దాదా తన వ్యాపార భాగస్తుని ముందు ప్రస్తావించగా అతను చాలా కంగారు పడ్డారు.. తనకు రాజులతో పరిచయాలు లేవు. అందువలన ఎక్కువ భాగం వ్యాపారం దాదానే చేసేవారు... ఈ కారణంతో, తనకు ఎక్కువ వాటా కావాలని దాదా అడుగుతారేమోనని ఆయన భయపడ్డారు. అదీగాక దాదాకు ఏ కారణం చేతనైనా కోపం వచ్చిందా... అని ఆలోచించసాగారు.
ఇది గమనించిన దాదా ఆ భాగస్తునితో ఇలా అన్నారు.
"ఇలా చూడండి.. నేను ఏ అభిప్రాయ బేధాల కారణంగానో ఈ వ్యాపారం నుండి తప్పుకోవడం లేదు.
ఇప్పుడు ఈ కలియుగ సృష్టి వినాశనం జరగనున్నది.
నేను నా ధనాన్ని ఈశ్వరీయ సేవలో వినియోగించాలని నిర్ణయించుకున్నాను. నేను మిమ్మల్ని లెక్కలు అడగను.
మీరు మీ వకీలుని సంప్రదించి ఎంత న్యాయమనిపిస్తే అంతే ఇవ్వండి. "అని.

ఈ సంఘటన జరిగిన కొద్దీ రోజులకే దాదా గారి బాబాయి​,​కాకా మూల్ చంద్ గారి​కి ​
ఆరోగ్యం బాగోలేదన్న సంగతి తెలిసింది. అందువలన దాదా తన భాగస్థుడు వకీలు ద్వారా పంపిన కాగితాలను తీసుకుని బయలుదేరారు. .. తన కుటుంబానికి తన రాకను తెలియ చేస్తూ దాదా​,​
వారికి ఈ తంతి సందేశం పంపారు...
"ఆత్మకు పరమాత్మ లభించారు. భాగస్థునికి అసత్య వారసత్వం మిగిలింది. పరమాత్మ ఆదేశం అందింది. రైలులో నా ప్రయాణం మొదలైంది. "అని​. ​
దాదా వచ్చేసరికే ఆయన పినతండ్రి మరణించారు. ఆ మరుసటి రోజు దాదాకు కాకా మూల్ చాంద్ గారి మృత్యు దశ సాక్షాత్కారం జరిగింది. ఆ సమయం లో దాదా తన బాబాయిగారి ఇంటి వరండా లో కూర్చొని ఉన్నారు. అప్పుడు దాదాకు తన బాబాయి కాకా మూల్ చాంద్ గారి శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్లేముందు తల దగ్గర నుండి కాలి బొటన వేలి వరకూ ప్రయాణం చేయడం దాదా చూశారు. ఆ తరువాత ఆత్మ వేగంగా తల వరకూ వచ్చి దేహం నుండి బయటకు వెళ్ళిపోవటం సాక్షాత్కరించింది. ఇది జరిగిన వారం రోజుల లోపే దాదాకు మహా విష్ణువు సాక్షాత్కరించి
" అహం విష్ణు చతుర్భుజం తత్ త్వం"అన్న అశరీరవాణి కూడా వినిపించింది. ఇలాగే
శ్రీ కృష్ణుడూ,శ్రీనాథ్,జగన్నాథ్,బద్రీనాథ్,వేంకటేశ్వర స్వామి .. ఇలా దేవతా మూర్తులు సాక్షాత్కరించి 'తత్ త్వం' అని అనటం వినిపించింది. ఇలా తనకు ఎందుకు జరుగుతోందన్న చింతన దాడిలో మొదలయ్యింది. ఇలా ప్రతీ దేవత సాక్షాత్కరించి 'తత్ త్వం' అని అనటం వెనుక రహస్యం ఏమిటన్న ఆలోచన మొదలయ్యింది.
ఇలా రోజులు గడుస్తున్నాయి.......... ....
ఇంతలో ఒకనాడు దాదా గారి గురువుగారు,దాదా ఇంటికి వచ్చారు. ఆయన రాకను పురస్కరించుకుని దాదా పెద్ద సభను ఏర్పాటు చేశారు.
ఆ సభకు చాలామంది వచ్చారు. సభ ప్రారంభమయ్యింది.... గురువుగారు ప్రసంగిస్తున్నారు. ఉన్నట్టుండి దాదా సభలోంచి లేచి తన గది లోకి వెళ్లిపోయారు. మునుపెన్నడూ దాదా ఇలా ప్రవర్తించలేదు. అందువల్ల విషయం ఏమిటో కనుక్కుందామని వారి భార్య యశోదగారు,ఇంకా వారి కోడలు బ్రిజేంద్ర గారు వెళ్లారు. దాదా గది లో ధ్యానావస్థలో ఉండటాన్ని వారు గమనించారు. యశోదగారు తిరిగి సత్సంగానికి వెళ్లిపోయారు. బ్రిజేంద్రగారు మాత్రం దాదాకు సన్ముఖంగా కూర్చున్నారు. ప్రపంచ చరిత్ర లోనే,కానీ వినీ ఎరుగని ఒక మహత్తర సంఘటన ఆ సమయం లోనే చోటు చేసుకుంది........
తన గదిలో ధ్యానమగ్నులై ఉన్న దాదా కనులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి.. ఆ క్షణంలో వారి నేత్రాలుఎర్రగా ప్రకాశించసాగాయి...
ఎర్రని కాంతి శక్తి ఎదో వారిలో ప్రవేశించినట్టుగా అనిపించసాగింది.... ఆకాంతితో వారి మోము ఆ గది ప్రకాశవంతంగా మారిపియాయి... అదే గదిలో దాదాకు ఎదురుగా కూర్చున్న వారి కోడలు బ్రిజేంద్ర గారు తాను తన శరీరం నుండి వేరవుతున్న అనుభూతికి లోనవ్వసాగారు... సమయం చాలా నెమ్మదిగా... గంభీరంగా గడుస్తోంది.... ఆ గంభీరతలోని నిశ్శబ్దం ఆ సమయం లో ఎదో అనూహ్య సంఘటన జరగబోతోందని మౌనంగా సూచిస్తున్నట్టుగా ఉంది..... కిటికీ తలుపులను తెరుచుకుని ఒక చల్లని పిల్ల తెమ్మెర మెల్లగా లోనికి ప్రవేశించింది... ఆ వీచికా స్పర్శ తో ఆ కిటికీలకు కట్టిన తెరలు అలల్లా కదలసాగాయి... అక్కడి వాతావరణం క్షణ క్షణానికి గుంభనంగా మారిపోసాగింది...
.... ఇంతలో కొన్ని మాటలు దాదా నోటినుండి వెలువడ్డాయి. ఆ గొంతు దాదాది కాదని స్పష్టంగా తెలుస్తోంది... అత్యంత దుర్లభము,అమూల్యములైన ఆ మహా వాక్యాలు ముందు ముంద్రంగా నెమ్మదిగా ప్రారంభమై క్రమక్రమంగా గంభీరంగా అయ్యాయి...
ఆ మహావాక్యాలు ఇవి... "నిజానంద రూపం శివోహం..శివోహం
జ్ఞానస్వరూపం శివోహం..శివోహం
ప్రకాశ స్వరూపం శివోహం..శివోహం "
భక్తమహాశయులారా .... గమనించారా, ఆశ్చర్యం అద్భుతం.... ఇవి స్వయంగా పరమ పిత పరమాత్మ స్వయంగా ఉచ్చరించిన మహావాక్యాలు... నిరాకారులు ఆజన్మ అయిన వారు, తన సంతానమైన
మన ఉద్ధరణ చేయడం కోసం ఆ క్షణం లో దాదా తనువు లో దివ్య అవతరణ గావించారు.... .... ....... ......
వారి ఈ మహా వాక్యాల ఉచ్ఛారణ పూర్తవగానే... ఆ గది లో మళ్ళీ మౌనం రాజ్యమేలసాగింది... దాదా మరియు వారి కోడలు బ్రిజేంద్రగారు ఇంకా అదే దివ్య అలౌకిక స్థితి లోఉన్నారు... అకస్మాత్తుగా దాదా కన్నులు మూత పడ్డాయి... అలా కొద్దీ సమయం గడిచాకా మెల్లగా కనులు తెరిచిన దాదా
అప్పుడే ఆ గాడి లోకి వచ్చిన కొత్త వ్యక్తిలా నలువైపులా ఆశ్యర్యంగా చూడడం మొదలు పెట్టారు.. అప్పుడే ఆ దివ్య అలౌకిక ధ్యానావస్థ నుండి తేరుకున్న వారి కోడలు బ్రిజేంద్రగారు... దాదా స్థితిని గమనించి మెల్లగా
వారిని ఇలా ప్రశ్నించారు...
ఈ విధంగా అనేకులు 'ఓం మండలి' సత్సంగానికి వచ్చి 'ఓంబాబా' ద్వారా 'శివ బాబా' పంచుతున్న జ్ఞానామృతాన్ని ఎంతో ఆనందంతో ఆస్వాదిస్తూ మనసుని శాంతపరుచుకోసాగారు...
ఇక్కడ 'శివ బాబా' అనగా స్వయంగా పరమపిత శివ పరమాత్మ అని అర్ధం. తండ్రిని హిందీ లో 'బాబా' అని అంటారు కదా.
కనుక పరమాత్మ సర్వాత్మలకూ తండ్రి అయిన కారణంగా ఇక పై
వారిని 'శివ బాబా'గా సంబోధించడం జరిగింది..
ఇక అప్పటినుండి బాబా వద్దకు వచ్చే వారి జీవితంలో సాత్వికత చోటుచేసుకోసాగింది. వారి ఆహార వ్యవహారాలలో ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. వారుఇతరులపై ఆధారపడటాన్ని మాని, తమ పనులు తామే చేసుకోసాగారు. దీంతో 'ఓం మండలి' సత్సంగాయానికి సమాజం లో మంచి పేరు వచ్చింది.
ఈ సత్సంగానికి వచ్చే వారి సంఖ్యా రోజు రోజుకూ గణనీయంగా పెరగసాగింది. అలా వచ్చే వారిలో విశిష్టమైన వ్యక్తిత్వంగల 'కుమారి'
ఒకరు ఉండేవారు .... అవివాహితులైన యువతులను 'కుమారి' అని సంభోదిస్తారు కదా. ఆమె పేరు 'రాధ'. అనతి కాలం లోనే వారే 'ఓం రాధగా' ప్రఖ్యాతిని పొందారు. వారు ఎంతో ప్రతిభా శాలి ...
చదుకునే రోజుల్లో అన్నింటా ప్రధమ శ్రేణిలో ఉండేవారు. వీణా వాదన లో ఆమెది 'అందె వేసిన చేయి'. వారి లో గాన కళా ప్రావీణ్యం కూడా మెండుగా ఉండేది. సత్సంగానికి వచ్చిన తొలినాడే పరమ పిత అయిన 'శివబాబా','ఓం బాబా'ముఖ కమలం ద్వారా వినిపిస్తున్న గీతా జ్ఞానాన్ని విని ఎంతగానో పులకించిపోయారు.తన జీవితాన్ని ఈశ్వరీయ సేవకే అంకితం చేయాలనిఆనాడేనిశ్చయించుకున్నారు.
'ఓం రాధ'ను చూసినవారికి ఆమె 'లక్ష్మీదేవి'గా సాక్షాత్కరించేవారు..
ఇదే సాక్షాత్కారం స్వయంగా 'ఓంబాబా'కు ధర్మ పత్ని అయిన యశోద గారికి కూడా కలిగింది. 'ఓం రాధా' తనకు కలిగిన అనుభూతులన్నింటినీ అందమైన గీతాలుగా మలచి పాడేవారు.
అలాగే పరమాత్మ అయిన 'శివబాబా' 'ఓం బాబా' ద్వారా అందించే
లోతైన జ్ఞానాన్ని తాను ఆచరించి, అందరూ ఆచరించేందుకు వీలుగా... హృదయానికి హత్తుకునేలా వివరించేవారు.
'శివ బాబా' ద్వారా జ్ఞానాన్ని పొందిన 'ఓం బాబా' తన కుటుంబ సభ్యల ఉద్ధరణ కూడా చేయాలనుకున్నారు. ఆయన దృష్ఠి ముందుగా తన పెద్ద కుమార్తె పై పడింది.
తరువాతి కాలం లో వీరే 'నిర్మల్ శాంతాదాదీ'గా 'పర్ దాదీ'గా ప్రసిద్దులయ్యారు.
'ఓం బాబా'గా మారక ముందు దాదా తన పిల్లలను ఎంతో గారాబంగా పెంచారు. కానీ 'దాదా'లో 'శివబాబా' దివ్య అవతరణ తరువాత ఆయన లో వచ్చిన అతీత స్థితిని వారి కుమార్తె అయిన 'నిర్మల్ శాంతా దాదీ' గమనించారు. ఎందుకంటే , 'ఓం మండలి' స్థాపన జరిగిన తరువాత నుండీ... దాదీ ఇక ఎప్పుడు ఇంటికి వచ్చినా దాదా మరియు యశోదా మాతలిద్దరూ 'శివబాబా' చెప్పే జ్ఞాన విషయాలనే వినిపించడం మొదలు పెట్టారు. 'దాదీ కూడా శివబాబాను తెలుసుకుని పవిత్ర జీవితాన్ని గడపాలని'ఓంబాబా', 'యశోదామాత'లిద్దరూ ఆశించసాగారు.
​ఆఖరికి వారిరువురి ఆశలను నెరవేర్చే ఆ శుభ ఘడియ
రానే వచ్చింది. ఆ రోజు ఒక పర్వదినం. ఈ సందర్భంగా 'బాబా'
'పర్ దాదీ'ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. దాదీ వచ్చిన సమయానికి అక్కడ కొంత మంది మాతలు, 'శివబాబా' 'ఓం బాబా' ద్వారా ఇచ్చిన జ్ఞానాన్ని తాగిన ఆనందం లో నృత్యం చేయసాగారు. వారిని చూసి 'దాదీ' ఆశర్యచకితులయ్యారు. ఎందుకంటే,వారంతా దాదీకి పరిచయస్తులు. వారేనాడూ నృత్యం అభ్యసించలేదు. అసలు నృత్యానికి సంభందించిన కనీస జ్ఞానమైనా లేదు. అలాంటివారు ఇంత అద్భుతంగా నృత్యం చేయడం చూసి దాదీ చాలా సేపు కదలకుండా అలాగే ఉండిపోయారు.
కొంతసేపటి తరువాత వారు ఆ మాత్లాలోని ఒక మాతను"మీకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన ఆ అనుభూతి ఏమిటి?"అని అడుగగా,
" రేపు చెబుతాను. " అని ఆవిడ అన్నారు. ఆ అనుభవాన్ని వైన్ ఆతృతలో ఉన్న 'నిర్మలశాంతా దాదీ', 'బాబా' తో" బాబా ! రేపు కారు పంపండి. నేను వస్తాను. " అని అన్నారు. అప్పుడు" రేపటి సంగతి రేపు చూద్దాం " అని 'బాబా' అన్నారు. 'బాబా' దగ్గర ఎంతో గారాబంగా పెరిగిన 'దాదీ','బాబా' నోటి వెంట ఏనాడూ విని వుండలేదు. 'బాబా' తన పిల్లల కోర్కెలను ఎలా తీర్చేవారంటే, వారు కోరుకోవాలేగాని నింగి లోని తారలను కూడా కోసుకొచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవారు.... అటువంటి 'బాబా' నోట ఈ మాటను విని మనసు నొచ్చిన 'దాదీ', 'బాబా'తో "బాబా ! రేపు కారు పంపకండి....... .. నేనురాను." అని కోపంగా అన్నారు. అప్పుడు కూడా 'బాబా' నవ్వుతూ,"అమ్మా! రేపటి సంగతి నీకు ముందే తెలుసా ఏమిటి? రేపటి సంగతి రేపు చూద్దాం" అని. ఆ మాటలు విని మరింత అలిగిన 'దాదీ' "ఓహో ! అంత తెలియని విషయం రేపు ఏం జరుగుతుందో నేనూ చూస్తాలే.... "
అని కోపంగా వెళ్లి పోయారు.
​​అదే రోజు దాదీకి ఒక దివ్య సాక్షాత్కారం జరిగింది. దదీ ముందు ప్రకాశవంతమైన రూపం లో 'బాబా' మరియు వారి భావి రూపమైన శ్రీ కృష్ణుడూ నిలుచుని ఉన్నారు. 'ఓం బాబా'లో 'శివ బాబా'ను ఆ సాక్షాత్కారం లో దాదీ స్పష్టంగా చూశారు. వెంటనే తన తప్పు తెలుసుకుని నిశ్చయానికి వచ్చిన 'దాదీ ',వెంటనే 'బాబా' చేయి పట్టుకుని " శివబాబా ! ఇన్నాళ్లూ మిమ్మల్ని గుర్తించలేక పోయాను. ఇప్పుడు గుర్తించా. 'ఓం బాబా' ఇంతకాలం మిమ్మల్ని నేను నా తండ్రిగానే చూశాను. కానీ మీరే కృష్ణుడిగా కాబోతున్నారని ఇప్పుడే తెలుసుకున్నాను... ఇక మీ ఆశ్రయాన్ని వదలను . మీరు ఏది ఆదేశిస్తే అదే చేస్తాను."అని ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజు నుండీ దాదీ జీవితం కొత్త మలుపు తిరిగింది. 'ఓంబాబా' మరియు యశోద మాతల ఆశలను 'శివ బాబా' ఇలా నెరవేర్చారు. ఈ విధంగా ఎంతో మంది పిల్లలు 'ఓం బాబా' లోని 'శివబాబా' ఒడికి చేరుకున్నారు. వారంతా ప్రతి రోజూ సత్సంగానికి రావడం మొదలు పెట్టారు. ఒక రోజున 'శివ బాబా' వారిని " నా రధమైన ఈ 'ఓం బాబాను' ఇక పై 'బ్రహ్మా బాబా' అనే కర్తవ్య వాచకం తో పిలవండి ."
అని ఆదేశించారు. శివబాబా 'ఓం బాబా' ద్వారా పావన దైవీ రాజ్యం అనగా స్వర్గం యొక్క స్థాపన చేయాలని నిర్ణయించడమే దీనికి కారణం. ఇక ఆ రోజు నుండి అందరూ 'ఓం బాబా'ని 'బ్రహ్మా బాబా' అని పిలవడం ప్రారంభించారు.
​సత్సంగానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగ సాగింది. అందువలన ఏకాంతం కోసం బాబా కాశ్మీర్ వెళ్లారు. బాబాతో బాటు వారి కుటుంబ సభ్యులు కూడా వెంట వెళ్లారు. 'బ్రహ్మా బాబా' వారి లో 'శివ బాబా' కొంత కాలం అక్కడ ఉన్నారు. 'ఓం బాబాకు'
'శివ బాబా' 'బ్రహ్మా బాబా' అని నామకరణం చేశారని ఇంతకు ముందే తెలుసుకున్నాము. కనుక ఇక పై 'ఓం బాబా'నే 'బ్రహ్మా బాబాగా ప్రస్తావించడం జరుగుతుంది... ప్రేక్షకులు గమనించగలరు. కాశ్మీరు లో ఉన్నంత కాలం 'శివబాబా' 'బ్రహ్మా బాబా' ద్వారా జ్ఞానాన్ని లేఖలుగా వ్రాయించి పంపే వారు.
ఆ లేఖ 'బ్రహ్మా బాబా' ఇంట్లో సత్సంగానికి వచ్చే మాతలలో ఎవరో ఒకరి పేరు మీద ఉండేది. ఆ 'ఈశ్వరీయ జ్ఞాన లేఖ'ను అనుకున్న ఆ మాత ఎంతో సంతోషం తో ఆ లేఖను చదివి ,అందులో శివ బాబా బ్రహ్మా బాబా ద్వారా రాయించి పంపిన ఈశ్వరీయ జ్ఞానాన్ని అక్కడున్న అందరికీ అనుభవ పూర్వకముగా వివరించి చెప్పేవారు. అక్కడ కాశ్మీర్ లో బ్ర్హమా బాబా శివబాబా స్మృతి లో అంతర్ముఖీగా అయ్యి ఉంటూ జ్ఞాన చింతన చేసేవారు.. తమ కుటుంబ సభ్యులకు జ్ఞాన బోధ చేసేవారు. బాబా కుటుంబ సభ్యులు కూడా అలాగే జ్ఞాన చింతన చేసి ఆనందం పొందేవారు. ఒకరోజు బ్ర్హమా బాబా కుమార్తె అయినా నిర్మల్ శాంతా దాదీ జ్ఞాన విషయాలు ఆలోచించుకుంటూ నడుస్తున్నారు. అదే దారి లో వారికి సింధ్ హైద్రాబాద్ లో పరిచయస్థుడైన 'రిజమల్' అనే వ్యక్తి కనిపించారు. వారు దాదీని ఒక పర్వతానికి దారి అడుగగా పరమ పీత పరమాత్మ శివబాబా జ్ఞాన చింతన లో ఉన్న దాదీ
" మీరు పర్వతానికి దారి అడుగుతున్నారా?... లేక పరంధామానికి దారి అడుగుతున్నారా?."అని యధాలాపంగా అన్నారు.. దాదీ చెప్పిన ఈ సమాధానాన్ని విని ఆశర్యపోయిన ఆ వ్యక్తి , దాదీని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుని తాను కూడా సత్సంగానికి రావడం మొదలు పెట్టారు.
అక్కడ సింధ్ హైద్రాబాద్ లో, బాబా లేని సమయం లో సత్సంగానికి రావటం మొదలు పెట్టిన వారికి కూడా బ్రహ్మాబాబా,శివబాబా యొకా జ్యోతి స్వరూపం, అలాగే శ్రీ కృష్ణుని సాక్షాత్కారాలు జరిగేవి. ఆ సాక్షాత్కారాల ద్వారానే వారు సత్సంగం యొక్క చిరునామా తెలుసుకొని పరుగు పరుగున వచ్చేవారు. కాశ్మీర్ నుండి తిరిగివచ్చిన బ్రహ్మా బాబాను తొలిసారి చూసిన వారు బాబాతో...
" బాబా!మీరే మాకు సాక్షాత్కారం చేయించి ఈ చోటికి రప్పించారు." అని అనేవారు. ఈ మాటలు విని బాబా ఆశ్చర్యపోయేవారు.
చాలాసేపు ఆలోచించాకా ఇది లోక కళ్యాణార్ధమై శివ బాబా తనను నిమిత్తంగా చేసి జరిపిస్తున్న లీలగా గుర్తించారు. సత్సంగానికి కొత్తగా వచ్చేవారికి కూడా బాబా అలౌకిక వ్యక్తిలా అనిపించేవారు. బాబా నయనాలూ,మస్తకం సదా ప్రసన్నత తో ప్రకాశిస్తూ ఉండేవి.
బ్రహ్మా బాబాను చూసిన వారికి శ్రీ కృష్ణుని సాక్షాత్కారం జరిగేది. ఈ కారణంగా ఆ సభ్యుల్లో ఉండే కొందరు బాబాను పట్టుకోవాలని ప్రయత్నించేవారు. కొన్ని సార్లు బాబాతపించుకునేవారు. మరికొన్నిసార్లు దాక్కునే వారు.. అయినా పుష్పాంని దాచగలంగానీ సుగంధాన్ని దాచలేముగా .....
అలాగే,బ్రహ్మా బాబాలోఉన్న శివబాబా శక్తి వారిని దొరికిపోయేలా చేసేది. ఇదంతా పిల్లల మనసుని ఆనంద పరచటం కోసం శివ బాబా చేస్తున్న లీలా వినోదం.ఇటు వంటి అద్భుతాలు చూసినవారు ఎంతో ఆనందం తో మనసులోనే కాక సామూహికంగా కూడా బృంద గీతాలు పాడేవారు. సత్సంగానికి వచ్చే చిన్న చిన్న పిల్లలలకు కూడా ఇటువంటి అద్భుత సాక్షాత్కారాలు జరిగేవి.
ఈ రకమైన సాక్షాత్కారం ప్రస్తుతం ఈ సంస్థ యొక్క అదనపు సంచాలకురాలైన దాదీ హృదయ మొహినిగారికి తొమ్మిదేళ్ల ప్రాయం లోనే జరిగింది. ఆ వారు నుంచే వారు తన తల్లిగారి తో కలిసి సత్సంగానికి వచ్చేవారు. కానీ పసివయసు కారణంగా ఎక్కువ సమయం ఆట,పాటల్లోనే గడిపేవారు. ఆ రోజు మాత్రం వారు అనుకోకుండా ధ్యానావస్థ లోకి వెళ్లిపోయారు.
కొద్దిసేపటికి యధా స్థితికి చేరుకొని తనకేం జరిగిందో అర్ధం కాక ఏడవడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న వారి తల్లిగారూ, ఇంకా ఇతర సోదరీ మణులు అనునయంగా"మీరేం చూశారు ?" అని ప్రశ్నించగా... తానొక అందమైన మహల్లో ఒక సుందరమైన రాక కుమారుడిని చూశానని..... ఆ బాలుడు తన తో ఆడుకోడాటానికి రమ్మంటూ సైగ చేస్తున్నాడని చెప్పారు. ఆకాడి వారు కొన్ని చిత్రపటాలు చూపించగా వాటి సహాయం తో తనకు సాక్షాత్కారం లో కనిపించింది శ్రీ కృష్ణుడుగా గుర్తించారు. సత్సంగానికి వచ్చే వారికి వయసుతో సంబంధం లేకుండా...ఇలా అద్భుత సాక్షాత్కారాలు కాసాగాయి. ఇక్కడికి వచ్చి బ్రహ్మా బాబాలో శివ బాబాను గుర్తించినవారు... బాబాతో ఇలా అనేవారు.
"బాబా ఇంతకాలం ఎక్కడకి వెళ్లారు? మేము మీ కోసం ఎంతగానో వెతుకుతున్నాం. మమ్మల్ని ఈ పాపపు జగతినుండి ఎక్కడికైనా తీసుకుపోండి."అని అది విని బాబా " ఓర్పు వహించండి పిల్లలూ.. నేను మీ కోసం స్వర్గ రాజ్యాన్ని వారసత్వంగా తీసుకొచ్చాను. " అని అనేవారు. ఈ విధమైన మధుర వాక్కులతో వారి మనసును శాంతిప చేసే వారు.
శివబాబా జ్ఞానకలశాన్ని ఆదినుండే మాతలకూ,కన్యాలకూ అప్పగించడం వలన... వారిలో ఒక అలౌకికమైన అతీంద్రియ శక్తి ఏర్పడింది నిన్నటి వరకూ తమ కుటుంబ సభ్యుల తో కూడా మాట్లాడిందేంకు సంకోచించిన ఆ మహిళలు ఇప్పుడు ఎటువంటి వారితో అయినా జ్ఞాన చర్చ చేయడానికి సిద్ధ పడ్డారు...
ఈవిధంగా జరిగిన అభివృద్ధిని చూసిన బాబా అక్టోబర్ 1937న
వారి లోని పదిమంది మహిళలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అలాగే పరమ పిత శివ పరమాత్మ ఆదేశానుసారం
తన స్థిర చరాస్తులు కమిటీ పేర రాసిఇచ్చేసారు. ఇద్దరు బాబాలూ ఈ రకంగా నారీ శక్తిని ముందుంచారు... ఈ సందర్భాంగా... చరిత్ర గతిని మార్చివేసే ఒక అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది."కామం నరక ద్వారం,మహా శత్రువు. దానిని త్యజించండి." ఆ సమయం లోనే శివ పరమాత్మ బ్రహ్మా బాబా ముఖ కమలం ద్వారా ఆదేశించారు. ఇది విని అందరూ పవిత్రమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. అలాగే బాబా సత్సంగానికి వచ్చేవారు, తమ తమ ఇళ్ల నుండి అనుమతి పత్రాన్ని విధిగా తెచ్చుకోవాలనే నిబంధన కూడా విధించారు. ఇలా అనేక మంది తెచ్చుకున్నారు. ఒక సోదరి ఇంట్లో మాత్రం అభ్యంతరం వ్యక్తంచేయగా బ్రహ్మా బాబా,ఓం రాధ వారికి జ్ఞానాన్ని అర్ధం చేయించి, ఒప్పించారు. ఆ సోదరి తండ్రికి మధ్య మాంసాలు స్వీకరించే అలవాటు ఉండేది. బ్రహ్మాబాబాద్వారా శివ బాబా ఇచ్చిన ఆదేశానుసారం ఆ దుర్వ్యసనాలన్నింటినీ త్యజించి తాను కూడా సత్సంగానికి రావడంమొదలుపెట్టారు. బ్రహ్మా బాబా కూడా తన కుటుంబ సభ్యులకు , శివ బాబా ఆదేశించినట్టుగా అనుమతి పత్రాన్ని వ్రాసియిచ్చారు. వారి వద్ద నుండి తాను కూడా
అనుమతి తీసుకున్నారు.
సత్సంగానికి వచ్చే అక్కయ్యలకూ,పిల్లలకూ... లౌకిక,అలౌకిక విద్యలు రెండూ నేర్పించడం కోసం ఒక ప్రత్యేకమైన పాఠశాల ఏర్పాటు చేశారు... పిల్లలకు శిక్షణ ఇచ్చేవారిలో
'కుమార్కాదాదీ','చంద్ర మణి దాదీ','శాంత మణి దాదీ',
'గుల్జార్ దాదీ'...... మొదలైనవారు ఉన్నారు.
ఆ పాఠశాల లో,ఆరు నుండి పది సంవత్సరాల వయసున్న పిల్లలకూ... పదకొండు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసున్న పిల్లలకూ... విడి విడిగా తరగతులు నిర్వహించేవారు. వారి దినచర్య ఈ విధంగా ఉండేది. పిల్లలు ఉదయమే మేల్కొని విహారానికి వెళ్లేవారు. అక్కడ వ్యాయామం చేసేవారు. ఆరున్నరకు త్రిగి వచ్చి కాలకృత్యాలు తీర్చుకుని చదువులో నిమగ్నమయ్యేవారు.. ఆ పిల్లలకు లౌకిక విద్య తో పాటు ఆదేత్మిక విద్యను నేర్పించేవారు.
అలాగే హిందీ,సింధీ,ఆంగ్ల భాషలను నేర్పేవారు. లెక్కలు నేర్పేవారు. పిల్లల్లో ఆధ్యాత్మిక చతన్యాన్ని పెంచేందుకు కృషి చేసేవారు. వీటిలో ఇటువంటి పాఠాలు నేర్పేవారు... " ఈ శరీరం పంచ తత్వాలతో తయారయ్యింది. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని నడిపే చైతన్య శక్తిని
ఆత్మే శరీర ఆధారంగా పాత్ర వహిస్తుంది. ఆత్మే నోటి ద్వారా మాట్లాడుతుంది. ఆత్మే చెవుల ద్వారా వింటుంది. ఆత్మే కర్మేంద్రియాలు ద్వారా కర్మలు చేస్తుంది. ఆత్మనైన నేను జ్యోతిర్బిందు స్వరూపమును. ఇటువంటి పాఠాలతో, ఆ ఆ పిల్లలలో చిన్ననాటి నుండే ఆత్మ నిశ్చయాన్ని కలిగించారు.
చదువు తరువాత మళ్ళీ కాసేపు ధ్యానం చేసేవారు. తరువాత భోజన విరామం,విశ్రాంతి. భోజనం కూడా ఎంతో క్రమ శిక్షణ తో చేసేవారు.
అందరూ వరుస క్రమం లో కూర్చుని పరమాత్మ శివబాబా స్మృతిలో నియమ బద్ధంగా భుజించేవారు. విద్యాధికారులు అనేక పర్యాయాలు
ఆ పాఠశాలకు ఆకస్మిక తనిఖీలకు వచ్చి ఆ పిల్లల్లోని క్రమశిక్షణ,
ఐక్యత ,అలౌకికత, సుగుణశీలతను చూసి ఆశ్యర్యానికీ ఆనందానికీ లోనయ్యేవారు.
ఇలా ప్రశాంతంగా సాగుత్న్న సమయంలో అకస్మాత్తుగా విఘ్నాలు రాసాగాయి. పరమాత్మ శివబాబా ప్రవేశపెట్టిన పవిత్రత నియమాన్ని పాటించడం మొదలుపెట్టిన మాతలకు వారి భర్తలనుండీ, అత్త మామల నుండీ..... అనేక సమస్యలూ,వేధింపులూ మొదలవ్వసాగాయి. ఇలా చేయడం మొదలుపెట్టిన వారి లో.... కొంతకాలం సత్సంగానికి వచ్చిన పురుషులు కూడా ఉన్నారు.
వీరంతా ఒక కూటమిగా ఏర్పడి 'ఓం మండలి'కి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం ప్రారంభించారు. వీరికి కొందరు నగర ప్రముఖులు తోడయ్యారు. ఇందువల్ల వీరు మరింతగా పేట్రేగిపోయారు. తమ లైంగీకవాంఛలను తీర్చమంటూ సత్సంగానికి వెళ్తున్న తమ భార్యలను హింసించసాగారు... ఆ పురుషుల కుటుంబ సభ్యులు కూడా వారికి ఈ దుశ్యర్యల్లో పూర్తి సహకారాన్ని అందజేసేవారు. అయినప్పటికీ ఆ మాతలు తమ తమ పవిత్రత వ్రత ధారణ నిర్ణయం లో స్థిరంగా ఉన్నారు.
వీరి దుస్థితి చూసిన ఇతర కన్యలు ఇక జీవితం లో వివాహం చేసుకోకూడదనినిర్ణయించుకున్నారు.
ఓం మండలికి వ్యతిరేకంగా ఏర్పడిన ఆ సంఘానికి

యాంటీ-ఓంమండలి​"
అని నామకరణం చేశారు పేరుకు తగ్గట్టుగానే వారి ప్రతి చర్యా 'ఓం మండలి' వారి నియమాలకు విరుద్ధంగా ఉండేది. ఈ సమాజం ఎంతటి పతనావస్థకు చేరుకుంది. ఒక వైపు స్త్రీని 'లక్ష్మి','దుర్గ','పార్వతి' అంటూ దేవతలుగా పూజిస్తారు. మరి వారు పవిత్ర జీవితాన్ని గడపాలనుకుంటే మాత్రం దారుణాతిదారుణంగా, హీనాతిహీనంగా,ఘోరాతిఘోరంగా... హింసిస్తారు. అదే ఒక పురుషుడు పవిత్ర జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటేమాత్రం, ప్రజలు అతడిని మహాత్మా అని కొనియాడుతారు. ఒక స్త్రీకి మాత్రం ఆ అధికారం లేక పోవడం కడు విచారకర విషయం. సత్సంగానికి వచ్చేవారితో పవిత్రతను పాటించనవసరం లేదని చెప్పమని బ్రహ్మా బాబాను యాంటీ-ఓం మండలి సభ్యులు అడిగారు... అందుకు బాబా నిరాకరించటం తో... మరింతగా విధ్వాంసం సృష్టించసాగారు. వారికి జ్ఞాన బోధ చేయాలని బాబా, ఒక గ్రాంఫోన్ రికార్డు పంపగా ఇందులో మాయలో మంత్రాలోఉండి ఉంటాయని భ్రమపడి దానిని పగులగొట్టి తగులబెట్టారు. ఇది వారి అజ్ఞానానికి పరాకాష్ట. ఈ విధంగా వారి ఆగడాలు రోజు రోజుకూ మితి మీర సాగాయి. ఇవి వారి భార్యలకు వారి పట్ల ఉన్న కొద్ది పాటి అనురాగాన్ని కూడా తొలగించి పూర్తి వైరాగ్యాన్ని కలిగించాయి. ఆ మూర్ఖుల క్రోధం అంతటి తో చల్లారలేదు.. వారు జూన్ 21,1938న బాబా సత్సంగం నిర్వహిస్తున్న భవనాన్ని ముట్టడించారు. ఆ భవనాన్ని 'లక్కీ రాజ్' భవనంగా వ్యవహరించేవారు. అక్కడివారు అడ్డుకోవడంతో ఆ భవనానికి నిప్పంటించారు. ఆ సమయంలో ఆ తగలబడుతున్న భవనంలో ఆ యాంటీ ఓం మండలికి చెందిన వారి కుటుంబసభ్యలు అనేకులు ఉన్నారు. అజ్ఞాన ఆవేశం లో ఉన్న వారికి ఈ విషయం కూడా గుర్తుకు రాలేదు. 'లక్కీ రాజ్' భవనానికి నిప్పంటించిన ఘటనను మహా భారతం లో పాండవులున్న లక్కాభవనాన్ని కాల్చడంగా చూపించారు.
ఈ సంఘటన తరువాత సత్సంగాన్ని 'ఓం నివాస్' అనే పేరుగల మరో భవనం లోకి మార్చారు. అక్కడి దినచర్య కూడా పూర్వం వలే యధాతధంగా ఉండేది.
ఆ రోజు ఉదయం సుమారు 4:30 (నాలుగున్నర) కు చిన్న చిన్న పిల్లలు తమ శిక్షకులతో కలసి విహాహారానికాని బస్సుల్లో బయల్దేరి వెళ్లారు .ఆ సమయానికి కొన్ని వందల సంఖ్యలో
'యాంటీ ఓం మండలి'సభ్యులు వచ్చి ఆ భవనం ముందు బైఠాయించారు. వారు విహారం నుండి తిరిగి వచ్చిన చిన్నపిల్లలను,వారి శిక్షకులనూ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సంఘటన ఆగష్టు 7,1938న జరిగింది.అయినాగానీ ఆ పిల్లలు ఏ మాత్రం భయపడకుండా ఒక వరుస క్రమంలోనుంచున్నారు.వారి సంఖ్యా యాంటీ ఓం మండలి వారి తో పోల్చుకుంటే చాలా తక్కువ. ఆ దృశ్యం చూడడానికి కొరవ పాండవ సేనలు రెండూ యుద్ధరంగంలో ఎదురెదురుగా నుంచున్నట్టు ఉంది. కొంత సేపటికి యాంటీ ఓం మండలివారు. చిన్న పిల్లలు లోనికి వెళ్లేందుకు అనుమతించారు. కానీ ఆ పిల్లలు మాత్రం 'మేము అందరం కలిసే లోపలి వెళ్తాము'అని భీష్మించుకుని కూర్చున్నారు. అంతే కాకా ఆ పిల్లలు యాంటీ ఓం మండలి వారు ఇవ్వజూపిన ఏ ఆహార పదార్ధాలనూ చివరకు మంచి నీళ్లను కూడా స్వీకరించలేదు.. వారి పట్టుదలను చూసి ఆశర్య పోవడం యాంటీఓం మండలి వారి వంతయ్యింది. ఇలా యాంటీ ఓం మండలి వారు 'ఓం నివాస్'భవనాన్ని ముట్టడించిన వార్త నగరమంతా పాకింది. ఇప్పుడు వీరిద్దరిలో అంటే 'ఓంమండలి', 'యాంటీ ఓం మండలి' వారిలో ఎవరు గెలుస్తారో? అనే చర్చ జనంలో ప్రారంభమయ్యింది. జరుగుతున్న సంఘటనను ప్రత్యక్షంగా చూసేందుకు జనాలు గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకోసాగారు. వారి లో ఇంత కాలం సత్సంగానికి రాకుండా యాంటీ ఓం మండలి వారు నిర్బంధించిన మతలూ కన్యలూ ఉన్నారు. వారిని అక్కడ చూసిన యాంటీ ఓం మండలి సభ్యలు నిర్ఘాంతపోయారు.. అవాక్కయ్యారు.
సమయం గడిచే కొద్దీ యాంటీ-ఓం మండలి వారి సంఖ్య పలుచబడసాగింది. ఆ ఎండలో అంత సేపు నిలబడ లేక యాంటీ-ఓం మండలి సభ్యులు ఒక్కొక్కరే మెల్లమెల్లగా జారుకోసాగారు. సాయంత్రానికల్లా యాంటీ ఓం మండలి వారి గుడారం పూర్తిగా ఖాళీ అయ్యింది.. అంత సేపూ అక్కడ ఎంతో ధైర్యంతో.. సహనంతో.. నుంచున్న ఆ చిన్న పిల్లలు తమ శిక్షకులతో కలసి లోపలి వెళ్లారు... ఈ విధంగా యాంటీ ఓం మండలి వారు అనేక మార్లు ప్రయత్నించి ఓడి వెనుదిరిగారు... ఈ దుశ్చర్యలు యాంటీ ఓం మండలి వారికి సమాజంలో ఉన్న కొద్దిపాటి పలుకుబడిని కూడా పూర్తిగా తగ్గించాయి. వీరికి విరుద్ధంగా అన్ని పత్రికల్లో ప్రధాన కధనాలు రాసాగాయి. ఈ కారణంగా అప్పటి సింధు ప్రభుత్వం కలుగ చేసుకుని 'ఓం మండలి'కి వ్యతిరేకంగా 'యాంటీ-ఓంమండలి' సాగిస్తున్న ఆగడాలను నిరోధించింది. అయితే అప్పటి మాజిస్ట్రేటు 'ఓం మండలి'వారికి వ్యతిరేకముగా నోటీసులు జారీ చేయగా అందులో వున్నా ఐదుగురి పేర్ల లో బ్రహ్మాబాబా పేరు కూడా ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ 'ఓం మండలి'వారు న్యాయస్థానాన్ని ఆశ్రయయించగా... న్యాయస్థానము మాజిస్ట్రేటు తీరును తప్పుబడుతూ ప్రతి ఒక్కరికీ తమ ఆధ్యాత్మిక భావాలను ప్రచారం చేసుకునే హక్కు ఉందనీ ఇందులో పూర్తి నేరం యాంటీ ఓం మండలి వారిదేనని తీర్పు ఇచ్చారు.
ఇది జరిగిన తరువాత సత్సంగాన్ని 'కరాచీ''కి మార్చారు... కొంత మంది అక్కయ్యకులూ అన్నయ్యలూ బాబా వెంట 'కరాచీ' రాగా... కొంతమంది మాత్రం గృహ నిర్బంధం లోనే ఉండి పోయారు..
అక్కడ సత్సంగ నిర్వాహణార్ధం ఐదు భవంతులు తీసుకున్నారు. వాటి పేర్లు వరుసగా 'ఓం నివాస్','ప్రేమ్భవన్', 'బేబీ భవన్','బోయ్స్ భవన్'
...ఇంకా వుంది